10.12.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధు శ్రీసాయి సురేష్ గారి అనుభవాలు పంపించారు. షిరిడీలో ఆయనకు కలిగిన అనుభవాలను తెలుసుకుందాము. వారు పంపించిన అనుభవాలను యధాతధంగా ప్రచురిస్తున్నాను.
సాయి భక్తుల అనుభవాలు - సాయిసురేష్ గారి అనుభవాలు - 1
షిర్డీ
లో నేను(సాయి సురేష్)
పొందిన అనుభవాలు 1
అఖిలాండకోటి
బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజా
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి
బంధువులకు బాబా వారి ఆశీస్సులు
“ముర్తిభావించిన
జ్ఞానం, చైతన్యం, ఆనందఘనం ఇది నా నిజస్వరుపమని
తెలుసుకో, నిత్యం దానినే ధ్యానించు” అని తమ నిజ
స్వరూపం ఆనంద స్వరూపమని బాబా
చెప్పారు.
షిర్డీ లో అనుభవమయ్యే శాంతి
అనుభవించవలసిందేగాని మాటలలో చెప్పలేనిది. మనకు యింటివద్ద ఏమి
చేసినా శాంతించని మనస్సు శిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక
వ్యవహారాలనన్నింటినీ మరచి మహా శాంతిని
పొందుతుంది. ఎక్కడ అలా శాంతి
లభిస్తుందో అదే మన పరమ
గమ్యమన్నది ఋషి వాక్యం. అని
ఎక్కిరాల భరద్వాజ గారు సాయి లీలామృతంలో
చెప్పారు.
ఇది
సాయి భక్తులకు అనుభవం కూడా. నేను
(మీ సాయి సురేష్) కూడా
షిర్డీ లో అడుగు పెట్టినది
మొదలు(10th నవంబర్ 2016) తిరిగి వచ్చి(15th నవంబర్ 2016) వరకు అన్ని బాధలు,
సమస్యలు మర్చిపోయి హాయిగా షిర్డీ లో గడిపిన మధుర
క్షణాలలో కొన్ని అనుభవాలు సాయి బంధవులందరితో పంచుకుంటున్నందుకు
ఆనందంగా వుంది.
నేను,
శ్రీనివాస మూర్తి గారు షిర్డీ లో
మొదటి రోజు మద్యాహ్నం హారతి
తర్వాత రహతాకి బయలుదేరాం.
మేము వెళ్ళినప్పుడు
సుమారు 3 గంటలు కావడం తో
బాబా గారు వెళ్ళిన కుశాల్
చంద్ ఇల్లు తాళం వేసి
వుంది. అక్కడ వున్న వారిని
విచారిస్తే ఆ పక్కన వున్న
ఇంట్లో తాళాలు వుంటాయి అని చెప్పారు.
కాని ఆ ఇంటి వారిని
ఆడిగితే ఎవరో తాళాలు తీసుకొని
బయటకు వెళ్ళారని, 5 గంటలు కు వస్తారని
చెప్పారు. సరే ఇంత దూరం
వచ్చాము కదా అని ఊరిలో
కొంత సేపు తిరిగి , 4.15 కి
వచ్చి మళ్ళీ అడిగితే, ఇంకా
రాలేదు, 5 కి వస్తారని చెప్పారు.
సరే అని అక్కడే కూర్చున్నాము.
సుమారు 4.30 సమయము లో నాకు
విపరీతమైన సాంబ్రాణి వాసన వచ్చింది. ఇంకా
కాసేపట్లో తాళాలు వస్తాయని బాబా సూచిస్తున్నారు అని
నాకు అనిపించింది. కొద్ది
క్షణాలలో ఒక కుర్రవాడు సైకిల్
పై వచ్చి, ఏమి కావాలి అని
అడిగాడు. మేము
కుశాల్ చంద్ ఇల్లు దర్శనానికి
వచ్చామని చెపితే, ఆ కుర్రవాడు వెంటనే
తాళాలు తెచ్చి ఇల్లు చూపించాడు.
బాబా
అప్పట్లో ఆ ఇంటి లో
ఎక్కడ కూర్చొనేవారో చూపించాడు.
మేం దర్శనం చేసుకొని
బయటకు వచ్చినప్పుడు కూడా ఆ సాంబ్రాణి
వాసన వస్తూనే వుంది. నేను అప్పుడు శ్రీనివాస
మూర్తి గారికి చెప్పాను. కొంత
సేపటి క్రితం నాకు సాంబ్రాణి వాసన
తో బాబా చేసిన సూచన
గురించి, ఇప్పుడు కూడా ఆ వాసన
వస్తూ ఉంది, మీకు
కూడా సాంబ్రాణి వాసన వచ్చిందా అని
ఆడిగాను. శ్రీనివాస మూర్తి గారు తనకి ఆ
వాసన రాలేదని, ఇప్పుడు కూడా నాకు ఏ
వాసన రావటల్లేదు అని చెప్పారు. అప్పుడు
అర్ధం అయ్యింది అది
నాకు చూపిన లీల అని. దానితో
చాలా సంతోషంగా అనిపించింది.
రెండవ
రోజు శుక్రవారం లేవడం కాస్త ఆలస్యమైంది. కాకడ ఆరతి, నేను రూమ్ లో
వుండాగానే మొదలైంది. అయినా త్వరగా ద్వారకమాయికి
వెళ్ళి హరతి కి హజరు
అయ్యాను. ప్రశాంత వాతవరణంలో బాబా కి ఇచ్చే
ఆ ఆరతి మనస్సుకు
వర్ణించలేని ఆనందాన్ని ఇచ్చింది. నిదానంగా పాడే ఆ ఆరతిని
దేవతలు సైతం చూసి తరించవలిసిందే
అంటే అతిశయోక్తి కాదేమో. మధ్యలో హాజరు అయినప్పటికి ఆ
ఆనందాన్ని తృప్తి గా పొందాను. ఆరతి
అయిన తర్వాత పైకి వెళ్లి బాబా
దర్శనం చేసుకుంటూ చాలా చాలా అనందం
పొందాను. ఆ ఆనందం కోసం
3 సార్లు మళ్ళీ మళ్ళీ క్యూ
లో వెళ్ళి దర్శనం చేసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా
ద్వారకామాయి మెట్ల మీద నుండి
పంపివేసేవారు. నేను చాల బాధ
పడేవాడిని. కానీ ఈ సారి
కొంచం లోపలి వరకు అనుమతి
ఇచ్చారు. అలా ద్వారకామాయి లోపలి
వెళ్ళడం చాల ఆనందాన్ని ఇచ్చింది. ద్వారకమాయిలో సుమారు ఒక అరగంట బాబాని
చూస్తు కూర్చొన్నాను. చాలా
హ్యపీ ఫీల్ అయ్యాను.
తర్వాత
అక్కడ నుండి వెళ్ళి గురుస్థాన్
దగ్గర 11 ప్రదక్షిణలు చేసాను. అక్కడ అందరు ఆతురతో వేపాకు సేకరిస్తూ వుంటారు. నేను ఎన్ని సార్లు
షిర్డి వెళ్ళినా వేపాకు కోసం ఆరాటపడలేదు.
నాకు ఇవ్వాలంటే బాబానే ఇస్తారు అనుకొనేవాడిని. ఈసారి కూడా ప్రదక్షిణ
చేస్తూ బాబా మీరు వేపాకు
ఇవ్వాలంటే అది నాకోసం ప్రత్యేకించి
రాలి పడాలి అనుకున్నాను. మూడవ ప్రదక్షిణ
చేస్తూ వుండగా ఒక వేపాకు కరెక్ట్
గా నా పాదాల చెంత
రాలింది. అది బాబా ప్రసాదంగా స్వీకరించాను. మరోసారి నేను, శ్రీనివాస
మూర్తి గారు గురుస్థాన్ వద్ద
వుండగా ఒక వ్యక్తి (బహుశ
బాబా ఆ రూపంలో వచ్చారేమో)
ప్రత్యేకించి నా వద్దకు వచ్చి
నాచేతిలో వేపాకు పెట్టారు. ఎంత
అద్భుతము? నేను ఏవిధంగా కోరుకున్నానో
అదే విధంగా ఒకసారి కాదు రెండు సార్లు
వేపాకు బాబా అందించారు.
ప్రతి
సంవత్సరం పల్లకీ ఉత్సవము చూస్తూన్న తృప్తి లేకపోవడం, ముందు రోజు శ్రీనివాస
మూర్తి గారు పల్లకీ ఉత్సవము
మిస్ అవ్వడం వలన, మాకు బాబా
మంచి అవకాశం
ఇచ్చారేమో అన్నట్లు సాధారణముగా
గురువారం జరిగే పల్లకీ ఉత్సవము
శుక్రవారం కూడా జరిగి చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంతేకాదు
నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చింది.
ఎందుకు అంటే ఈసారి పల్లకీ
సమాధి మందిరం నుండి ద్వారకమాయికి తర్వాత ద్వారకామాయి నుండి
ఊరి లోపలికి తీసుకు వెళ్ళారు. వెళ్ళే ముందు అక్కడ వున్న
కొంత మంది భక్తులకు పల్లకీ
తాకి బాబాను, బాబా పాదాలను తాకే
అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం నాకు
దొరకింది. ఆ ఆనందం ఏమని
చెప్పను. చాలా
చాలా సంతోషం బాబా నాకు ఇచ్చారు.
(రేపు మరొక అనుభవం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment