Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, December 12, 2016

సాయి భక్తుల అనుభవాలు – సాయి సురేష్ గారి అనుభవాలు - ౩

Posted by tyagaraju on 8:05 AM
           Image result for images of shirdi sai baba and lord venkateswara
                Image result for images of white rose

12.12.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధు శ్రీ సాయి సురేష్ గారి మరొక అనుభవాలలో మూడవ అనుభవం. మనం ఏదేముడు, దేవత దర్శనానికి వెళ్ళినా బాబా ని నమ్మి పిలిస్తే ఆయన మనకూడా ఉంటాడని మనకు అర్ధమవుతుంది.  ఆయన సర్వదేవతా స్వరూపుడు కదా! ఆయన పంపించిన అనుభవాన్ని యధాతధంగా ప్రచురిస్తున్నాను.
            Image result for images of shirdi sai baba and lord venkateswara

సాయి భక్తుల అనుభవాలు – సాయి సురేష్ గారి అనుభవాలు - ౩
బాబా నా(సాయి సురేష్) తోడుగా వుండి కష్టాన్ని తేలియనీయలేదు
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
నేను షిర్డీ నుండి ఇంటికి వచ్చిన(16.11.2016) నాలుగు రోజుల తర్వాత 20 తేదీన అనుకోకుండా నాకిష్టం లేకపోయినా మా కుటుంబంతో తిరుపతి బయలుదేరవలసి వచ్చింది.


షిర్డీ లో కలిగే ఆనందం నాకు ఎక్కడా దొరకదు. మరి నన్ను ఎందుకు బాబా నా ఇష్టానికి వ్యతిరేకంగా తిరుపతి తీసుకెళ్తున్నారు అని అనుకున్నాను
              Image result for images of shirdisaibaba and lord venkateswara

సరే అక్కడ మీ దర్శనం నాకు ఇవ్వండి అనుకున్నానుఇంతకుముందు  నేను ఒకసారి 2012 సంవత్సరంలో కాలినడకన కొండ ఎక్కాను. కానీ కొండ ఎక్కే సమయంలో కాలిపిక్కలు పట్టేసి, ఆయాసం కూడా వచ్చి మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ప్రతి 30 నుండి 40 మెట్లకి ఒకసారి కొంతసేపు కూర్చొని చాలా కష్టం మీద ఎక్కాను. అప్పుడు  ఇకపై ఎప్పుడు కూడా కొండ ఎక్కుతానని అనుకోనని కూడా అనుకున్నాను. కానీ 2014 సంవత్సరంలో మా ఫాదర్ కి బై పాస్ సర్జరీ జరిగింది. అప్పుడు ఆయన బాధ తట్టుకోలేక 2 నెలలు చాలా ప్రాబ్లం ఫేస్ చేసారుమనకు వచ్చే ఆరోగ్య సమస్యలు పూర్వ జన్మ కర్మ ఫలాల వలన వస్తాయి. అందువలన  మా ఫాదర్ పడే భాదను చూడలేక బాబా కర్మను నేను తిరుపతి కొండ కాలినడకన ఎక్కి అనుభవిస్తానుమీరు వీలయితే మా డాడ్ ను రక్షించండి అని వేడుకున్నాను. ఇప్పుడు మ్రొక్కు  తీర్చుకోవలిసిన సమయం వచ్చింది కాబోలు నన్ను బాబా బలవంతంగా తిరుపతి తీసుకెళ్తున్నారు అని నాకు అనిపించింది. అందుకని తిరుపతి వెళ్ళిన రెండవ రోజు కొండపై నుండి క్రిందికి బస్ లో దిగి అలిపిరి పాదాల వద్ద నడక మొదలు పెట్టాను. అప్పుడు సమయం ఉదయం 11.45 నిమషాలు. మా వాళ్ళు మొదటిసారి నేను కొండ ఎక్కేటప్పుడు పడిన కష్టం, మిట్ట మధ్యాహ్నం ఒక్కడినే మెట్లు ఎక్కడానికి వెళ్తుండటం దృష్ట్యా చాలా టెన్షన్ పడ్డారు. మా తమ్ముడైతే ఒకసారి మళ్ళి ఆలోచించుకో అన్నాడుకానీ బాబా నే ఉన్నారు ఆయనే నడిపిస్తారు అనే ధైర్యంతో నేను వెళ్ళాను. నడక మొదలు పెట్టే ముందు, బాబా, మీరే నాకు తోడుగా ఉండి నడిపించాలి, లేకపోతే నేను ఎక్కడం చాల కష్టం అని బాబా ని తలచుకున్నానుబాబాని తలుచుకుంటూ, నాలో నేనే బాబాతో ఏదో మాట్లాడుకుంటూ కొండ ఎక్కుతున్నాను
                   Image result for images of shirdi sai baba and lord venkateswara

అలా ఎక్కుతుండగా మధ్యలో  3, 4 సార్లు పిక్కలు పట్టేస్తున్నట్లు, ఆయాసం వస్తున్నట్లు అనిపించి ఇంక కాసేపు కూర్చుందాం అనుకోవడం మళ్ళి అంతలో  నా కాళ్ళు తెలికపడటం, ఆయాసం పూర్తిగా పోయి కొత్త శక్తి వచ్చినట్లు నడవగలగటం నాకే  ఆశ్చర్యంగా అనిపించింది. నన్ను నేనే నమ్మలేని విధంగా ఎక్కడ ఆగకుండా మద్యాహ్నం 2 గంటల 15 నిమషాలకి  కేవలం 2 గంటల 30 నిమషాల సమయంలో మెట్లు పూర్తిగా ఎక్కేసాను.
మధ్యలో ఒకచోట నీళ్ళు త్రాగుతున్నాను, వెనక నుండి 'సాయి రామ్' అని పిలుపు వినబడి ప్రక్కకు తప్పుకుంటే ఒక వ్యక్తి నీళ్ళు త్రాగారు. నేను నాలుగు అడుగులు ముందుకు వెళ్తూ తిరుపతి కొండపై ఎక్కడ విన్నా గోవింద నామమే వినిపిస్తుంది గాని, సాయి రామ్ అని పిలిచింది ఎవరబ్బా, బహుశా నా బాబా కాదు కదా! అని వెనుకకు తిరిగి చూసాను, కానీ ఎవరు లేరు. అలా యెంత గమనించినా వ్యక్తి మళ్ళి కనిపించలేదు. అతను కచ్చితంగా బాబానే అని అప్పుడు అర్ధం అయ్యింది. నేను తిరుపతి వచ్చే ముందు బాబా మీ దర్శనం నాకు తిరుపతి లో కావాలని అడిగాను. అలానే బాబా వచ్చి దర్శనం ఇచ్చారు. నాకు తోడుగా ఉండి నాకు శ్రమ లేకుండా కొండ ఎక్కించారు. ఎంతటి దయామయుడు మన సాయిఇంతలా అనుక్షణం తోడుగా ఉండి నడిపించే బాబాకు మనం ఏమి యివ్వగలము తండ్రి ప్రేమకు  తండ్రే సాటి.

ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మాయ మనల్ని ఎలా మోసపుచ్చుతుందో చూడండి. షిర్డీ లో నాకు బాబా దర్శనం ఇచ్చారు. అప్పుడు నేను ఆయనను గుర్తు పట్టలేదని చాలా భాధ కూడా పడ్డాను. ఏన్నో రోజులు కూడా గడవలేదు, కేవలం 10 రోజుల వ్యవధిలో తిరుపతి లో మళ్ళి బాబా దర్శనం ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను గుర్తించలేకపోయాను. ఇదే మాయ అంటే. నిజానికి మనం బాబాను అయన దర్శనం కావాలని అడుగుతాముమన పై ప్రేమతో బాబా మన కోరిక తీరుస్తారు కూడా. కానీ మనకే ఆయనను క్షణంలో గుర్తించే సమర్ధత లేదు. ఏమైనా నా తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ, రెండు సార్లు నా కోరిక మన్నించి దర్శనం ఇచ్చినందుకు ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటున్నాను.

సర్వం సాయినాధార్పణమస్తు

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List