Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, December 18, 2016

సాయి భక్తుల అనుభవాలు – బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన లీల

Posted by tyagaraju on 6:20 AM
      Image result for images of sai
        Image result for images of rose hd

18.12.2016 ఆదివారమ్
ఓమ్ సాయి  శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారం రోజులుగా కొన్ని స్వంత పనులవల్ల ప్రచురణకి అంతరాయం కలిగింది. ఈ రోజు సాయి బంధు శ్రీసాయి సురేష్ గారు పంపించిన అనుభవాలలో మరొక అనుభవమ్ యధాతధంగా ప్రచురిస్తున్నాను.
సాయి భక్తుల అనుభవాలు – బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన లీల
                                   @@@
బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిర గారి అనుభవాలు)
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజా పరబ్రహ్మ 
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
విజయవాడ వాస్తవ్యులు శ్రీ  ఇందిర గారు తమ కుటుంబంలో జరిగిన మూడు బాబా లీలలను saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకోవడానికి నాకు వాట్సప్ లో పంపించారు. వారికి బాబా వారి ఆశీస్సులు సదా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాను. ఇక చదివి ఆనందించండి.


మా  పెద్దమ్మాయి పేరు రేవతి.  డిగ్రీ  ఫస్ట్  ఇయర్ లో   ఉండగా మా అమ్మాయి స్నేహితురాలు  కుటుంబంతో షిరిడి  వెళ్ళిందిబాబా  దర్శనం  చేసుకుని బయటకు వస్తుంటే  ఒక  పూజారి గారు      అమ్మాయిని  పిలిచి  ఒక  ఆరంజ్ రంగు తాడుప్రసాదం  ఇచ్చి  మీ  ఫ్రెండ్  రేవతి   కి  ఇవ్వమని  ఇచ్చారట  అమ్మాయి షిర్డీ నుండి వచ్చాక  మా అమ్మాయికి  ప్రసాదంతాడు  ఇచ్చి  మీకు  షిరిడిలో  చుట్టాలు  ఉన్నారా  అని  అడిగిందిమా అమ్మాయి మాకు షిర్డీలో తెలిసిన వారు ఎవరు  లేరు  అని  చెపితే, అమ్మాయి  ఏమో  నాకు తెలియదు  పూజారి   గారు తాడు, ప్రసాదం మీకు   ఇచ్చి  అడిగానని చెప్పమన్నారు  అని  చెప్పిందిమా  అమ్మాయి  ప్రసాదం  తెచ్చి నాకు  ఇచ్చి, విషయం అంతా చెప్పిందినేను  మా  అమ్మాయితో  రూపంలో బాబాగారు ఆరంజ్  తాడుప్రసాదం నీకు  పంపించారు  అనితాడు  మా  అమ్మాయి  చేతికి   కట్టి  ప్రసాదం  అందరమూ తీసుకున్నాము. సంఘటన 2003లో జరిగింది అనుకుంటా. అమ్మాయికి బాబా కనబడుతుంటారు. ఏదైనా ఆడిగితే సమాధానం చెపుతుంటారు.

2003 సంవత్సరంలో  నెల గుర్తు లేదు ఒక రోజు చపాతీలు చేసి బంగాళదుంప కూర చేసి స్టౌ ప్రక్కన పెట్టాను. రాత్రి 8 గంటలకి, మా రెండవ అమ్మాయి ఇంకా స్కూల్ నుండి రాలేదు వచ్చాక అందరమూ తినవచ్చు అని కూర్చున్నాము.  మా అమ్మాయి వచ్చాక తిందామని చూస్తే  పైన ఉన్న చపాతీ కొంచం తుంచి ఉంది.  
                  Image result for images of chapati some part eaten

ప్రక్కన  ఉన్న  కూర మధ్యలో కొంచం తీసినట్టుగా ఉంది. నాకు అర్థంకాక పిల్లల్ని అడిగా మీరెవరన్నా తిన్నారా అనివాళ్ళు లేదు అని చెప్పారుతరువాత మా అమ్మాయికి  బాబా నేనే తిన్నానని చెప్పారు.

మా  ఫాదర్,   మదర్   కాశి   వెళ్లినప్పుడు  అక్కడ    పండుగానికూరగాయగాని ఏదో ఒకటి  వదిలిపెట్టాలని,   మా  నాన్న   గారు  జామకాయ  వదిలి  వచ్చేసారుతరువాత  వాళ్ళకి  షుగర్  వచ్చిందిషుగర్ వాళ్ళు  తినే  ఫ్రూప్ట్స్  ఏముంటాయిజామకాయ  తప్ప  ఏమి  తినకూడదుమా  మదర్  మా  అమ్మాయిని  బాబాని  అడగమన్నారు  జామకాయ తినోచ్చేమో    అని.   కాశిలో వదిలారు  అది  ఎలా  కుదురుతుంది  అని బాబా  చెప్పారుతరువాత  రెండు  రోజుల  తరువాత  నాకు  ఎవరో  పెద్ద  జామకాయ   ఇచ్చారునేను  దానిని  కడిగి  బాబాకి  నైవేద్యంగా పూజలో  పెట్టాను.  
                         Image result for images of gua fruit
నేను  టీచర్ గా పని   చేసేదానినినేను  స్కూల్  కి  వెళ్లి  సాయంత్రం  వచ్చి  చూస్తే   పూజలో  జామకాయ  లేదునేను  పిల్లలు  తిన్నారేమో  అనుకుని ఊరుకున్నానుమేము  కాలనీలో  ఉంటాం. మా  వెనుక  లైన్లో  మా  మదర్  వాళ్ళు  ఉంటారు . సాయంత్రం  6గంటలకి నన్ను మా  మదర్  పిలిచి  వాళ్ళ ఇంటిలో దేవుడి దగ్గర ఒక  కవర్  లో  జామకాయ  పెట్టి   ఉందని   చూపించారుఅవి  నేను  బాబాకి  నైవేద్యం  పెట్టిన జామకాయ,      పక్కన  నేను పడేసిన  నల్లని  కవర్అప్పుడు అర్ధమైంది  మా  మదర్ జామకాయ తినవచ్చా, లేదా అని బాబాని  అడిగారు  కదా! దానికి సమాధానంగా బాబా  జామకాయ ను మా  ఇంట్లో  మాయం  చేసి  మా  మదర్ వాళ్ళ  ఇంట్లో  పెట్టి  తినవచ్చని సూచించారు.
మా  పెద్దమ్మాయి  పెళ్లికి  మొదటి  శుభలేఖ  బాబాకి  ఇంట్లో   పూజలో   పెట్టి  పెళ్లికి  రమ్మని   పిలిచానుపెళ్లిలో మేము  బిజీగా  ఉన్న సమయంలో  ఒక  ఆవిడ  వచ్చి  మా  అమ్మగారితో  నాకు  భోజనం  పెడతారా   అని  అడిగారుమా  అమ్మగారు తీసుకువెళ్ళి భోజనం  పెట్టించారుఆవిడ  తింటూ  నావంక  చూస్తూనే  వున్నారట  నేను  గమనించలేదుతరువాత  మా  అమ్మగారు రూపంలో   బాబానే  వచ్చారని చెప్పారుఆవిడ కళ్ళు  నీలంగా ఉన్నాయట.    యన వస్తే  గుర్తుపట్టలేదు  అని.
సర్వం సాయినాధార్పాణమస్తు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

1 comments:

Unknown on December 30, 2016 at 9:54 PM said...

sai ram. thanks thyagaraju garu. manisha garu blog lo rasinattu sai nama japam start chesanu ninna. ma bavagaru ninna tirupati prassadam techaru valla office lo evaro icharani. sai ram sai ram sai ram

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List