Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, November 13, 2017

స్వామీజీ ప్రసాదించిన గులాబీ

Posted by tyagaraju on 6:08 AM
          Image result for images of shirdi sai
               Image result for images of roses

13.11.2017  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారిశుభాశీస్సులు
శ్రిసాయిపదానంద రాధాకృష్ణస్వామీజీ గారి బ్లాగులో ప్రచురించిన మరొక అధ్భుతమైన లీల, ఆగస్టు, 3, 2008,  ఆదివారమునాడు ప్రచురింపబడింది.  దానికి తెలుగు అనువాదమ్.

స్వామీజీ ప్రసాదించిన గులాబీ

నాకు మూడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే స్వామీజీ సమాధి చెందారు. నాకు ఆయన గురించి తెలుసుకునే అవకాశం కూడా  తక్కువే.  ఆయినా ఆయన నాకు బాగా తెసుసుననే భావం నాలో ఉండేది.  ఆయనతో నాకు విడదీయరాని బంధం ఉన్నట్లుగా అనిపించడం వల్ల ఆయన కూడా నాతాతగారనే పొరబాటు అభిప్రాయం కూడా ఉండేది. 



 నాకు చిన్నతనం వల్ల నాకు యిద్దరే తాతగార్లు (మా అమ్మగారి తండ్రి, మా నాన్నగారి తండ్రి) ఉంటారనే జ్ఞానం లేకపోవడం కూడా దానికి ఒక కారణం.  ఆయనతో నా సహచర్యం ప్రార్ధనల ద్వారా మాత్రమే.

     Image result for images of radhakrishna swamiji
ఆయన గొప్పతనం గురించి మీకందరికీ తెలియచేయవలసిన అవసరం ఈ రోజు ఎంతగానో ఉంది.  మనకు ఎందరో సన్యాసుల గురించి తెలుసు.  కాని వారందరిలోకి స్వామీజీలాంటివారు, పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసించే పుష్పంలాంటివారు.  చాలా కొద్దిమందికి మాత్రమే అటువంటి మహాపురుషులు తారసపడతారు.  ఆయన ప్రచారాలకు దూరంగా ఒక సాధారణ మానవునిలాగే జీవించారు.  అయినప్పటికీ కంటికి అగుపించని తన అధ్భుత చర్యల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసారు.

నాకు 8  లేక 10 సంవత్సరాల వయసప్పుడు మాయిద్దరు తాతగార్లతోను (మా అమ్మగారి తండ్రి, నాన్నగారి తండ్రి) బెంగళూరులో ఉన్న సాయి స్పిరిట్యువల్ సెంటర్ కి వెళ్ళాను అక్కడ స్వామీజీ నివసించిన గది ‘హంసనికేతన్’ ని దర్శించాము.  ఈ గది చాలా ప్రత్యేకమయినది.  ఆగదిలోకి ప్రవేశించినవారందరూ ఎంతో నిశ్చలత్వాన్ని, మానసిక శాంతిని అనుభూతి చెందేవారు.  ఈగదిలో స్వామీజీ గారు ఉపయోగించిన కళాకృతులు ఎన్నో ఉన్నాయి.  వాటిలో ఒక గడియారం కూడా ఉంది.  ఒకసారి స్వామీజీ లేని సమయంలో ఒక భక్తుడు బాబాకు నైవేద్యం సమర్పించడం మర్చిపోయినపుడు ఆగడియారం కిందకు దుమికి గుర్తు చేసింది.

(దీనికి సంబంధించిన సమాచారమ్ రేపటి సంచికలో)

మేము గదిలోనికి వెళ్ళినపుడు అక్కడ స్వామీజీగారి నిలువెత్తు పటం కనిపించింది.  ఆ పటం వద్ద అందమయిన ఎఱ్ఱ గులాబీ ఉంది.  నాకు గులాబీలంటే చాలా యిష్టం.  అందులోనే బెంగళూరు గులాబీలంటే మరీ మరీ యిష్టం.  చిన్నపిల్లలకు గులాబీని చూడగానే కావాలనిపిస్తుంది.  నాలో కూడా ఆవాంఛ ఉన్నందువల్ల మాతాతగారితో (మా అమ్మగారి తండ్రి) నాకా గులాబీ కావాలని అడిగాను.  మాతాతగారు శ్రీ పి.శేషాద్రిగారు ఆ గులాబీ తీసుకోకూడదు తప్పు అని చెప్పారు.  నాకు చాలా నిరాశ కలిగింది.  వెంటనే స్వామీజీని నాకా గులాబీ పువ్వును యిప్పించమని మనసులోనే ఆయనను ప్రార్ధించుకున్నాను.  ఆ తరువాత ఆవిషయం మర్చిపోయాను.  దర్శనాలు అయిన తరువాత యింటికి తిరిగి వచ్చేశాము.

నేను, నా కజిన్ యిద్దరం మాయింటి వెనక పెరడులో ఆడుకుంటున్నాము.  ఆటలలో భాగంగా అక్కడ ఉన్న కొన్ని యిటుకలతో బాబాకి చిన్న గుడి కట్టాము.  అందులో సాయిబాబా విగ్రహాన్ని పెడుతుండగా మాతాతగారు నన్ను పిలుస్తూ ఉండటం వినిపించింది.  నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళాను మాతాతగారి చేతిలో నేను స్వామీజీ పటం దగ్గర చూసిన గులాబీ పువ్వే ఉంది.  తాను పంచె విప్పుకుంటుండగా ఆ గులాబీ పువ్వు రాలిపడిందని, అది ఎలా జరిగిందో కూడా అర్ధం కాలేదని ఆశ్చర్యపడుతూ చెప్పారు.  నా సంతోషానికి అంతు లేదు.  నేను కోరిన చిన్న కోరికను స్వామీజీ తీర్చారు.  పెద్దవారికది అంత ప్రాముఖ్యత లేనిదే కావచ్చు, కాని పిల్లలకు అదే పెద్ద మహద్భాగ్యం.  మీరది ఒక గులాబీ పువ్వు అని అనుకోవచ్చు, కాని వెంటనే దాని రేకలన్నీ విడిపోయాయి.  అందరం వాటిని స్వామీజీ  ప్రసాదంగా భావించి తీసుకున్నాము.  స్వామీజీ నాప్రార్ధనను ఆలకించారని ఈ సంఘటన ద్వారా నాకు తెలియచేసారు.

                                                                        @@@@@@



శ్రీ రాధాకృష్ణ స్వామీజీ బెంగళూరులోసాయి స్పిరిట్యువల్ సెంటర్ వ్యవస్థాపకులు సెంటర్ ను స్థాపించిన కొన్ని సంవత్సరాల తరువాత, శ్రీసాయి సాక్షాత్తు శ్రీరామ చంద్రులవారే అని తన భక్తులకు నిరూపణ చేసే అవకాశం ఆయనకు లభించిందిఒకరోజు మందిరానికి ఒక సన్యాసి వచ్చాడుఆయన స్వామీజీని బాబా మానవమాత్రుడే కదామరి అటువంటపుడు బాబాని భగవంతునిగా ఎందుకని పూజించాలో నిరూపించమని  ప్రశ్నించాడుస్వామీజీ యిచ్చిన వివరణ సన్యాసిని ఒప్పించలేకపోయిందిఅపుడు స్వామీజీ మనసులోనే బాబాని ప్రార్ధించారుకొన్ని నిమిషాల తరువాత ఒక స్త్రీ, రామ, లక్ష్మణ సీత, మారుతి విగ్రహాలను తీసుకుని వచ్చి సన్యాసి సమక్షంలో స్వామీజీకి భక్తిపూర్వకంగా సమర్పించుకుంది.  
                Image result for images of shirdisaibaba and lord rama
సంఘటన సన్యాసికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందిబాబాయే శ్రీరామచంద్రమూర్తి అన్న స్వామీజీ యిచ్చిన వివరణకి సాక్ష్యం లభించింది సన్యాసి కన్నీరు కారుస్తూ సాయిబాబా గొప్పతనం గురించి శంకించినందుకు స్వామీజీని క్షమాపణ వేడుకొన్నాడు ప్రతిమలను ఎక్కడినుంచి తీసుకుని వచ్చావని స్వామీజీ స్త్రీని ప్రశ్నించారుతాను వాటిని మద్రాసులోని ఆల్ ఇండియా సాయి సమాజ్ నుండి తీసుకుని వచ్చానని చెప్పింది.  "దీనికి ఇంకా నీకు సాక్ష్యమేమన్నా కావాలా అన్నట్లుగా స్వామీజీ చిరునవ్వుతో సన్యాసి వంక చూసారు.
(పాడయిపోయిన గడియారం ప్రాణం ఉన్నదానిలా దుమకగలదా?
ఎప్పుడో పాడయిపోయి తిరగని గడియారం అలారం కొట్టగలదా?  రేపటి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

1 comments:

Sadananda swamy on September 16, 2021 at 9:47 AM said...

🕉 sai Ram

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List