Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 30, 2016

సాయి భక్తుల అనుభవాలు - ఈ భౌతిక దేహానంతరమూ నేను అప్రమత్తుడనే

Posted by tyagaraju on 12:46 AM
         Image result for images of shirdisai
       Image result for images of rose hd yellow

30.12.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత పది రోజులుగా కొన్ని వ్యక్తిగత వ్యవహారాల వల్ల ప్రచురించడానికి సమయం దొరకలేదు.  ఈ రోజు యధావిధిగా ప్రచురిస్తున్నాను. సాయి బంధు శ్రీసాయి సురేష్ గారు పంపించిన అనుభవాలలో మరొక అనుభవం.  శ్రీసాయి సురేష్ గారు పంపించిన అనుభవాన్ని యధాతధంగా ప్రచురిస్తున్నాను.

సాయి భక్తుల అనుభవాలు

ఈ భౌతిక దేహానంతరమూ నేను అప్రమత్తుడనే
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు అందుగాక. ఈరోజు సాయి దయతో, సాయి క్పపతో నెల్లూరు నుండి ఇందిరా బాలాజీ గారు  పంపిన  శ్రీసాయి లీలను చదివి ఆనందిద్దాము..


పాండు రంగ గారి అనుభవం :-
బాబా సమాధి అనంతరం బీడ్ సమీపంలో గోదావరి పంచదార కర్మాగారం లో, పాండురంగ అనే దత్తాత్రేయ భక్తుడుండేవాడు. ఆయన బాబా గురించి విని షిర్డీ వెళ్ళి "సాయీ! మీరు దత్తాత్రేయ అవతారం అని అందరూ అంటున్నారు అందుకు ఏదయినా నిదర్శనం చూపించకూడదా?" అని ప్రార్దించాడు
                 Image result for images of shirdisaibaba and lord dattatreya

బాబా నవ్వినట్టనిపించింది. ఆ రాత్రి కలలోబాబా ఆయనకు దర్శనం యిచ్చి " నాకు, దత్తుడికి భేదం లేదు. దత్త దర్శనం కోసం ఇకనుండీ నువ్వు గాణ్గాపూర్ వెళ్లాల్సిన అవసరం లేదు" అని బాబా అన్నారు.
                 Image result for images of gangapur temple

ఆతర్వాత షిర్డీకి వచ్చి కొన్నాళ్లున్నారు, పాండురంగ గారు తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్నప్పుడు, మళ్లీ బాబా కలలో కనపడి "నువ్వు ఇంటికి వెళ్ళవద్దు" అన్నారు. సాయి వద్దన్నది చేయటానికి మనసొప్పక ప్రయాణం విరమించుకున్నాడు. కానీ భోజనం చేయటానికి చేతిలోపైసాలేదు. ఎవరినన్నా అడగటానికి మొహమాటం. ఏంచెయ్యాలో ఆయనకు తోచలేదుఊరికి వెళ్ళవద్దని చెప్పిన తండ్రి ఏదోవిధంగా కడుపు నింపకపోతాడా! అని తనలోతాను అనుకుంటున్నంతలోనే, ముక్కు ముఖమూ, తెలియని ఒకవ్యక్తి హడావుడిగా దగ్గరకు వచ్చి "భోజన్ కరో యహా భూఖా నహీ రహనా" అని పదిరూపాయలు చేతిలో పెట్టి వెళ్లి పోయాడు. ఏంజరిగిందో  కూడా పాండురంగ గారికి ఒక నిమిషం అర్ధం కాలేదు. తనకోసం వచ్చిన బిడ్డలను ఆయన ఆకలితో వుంచుతాడా? సాయి ప్రేమను, తన పట్ల చూపే శ్రధ్ధను చూసి పాండురంగ గారు చలించిపోయారు.

భోజనం చేసి వచ్చిఆరాత్రి మసీదులో పడుకున్నారు. షడన్ గా మెలుకువ వచ్చింది ఎవరో నిద్రలేపినట్టుగా. లేచి దుప్పటి కప్పుకొని మసీదు స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఇంతలో ఎవరో వచ్చి దుప్పటి లాగినట్టుగా అనిపించి, గబుక్కున పైకి లేచి నిలబడి ఎదురుగా చూసారు. అంతే వారికి ఎదురుగా పెద్ద పాము బుసలు కొడుతూ వస్తూ ఉంది. అక్కడ పక్కనే కఱ్ఱ కనిపించింది. ప్రయత్నంగా కఱ్ఱతో దానిని దూరంగా విసిరేసారు. అది తిరగబడకుండా ఎటో వెళ్ళిపోయింది. తనని రాబోయే ప్రమాదానికి ముందే అప్రమత్తం చేసి బాబా తనని కాపాడటం చాలా ఆశ్చర్యంగా అనిపించిందిఅంతేకాదు అసలు సమయానికి అక్కడ కఱ్ఱ కూడా వుండటం ఇంకా ఆయనకు ఆశ్చర్యంగా అనిపించింది. బాబాకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు పాండురంగ గారు. తెల్లవారిన తరువాత పాండురంగ గారు, తన మిత్రులయిన శివనేశన్ గారికి ఈవిషయం చెప్పగా ఆయన ఇలా అన్నారు "బహుశః ఈ సర్పగండం నుంచి మిమ్మల్ని రక్షించటానికే బాబా మిమ్మల్ని ఇంటికి వెళ్ళవద్దన్నారేమో!". అప్పుడు పూర్తిగా అర్థం అయ్యింది పాండురంగ గారికి. "తనను  ఊరికి ఎందుకు తిరిగి వెళ్ళవద్దన్నారో".

ఇలా సాయి భౌతిక శరీరం విడచినా, అప్రమత్తులై భక్తుల్ని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుతున్నారని. ఇలా ఎంతోమంది భక్తుల అనుభవాలే మనకు నిదర్శనాలై  మనకు దర్శనమిస్తున్నాయి.
"ఈభౌతిక దేహానంతరమూ, నేను అప్రమత్తుడనే" అనేది ఎంత సత్యమో అందరూ గ్రహించాలి.
సర్వం సాయినాధార్పాణమస్తు

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List