Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, September 30, 2017

వామనరావు అనుభవాలు

Posted by tyagaraju on 5:18 AM
        Image result for images of shirdisaibaba with durgadevi
       Image result for images of lotus flower


30.09.2017  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
విజయదశమి శుభాకాంక్షలు
 వామనరావు యొక్క అనుభవాలు షిర్ది సాయి ట్రస్ట్.ఆర్గ్ నుండి గ్రహింపబడింది. 
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు,
                             నిజాంపేట,  హైదరాబాద్
వామనరావు అనుభవాలు

సాయిబాబా తన భక్తులకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు.  ఆయనతో పోల్చదగినవారు మరెవ్వరూ లేరు.  ఈ ప్రపంచంలో సాయిభక్తిని కొలవడానికి ఎటువంటి కొలమానం లేదు.  ఏసాయి భక్తుని హృదయంలోనయితే సాయిబాబా నివసిస్తూ ఉంటారో ఆభక్తుడిని ఎటువంటి మాయ భాధించదు.  ఎవరిమీదనయితే సాయిబాబా తమ  అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తారో వారు మాత్రమే సాయిబాబా వారి అంతరంగాన్ని అర్ధం చేసుకోగలరు.  సాయిబాబాను చేరుకొనే మార్గం చాలా సులభమయినదే, కాని దురదృష్టవంతులు ఆ మార్గాన్ని అనుసరించడానికి అంగీకరించరు. 


ఒకసారి వామనరావు షిరిడీలో ఉన్నపుడు వివేకానందుడు వ్రాసిన మాయావతి సాహిత్యాన్ని చదువుతున్నాడు.  జ్ఞానులయొక్క కఠినమయిన మార్గాలు అనే అంశం ఆ సాహిత్యం మధ్యలో వచ్చింది.  ఆ విషయాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది.  అది అర్ధం కాకపోవడం వల్ల    అతనికి చాలా విసుగు కలిగింది.  చదువుతున్న పుస్తకాన్ని మధ్యలోనే వదిలేసి ద్వారకామాయికి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోయాడు.  ద్వారకామాయిలో సాయిబాబా ఉన్నారా లేదా అనే విషయం కూడా ఏమాత్రం పట్టించుకోలేదు.  ద్వారకామాయినుంచి తిరిగి వచ్చిన తరువాత మరలా పుస్తకం చదవడం ప్రారంభించాడు.  ఆ తరువాత అంతకుముందు అర్ధంకాని అంశాన్ని చాలా సులభంగా అర్ధం చేసుకోగలిగాడు.

ఒకరోజున సాయిబాబా అతనితో ఈ విధంగా అన్నారు.  “ఈ పంట పొలాన్ని చూడు.  ఈ పొలాన్ని పట్టించుకునేవాడు ఎవడూ లేడు.  రక్షణ లేకపోవడం వల్ల పశువులు వచ్చి పంటనంతా తినేస్తాయి.”  దీనియొక్క అర్ధం ఏమిటంటే నువ్వు ఏపుణ్యాన్ని సంపాదించుకున్నా దానికి వ్రతములు (ఉపవాసం) నియమం, సహనం వీటితో కాపాడుకుంటూ ఉండాలి.  లేకపోతే సంపాదించుకున్న పుణ్యఫలమంతా కొట్టుకునిపోతుంది.”

ఒకరోజు రాత్రి వామనరావు ద్వారకామాయిలో సాయిబాబా దగ్గర కూర్చున్నాడు.  అపుడు సాయిబాబా తన ప్రేమామృత హస్తాన్ని వామనరావు శిరసుమీద పెట్టి అతనికి శక్తిపాతాన్ని ప్రసాదించారు.  మధురమయిన వాక్కులతో “ఆ పరమేశ్వరుని అనుగ్రహం నీకు లభించింది” అన్నారు.  ఈ విధంగా సాయిబాబా అతనికి కొన్ని దైవిక శక్తులను ప్రసాదించారు.

అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి.  వాటి ద్వారా సాయిబాబాకు వామనరావుకు మధ్యగల సంబంధం మనకు అర్ధమవుతుంది.

ఒకరోజున వామనరావు సాయిబాబాను పూజిస్తూ ఉన్నాడు.  ఆవిధంగా పూజిస్తూ ఉన్న సమయంలో ఈ విధంగా ఆలోచించాడు – ‘ఈ రోజు సాయిబాబా మనతోనే ఉన్నారు.  ఆయనను చందనంతోను, పూలతోను, సువాసనలు వెదజల్లే అగరువత్తులతోను, ఆయన శరీరాన్ని మర్ధనా చేస్తూ ఆయనకు సేవలు చేస్తూ పూజిస్తూ ఉన్నాము.  ఆ తరువాత ఆయన లేకపోతే మేమెవరికి పూజ చేయాలి?”

సాయిబాబా సర్వాంతర్యామి.  ఆయనకు తన భక్తుల మనోగతాలన్నీ తెలుసు.  వామనరావు మదిలో చెలరేగుతున్న భావాలన్నీ ఆయనకు వెంటనే తెలిసిపోయాయి.  వామనరావు ఆలోచనలకి సమాధనంగా సాయిబాబా “ఈ కనిపించే శరీరమే సాయిబాబా అనుకుంటున్నావా?  నేను ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాను.  నేను ఈ భూమిపై లేననే చింత పెట్టుకోకండి.  ఎందుకని నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావు?” అన్నారు.


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

శ్రీ సాయి సురేష్ గారు షిర్డీ సాయిబాబా whatsapp గ్రూపులోని సాయి బంధువు జగన్ గారి అనుభవం పంపించారు.  దానిని యధాతధంగా ప్రచురిస్తున్నాను.  
బాబాను నమ్ముకున్నవారికి ఆయన ఊదీనే పరమౌషధంగా భావించేవారికి కలిగే అనుభవాలు ఎన్నిటినో చదివాము.  అందులో ఇది మరొకటి.

ఈ మధ్యనే సెప్టెంబర్ 17 తేదిన బాబా గారు చూపిన ఒక లీలను సాయి బంధువులతో పంచుకోవాలనే కోరికతో అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను.
17 తేదిన మా చిన్న అమ్మాయికి తీవ్రమైన జ్వరం వచ్చింది. టెంపరేచర్ 103 నుండి 104 డిగ్రీలు ఉంది. శరీరం ఎర్రగా కమిలిపోయినట్లు అయిపొయింది. మరుసటి రోజు హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాము. డాక్టర్ గారు మందులు ఇచ్చి జ్వరం తగ్గకపోతే రెండు రోజుల తరువాత రమ్మన్నారు. మూడు రోజులు గడిచినా జ్వరం 103 డిగ్రీలు ఉంది.
                      Image result for images of man worshiping before baba photo
20 తేది అర్ధరాత్రి బాబా ఫోటో ముందు కూర్చొని 30నిమషాలు సాయి నామం చేసి పాపకు జ్వరం తగ్గించమని బాబాని ప్రార్ధించాను. రాత్రి 12 గంటల 40 నిమషాల సమయంలో నా శరీరమంతా 
రోమాంచితమై ఆనందబాష్పాలు వచ్చాయి. అది బాబా అనుగ్రహం అని తలచి బాబా పటం ముందు నిల్చున్నాను. మళ్ళి అదే అనుభూతి కలగసాగింది. మనస్సులో బాబా ఆజ్ఞగా స్ఫురించి వారి విభూతిని మా అమ్మాయి శరీరానికి పూసి, నుదుటన పెట్టి, నోట్లో కొంచం వేశాను. చిత్రంగా జ్వరం తగ్గటం ప్రారంభమైంది. కొద్ది క్షణాలలో 104 డిగ్రీల నుండి 100 డిగ్రీలకు వచ్చింది. తరువాత హాస్పిటల్ లో బ్లడ్ టెస్ట్ చేయిస్తే మాములు జ్వరం అని చప్పారు. మా అమ్మాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఇది కేవలం బాబా దయవల్ల మాత్రమే జ్వరం తగ్గింది. నిజానికి లక్షణాలు డెంగ్యుకు సంబంధించినవట. బాబా గారు రక్షణగా నిలిచారు.
జై సాయిబాబా

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List