Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, June 3, 2017

శ్రీసాయి తత్త్వ సందేశములు – 6 వ.భాగమ్

Posted by tyagaraju on 7:35 AM
   Image result for images of shirdi sai baba god
      Image result for images of rose

03.06.2017 శనివారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు

శ్రీ సాయితత్త్వ సందేశములు

(voice of Sai Baba)



శ్రీసాయి తత్త్వ సందేశములు – 6 వ.భాగమ్

19.  20.06.1992 రాత్రి 9 గంటలకు శ్రీ సాయి యిచ్చిన సందేశము

కర్మచే పవిత్రత, ధ్యానము భక్తిచే ప్రకాశము. జ్ఞానముచే ఐక్యత సిధ్ధించగలవు.  కర్మ భక్తి సాధనలతో కైవల్య ప్రాప్తిని పొందవచ్చును.  భక్తి యొక్కటియే ప్రపంచములో స్థిరమైనది, నాశరహితమైనది.  సద్గుణ కుసుమాలలచే మీ హృదయ క్షేత్రమును, దైవముతో అలంకరించుకొనండి.  




ఎవరైతే అచంచలమైన భక్తితో దైవమును సేవించెదరో, అట్టివారు త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మసాక్షాత్కారము పొందగలరు.  భగవదైక్యమునకు గాని, భగవద్దర్శనమునకు గాని, భక్తియే ముఖ్యమని గ్రహించండి.
             Image result for images of invisible god
భగవంతుడు యోగమాయచే గప్పబడి యున్నందున మీరు ప్రత్యక్షముగా చూడలేకపోవుచున్నారు.  ఎవరైతే ఆ యోగమాయను ఛేదించెదరో, అట్టివారు భగవంతుని చూడగలరు.  భగవధ్యానము చేయువాని చిత్తము పరమత్మయందు తప్ప దేనియందు వుండదు.  

                 Image result for images of woman worshiping baba
భక్తి సకల సద్గుణములను ప్రసాదించును.  దీనికి యితరుల సహాయము అవసరము లేదు.  స్వతంత్రమైనది, సజ్జన సాంగత్యము వుంటె భక్తిని పొందగలరు.  అటువంటి వారు జననమరణ రూపమున సంసార చక్రమున భ్రమింపరు.

భక్తి యొక్కటియే పరమార్ధమగు బ్రహ్మజ్ఞానమును నిచ్చునదియు, పరమతత్త్వమును ప్రకాశింపచేయునది.  భక్తియే పరమ భక్తికి కారణము కావున భక్తియందు నిమగ్నులుకండి.

20.  17.07.1992 ఉదయం 9.45 గంటలకు, గురుపూర్ణిమనాడు, పూజామందిరములో యిచ్చిన సందేశము.

నేనే వ్రాయించుచున్న గ్రంధము భక్తి, జ్ఞానములు అనే మణులను ప్రసాదించుటయే గాక, యిహపరములకు కావలసిన బుధ్ధిని యిచ్చును.  ఈ గ్రంధములోని అమూల్యమైన పలుకులు, బోధలు, తత్త్వములోని అంతరార్ధమును గ్రహించి, జీర్ణించుకొన్న, మీలో వున్న మనోవికలత పోగొట్టుకొనుటయే గాక, బధ్ధకము, చంచలత్వము, శరీరము మీద అభిమానము మొదలైనవి విడచి, యావత్తు దృష్టిని నావైపే త్రిప్పెదరు.

ఈ గ్రంధములోని విషయములు నీతి పైన ఆధారపడి యున్నందున భక్తి యొక్క రహస్యమును తెలుసుకొనగలరు.  నావల్లనే ఈ కాల చక్రము తిరుగుచున్నదని గ్రహించండి.  ఈ గ్రంధమునుండి నా లీలామృతము ప్రవహించుటయే గాక, అజ్ఞానులకు జ్ఞానమును, గృహస్తులకు సంతృప్తిని కలిగించుటయే గాక, మోక్షమును సాధించుటకు వారికి సాధనగా ఉపకరించును.  ఈగ్రంధ రచనకు నీకు మేధాశక్తిని, ధైర్యమును ప్రసాదించి ఆశీర్వదించినందున జయప్రదముగా సంపూర్తి చేయగలిగినావు.  నీవు నిమిత్తమాత్రుడవేనని గ్రహించు.

ఈ గ్రంధములో ‘Inwardness of Sai Baba’ అనే అధ్యాయమును తొలగించు.  నా అంతరంగము సముద్రమువలే లోతైనది.  నా రూపురేఖలుగాని, నా అంతరంగ స్థితినిగాని, సామాన్య మానవులు ఎవరూ తెలుసుకొనజాలరు.  నా ‘INWARDNESS’ ను రచించుటకు గాని, చిత్రీకరించుటకు గాని వ్యర్ధప్రయత్నం చేయకు.  అదేవిధముగా – ‘RELIVENCE OF SAI BABA’S PREACHINGS TO THE PRESENT GENERATION’  - ను అధ్యాయమును కూడా తొలగించు.

‘THE PEARLS OF SAI TATWA’ అనే అధ్యాయములో (1) శ్రవణము – మననము, (2) ఆత్మ పరిశోధన, (3) సమాధి స్థితి (4) సాధనలో ఓంకార ప్రాముఖ్యత, (5) బ్రహ్మసత్యం – జగత్ మిధ్య, (6) నా తత్త్వ సారాంశములను కూడా వివరముగా విశదీకరించు.
నీకిచ్చిన కార్యమును పట్టుదలతో కొనసాగించు.

21.  17.07.1992 రాత్రి 9.30 గంటలకు పూజామందిరములో యిచ్చిన సందేశము

నేను సామాన్య నాగేంద్రుడనని తలంచరాదు.  నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడను.  నాకు సర్వస్వము తెలియును.  నేను మీ యింటిచుట్టూ మీ సంరక్షాణార్ధము తిరుగుచున్నాను.  

               Image result for images of shirdi sai baba god
నన్ను నమ్మిన నిన్ను, నీ కుటుంబమువారిని సదా సంరక్షించెదను.  నీ సమీపములో నివశించుచున్న సహచరులు నాయందు నమ్మకము లేక నా పూజను నిత్యము చేయుటలేదు.  వారు కూడా నా నామస్మరణ చేసిన వారిని కష్టములనుండి తొలగించెదను.  నేనెవరో నా మహత్యమేమిటో తెలుసుకొని నన్ను నిత్యము ప్రార్ధించిన కష్టములనుండి బయటపడెదరు.

నీవు వ్రాయుచున్న గ్రంధములో వచ్చుచున్న సంస్కృత శ్లోకములు సరియైనవా కాదా అని సందేహించుచున్నావు.  ఆ సంస్కృత శ్లోకములను విడిగా వ్రాసి తెలిసిన సంస్కృత పండితుల వద్దకు వెళ్ళి వాటిని సరిదిద్దించి సంస్కృతములో కూడా వ్రాయించు.  అప్పుడే నేను వచించిన శ్లోకములయొక్క అంతరార్ధమును గ్రహించగలరు.  ఈ గ్రంధ రచనకు తొందరపాటు పనికిరాదు.  అన్ని కోణములలో విచారించి సంపూర్తి చేయి.

ఇతర సాయి భక్తులను విమర్శించవద్దు.  అందరూ నీ కంటే గొప్పవారని భావనలో వుండు.

ఈ గ్రంధము జగత్ ప్రఖ్యాతి కావలయునంటే శ్రధ్ధ, సబూరి అవసరము.  అప్పుడే ఈ గ్రంధము దివ్య గ్రంధముగా బయట ప్రపంచములోనికి వచ్చును.  ఇదియే నీ ఆశయమని గ్రహించు.  ఇతరుల వివాద విషయములలోనికి దిగవద్దు.  నీకు వచ్చు భావనలన్నియు నావేనని గ్రహించి పుస్తక రూపమును క్రోడీకరించు.


జూలై 31, 1992, రాత్రి 9 గంటలకు డాక్టరు శ్రీ జి.వి.రత్నంగారి పూజా మందిరములో శ్రీసాయిబాబా యిచ్చిన దివ్య సందేశము.


నిన్ను ఆహ్వానించిన సాయి భక్తునికి నా తత్త్వము గురించి ఒక మాసపత్రిక నడపవలయునని ఆసక్తి కలిగినది.  అది అంత తేలికైన విషయము కాదు.  నేను ఎవరో నా అవతారము ఏమిటో తెలుసుకొనిన తరువాతనే యితరులకు బోధ చేయుటకు ప్రయత్నించమని చెప్పు.  తాను గ్రహించకుండా తన పత్రిక ద్వారా యితరులకు బోధన చేయుటకు ప్రయత్నం చేయవద్దని చెప్పు.  ఈ పత్రిక ప్రచురణకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మ విశ్వాసముతో ధృఢ నిశ్చయముతో ముందుకు పోసాగిన జయము సాధించగలడు.  కాని ముందు అడుగు వేయునప్పుడు కడు జాగరూకత వహించిన తర్వాతనే ప్రచురణ ప్రారంభించమని చెప్పు.

అతనికి ఏ భావము వస్తే అది నాదనే భావించి వాటినే ప్రచురించమని చెప్పు.  అనవసరమైన విషయములకు పత్రికలో తావు యివ్వవద్దు.
దుస్సాంగత్యము వలన సత్సాంగత్యము చెడిపోవును.  అనవసరమైన విమర్శనలకు పాల్పడవలసివస్తుంది.  ఒకరినో యిద్దరినో తనకు మనస్ఫూర్తిగా సహాయపడెదరని నమ్మకము వున్నవారి సహాయము మాత్రమే తీసుకొనమని చెప్పు.

నా లీలలు, నా చరిత్ర ప్రచురించుటయేకాగ, నాతత్వ ప్రచారమునకు యీపత్రికలో ప్రాముఖ్యత యివ్వవలసినది.  నా సందేశములలోని గూఢార్ధమును, వేదాంత అర్ధమును వాడవాడలలో ప్రచారము చేయమని చెప్పు.

సత్సంగములో పరిశుధ్ధమైన మనస్సుతో పాల్గొని నా తత్త్వమును ఎవరైతే అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించెదరో, అట్టివారు నేను ఎవరో నా అవతారమేమిటో తెలుసుకొనగలరు.  అజ్ఞానులు నా తత్త్వములోని వేదాంత రహస్యమును గ్రహించుటకు ప్రయత్నించరు.  అట్టివారిలో కూడా యీ పత్రిక ద్వారా వారిలో కూడా చైతన్యము కల్గించి వారిలో జ్యోతిని వెలిగించుటకు ప్రయత్నం చేయండి.  అట్టి ఉత్తేజము కలిగించే వ్యాసములనే ప్రచురించడండి.

ప్రతి వ్యాసంలో నాతత్త్వ వేదాంత సారము గాని, నా లీలలు గాని. వున్నవో లేవో పరిశీలించి తర్వాతనే ప్రచురించండి. 


నా తత్త్వప్రచారమును యిప్పుడు నిన్ను ఆహ్వానించిన భక్తునికి కూడా  అప్పగించడమైనది. 
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List