Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 4, 2017

అబ్దుల్ రహిం శంషుద్దీన్ రంగారీ

Posted by tyagaraju on 7:14 AM
     Image result for images of shirdisaibaba with lakshmi
     Image result for images of lotus flower
04.08.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
      Image result for images of shirdisaibaba with lakshmi

శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు

ఆకాలంలో బాబాకు ముస్లిమ్ భక్తులు కూడా వుండేవారు.  వారిలో ఒకరయిన శ్రీ అబ్దుల్ రహిం శంషుద్దీన్ రంగారీ గురించి ఈ రోజు తెలుసుకుందాము.  ఆయన గురించి శ్రీ సాయి సురేష్ గారు పంపించారు. శ్రీ హెచ్.హెచ్. నరసింహస్వామి గారు వ్రాసిన   Life of Saibaba - Volume III నుండి గ్రహింపబడినది.


అబ్దుల్ రహిం శంషుద్దీన్ రంగారీ

థానా నివాసి అబ్దుల్ రహీం శంషుద్దీన్ రంగారీ 1913 సంవత్సరంలో మొదటిసారిగా సాయిబాబాను కలుసుకున్నాడు సమయంలో అతని భార్య ఏదో తెలియని వ్యాధితో బాధపడుతూవుంది. ఆమె గొంతు మరియు దవడల వాపుతో ఏమీ తినలేకపోయేది. వైద్య సహాయం ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. కాబట్టి, తన భార్య వ్యాధి నివారణ కోసం, అతను ఒక స్థానిక న్యాయవాది ఆర్.జె గుప్తా సలహా మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను తీసుకుని ఎంతో ఆశతో బాబా దర్శనానికి వెళ్లాడు. ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో వుంది. కానీ వారు ఇగత్ పురికి వెళ్ళినప్పుడు, ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్ లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. షిర్డీ చేరేసరికి ఆమె పరిస్థితి బాగా మెరుగుపడింది.
           Image result for images of old dwarakamayi

వారు షిర్డీ చేరాక, అతను మాత్రమే మశీదు లోనికి వెళ్లి బాబాకు నమస్కరించాడు.
అప్పుడు బాబా నీవు ఎందుకు వచ్చావు? నీకు ఏం కావాలి?”  అని అడిగారు.
అతనునా భార్య గొంతు, దవడల వాపుతో బాధపడుతుందిఅని సమాధానమిచ్చాడు.
"ఆమెను లోపలికి రమ్మను" అని బాబా అన్నారు.
అప్పుడు ఆమె మశీదు లోపలికి వచ్చి బాబా పాదాలకు నమస్కరించింది.
బాబా ఆమె తలపై చేయివేసి, 'ఖుదా అచ్ఛా కరేగా' (భగవంతుడు మంచి చేస్తాడు) అని అన్నారు.
Image result for images of old one rupee silver coin


అప్పుడు రంగారీ, బాబాకు ఒక రూపాయి నాలుగు అణాలు దక్షిణ సమర్పించుకున్నాడు. బాబా దానిని స్వీకరించి అతనికి ఊదీ ఇచ్చారు. వారు రెండు గంటల సమయం అక్కడే బాబా సన్నిధిలో ఉన్నారు. అతడు అక్కడున్న రెండు గంటల కాలంలో బాబాతో మాట్లాడింది చాలా తక్కువ.

 రెండు గంటలు గడిచిన తరువాత ఆమె గొంతు, దవడ వాపులు  ఉపశమనం చెందుతూ ఉండటంతో అక్కడినుండి బయలుదేరాలని అనుకున్నాడు రంగారీ. కాని బాబా వారిని అక్కడే ఉండమన్నారు. కాని రంగారీఅతని భార్య రెండేళ్ళ కొడుకుతో కొత్త ప్రదేశంలో ఉండటం ఇష్టంలేక బాబా అనుమతి తీసుకోకుండా ఇంటికి బయలుదేరారు. వారు అందుకు పరిహారం చెల్లించవలసి వచ్చింది.
వారు వెడుతున్న టాంగా  ఇరుసు రాత్రి 10 గంటలకు ప్రయాణం మధ్యలో విరిగిపోయింది. అక్కడ మరి ఇతర వాహనాలు అందుబాటులో లేవు. అతను, అతని భార్య మరియు బిడ్డ రాత్రి వేళ అన్ని మైళ్ళ దూరం అటు వెనకకు నడవలేరు, అలా అని ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో చిక్కుకున్నారు. అది ఒక నిర్మానుష్యమయిన రహదారి మరియు వాతావరణం కూడా బాగాలేదు. తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ రెండు గంటలు గడిపారు. ఏమి చేయాలనేది అతనికి తోచలేదు. బాబా అనుమతి లేకుండా బయలుదేరినందుకు అతను పశ్చాత్తాపపడ్డాడు.
అర్ధరాత్రి దాటిన తరువాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. “థానావాలా, థానావాలాఅని బండితోలే వ్యక్తి అరుచుకుంటూ వస్తున్నాడు. టాంగా దగ్గరకు రాగానే రంగారీ టాంగాను ఆపి, “నేనే థానావాలాఅని చెప్పాడు. అప్పుడు టాంగావాడుబాబా మిమ్మల్ని తీసుకొని రమ్మని పంపించారుఅని చెప్పాడు. అప్పుడు వాళ్ళు టాంగా ఎక్కి రాత్రి 2 గంటలకు షిర్డీ చేరుకున్నారు. వాళ్ళని చూస్తూనే బాబా, “మీరు అనుమతి లేకుండానే వెళ్ళారు. కాబట్టి, మీకు విధంగా జరిగిందిఅన్నారు. వెంటనే రంగారీ తాను చేసిన తప్పుకు బాబాను క్షమాభిక్ష కోరారు. అప్పుడు బాబా, 'ఉదయం వరకు వేచి ఉండండిఅని చెప్పారు.

ఉదయం బాబా భిక్ష నుండి తిరిగి వచ్చిన తరువాత కొంత రొట్టె మరియు కూర తినమని వారికి ఇచ్చారు. బాబా ఇచ్చిన రొట్టెను అతని భార్య తినగలిగింది. తరువాత బాబా అతనితో, 'నీవు వెళ్ళవచ్చు' అన్నారు. అతను వెళ్లి టాంగా  కోసం చూశాడు, కాని ఎక్కడా టాంగా కనిపించక బాబా వద్దకు తిరిగి వచ్చాడు. బాబానీవు ఇప్పుడు వెళ్ళవచ్చు, టాంగా అక్కడ ఉంది చూడుఅన్నారు. అతడు చూస్తే టాంగా ఉంది. అంతవరకు కనిపించని టాంగా అంతలోనే అకస్మాత్తుగా ఎలా వచ్చిందో అని అతను చాలా ఆశ్చర్యపోయాడు.
అతడు బాబా నుదుట చందనం అద్ది ఉండడం గమనించి, “ముస్లింలు అలా గంధం పూసుకోరు కదా! మరి మీరు ఎలా అంగీకరించారు?” అని బాబాను అడిగాడు.
అప్పుడు బాబా, “జైసా దేశ్, వైసా వేష్ (ఏదేశంలో ఉంటే ఆదేశకాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి). ఇక్కడి వారు వారి వారి దైవాలను పూజించడానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి  పూజిస్తున్నారు. వారిని అసంతృప్తి పరచడమెందుకు? నా వరకూ నేను భగవంతునికి బానిసనేఅన్నారు.
ఆయనే మళ్ళీనీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ సంగీతకచ్చేరి జరిగింది. నేను రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నాను. వీళ్ళంతా నన్నుతిట్టారు’ ”  అన్నారు.
వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు?” అనడిగితే,
బాబా, “నేనుతిట్టారుఅని చెబితే అందరూ అర్ధం చేసుకోలేరు. కానీ నీవు అర్ధం చేసుకోగలవుఅన్నారు.
నిజానికితిట్టారుఅన్నమాటకు సూఫీ పరిభాషలోవినోద పరిచారుఅని అర్థమని అతనికి తెలుసుగనుక, “భగవంతుని స్థుతిస్థుంటే ఆయనపై ప్రేమ ఉన్న భక్తులు దుఃఖిస్తారు, నవ్వుతారు, లేదా నృత్యం చేస్తారుఅని అతను బాబాతో అన్నాడు.
బాబాఅంతే! సరిగా చెప్పావు. నీ గురువు నీకున్నారు కదా!” అన్నారు.
అందుకు అతడుఅవును ఉన్నారు. హబీబ్ ఆలీషా చిస్తీ నిజామీఅని చెప్పారు.
అందుకేనీకు అర్థం అయ్యిందిఅన్నారు బాబా.
చిస్టీ  గురువు ఎక్కడికి వెళ్ళినా ఎల్లాపుడూ కూడా సంగీత కళాకారులు వెంటే ఉండేవారు.  వారు పాడే పాటలతో ఆయన సమాధిస్థితిలోకి వెళ్ళేవారు.

అతను షిర్డీ వెళ్ళినది ఒక్కసారే. కాని తొలిసారి బాబా దర్శనంతోనే అతనికి బాబాపై స్థిరమైన విశ్వాసమేర్పడింది. అతడు రోజూ నిద్రించేముందు బాబాని తలుచుకొనేవాడు. అతను ఆర్తిగా బాబాని తలుచుకున్నప్పుడు బాబా అతనికి దర్శనమిచ్చేవారు.


(Source: Life of Saibaba Volume 3. by Sri.B.V.Narasimha Swamiji)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment