11.12.2016
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
బంధు శ్రీసాయి సురేష్ గారి అనుభవాలలో రెండవ అనుభవమ్ ఈ రోజు ఆస్వాదించండి.
సాయిభక్తుల
అనుభవాలు – సాయిసురేష్ గారి అనుభవాలు - 2
షిర్డీ
లో నేను(సాయి సురేష్)
పొందిన అనుభవాలు 2
అఖిలాండకోటి
బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి
బంధువులకు బాబా వారి ఆశీస్సులు
మూడవ
రోజు ఉదయాన్నే కాకడారతికి వెడదామనుకున్నాము. కానీ లేవడం ఆలస్యమైంది. శ్రీనివాస
మూర్తి గారు సమయానికి కాకడారతికి వెళ్లారు గాని,
నేను హారతి చివరలో ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని
కొంత సమయం కూర్చొని సమాధి
మందిరం దర్శనానికి వెళ్ళాను.
బాబా దర్శనం తో
తనివితీర ఆనందించి మా
ఫ్రెండ్ వస్తాడని
రూమ్ కి వెళ్తున్నాను. నేను
షిర్డీ వెళ్ళే ముందు, బాబా! మీరు
ఎందరో భక్తులకు షిర్డీ లో సజీవ దర్శనం
ఇస్తూ ఉంటారు. కానీ నేను ఇన్ని
సార్లు షిర్డీ వచ్చినా నాకు
అటువంటి అనుభవం కలుగలేదు. ఈ సారైనా నాకు
మీ దర్శనం ఇవ్వండి అనుకున్నాను. నేను షిర్డీ వెళ్ళిన
మొదటి రెండు రోజులు బిచ్చగాళ్ళు
అందరిని అడుగుతున్నారు కానీ నన్ను ఎవరు
అడుగలేదు. బాబా ఏ రూపంలోనైన
రావొచ్చు. ఈ బిచ్చగాళ్ల
రూపంలో కూడా రావొచ్చు. అలా
వస్తే మీరు నన్ను ప్రత్యేకంగా
అడిగితే నేను ఇస్తాను అని
అనుకున్నాను. నేను రూమ్ కి
వెళ్తుండగా లక్ష్మి మందిరం వద్ద ఒక ముసలి
వ్యక్తి నిలబడి ఉన్నారు. అతను ఎవరిని ఏమి
అడగటం లేదు. నేను అతని
వద్దకు రాగానే టీ త్రాగడానికి డబ్బులు
అడిగారు. నేను పట్టించుకోకుండా నాలుగు
అడుగులు ముందుకు వెళ్ళిపోయాను. అప్పుడు నా
సంకల్పం గుర్తుకు వచ్చి 2 రూపాయలు యివ్వలనుకున్నాను. కానీ 2 రూపాయలకు టీ ఏమి వస్తుందని.
10 రూపాయలు ఇవ్వాలని వెనుకకు వెళ్లి, అతని కి 10 రూపాయలు
ఇచ్చాను. వెంటనే
అతడు సాయిరాం అని నా శిరస్సుపై
తమ రెండు చేతులు ఉంచి
ఆశీర్వదించారు. అతను నా తలపై
చేతులు ఉంచగానే నా తల అంత
చాలా చల్లగా అనిపించింది. ఆ చేతి స్పర్శకు
నాకు ఏంతో హాయి గా,
ప్రశాంతంగా అనిపించింది. తర్వాత నేను రూమ్ కి
వచ్చాక గాని అర్ధం కాలేదు.
ఆ రూపంలో వచ్చింది ఎవరో
కాదు నా బాబా అని. చాల
బాధపడ్డాను. నేను ఏవిధంగా బాబా
దర్శనం కావాలని కోరుకున్నానో అదే రూపంలో బాబా
వచ్చినప్పటికీ గుర్తించలేని అజ్ఞానిని. బాబా
సజీవ దర్శనం ఇచ్చినా బాబా పరీక్షిస్తారో, లేక
మాయ ప్రలోభ పెడుతుందో కానీ ఆ క్షణంలో
గుర్తించలేకపోయాను. అయినప్పటికీ బాబా దర్శనం, ఆశీస్సులు
లభించాయి. అదే మహదానందం.
చివరి
రోజు మేము కార్తీక పౌర్ణమి
సందర్భంగా సాయి సత్యవ్రతం చేసుకున్నాము. కార్తీక
పౌర్ణమి రోజు మా ఇంట్లో
కేదారేశ్వర వ్రతం చేసుకుంటాము. మనకు
మన బాబా యే కదా
ఆ కేదారినాధుడు, అందువలన ఆ రోజు సాయి
సత్యవ్రతం ఎందుకు చేసుకోరాదు అని అనిపించేది. ఆ
కోరికను బాబా ఈ రూపంలో
తీర్చారు. ఈ సంవత్సరం సరిగా
కార్తీక పౌర్ణమి రోజు షిర్డీ లో
ఉండేలా చేసి పవిత్రమైన షిర్డీ
క్షేత్రంలో సాయి సన్నిధిలో సాయి
సత్యవ్రతం చేసే అవకాశం ఇచ్చి
ఆ కేదారినాధుడే తానని నిరూపించారు..
ఎప్పుడు
షిర్డీ వెళ్ళినా తిరిగి వచ్చే సమయంలో చాలా భాధ కలుగుతుంది.
షిర్డీ విడిచి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎప్పుడు వస్తామోనని.
బహుశా
చాలా మంది భక్తులు కూడా
ఈ బాధను అనుభవిస్తారు. ఈసారి కూడా చివరి
క్షణం ఆసన్నమైంది. కానీ ఈసారి ప్రత్యేకమైనది.
చివరిగా మేము ద్వారకామాయి గేటు
వద్ద నుండి బాబా దర్శనం
చేసుకొని వెళ్ళిపోదామని నిర్ణయించుకొని రూమ్ నుండి లగేజి
తో బయలుదేరాము. ముందు గా చావడిలోనికి
వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను.
ఆశ్చర్యం, బాబా
ముఖంలో ఒక రకమైన ఆనంద
పారవశ్యాన్ని చూసాను.
అది నిజామా, కలా
అని మనసులో అనుకున్నంతలో నిజమే అని
బాబా తెలుపుతున్నట్లు పరిమళాల వాసన వచ్చింది. చాలా
సంతోషమనిపించింది. అక్కడి నుండి ద్వారకామాయి గేటు
వద్దకు వెళ్లి బాబా దర్శనం చేసుకుంటున్నాను.
భక్తులు బాబా దర్శనం చేసుకుంటుంటే
బాబా మాత్రం ప్రత్యేకించి నన్ను చూస్తున్న అనుభూతి
పొందాను. బాబా వారు సంతోషంగా
వెళ్ళిరమ్మని ఆశీర్వదించారని అనిపించి మాటలలో చెప్పలేని ఆనందం, అనుభూతి చెందాను.
గత 4 రోజులుగా చూస్తున్న ద్వారకామాయిలో గాని, చావడిలో గాని
బాబా వద్ద నాకు ఏవిధమైన
అనుభూతి కలగలేదు. కానీ చివరి దర్శనంలో
నాకు ఈ రెండు చోట్ల
గొప్ప అనుభూతిని ప్రసాదించి నా
మనస్సుని పరవశింపజేసారు. ఆ ఆనందంతో ఎటువంటి
బాధ లేకుండా సంతోషంగా షిర్డీ నుండి తిరిగి వచ్చేసాను.
ఇప్పటికీ కనులు మూసుకుంటే చాలు
ఆ చివరి దర్శనం కనుల
ముందు మెదిలి ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది. ఇదంతా వింతగా అనిపించవచ్చు
కానీ ఇది నాకు ప్రత్యక్ష
అనుభూతి.
నాకు
ఇంత మంచి అనుభవాలను ప్రసాదించి
ఆనందపారవశ్యంలో ముంచిన నా గురు సాయికి నా శతకోటి ప్రణామాల
దక్షిణ సమర్పించుకుంటున్నాను. అందరికి అనుభవాలను ప్రసాదించి వారి భక్తిని పెంపొందింపజేయాలని
సాయిని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.
సర్వం
సాయినాధార్పణమస్తు
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి
సంచికలో మరికొన్ని అనుభవాలు)
0 comments:
Post a Comment