Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, May 4, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –36 వ.భాగమ్

Posted by tyagaraju on 6:55 AM
          Image result for images of shirdi saibaba smiling
         Image result for images of rose hd

04.05.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –36  వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
Image result for images of bharam mani
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
 కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id  :  tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్ ఆప్  : 9440375411
                            8143626744

మా మనుమడికి బాబా దర్శనమ్, రక్షణ
మా మనుమడు చి.కళ్యాణ్ కార్తీక్ కి 5 సంవత్సరాల వయసులో శ్రీసాయినాధులవారు కలలో కనిపించి “ఓమ్ నమోనారాయణాయ అనే మంత్రాన్ని పది సార్లు జపించమని చెప్పారు.  ఈ రోజుల్లో పిల్లలకి అంకెలన్నీ మిగతా భాషలకన్నా ఆంగ్లంలోనే బాగా అర్ధం చేసుకోగలరు. 

అందుచేత బాబా ఆంగ్లంలోనే మామనవడికి చెప్పారని భావించాము.  మామనవడు ఆమంత్రాన్ని ఇంతవరకు వినకపోయినా బాబా దయవల్ల బాగానే గుర్తుపెట్టుకున్నాడు.  వాడు చాలా చిన్నవాడు కాబట్టి పూజాగదిలో కూర్చుని మంత్రాన్ని వేళ్ళు లెక్కపెట్టుకుంటూ జపించాడు.

1990వ.సంవత్సరంలో మేము హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మాస్వంత ఇంట్లోనే ఉంటున్నాము.  అపుడు మామనవడు కార్తీక్ కి పదకొండు సంవత్సరాలు.  సెవెంత్ స్టాండర్డ్ చదువుతున్నాడు.  వాడికి సైకిలు తొక్కడం వచ్చు.  కాని మోపెడ్ నడపడం రాదు.  మా బంధువు సహాయంతో ఎలాగయితేనేం మోపెడ్ నడపడం నేర్చుకున్నాడు.  మేము ఎంత చెప్పినా వినకుండా మాహెచ్చరికలని పట్టించుకోకుండా మోపెడ్ ని నడపడం మొదలుపెట్టాడు.  ఒక రోజున నాభర్త మోపెడ్ ని తీసుకునివెళ్ళి ఎంతసేపయినా తిరిగిరాలేదు.  మాకు చాలా కంగారుగా ఉంది.  పిల్లవాడు ఏమయిపోయాడొ అని చాలా ఆందోళనపడుతూ ఉన్నాము.

ఇంతలో ఒక పొడవాటి వ్యక్తి మామనవడిని తీసుకుని వచ్చాడు.  ఆవ్యక్తి చూడటానికి అందంగా ఉన్నాడు.  ఆ వ్యక్తి మామనవడిని మాకు అప్పగిస్తూ, కార్తీక్ కి యాక్సిడెంట్  అయిందని, తను డాక్టర్ నని చెప్పాడు.  మేము మామనవడిని అతని వద్దనుంచి తీసుకున్నాము.  మాకు ఏడుపు వస్తూ ఉంది.  మావాడికి ప్రమాదకరమయిన దెబ్బలు ఏమన్నా తగిలాయా అని ఆవ్యక్తిని అడుగుదామని ప్రక్కకి తిరిగాము.  కాని, ఆవ్యక్తి అక్కడలేదు.  తరువాత ఆయాక్సిడెంట్ ఎలా అయిందని మామనవడిని అడిగాము.  కాని ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు.  వాడు షాక్ లో ఉన్నాడేమో అనుకున్నాము.  కొంతసేపయిన తర్వాత మళ్ళి యాక్సిడెంట్ ఎలా అయిందని అడిగాము.  వాడు పొంతన లేకుండా, సందర్భం లేకుండా మాట్లాడాడు.  వాడు మాట్లాడే మాటలలో స్థిరత్వం లేదు. “యాక్సిడెంట్ ఏమిటీ, నేను స్కూలుకు ఎందుకని వెళ్ళలేదు అని మాట్లాడాడు.  వాడికి అసలు ఏమీ గుర్తు లేదు.  మోపెడ్ ఎక్కడ ఉందో కూడా చెప్పలేకపోయాడు.  వాడికి తలమీద ఎటువంటి గాయాలు, దెబ్బలు తకగలకున్నా లోపల కనిపించని దెబ్బలు ఏమన్నా తగిలాయేమోనని చాలా భయపడుతూ ఉన్నాము.

మేము ఈవిధంగా బాధపడుతూ ఉన్న సమయంలో మారెండవ మనుమడు చి.కళ్యాణ్ కౌశిక్ వచ్చాడు.  “నేను అన్నయ్యని మోపెడ్ మీద వెడుతూ ఉండటం చూశాను.  వెనకాల తన స్నేహితుడిని కూర్చోపెట్టుకుని మోపెడ్ నడుపుతున్నాడు అని చెప్పాడు.  వెంటనే మేము ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాము.  అతను క్షేమంగానే ఉన్నాడు.  మేమతనిని యాక్సిడెంట్ ఎలా అయిందని వివరాలడిగాము.  ఆ అబ్బాయి “జూబ్లీహిల్స్ లో జర్నలిస్ట్ కాలనీ దగ్గర రోడ్డుకు ఒక ప్రక్కన పెద్ద కొండ ఉంది.  కొండంతా మొక్కలతో నిండి ఉండటం వల్ల అది మాకు కనపడలేదు.  బాగా దగ్గరకి వచ్చాక ఆఖరి నిమిషంలో అక్కడ కొండ ఉన్నట్లుగా గమనించాము.  అక్కడికీ తప్పిద్దామని చూశాము గాని, మోపెడ్ కొండని గుద్దుకుంది.  బండి పడిపోతుండగా వెనకాల కూర్చున్న నేను కిందకి దూకేశాను.  నాకు దెబ్బలేమీ తగలలేదు.  కార్తీక్ స్పృహతప్పి పడిపోయాడు.  నాకు భయం వేసి వెంటనే ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు.

మోపెడ్ ముందు చక్రం పూర్తిగా వంగిపోయింది.  హాండిల్ విరిగిపోయింది.  మోపెడ కాబట్టి డబ్బుపెట్టి బాగు చేయించాము.  ఒకవేళ మామనవడికి ఏదన్న అయుంటే మేమెంతగా ఏడ్చేవాళ్ళమో ఆ భవంతుడికే తెలియాలి.
               Image result for images of shirdi saibaba smiling
మామనవడు కార్తీక్ ని తీసుకుని వచ్చినతనికి మాకృతజ్ఞతలను కూడా తెలుపుకోలేకపోయాము.  మా కార్తీక్ ని క్షేమంగా ఇంటికి తీసుకునిరావడమే తన పని అన్నట్లుగా మాకు అప్పగించి, అదృశ్యమయిపోయాడు.  ఆవ్యక్తి శ్రీసాయినాధులవారు తప్ప మరెవరూ కాదు.


1996వ.సంవత్సరంలో సాయిబాబా మామనవడు కార్తీక్ ని మద్రాసు ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించమని సలహా ఇచ్చారు.  అనంతరం వాడికి మద్రాసులోని డా.ఎమ్.జి.ఆర్. ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది.  అక్కడ బి.ఇ. కంప్యూటర్స్ చదువుతున్నాడు.  ఆవిధంగా బాబా మాకుటుంబ సభ్యులందరి మీద తమ అనుగ్రహాన్ని చూపించారు.
(రేపటి సంచికలో రావుగారి అమ్మాయికి బాబా వారి
అనుభవాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List