Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, May 15, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –46వ.భాగమ్

Posted by tyagaraju on 6:51 AM

     Image result for images of shirdi sai
     Image result for images of yellow rose hd

15.05.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –46వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
 కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id  :  tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్ ఆప్  : 9440375411
                            8143626744

శివలింగ దర్శనమ్
నా సోదరుడు శ్రీ ఎమ్.హరగోపాల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (R & B) గా విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు.  తను ఎమ్.వి.పి. కాలనీలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నాడు.  నాసోదరుడు, అతని భార్య ఇద్దరూ సాయిభక్తులే.  అందుచేత ఆ శుభదినాన సాయినామ జపాన్ని ఏర్పాటు చేశారు.  మేమంతా నామజపంలో పాల్గొన్నాము.  భజన మొదలయిన రెండు గంటల తరువాత నాకు తెలీకుండానే నాకనులు మూతపడ్డాయి.  గాఢమయిన ధ్యానంలోకి వెళ్ళాను.  ఆ ధ్యానంలో నాకు పెద్ద శివలింగం, చుట్టూ పానపట్టం కనిపించింది.  
            Image result for images of biggest shiva lingam
దానిమీద అభిషేక జలం కనపడుతోంది.  అప్పుడే పూజ చేసి ముగించినట్లుగా శివలింగం పైన తెల్లని పువ్వులు పెట్టబడి ఉన్నాయి.  శివలింగాన్ని చుట్టుకుని ఒక సర్పం తన తలను క్రిందకు వంచుకుని ఉంది.  దానిని చూస్తే అభిషేక జలాన్ని త్రాగుతోందన్నట్లుగా ఉంది.  ఈలోగా నేను ధ్యానంలోనుండి ఇహంలోకి వచ్చాను.  దృశ్యమంతా అదృశ్యమయిపోయింది.  నాకంతటి అధ్బుతమయిన దృశ్యాన్ని సుందరమయిన శివలింగాన్ని గోచరింప చేసినందుకు శ్రీసాయీశ్వరునికి నమస్కరించుకొన్నాను.
                            Image result for images of biggest shiva lingam
1994వ.సంవత్సరంలో ఒక సారి నాకు కలలో నేను నాభర్తతో ఒక పెద్ద శివాలయానికి వెళ్ళినట్లుగ కలవచ్చింది.  లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము.  కొంత దూరంలో మూడు అడుగుల ఎత్తున్న నంది విగ్రహం ఉంది.  
           Image result for images of three feet height nandi idol

అది లేచి శివుని ముందుకు వచ్చి అక్కడినుంచి ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గరకి వెళ్ళి, గర్భాలయానికి సరిగా ఆరు అడుగుల దూరంలో ఆగిపోయింది.  ఆవిధంగా ఆక్షణంలో అంతటి అద్భుతమయిన దృశ్యం మాకు కన్పించి మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

నాపైన జగన్మాత అనుగ్రహమ్

1994వ.సంవత్సరం ఆగస్టు 24వ.తారీకు తెల్లవారుఝామున నాకొక కల వచ్చింది.  మాయింటిలో ఉన్న షోకేసులో ఒక స్త్రీ విగ్రహం పొడవాటిది ఉంది.  ఆ రోజు పండుగ సందర్భంగా ఆ విగ్రహం మెడలో నా బంగారు గొలుసులను వేసి అలంకరించాను.  కొంతసేపటి తరువాత విగ్రహం మాయమయిపోయి దాని అడుగు భాగం మాత్రమే మిగిలింది.  ఆ అడుగుభాగానికి మధ్యలో రంధ్రం ఉంది.  ఆ రంధ్రంలో ఉన్న నా గొలుసులను తీద్దామని ప్రయత్నించాను.  ఆ రంధ్రంలో ఒక అడుగులోతులో నీరు కనిపించింది.  ఆ నీటిలో చిన్న చిన్న బుడగలు కనిపిస్తున్నాయి.  రెండు మూడు సార్లు పాము బుసకొట్టినట్లుగా ‘హిస్ – హిస్’ అనే శబ్దం వినిపించింది.  నేను పరీక్షగా ఆ రంధ్రంలోకి చూశాను.  అందులో ఒక పురాతనమయిన కుర్చీలో ఒక వృధ్ధ స్త్రీ కూర్చుని ఉంది.  ఆమె ఆకుపచ్చని అంచు ఉన్న తెల్లని చీర ధరించి ఉంది.  ఆమెకు సుమారు 70 సంవత్సరాల వయసు ఉండవచ్చు.  ఆమె లావుగా ఉంది.  తలంతా నెరిసిపోయింది.  ఆమె ఒకయోగినిలాగ దర్శనమిచ్చింది.  నేనామెను క్షమించమని కోరుతూ ఇలా అన్నాను. “అమ్మా, ఇన్ని రోజులుగా నిన్ను నేను ఒక విగ్రహంలాగే భావించాను.  నేను నిన్ను సరిగా ఆదరించలేదు.  అలక్ష్యం చేశాను.  నువ్వు ఇంతటి శక్తిమంతురాలయిన తల్లివని నేనెపుడు అనుకోలేదు.  దయచేసి ఈ అజ్ఞానురాలిని మన్నించు” అని వేడుకొన్నాను.  అపుడామె”నేనిక్కడినుంచి వెళ్ళిపోవాలి.  హిమాలయాలలో కొందరికి సేవ చేయాలి” అని చెప్పింది.  నేనామెను ఇక్కడినుంచి వెళ్ళిపోవద్దని కోరాను.  కాని ఆమె, "పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నేను వెళ్ళక తప్పదు” అని చెప్పింది.  అప్పుడు నేను నాభర్తను పిలిచాను.  ఆయన కూడా ఆవిడకు నమస్కరించుకొన్నారు.  ఆవిడ ఆయనను దీవించగానే నాభర్త మెడలో పూలదండ ప్రత్యక్షమయింది.  అప్పుడు నేను నా భర్తని ఆమెతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఆవిడని గట్టిగా పట్టుకుని ఈవిధంగా ప్రశ్నించాను.  “అమ్మా! మరి నాసంగతేమిటీ?  నాకు ధ్యానంలో ఏకాగ్రత ఎప్పుడు కలుగుతుంది.  నేనెపుడు సమాధిస్థితికి చేరుకుని మోక్షాన్ని పొందుతాను?”  అపుడామె “నువ్వు మోక్షాన్ని పొందాలంటే ఇంకా అయిదు జన్మలు ఎత్తవలసి ఉంటుంది” అని సమాధాన మిచ్చింది.  “అయితే ఈ జన్మ వ్యర్ధమేనా?” అని ప్రశ్నించాను.  అపుడామె “సమాధి స్థితికి చేరుకోవాలంటే నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.  మొదటినుంచీ నీభర్త కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి ఉండినట్లయితే ఈపాటికే ఎంతో అత్యున్నత స్థాయికి చేరుకుని ఉండేవాడు.  కాని, పురుషుడు సహకరించకపోతే, ఒక స్త్రీగా నువ్వు ఏమీ చేయలేవు” అని చెప్పింది.  అపుడు నేనామెని గట్టిగా ఆలింగనం చేసుకొని నాతలను ఆమె వక్షస్థలం మీద ఆనించాను.  ఆమె తన చేతిని నాశిరసుమీద పెట్టి ఆశీర్వదిస్తూ “ఈ జన్మలో కూడా నీకు జ్ఞానం లభిస్తుంది” అంది.  ఆవిధంగా చెబుతూ ఆమె అదృశ్యమయింది.

ఆది దంపతుల ఆశీర్వాదమ్
                          Image result for images of siva parvati

1998వ.సంవత్సరం జవరి 8వ.తారీకున భీష్మఏకాదశినాడు తెల్లవారుఝామున నాకొక కలవచ్చింది.  ఆ కలలో నేను ఒక గుడికి వెళ్ళాను.  అది అమ్మవారి గుడి.  నల్లని శిలతో చెక్కబడ్డ అమ్మవారి విగ్రహం చాలా అందంగా ఉంది.  దర్శించుకున్న వెంటనే భక్తుల హృదయాలలో భక్తిభావం పెల్లుబికేంత అందంగా ఉంది.  ఎవరో ఆమెను పసుపు కుంకుమలతో పూజించినట్లుగా కనపడుతోంది.  నేను అమ్మవారికి నమస్కరించుకోగానే, విగ్రహం వెనుకనుండి అమ్మవారు ప్రత్యక్షమయింది.  నేనామెకు సాష్టాంగ నమస్కారం చేసుకుని “ అమ్మా! నాకు స్వామి దీవెనలు కూడా కావాలి” అని కోరుకున్నాను.  అపుడు అమ్మవారు నన్ను ప్రక్కకు వెళ్ళమని సూచించింది.  అక్కడ బంగారు మేనిచాయతో తెల్లని దుస్తులలో ఉన్న స్వామి కనిపించారు.  ఆ స్వామికి కూడ నేను సాష్టాంగ నమస్కారం చేసుకొన్నాను.  స్వామి నన్ను తన అభయ హస్తంతో దీవించారు.

చూసేవారంతా నన్ను చూసి ఏమనుకుంటారో అనే ఆలోచన  నాలో కలిగింది.  దానికి కారణం అమ్మవారి విగ్రహం ఈప్రక్కన ఉంటే, నేను మరొక ప్రక్కకు తిరిగి దేవునికి నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నాకు మాత్రమే కనపడుతున్నారు.  మిగిలినవారికి అదృశ్యంగా ఉన్నారు. ఈవిడ ఆవిధంగా ఇంకొక ప్రక్కకు తిరిగి నమస్కారం చేసుకుంటోందేమిటి అని చూసేవారు అనుకుంటారు.   ఈ విధంగా నా ఆలోచనలు సాగుతున్నాయి.  ఇంతలో ఆ ఆదిదంపతులు అదృశ్యమయ్యారు.  నాకు మెలకువ వచ్చేసింది.

భీష్మఏకాదశి పర్వదినం రోజున పార్వతీపరమేశ్వరుల దర్శన భాగ్యం కలిగినందుకు నేనెంతో అదృష్టం చేసుకున్నాని సంతోషించాను.

శ్రీసాయిబాబాకు ప్రణామాలు

1990వ. సంవత్సరం మే నెలలో నాకు ఒక కల వచ్చింది.  ఆ కలలో నేను రాజమండ్రి లోని గోదావరి నదిలో సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానమాచరించడానికి నది ఒడ్డున ఉన్నాను.  నదిలోకి దిగి స్నానం చేస్తుండగా కుడివైపుకు తిరిగి చూశాను.  నాకు కొన్ని గజాల దూరంలో నడుము లోతు వరకు నదిలో నిలబడి ఉన్న శ్రీశివనేశన్ స్వామీజీ గారు కనిపించారు.  కాని ఆయన నన్ను చూడలేదు.  ఆ సమయంలో ఆయనని పలకరించడం భావ్యం కాదని మిన్నకుండిపోయాను.  బహుశ నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల కావచ్చు, అటువంటి మహాపురుషుని సన్నిధిలో ఇపుడు నదీ స్నానమాచరించే భాగ్యం కలిగింది.  ఆ తరువాత ఏమి జరిగిందో నాకు తెలీదు. 

సూర్యాస్తమయానికి నాకు మెలుకువ వచ్చి లేచాను.  నేను నేలమీద పడుకొని ఉన్నాను.  నది నామీద నీళ్ళను చిమ్ముతూ ఉంది.  సూర్యోదయంనుంచి సూర్యాస్తమయం వరకు నేనలా మైకంలోనే ఉన్నాను.  నాశరీరం సగ భాగం వరకు నీటితో తడిసిపోయి ఉంది.

నాజీవితంలో ఎపుడూ నాకటువంటి అనుభూతి కలగలేదు.  అది ఒక కొత్త అనుభవం.  కనీసం కలలోనయినా దైవసంభూతులయిన శ్రీశివనేశన్ స్వామీజీతో కలిసి ఉన్నందుకు ఆయనకు నా విధేయతను తెలుపుకుంటున్నాను.  కలలో అటువంటి అనుభవాన్నిచ్చినందుకు శ్రీసాయిబాబాకు, శ్రీస్వామీజీకి నా ప్రణామాలను అర్పించుకొన్నాను.

 (రేపటి సంచికలో ‘సాయి లీలా తరంగిణి’ పుస్తకం గురించి బాబా ఏమన్నారు?)

(రేపటి లీలలతో  సాయిలీలా తరంగిణి ముగింపు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment