Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, October 10, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వమ్ - 18. గురుభక్తి – 3వ.భాగమ్

Posted by tyagaraju on 8:21 AM
    Image result for images of shirdisaibaba and durgadevi
       Image result for images of rose hd

10.10.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వమ్
        Image result for images of m b nimbalkar
ఆంగ్లమూలమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ - 9440375411

18. గురుభక్తి – 3వ.భాగమ్
ఎవరి గురువుపై వారికి నమ్మకం ఉంచుకోవాలన్న విషయాన్ని సాయిబాబా సందర్భం వచ్చినపుడెల్లా స్వయంగా వివరించి చెబుతూ ఉండేవారు.  26వ.అధ్యాయంలో భక్తపంత్ తో అతని గురువుపైనే భక్తిని నిలుపుకొమ్మని ఈవిధంగా చెప్పారు.  “ఏమయినను కానిండు, పట్టు విడువరాదు.  నీగురునియందే ఆశ్రయము నిలుపుము.  ఎల్లప్పుడు నిలకడగా ఉండుము.  ఎల్లప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము.” అదేవిధంగా హరిశ్చంద్రపితలే, గోపాల్ అంబడేకర్ లకి కూడా తాము వంశపారంపర్యంగా పూజిస్తున్న స్వామి సమర్ధ మీదనే భక్తి కలిగి ఉండమని చెప్పారు.


3. గురువుయొక్క ఆజ్ఞనలను మరువద్దు :
        Image result for images of guru sishya
గురువుకు తన శిష్యునియొక్క శక్తిసామర్ధ్యాలపై పూర్తి అవగాహన ఉంటుంది.  అతని సమర్ధతకు తగినట్లుగానే తన శిష్యునికి సలహాలను, సూచనలు చేసి బోధన చేస్తూ ఉంటాడు.  అందుచేత శిష్యుడు తన గురువు తనకు ప్రత్యేకంగా ఇవ్వబడ్డ ఆజ్ఞలనే పాటించాలి.  వాటికి బధ్ధుడయి ప్రవర్తించాలి.  ఇతర యోగులు చేసే బోధనలను గాని, తన గురువు ఇరత శిష్యులకు ఇచ్చే ఆజ్ఞలనుగాని, అమలు చేయరాదు.  తన గురువు యొక్క ప్రవర్తనను గమనించినా, వివరింపబడినా దానిని అనుసరించరాదు. 
             Image result for images of guru sishya
“ఎవరయినా సరే ఇతర యోగులను అగౌరవపరచరాదు”  ఈ మాటలను మనం బాగా గుర్తు పెట్టుకోవాలి.  మన కన్నతల్లి కన్న మరెవరయినా మనమీద అత్యంత శ్రధ్ధాభక్తులు కనపరచగలరా?  మన యోగక్షేమాలు చూడగలరా?
                                    (ఓ.వి. 117)
“ఇతర యోగులు కాని, గురువు కాని చెప్పినవి వినాలి.  కాని ఎవరయినా తన గురువు చెప్పిన బోధనలకే కట్టుబడి ఉండాలి”                                                   (ఓ.వి. 122)

ఒక వైద్యుడు ఉన్నాడంటే అతను తన దగ్గరకు వచ్చిన రోగిని పరీక్షించి రోగనిర్ధారణ చేసి దానికి తగ్గ మందులు ఏవి వేసుకోవాలో సూచిస్తాడు.  అదే విధంగా సద్గురువు కూడా తన శిష్యునియొక్క బాధలను, కష్టసుఖాలను పరిగణలోకి తీసుకుని దానికి తగ్గట్లుగానే సలహాలనిస్తాడు.

గురువు స్వయంగా ఆచరించేదానిని మనం అనుకరించకూడదు.  ఆయన ఆజ్ఞానుసారమే మనం నడుచుకోవాలి.  ఆయన మనకు ప్రత్యేకించి చెప్పిన బోధనలనే ఆచరణలో పెట్టాలి.            (ఓ.వి. 114)

“గురువు చెప్పిన మాటలనే ఎల్లప్పుడూ చింతన చేస్తూ వాటిమీదనే శ్రధ్ధ పెట్టాలి.  ఆయన బోధనలే మనలను ఉద్ధరించడానికి కారణం అవుతాయి.”
                                          (ఓ.వి. 115)
“గురువు ఉపదేశాలే గ్రంధపురాణాలు.  గురువు పారాయణ చేస్తూ వివరించే విషయాలు శ్రోతలకోసం.  కాని ఆయన మనకు ప్రత్యేకంగా ఇచ్చిన ఉపదేశాలనే గుర్తుపెట్టుకుని ఆచరణలో పెట్టాలి.  అవే మనకు వేదాలు.
                                           (ఓ.వి.  116)
4. అధ్యయనం, శ్రమించుట:
మోక్షాన్ని పొందగోరే శిష్యుడు స్వయంగా కష్టపడి పని చేయాలి.  గురువు మార్గాన్ని చూపిస్తారు.  “పట్టుపీతాంబరాలు ధరించినంత మాత్రాన ఎవరయినా యోగీశ్వరులు, మహాత్ములు కాగలరా?  కష్టపడి ఎముకలు అరిగేలా శ్రమించాలి, రక్తాన్ని నీరుగా మార్చాలి.”                                                             (ఓ.వి. 79) అధ్యాయం – 4
                                                          
“పరమానందాన్ని పొందాలి, మోక్షం కావాలనే తపన ఉన్నవాడు ఎంతో అభ్యాసం చేయాలి.  ఎన్ని విపత్తులెదురయినా తట్టుకునే శక్తి కలిగి ఉండాలి.  సాహసంతో నెగ్గుకు రావాలి.”                                                                    (ఓ. వి. 150)  అధ్యాయం – 32
"ఫలాపేక్ష గురించి చింత పెట్టుకోకుండా తీవ్రంగా శ్రమించండి.  మీరు పాలకోసం ఏవిధమయిన ప్రయత్నం చేయకండి.  మీవెనుకే పాలగిన్నెను పట్టుకొని నేను నిలబడి ఉన్నాను."                                                                           (ఓ.వి. 158)

“కాని, గ్లాసుల కొద్దీ పాలన్నీ  నేను త్రాగుతాను, మీరు మాత్రం కష్టపడండి అనే భావంతో మీరు ఉంటే నేను దానికి ఒప్పుకోను.  మీరు మీపనులలో చాలా చురుకుగా ఉండి కార్యసాధకులుగా ఉండాలి.                                                  (ఓ.వి. 159) అధ్యాయం – 19

దీని భావం ఏమిటంటే మనం ఎటువంటి కష్టం పడకూడదు.  భగవంతుడు మాత్రం మనకి అనుకున్నవన్నీ వెంటనే ఇచ్చేయాలి.  ఈ భావం మనలో ప్రవేశించకూడదని బాబా వారు మనకి హితోపదేశం చేస్తున్నారు.  మనం శ్రమించాలి.  ఫలితం భగవంతునికి వదిలేయాలి.  మనకేది ఎప్పుడు ఏవిధంగా ఇవ్వాలో భగవంతునికి తెలుసు.

సాయిబాబా చెప్పేదేమిటంటే ఎవ్వరూ కూడా కష్టపడి శ్రమించడానికి సిధ్ధంగా లేరు. కష్టపడకుండా ఫలితం మాత్రం వెంటనే కలగాలని కోరుకునేవారే అందరూ.

“నా సర్కారు (భగవంతుడు లేక గురువు) తీసుకుపో, తీసుకుపో అంటాడు.  కాని అందరూ నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి అంటారు.  నేను చెప్పిన మాటలను ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేకుండా ఉన్నారు.  ఎవరూ అవగాహన చేసుకోవటల్లేదు.                               
                                      (ఓ.వి. 161)

“నా ఖజానా నిండుగా పొంగి పొర్లిపోతున్నది.  బండ్లకొద్దీ తవ్వి తీసుకుపొమ్మన్నా ఎవరూ బండి తెచ్చుకోరు, త్రవ్వి తీసుకుపోరు.  సుపుత్రుడయినవాడు ఆద్రవ్యమునంతయు తీసుకొనవలెను.”
                            (ఓ.వి. 163)  అధ్యాయం – 32
ఇక్కడ బాబావారి ఉద్దేశ్యం ఖజానా అంటే ఆధ్యాత్మిక ఖజానా.  నా వద్దకు వచ్చేవారందరూ ఐహిక సుఖాలయిన ధనము, పుత్రపౌత్రులు, కీర్తి ప్రతిష్టలు ఇవే కోరతారు.  నా ప్రభువు ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుపొమ్మంటారు.  ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సుపుత్రుడు వచ్చి తీసుకొని వెళ్ళాలి.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 




Kindly Bookmark and Share it:

1 comments:

Unknown on October 10, 2016 at 11:32 PM said...

I have recently launched a blog on Shri Shirdi SaiBaba which can be reached at http://chsairutvik.blogspot.com request all Sai devotees to red and bleess me.

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List