Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, June 4, 2017

శ్రీసాయి తత్త్వ సందేశములు – 7 వ.భాగమ్

Posted by tyagaraju on 8:37 AM
     Image result for images of shirdi sai baba

                Image result for images of rose hd


04.06.2017 ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు

శ్రీ సాయితత్త్వ సందేశములు

(voice of Sai Baba)



శ్రీసాయి తత్త్వ సందేశములు – 7 వ.భాగమ్


23. షిరిడీ ద్వారకామాయిలో 04.08.1992 సాయంత్రము 6.50 గంటలకు బాబా యిచ్చిన సందేశము :
         Image result for images of shirdi sai baba reading book
నేను వ్రాయించుచున్న గ్రంధము ఎవరైతే మనస్సును నిలకడ చేసుకొని, శ్రధ్ధా భక్తులతోను, ప్రేమతోను చదివెదరో అట్టివారికి జ్ఞానోదయము కలగుటయేగాక, భక్తి, శాశ్వతమైన తృప్తి పొంది, బంధములనుండి, తప్పుకొని ప్రాపంచిక విషయ వాసనలయందు తగుల్కొనక భక్తి శ్రధ్ధలతో మనస్సును నాయందు కేంద్రీకరించి ఆనందము కలిగి, అహంకారము పోయి, శుధ్ధ చైతన్యమును పొందెదరు.


ఈ గ్రంధము నేనే వ్రాయిచున్నాననే అహంకారమునకు తావు యివ్వవద్దు.  ఈ గ్రంధ రచన సంపూర్తి కావచ్చుచున్నది.  ప్రచురణ ఎట్లా అని తపనపడుచున్నావు.  ఈ గ్రంధ ముద్రణకు దాత తనంతటతానే ముందుకు వచ్చును.  అట్టి దాతకు, మనోవాక్కాయ కర్మలచే సత్యమార్గమున పెట్టి, సత్ ప్రవర్తనను నిర్దేశించి, అంతర్ దృష్టిని ప్రసాదించి, ఆదర్శ యోగీశ్వరునిగా చేసెదను.

ఈ గ్రంధ రచనకు నీకు సహకరించిన భక్తులకు, జ్ఞానమార్గము యిచ్చుటయే గాక, వారి మనస్సును నిర్మలము చేసి, ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించెదను.  అప్పుడే వారు యీ ప్రాపంచిక సుఖములయందు అభిలాష నశించి, మనస్సునందు శాంతము, ఆనందము పొందగలరు.

నాభక్తులకు, వారి వారి అర్హతలను బట్టి ఎవరికి తగిన సేవను వారికి అప్పగించెదను.  అట్టి సేవను పట్టుదలతోను, దీక్షతోను కొనసాగించవలయును.  అశక్తిని ప్రకటించి అసాధ్యమని భావించి, ఆ కార్యమును యితరులకు అప్పగించరాదు.  నాతత్త్వము, నాబోధలు, నా వేదాంతము అర్హతగల భక్తులకే ప్రచారమునకు అప్పగించెదను.  మీరు నిమిత్తమాత్రులే, చేయించేది, నేనె, చేసేది మీరు.  ఈ విషయమును నిన్ను ఆహ్వానించిన భక్తునకు తెలియచేయి.  అతనిలోనున్న అహంకారము, శరీర ఢాంభికము పోగొట్టుకొనిన కాని, అతని సందేహములు పటాపంచలుగావు.  అప్పుడే అతనిలో మనోధైర్యము కలుగును.  సందేహములు సాధనకు ఆటంకములు.

ఆత్మానుసంధానములో నిమగ్నులై, అహంకారమును విడచి మనస్సును స్వాధీనమందుంచుకొన్న, మీలో ప్రభోధము కలిగి, పరమపావనమైన జీవనము గడపగలరు.  ఎవరైతే నా తత్త్వప్రచారములో నిమగ్నులయ్యెదరో అట్టివారు పరమార్ధమార్గములో నడవగలరు.  ఎవరైతే నాకు పూర్తి శరణాగతులయ్యెదరో, వారిలో అహంకారము, శరీరాభిమానము నశించి శుధ్ధచైతన్య స్వరూపులగుదురు.

24. 15.08.1992 రాత్రి 9 గంటలకు పూజామందిరములో శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.

దృశ్యవాసనలన ఛేదించుకొనండి.  అట్లు ఛేదించుకొనవలయునంటే మనస్సును స్వాధీనమంధుంచుకొనవలయును.  సమస్త జగత్ యొక్క రూపమే మనస్సు.  మీ అజ్ఞానమునకు మూలము మీ మనస్సుయొక్క వాసనలే.  వాసనలు నశించిన కాని, మనస్సును జయించలేరు.  ఎవరైతే అంతఃకరణమున విషయానుసంధానమునకు చోటు యివ్వరో అట్టివారి మనస్సు చంచలము కాదు.  మనస్సు సంకల్పములచే నశింపబడి మరల ఆ సంకల్పములచేతనే ఉత్పన్నమగుచున్నదని గ్రహించండి.  ఎవని మనస్సు చంచలత్వము లేనిదై, ఆత్మయందే స్థిరముగా వుండునో, అట్టివారు ధ్యానమున నన్ను పొందగలరు.  సంకల్పమే మనస్సుయొక్క బంధము.  సంకల్పములు లేకుండుటయే ముక్తి.
                       Image result for images of woman worshiping shirdi sai baba
కర్మ ఫలములయందు ఆసక్తి లేక కర్మలు చేయండి.  కర్మయందు అకర్మత్వము, అకర్మయందు కర్మత్వమును చూడండి.  ‘నేను – నాది’ అనే అభిమానమున్నంత వరకు దుఃఖములనుండి ఎప్పటికిని బయటపడలేరు.  మీలో వున్న మనోవృత్తిని జయించుటకు ప్రయత్నం చేయండి.
మీలో నా తత్త్వజ్ఞానము ఉదయించిన మీలో వున్న విషయ భోగేచ్చలు నశించును. 

నిశ్చలమైన మనస్సు, భక్తి యోగ బలము నీకు ప్రసాదించి నాతత్త్వబోధలను రచించమని ప్రేరేపించినాను.  కాని నీకంటే సకల శాస్త్రములు, సకలవేదములు తెలుసునని భ్రమించి, నీవు వ్రాసిన ప్రతులను యితరులకు యిచ్చినావు.  విద్య అనగా ఏమిటో నీకు తెలుసా?  నీవు సరిదిద్దుటకు యిచ్ఛినవారికి వేదంత విద్య, రాజవిద్య మాత్రమే తెలుసు.  బ్రహ్మమును తెలిపే బ్రహ్మ విద్య తెలియదు.  దీనినే రాజగుహ్యమనెదరు.


“జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్సామేక్ష్య సేశుభాత్”, నీవు పరమాత్మకు దూరముగా వున్నావని, కనులముందు కనిపించే నీలో వున్న వ్యక్తిత్వము తెలుసుకొనలేని అజ్ఞానములో యుండి, వేదాంత శాస్త్రములు తెలిసినవారిని ఎవరెవరి దగ్గరకో పరుగులిడుచున్నావు.  ఎవరికైతే యీ గ్రంధప్రతులను యిచ్చినావో వాటిని వెంటనే తీసుకొని వచ్చివేయి.  నీస్వయం కృషితో సాధించు.  ఈగ్రంధ రచనకు ఎవరి సహాయమవసరములేదు.  ఆలోచించిన మేఘమువలే చెదరి భ్రష్టత్వము పొందును. 
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List