12.10.2016 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వమ్
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
18.
గురుభక్తి –4 వ.భాగమ్
5.
శిష్యునియొక్క తొమ్మిది గుణాలు :
సాయిబాబా
తన భౌతిక శరీరాన్ని విడిచి వెళ్ళేముందు లక్ష్మీబాయి
షిండేకి తొమ్మిది రూపాయినాణాలను ఇచ్చారు. అధ్యాయమ్
– 42. ఇందులోని గూఢార్ధం ఈ సంఖ్య నవవిధ భక్తులను
తెలియచేస్తుంది. శిష్యునియొక్క తొమ్మిది గుణాలను
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఉద్దవునికి వివరించిన విషయాన్ని హేమాడ్ పంత్ శ్రీసాయిసత్
చరిత్రలో ప్రస్తావించారు.
గురువుయొక్క అనుగ్రహం పొందాలంటే “శిష్యుడు 1.ఎంతో అణకువగా (అహంకారం లేకుండా) 2. శ్రధ్ధాసక్తుడై, 3.ఈర్ష్యా, అసూయలు లేనివాడుగా 4.ఐహిక సుఖాలయందు అనాసక్తునిగా, 5.నిరంతరం తన గురువుకు సేవ చేసుకోవాలనే తపనతోను, 6.ముక్తి మోక్షాన్ని పొందుదామనే జిజ్ఞాసను కలిగినవాడై, 7.చంచల మనస్సు లేకుండా, 8.ఇతరులను దూషించనివానిగా, 9. తన గురువు ఎదుట అనవసరమైన వాదనలు చేయనివాడుగను ఉండాలి. ఈ తొమ్మిది గుణాలతోను తన గురు మహరాజ్ ను సంతృప్తి పరచడానికి కఠోర శ్రమచేయాలి.
గురువుయొక్క అనుగ్రహం పొందాలంటే “శిష్యుడు 1.ఎంతో అణకువగా (అహంకారం లేకుండా) 2. శ్రధ్ధాసక్తుడై, 3.ఈర్ష్యా, అసూయలు లేనివాడుగా 4.ఐహిక సుఖాలయందు అనాసక్తునిగా, 5.నిరంతరం తన గురువుకు సేవ చేసుకోవాలనే తపనతోను, 6.ముక్తి మోక్షాన్ని పొందుదామనే జిజ్ఞాసను కలిగినవాడై, 7.చంచల మనస్సు లేకుండా, 8.ఇతరులను దూషించనివానిగా, 9. తన గురువు ఎదుట అనవసరమైన వాదనలు చేయనివాడుగను ఉండాలి. ఈ తొమ్మిది గుణాలతోను తన గురు మహరాజ్ ను సంతృప్తి పరచడానికి కఠోర శ్రమచేయాలి.
(ఓ.వి. 125) అధ్యాయం – 42
ఉత్తమ
శిష్యుడయినవానికి పైన చెప్పిన గుణాలన్నీ ఉండాలని చెప్పడం నూటికి నూరు శాతం యధార్ధమే. అవి తప్పకుండా ఉండాల్సిందే. కాని సరైన గురువును ఎంచుకోకపోతే శిష్యునిలో ఉన్న
ఆగుణాలన్నీ వ్యర్ధమే కదా. అందుచేత హేమాడ్ పంత్
శ్రీసాయి సత్ చరిత్రలో అనేక చోట్ల సద్గురునియొక్క లక్షణాలను గురించి వివరించారు.
“ఆరు శాస్త్రాలలోను (న్యాయ, వైసేషిక, సాంఖ్య,
యోగ, మీమాంస, వేదాంత) ప్రావీణ్యం ఉన్నవానిని, వేదాలను ఉపనిషత్తులను వివరించి చెప్పేవానిని
తెలివయిన వారు సద్గురువుగా భావింపరు. “ (ఓ.వి.
-3)
‘శ్వాసను బిగపట్టి సమాధిని పొందేవారినీ,
కాల్చి ఎఱ్ఱగా చేసి రాగి ధాతువుల ముద్రలను తమ శరీరం మీద వేయించుకుని, ఆచిహ్నాలను ధరించేవారిని,
తను స్వీయానుభూతి పొందకుండా తమ వాక్చాతుర్యంతో బ్రహ్మమును గురించి వివరిస్తూ శ్రోతలను
రంజింపచేసేవారిని జ్ఞానులు సద్గురువులని అనరు.’
(ఓ.వి. 4)
‘శిష్యులకు శాస్త్రోక్తంగా మంత్రాలనుపదేశించి,
వానిని జపం చేయమని ఆజ్ఞాపించేవారు, ఫలప్రాప్తి ఎప్పుడు సిధ్ధిస్తుందో ధృఢంగా చెప్పలేనివారు
సద్గురువులు కారు’ (ఓ.వి. 57)
‘బ్రహ్మమును గురించి రసవోత్తరంగా, ఆసక్తికరంగా
వివరించినా స్వానుభవం ఎంతమాత్రం లేనివానిని, కేవలం మాటలే తప్ప జ్ఞానం లేనివానిని సద్గురువులుగా
భావించరు.” (ఓ.వి.6)
‘వేదాలు,
శాస్త్రాలలో పరిపూర్ణమయిన జ్ఞానం ఉండి శిష్యులకు ప్రత్యక్షానుభవాన్ని ఇవ్వడంలో పూర్ణ
అనుభవం కలిగి ఉన్నవారికే శిష్యులకు ఉపదేశించటానికి అధికారం ఉంటుంది.’
(ఓ.వి. 8)
‘సద్గురువయినవాడు
కలలోనైనా తన శిష్యునినుండి ఏవిధమయిన లాభాన్ని గాని, సేవను గాని కోరడు పైగా తానే తన
శిష్యునకు సేవ చేయాలనుకుంటాడు.’ (ఓ.వి. 10)
‘శిష్యుడనగా పనికిమాలినవాడని భావింపనివాడు,
అందరిలోకి తానే
శ్రేష్ఠుడిననే అహంకారం లేనివాడే సద్గురువు. అటువంటివాడే ఈ ప్రపంచంలో శ్రేష్ఠుడయిన సద్గురువు’ (ఓ.వి. 11)
శ్రేష్ఠుడిననే అహంకారం లేనివాడే సద్గురువు. అటువంటివాడే ఈ ప్రపంచంలో శ్రేష్ఠుడయిన సద్గురువు’ (ఓ.వి. 11)
'శిష్యుడు
కూడా పరమాత్మ స్వరూపుడని భావించి పుత్రప్రేమతో చూస్తు వారినుంచి తన అవసరాలను తీర్చుకోనివారు
సద్గురువులు. అటువంటివారే ఈప్రపంచంలో శ్రే ష్ఠులయిన
సద్గురువులు’ (ఓ.వి. 12)
‘పరమశాంతికి నిధానమై, విద్యాదర్పం లేనివారి అందరినీ సమానంగా అనగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చూసేవారే సద్గురువులు'
(ఓ.వి.13) (అధ్యాయం – 48)
(ఓ.వి.13)
‘సద్గురువయినవాడు
తన శిష్యులు మోహబంధాలలో చిక్కుకుని ఉండటం చూసి మనసులో వ్యాకుల పడుతూ వారిని ఆబంధాలనుంచి
ఏవిధంగా బయటపడవేయాలా అని రాత్రింబవళ్ళు చింతిస్తూ ఉంటాడు.’ (ఓ.వి. 58 అధ్యాయం – 10)
‘ఈ
ప్రపంచంలో ఎంతో మంది గురువులున్నారు. వారందరూ
శిష్యులను పట్టి బలవంతంగా వారికి మంత్రోపదేశం చేసి వారినుంచి డబ్బులు గుంజి మోసం చేస్తూ
ఉంటారు.’
(ఓ.వి.
61)
‘కొంతమంది గురువులు శిష్యులకు ధర్మబధ్ధంగా
ఏవిధంగా నడచుకోవాలో బోధిస్తారు. కాని తాము
మాత్రం దానికి విరుధ్ధంగా ప్రవర్తిస్తారు.
అటువంటివారు మనలను భవసాగరాన్ని ఏవిధంగా దాటించగలరు? మనలను కష్టాలనుండి, బాధలనుండే కాక జననమరణ చక్రాలనుండి
కూడా తప్పించలేరు.’
(ఓ.వి.
62)
‘నియత గురువులని, అనియత గురువులని రెండు
రకాల గురువులున్నారు. ఈ రెండు రకాల గురువుల
గురించి వివరంగా తెలుసుకుందాము.’
(ఓ.వి. 65)
‘అనియత గురువులు సమయానుకూలముగా వచ్చి ఏదయినా
సలహానిచ్చి మన అంతరంగములోని సుగుణాన్ని వృధ్ధి చేసి మోక్షమార్గంలో పయనింప చేస్తారు.’
(ఓ.వి. 66)
‘నియత గురువులతో అనుబంధం ఏర్పడితే నీవు
నేను అనే ద్వంద్వ భావాన్ని పోగొట్టి అంతరంగాన్ని యోగంలో ప్రతిష్టించి, ‘తత్వమసి’ అనే మహా వాక్యాన్ని
ఆగురువులు ప్రత్యక్షంగా అనుభవింప చేస్తారు.
అనగా భగవంతుడు నీవు వేరు కాదనే విషయాన్ని మనకు తెలియచేస్తారు. (ఓ.వి. 67) అధ్యాయం – 10
సాయిబాబా
రెండవ కోవకి చెందిన సద్గురువు. అంతే కాదు ఆయన
సర్వశక్తిమంతులు. ప్రపంచ జ్ఞానాన్ని బోధించే
గురువులు అనేకమంది ఉన్నారు. కాని ఎవరయితె సహజస్థితిలో
నిలిచేలా చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతంగా తీసుకుని వెడతారో ఆయనే అసలయిన సద్గురువు. సంసారసాగరాన్ని సులభంగా దాటించేవారే సమర్ధ సద్గురువు. సద్గురువుయొక్క మహిమ, గొప్పతనం అద్వితీయం. అది అగోచరమయినది.
(ఓ.వి. 70)
(అధ్యాయం - 10)
అందుచేతనే సాయిబాబా తన భక్తులయిన మహల్సాపతి, కాకాసాహెబ్ దీక్షిత్, దాసగణు మహరాజ్, ఉపాసనీ మహరాజ్ లను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళగలిగారు. ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే 1938 సంవత్సరంలో అనగా సాయిబాబా మహాసమాధి చెందిన 20 సంవత్సరముల తరువాత, ఆయన కరాచీలో ఉన్న శ్రీమోటా గారికి దర్శనమిచ్చి ఆత్మసాక్షాత్కారం పొందడానికి చేయవలసిన కొన్ని యోగా పధ్ధతులను వివరించారు. శ్రీమోటాగారికి 29 మార్చి 1938 సంవత్సరంలో రామనవమి రోజున వారణాసిలో ఆత్మసాక్షాత్కారం కలిగింది.
అందుచేతనే సాయిబాబా తన భక్తులయిన మహల్సాపతి, కాకాసాహెబ్ దీక్షిత్, దాసగణు మహరాజ్, ఉపాసనీ మహరాజ్ లను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళగలిగారు. ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే 1938 సంవత్సరంలో అనగా సాయిబాబా మహాసమాధి చెందిన 20 సంవత్సరముల తరువాత, ఆయన కరాచీలో ఉన్న శ్రీమోటా గారికి దర్శనమిచ్చి ఆత్మసాక్షాత్కారం పొందడానికి చేయవలసిన కొన్ని యోగా పధ్ధతులను వివరించారు. శ్రీమోటాగారికి 29 మార్చి 1938 సంవత్సరంలో రామనవమి రోజున వారణాసిలో ఆత్మసాక్షాత్కారం కలిగింది.
శ్రీమోటాగారు గుజరాత్ రాష్ట్రంలో పేరుగాంచిన గొప్ప యోగీశ్వరుడు. ఆయన తన జీవిత చరిత్రలో “సాయిబాబా నా ఆధ్యాత్మిక ప్రగతికి తుది మెరుగులు దిద్దారు” అని వ్రాసుకున్నారు.
(HariOm Asram founded by SrI Mota)
సాయిబాబావారు చెప్పినట్లుగా పైన చెప్పబడిన సలహాలను పాటించి, శిష్యుడయినవాడు సద్గురువుకు విధేయతలతో సేవ చేసినట్లయితే ఆధ్యాత్మికంగా పురోగతి ఖచ్చితంగా సాధించి తీరతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. గురువుయొక్క యోగ్యత ఎంత ఘనంగా ఉంటే శిష్యునియొక్క భక్తికూడా ఆవిధంగానే ఉంటుంది.
‘విశ్వాసంతో మన శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని,
సర్వస్వాన్ని సద్గురు పాదాల వద్ద భక్తిపూర్వకంగా సమర్పించాలి. జీవితమంతా సద్గురు సేవలో ఆజన్మాంతము ఆయువును వెచ్చించాలి.’
(ఓ.వి. 57)
‘గురునామం, గురు సహవాసం, గురుకృప, గురుచరణ
తీర్ధం, గురుమంత్రం, ఇవి ప్రాప్తించడం అత్యంత కష్టం’
(ఓ.వి.
58)
‘తన ప్రచండ శక్తితో గురువు భక్తుల భక్తిని
పరీక్షించి, వారిని అవలీలగా మోక్షద్వారానికి తీసుకుని వెడతారు.’
(ఓ.వి.
59) అధ్యాయం – 1
(రేపటి
సంచికలో జ్యోతిష్య శాస్త్రం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment