Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, July 27, 2017

మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 5 వ.భాగమ్

Posted by tyagaraju on 8:56 AM



Image result for images of shirdi saibaba
Image result for images of rose hd

27.07.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా తెలుసుకుందాము.   మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు.  బాబాకు శ్యామా అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది.  ఈ వ్యాసం రెండవ భాగమ్ శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక మే - జూన్ 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం
శ్రీమతి ముగ్ధా దివాద్కర్.  ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్

తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు త్యాగరాజు
       Image result for images of madhavrao deshpande

   Image result for images of rose hd

మాధవరావు దేశ్ పాండే  (శ్యామా) - 5 వ.భాగమ్

అప్పుడప్పుడు మాధవరావు మూలశంక వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు.  దానివల్ల విపరీతంగా బాధతో విలవిలలాడేవాడు.  ఆబాధనుంచి ఉపశమనం కోసం ఇటుకతో కాపడం పెట్టుకునేవాడు.  బాబా అనుమతి లేకుండా తనంతతానుగా ఎటువంటి మందులను వేసుకునేవాడు కాదు.


ఒకసారి అతను మూలశంక వ్యాధితో బాధపడుతున్నాడు.  అప్పుడు బాబా “మనం మధ్యాహ్నం వైద్యం చేద్దాము” అని చెప్పారు.  
     
Image result for images of sonamukhi 




  (సోనాముఖి)
ఆవిధంగా ఆయన సోనాముఖి కషాయాన్ని తయారు చేసి త్రాగమని మాధవరావుకిచ్చారు.  వెంటనే అతనికి మూలశంక బాధ తగ్గిపోయింది.

రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ అతనికి ఆవ్యాధి వచ్చింది.  బాబాతో చెప్పకుండా అంతకుముందు ఆయన తయారుచేసి ఇచ్చిన కషాయం ఉంటే దానిని సేవించాడు.  కాని బాధ తగ్గడానికి బదులు యింకా ఎక్కువయిఅంది.  కొద్ది రోజుల తరువాత బాబా అనుగ్రహం వల్ల అతనికి బాధ ఉపశమించింది.  అపుడతనికి అర్ధమయింది.  బాధను నివారించే శక్తి ముందులో లేదని తన దేవునియొక్క అనుగ్రహంలోనే ఉందని.

ఒకసారి మాధవరావు శ్రీబుట్టీతో నాగపూర్ వెళ్ళినపుడు మరలా మూలశంక వ్యాధి తిరగబెట్టింది.  మాధవరావు బాబాకు ఉత్తరం వ్రాశాడు.  దానికి సమాధానంగా బాబా “అతనిని షిరిడీకి రమ్మని చెప్పు” అని రాస్తూ యింకా హాస్యపూర్వకంగా అతని బాగోగులు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.  కాని అతనికి ఇక్కడికి రావడానికిష్టం లేదు.  ఊరికే తిరగడమంటే యిష్టం.  వాడికి ఉత్తరం వ్రాసి ఇక్కడికి రమ్మని చెప్పు.  వాడికి ఆవ్యాధి తగ్గుతుంది” అని బుట్టీకి ఉత్తరం రాసారు బాబా.

ఇక్కడ చెప్పవలసిన విషయాలు ఏమిటంటే మాధవరావు తనంతతానుగా ఎక్కడికీ వెళ్ళడు.  బాబాయే అతనిని వేరువేరు ప్రదేశాలకు పంపిస్తూ ఉంటారు. ఆవిధంగా  మాధవరావు బయటకు వెళ్ళగానే అతను లేని లోటు బాబాను బాధించేది.
 మాధవరావు వద్ద రెండు కుండలు ఉన్నాయి. వాటినిండుగా బాబా స్వయంగా యిచ్చిన ఊదీ ఉంది.  మాధవరావు ఆరెండు కుండలనూ తన యింటిలోపల గదిలో ఒక మూలగా చాలా జాగ్రత్తగా భద్రపరిచాడు. 
Image result for images of two earthen pots
బాబా మహాసమాధి చెందిన తరువాత మాధవరావు ప్రత్యేకమయిన సందర్భాలలో కొంత ఊదీని భక్తులకు పంచేవాడు.  ఇంటిలో ఉన్న ఆడవాళ్ళకి కుండలలో ఊదీ ఉన్న విషయం తెలియదు.  ఒకసారి వారంతా యిల్లంతా దుమ్ము దులిపి  శుభ్రం చేసుకుంటున్నారు.  ఆసమయంలో వారి కంటికి ఈరెండు కుండలు కనిపించాయి.  అనవసరంగా ఈకుండలు ఎందుకనే భావంతో వాటిని బయటపడేద్దామని వాటిని వాటి స్థానంలోనుంచి జరిపారు.  ఆ సమయంలో మాధవరావు బొంబాయిలో ఉన్నాడు.  ఆరోజు రాత్రి బాబా అతనికి కలలో కనిపించి’ “శ్యామా, లే, నువ్వు జాగ్రత్తగా దాచుకున్న ఊదీ తొందరలోనే పెంటకుప్పలో పడబోతోంది.  వెంటనే లేచి మీఊరికి వెళ్ళు.  ఆఊదీని జాగ్రత్తగా దాచుకో" అన్నారు.  మరుక్షణమే మాధవరావు నిద్రనుంచి మేల్కొని వెంటనే షిరిడికి బయలుదేరాడు.  ఇంటికి చేరుకోగానే తనకు వచ్చిన కల నిజమేనని అర్ధమయింది.  రెండు కుండలనీ తీసి మేడమీద భద్రంగా దాచాడు.

మాధవరావు యిక 3 – 4 సంవత్సరాలకు మరణిస్తాడనగా గౌటు వ్యాధితో బాధపడ్డాడు.  అపుడు అతని వయస్సు 72 సంవత్సరాల పైగానే ఉంటుంది.  కాకాసాహెబ్ దీక్షిత్ కోరిన మీదట, దీక్షిత్ వాడాలో మొదటి అంతస్తులో నివసించసాగాడు.  ప్రతిరోజు మేడమీదనుంచి క్రిందకు దిగడం కష్టమయేది.  
                Image result for images of dixitwada

దిగేందుకు కూడా శక్తిలేకుండా పోయింది.  అయినా గాని అతను నిరంతరం ఎడతెగకుండా బాబా లీలలను వర్ణించి చెబుతూనే ఉండేవాడు.

బాబా లీలలను వర్ణించి చెప్పేటప్పుడు మాధవరావుకు అమితానందంతో భావోద్వేగాలు కలుగుతూ ఉండేవి.  ఆవిధంగా చెప్పేటప్పుడు “నేను నాదేవునికి ఎన్నో చెప్పాను అంటూ తను మాట్లాడే మాటలకి పశ్చాత్తాపం చెందుతూ ఉండేవాడు.  బాబాగారి క్షమాభిక్ష స్వభావాన్న్ని గుర్తు చేసుకోగానే అతని కళ్ళనిండా అశ్రువులు ధారగా కారేవి.  అపుడు అతను “ఓ నాదేవా” అనేవాడు. 

ముఖ్యంగా రెండు సందర్బాలలో బాబా మాధవరావింటికి వెళ్ళారు.  ఒకసారి మాధవరావుని తేలు కుట్టినపుడు, రెండవసారి అతడు విపరీతమయిన జ్వరంతో బాధపడుతున్నపుడు.  అతను జ్వరంతో బాధపడుతున్న కారణంగా మసీదుకు రాలేదు.  “మాధవరావు ఆరతికి ఎందుకు రాలేదని” అక్కడున్న భక్తులను అడిగారు బాబా.  మాధవరావు జ్వరంతో బాధపడుతున్నాడు అందుకనే రాలేదని చెప్పారు.  బాబా తన చిరిగిన కఫనీని పట్టుకుని మాధవరావింటికి వెళ్ళి అతనిని ఆరతికి తీసుకుని వచ్చారు.

మాధవరావు కాకాసాహెబ్ గారి వాడాలోనే ఉంటూ వాడా నిర్వహణ బాధ్యతలన్నీ చూడసాగాడు.  కాకాసాహెబ్ కి మాధవరావు మీద ఎంతో అభిమానాన్ని ప్రేమను కురిపించేవాడు.  ఆ అభిమానం, ప్రేమలవల్ల అతనిని తన వాడాలోనే ఉండమని చెప్పాడు.  మాధవరావు స్వంత ఇంటిని అద్దెకు ఇప్పించి అద్దెల రూపేణా అతనికి ఆదాయం లభించేలా సహాయపడ్డాడు.  కాకా సాహెబ్ మరణించిన తరువాత మాధవరావు అద్దె ముట్టినట్లుగా ఇచ్చే రసీదులను సంస్థానం పేరుతో ఇచ్చేవాడు. 

బాపూసాహెబ్ బూటీ కూడా వాడాయొక్క నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను మాధవరావుకి అప్పగించాడు.  ఆబాధ్యతలను నిర్వర్తిస్తున్నందుకు బాపూసాహెబ్ ప్రతినెలా మాధవరావుకు ఏడు రూపాయలు ఇచ్చేవాడు.  బాపూసాహెబ్ మరణించిన తరువాత అతని కొడుకు కేశవరావు తన తండ్రి చేసిన మంచిపనిని కొనసాగించాడు.

మాధవరావు ఇక కొద్ది నెలలకు చనిపోతాడనగా, ఒక ప్రత్యేకమయిన కారణం వల్ల దీక్షిత్ వాడా నుంచి  తన స్వంత యింటికి వచ్చేశాడు.  అతను మరణించడానికి 6 – 7 నెలలముందు విచిత్రంగా అతని ఆరోగ్యం మెరుగయి లేచి తిరగసాగాడు.  “నాదేవుడు నా యోగక్షేమాలను మరొకసారి కనిపెట్టుకుని ఉన్నాడని” పదేపదే చెప్పాడు. 

మాధవరావు మరణం గురించి బాలాసాహెబ్ దేవ్ ఈవిధంగా చెప్పారు.
  
   “కాకాసాహెబ్ దీక్షిత్, భావూసాహెబ్ ధుమాల్, అన్నాసాహెబ్ ధబోల్కర్ లు ఎంతో పుణ్యం చేసుకున్న భక్తులు కాబట్టె, చనిపోవడానికి ముందు     వారికి  ఎటువంటి బాధలు  కలుగలేదు.  మాధవరావు కూడా అదేవిధంగా అదృష్టవంతుడు.  అతను ఒకరాత్రి, మధ్యాహ్న సమయం వరకు మాత్రమే స్పృహలేని స్థితిలో ఉన్నాడు.  అతను తన స్వగృహంలోనే ఏప్రిల్, 26, 1940 వ.సంవత్సరం గురువారంనాడు (చైత్ర కృష్ణ చతుర్ధి, శక సం. 1862) పరమపదించాడు.  అప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలు. చాలా అరుదుగా అటువంటి అనాయాస మరణం పుణ్యాత్ములకి  మాత్రమే లభిస్తుంది.  గతంలో చేసిన మంచికర్మల వల్లనే ఆవిధంగా ప్రాప్తిస్తుంది.

మరునాడు అతనిని ఊరేగిస్తూ తీసుకువెళ్ళి అంత్యక్రియలు జరిపించారు.  ఎంతోమంది అతని అంత్యక్రియలకి వెళ్ళారు.  గ్రామంలో ఉన్న బావివద్ద వారతనికి తిలతర్పణాలు వదిలారు.
(రేపు ఆఖరి భాగమ్)
(రేపటి సంచికలో మాధవరావు బాబాను కేకలు వేసిన సందర్భాలు, యింకా బాబాకు మాధవరావుకు మధ్య అంతటి ఆత్మీయానుబంధానికి కారణాలు - బాలాసాహెబ్ దేవ్ పరిశోధన వివరాలు, )

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List