Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 9, 2016

సాయిభక్తుల అనుభవాలు - విగ్రహ రూపంలో కాపాడిన సాయినాధుడు

Posted by tyagaraju on 6:20 AM
     Image result for images of shirdi sainath
          Image result for images of rose hd

09.12.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబంధు సాయిసురేష్ గారు పంపించిన, ఇద్దరు సాయి భక్తుల అనుభవాలను యధాతధంగా ప్రచురిస్తున్నాను.  
కువైట్ కి చెందిన సాయి గీత గారికి ఈరోజు(07th November 2016) బాబా ఇచ్చిన అనుభవము
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
కువైట్ నుండి సాయి గీత గారు తమకు ఈరోజు(07th November 2016) బాబా ఇచ్చిన అనుభవాన్ని నాకు whatsapp ద్వార ఆడియో రూపంలో పంపించారు. దానిని సాయి బంధువుల కోసం అక్షర రూపం గావించాను. సాయి గీత గారి మాటలలోనే వారి అనుభవాన్ని చదవండి.


ఇండియా లో ఓటర్ ఐడి లా మాకు ఇక్కడ కువైట్ లో సివిల్ ఐడి కాపీ అని ఉంటుంది. అది లేకుండా బయటకు ఎటు వెళ్ళినా (ఇల్లీగల్) అది చట్ట విరుధ్ధంఅలాంటిది రోజు ఏమైందంటే సివిల్ ఐడి కాపీ ని స్వెటర్ లో పెట్టి గుర్తు లేక వాషింగ్ మెషిన్ లో వేసేసాను. కొద్ది సేపటికి ఏదో విషయంగా బాత్ రూమ్ కి వెళ్ళాను. ఏదో శబ్దం వస్తుంది, కానీ అంతగా గమనించలేదు. బాబా ని తలచుకుంటూ ఉన్నాను. ఎందుకో మనఃశాంతి లేదు. బాబా నాకు మనఃశాంతిని  ప్రసాదించండి అని ప్రార్ధిస్తున్నాను. సాధారణంగా నేను ఒకసారి వాషింగ్ మెషిన్ ఆన్ చేసాక చూడను. అలాంటిది ఎందుకో సడన్ గా 15 నిమిషాల తర్వాత చూసేసరికి సివిల్ ఐడి కాపీ కనిపించింది. నాకు చాల కంగారుగా అనిపించింది. ఏమి చేయాలో తోచలేదు. ఎందుకంటే మాది ఆటోమాటిక్ వాషింగ్ మెషిన్ ఒకసారి ఆన్ చేసాక మళ్ళి ఆఫ్ చేసినాగాని లాక్ ఓపెన్ కాదు. ఐదు నిమషాల  తర్వాత ఏమి చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు మెషిన్ లాక్ ఒకసారి ప్రయత్నించి ఓపెన్ కాకపోతే ఎవరైనా  ఎలక్ట్రీషియన్ కి  గాని, ప్లంబర్ కి గాని కాల్ చేద్దామనుకొని, ఒకసారి ప్రయత్నించాగానే లాక్ ఓపెన్ అయ్యింది. ఇది నిజంగా బాబా దయ. ఎందుకంటే ఇక్కడ మాకు సివిల్ ఐడి కాపీ లేకుంటే చాలా ప్రాబ్లం గా ఉంటుంది. అదికాక పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేద్దామన్నా కూడా ఎలా చేయాలో తెలియదు. బాబా ఈజ్ గ్రేట్. అయన మాతో ఎప్పుడు తోడుగా ఉన్నారని నిరూపిస్తున్నారు. చాలా చాలా థాంక్స్ బాబా.

విగ్రహ రూపంలో కాపాడిన సాయినాధుడు
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
కమ్మరి బిడ్డ కొలిమిలో పడబోతుంటే మసీదులో కూర్చొని మండుతున్న ధునిలో చేయిపెట్టి బిడ్డని కాపాడారు మన దేవాదిదేవుడు. అదేవిధంగా మొన్న 22--11--2016 విజయవాడకి చెందిన   సునీత గారి పూజగదిలో ఉన్న బాబాగారు తన కాలు విరగ్గొట్టుకొని వారి అబ్బాయిని కాపాడారు.. అది వారి మాటల్లోనే విందాము.

అందరికీ నమస్కారమండి. నా పేరు సునీత. మన "సాయిపత్" గ్రూపులో మధ్యే  చేర్చబడినాను. బాబాగారి బిడ్డనైనందుకు జన్మంతా బాబాగారికి ఋణపడి ఉంటాను. బాబాగారి లీలలు వర్ణించడం ఎంత మధురం. నా జీవితంలో మధ్యే జరిగిన బాబాగారి లీల మా కుటుంబమును కాపాడిన ఒక సందర్భమును మీ అందరితో పంచుకుంటున్నాను.

నవంబరు 22 తారీకు మంగళవారము పూజ చేసుకొని పని మీద బయటకు వెళ్ళివచ్చాము. ఇంటి తలుపులు తెరవగానే బాబా మందిరంలో బాబాగారి పటము, విగ్రహము రెండూ క్రింద పడిపోయి ఉన్నాయి. బాబాగారి విగ్రహం మోకాలు దగ్గర నుండి విరిగి పోయిందిచూస్తూ కూర్చుండి పోయి ఏడ్వటం జరిగిందిఏమి చేయాలో తెలియదు. దాదాపు పదిహేను సంవత్సరాలుగా విగ్రహములోనే బాబాగారిని చూసుకుంటూ నా కుటుంబము గడుస్తుంది. స్వామీ, ఏమిటి ఆపద అని మన "సాయిపత్" సాయిబంధువులైన సాయి శ్రీనివాస్ మూర్తి గారికి, సాయి సురేష్ గారికి, సాయి మూర్తి గారికి ఏమైనా సలహా ఇస్తారేమోనని ఫోన్ చేసాను. కాని ఒక్కరి ఫోన్ కూడా కలవలేదు. ఒక్కరితోనైనా మాట్లాడేందుకు బాబా నాకు అవకాశం ఇవ్వలేదు. భయము ఇంకా పెరిగింది. ఏమి ఆపద ముంచుకొస్తుందో అనే భయంతో బాబా నామ స్మరణ చేస్తూ ఒక రోజు గడిపాముసాయిసురేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది. తిరుపతి వెళ్ళినందుకు ఫోన్ కలవలేదు అని వారే నాకు ఫోన్ చేసారు. జరిగినది అంతా చెప్పాను. వారి మాటలతో కొంచెం ఓదార్పు కలిగింది. అదే రోజు సాయంత్రం సాయిమూర్తి గారు ఫోన్ చేసారు. వారికి కూడా  జరిగినదంతా చెప్పాను. వారు వెంటనే యొక్క విగ్రహం ఫోటో తీసి పంపించు తల్లీ అని చెప్పారు. వెంటనే రెండు ఫోటోలు తీసి సాయిమూర్తి గారి వాట్సప్ కి  పంపించాను. బాబాగార్ని అడిగి చెబుతానమ్మా అని అన్నారు.

ఒక పెద్ద షాకింగ్ న్యూస్. సాయిమూర్తి గారు ఫోన్ చేసి మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా చిన్నదో, పెద్దదో ప్రమాదమేమైనా తప్పిపోయినదా! అని అడిగారు. నాకు పూజలో ఉండగా అలాగే తోచింది.   మా ఇంటికి దీపం మా బాబు. బాబాగారి వరప్రసాదం. వెంటనే మా బాబుని అడిగాను. నిన్న నీకు స్కూలులో ఏమైనా జరిగినదా అని అడిగాను. నిన్న స్కూలులో యోగా(spiritual games) నిర్వహించారు. అందులో పాల్గొన్నప్పుడు కాలు విరిగే పరిస్ధితి అవుతుందేమో అన్నట్లు పడబోతుంటే ఎలాగో ఆగిపోయాను ఆపినట్లు అని చెప్పాడుసరిగ్గా మా బాబాగారి విగ్రహం ఎక్కడా ఏమీ అవ్వలేదు, కాలు మాత్రమే విరిగిపోయిందినిజంగా నాకు కన్నీళ్ళు ఆగలేదు. సాయిమూర్తి గారు చెప్పినది నిజమైంది. మీ ఆపదను బాబాగారు విధంగా తొలగించి మీ అబ్బాయిని కాపాడారు అని చెప్పారు. లీలని ఎరుకపడేలా బాబా ఆయనతో నాకు తెలియపరిచేలా చేసారు. సాయిసురేష్ గారికి పూజలో మాకు ఒక విగ్రహం ఇప్పించమని బాబాగారు తెలియపరిచారు. వారు మాకు బాబాగారి విగ్రహం ఇవ్వబోతున్నారు. నిజంగా "సాయిపత్" గ్రూపులో చేర్చబడి సాయిబాబా లీలను చదువుతూ వారికి దగ్గరగా ఉండేలా చేస్తున్న అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. బాబాగారు మన బాధలను ఎలా పంచుకుంటున్నారు, మన బిడ్డలకి రక్షణగా ఎలా ఉంటున్నారు అనేదానికి లీల ప్రత్యక్ష నిదర్శనం.
సాయిశ్రీనివాస్ మూర్తి గారికి, సాయిసురేష్ గారికి, సాయి మూర్తి గారికి మరీ మరీ కృతజ్ఞతలు.
"సర్వేజనాః సుఖినోభవంతు, లోకా సమస్తాః సుఖినోభవంతు".
ఇట్లు
మీ
సునీతామధుసూధన్.

నాకు(సాయి సురేష్) సోదరి సాయి సునీత గారు జరిగిన  సంఘటన  చెప్పినప్పుడు బాబా తనను అమితంగా ప్రేమించే భక్తులకు కష్టం రానివ్వరు ఏదో కర్మ రూపంలో తొలగించి ఉండవచ్చు, మీరు దిగులు పడకుండా దైర్యంగా, ప్రశాంతంగా ఉండండి. ఏమి కాదు అని చెప్పాను. బహుశా బాబా నే అలా పలికించారు. తర్వాత సాయి మూర్తి గారి ద్వారా అసలు విషయం బాబా తెలియజేసారు. బాబా తన కాలు విరగ్గొట్టుకొని తన బిడ్డను రక్షించారుఅప్పుడు అర్థం అయ్యింది భక్తుల బాధలు తాను భరించే బాబా యొక్క భక్తవత్సలతఇలాంటి బాబా లీలలు అనంతం. కాబట్టి  ప్రియ సాయి బంధువులారా ఎటువంటి విపత్కర పరిస్టితి సంభవించిన బాబా తన వారికీ అండగా ఉండి  రక్షణ  ఇస్తారని దృఢ విశ్వాసం, సహనంలతో  ఉండండి.అదే బాబా మన నుండి కోరే రెండు పైసల దక్షిణ శ్రద్ధ, సబూరి.
సాధారణముగా మన సమాజంలో విరిగిన విగ్రహం ఇంట్లో వుండకూడదు, వుంటే తప్పు లేక ఏదో జరుగుతుంది వంటి చాలా అపోహలు వున్నాయికాని ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. బాబా మనకు రానున్న ఆపధను ఆయన స్వీకరించి మనల్ని రక్షిస్తే మనం ఆయన విగ్రహం తీసుకొని వెళ్ళి గంగ లోనో, గుడి లోనో వదిలి రావడం ఎంత వరకు సమంజసంఅంతేకాదు  మనం తర్ఖడ్ కుటుంబ అనుభవాలు చదివాముఅందులో గణపతి విగ్రహం విరిగిపోయిన సంధర్భంలో శ్రీమతి తర్ఖడ్ తో బాబా " ! అమ్మా! మన కొడుక్కి చేయి విరిగితే అతనిని మన యింటినుంచి వెళ్ళగొట్టము. దానికి ప్రతిగా అతనికి తిండి తినిపించి, కోలుకునేలా చేసి తిరిగి మామూలు మనిషి అయేలా చేస్తాము"   అని  అనలేదా. అందుకే వివేకంతో ఆలోచించి నడుచుకోండి

తర్వాత రోజు నాకు బాబా సునీత గారికి పెద్ద బాబా విగ్రహం ఇవ్వాలన్న ప్రేరణ కలిగించారు. అది బాబా ప్రేరణ అవునా, కాదా అన్న సందేహంతో బాబా వారిని అడిగాను. బాబా అవునని సమాధానం ఇచ్చారు. బాబా అనుమతి ఇచ్చారన్నమాట చెప్పకుండా  సునీత గారికి విషయం చెప్పానుఅప్పుడు సునీత గారు ఇంట్లో పెద్ద విగ్రహం ఉండకుడదేమో అనే సందేహం వ్యక్త పరిచారు. (ఇది కేవలం సునీత గారి సందేహం మాత్రమే కాదు. చాలామందికి ఉంది అనుమానం. దీనికి నా సమాదానం ఒక్కటే, బాబా నాకు నా ప్రతి రూపానికి భేదం లేదని స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు విగ్రహం చిన్నదైన, పెద్దదైన రూపంలో ఉన్నది సాక్షాత్ మన సాయినాధుడే. ఇంక భయమెందుకు?. ఎందుకు పెట్టారో అర్థంకానీ ఆచారాలతో మనకేం పని. స్వయంగా బాబా మన పూజలండుకోవడానికి మన ఇంటికి వస్తున్నారు. ఇంకేం కావాలి.) బాబా అనుమతి లభించాక తగిన పరిస్థితుల ద్వారా ఆమె సందేహ నివృత్తి చేసి ఆమెను ఒప్పుకోనేలా బాబా చేస్తారనే నమ్మకంతో మీ  ఇంట్లో మాట్లాడి రేపు చెప్పండి అన్నాను. మరుసటి రోజే సునీత గారు సరేనని చెప్పారు. త్వరలో బాబా వారి ఇంటికి వెళ్లనున్నారు.

నాకు(శ్రీనివాస మూర్తి) కూడా ఎప్పుడు ఇదే (ఇంట్లో పెద్ద విగ్రహం ఉండకూడదనే) సంశయం ఉండేది. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో 1 1 /2 feet సాయి బాబా వారి విగ్రహం ఉంది. అందరు పెద్ద విగ్రహం ఉంటె ప్రతిరోజూ పూజ చేయాలి ప్రసాదం ఎక్కువ పెట్టాలి లేకపోతే అరిష్టం అని భయపెట్టేవాళ్ళు. నేను ఒక్కసారి కిషోర్ బాబు గారిని విషయమై అడిగాను. సర్ చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందం కలిగించింది. ఏమన్నారంటే "మీ అన్న ఎక్కడవున్నా తినే ముందు ఇంట్లో ఉన్న బాబాకి నైవేద్యం పెడుతునట్లుగా భావిస్తే ఏమి కాదు" అని అన్నారు.

సర్వత్ర నిండి ఉన్న బాబా సర్వదా మనతో పాటే  ఉంటారు. అటువంటప్పుడు మనం ఎక్కడ ఉన్న బాబా కు ఏది సమర్పించిన ఇంట్లో ఉన్న ఆయనకు సమర్పించుకున్నట్లే కదా!
సర్వం సాయినాధార్పణమస్తు

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List