14.11.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు ప్రచురిస్తున్న
ఈ అధ్భుతమైన చమత్కారమ్ శ్రీసాయిపదానందరాధాకృష్ణస్వామీజీ బ్లాగ్ నుండి గ్రహింపబడింది. 2011 ఫిబ్రవరి, 23, బుధవారము నాడు బ్లాగులో ప్రచురింపబడినదానికి
తెలుగు అనువాదమ్.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
పనిచేయని గడియారానికి ప్రాణమ్
శ్రీరాధాకృష్ణ స్వామీజీ
గారు సాయి ప్రచార నిమిత్తం బెంగళూరునుండి మరొక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళేముందు తన భక్తులలో ఒకరిని పిలిచి ప్రతిరోజు
రాత్రి సరిగ్గ 8 గంటలకి తన కుటీరంలో ఉన్న సాయిబాబా, శ్రీనివాసుని విగ్రహాలకి నైవేద్యం
సమర్పిస్తూ ఉండమని చెప్పారు.
కాని ఒక రోజు
ఆ భక్తుడు నైవేద్యం పెట్టడం మరిచిపోయిన సమయంలో పనిచేయని గడియారం అకస్మాత్తుగా పనిచేయడం
మొదలుపెట్టి అలమారునుండి క్రిందకు పడి ఆవిషయాన్ని గుర్తు చేసింది. ఈ సంఘటన గురించిన సమాచారం స్వామీజీ గారి జీవిత చరిత్ర
‘Apostle of Love’ Written by Rangaswami Parthasarathy ( ఈ పుస్తకం తమిళంలో కూడా ఉండవచ్చు) పుస్తకంలో మనం చదవవచ్చు. ఇంకా మరికొన్ని చమత్కారాలను గురించిన పూర్తి సమాచారం పైన తెలిపిన పుస్తకంలో చదవవచ్చు.
స్వామీజీ లేని రోజులలో
ఆ భక్తుడు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు సాయిబాబా, శ్రీనివాస మూర్తులకు స్వామీజీ చెప్పిన
ప్రకారం నైవేద్యం సమర్పిస్తూ ఉండేవాడు. కాని
ఒకరోజు నైవేద్యం పెట్టడం మరచిపోయాడు. అప్పుడు
అలమారలో ఉన్న పాడయిపోయిన గడియారం అలమారునుండి ఆ భక్తుని ఎదురుగా కిందకు దుమికింది. పనిచేయని ఆ గడియారం సరిగ్గ 8 గంటలకు అలారం మ్రోగుతూ
ఆ భక్తునికి నైవేద్యం గురించి గుర్తు చేసింది.
స్వామీజీ కుటీరానికి తిరిగి వచ్చిన తరువాత ఆ భక్తుడు ఎంతో విస్మయంగా నమ్మశక్యంగాని
ఈ విషయాన్ని వివరించాడు.
అపుడు స్వామీజీ, భగవంతుని
విషయంలో ఎటువంటి లోపాలు జరగకూడదని చెప్పారు.
తన గదిలో ఉన్న ప్రతి వస్తువులోను ప్రాణం ఉందన్నారు. అందువల్లనే అలమారులో ఉన్న గడియారం క్రిందకు దుమికి
నీ కర్తవ్యాన్ని గుర్తు చేసిందని అన్నారు.
త్యాగరాయనగర్ లో ఉన్న సాయిమందిరంలో ఉన్న స్వామీజీ గదిలో ఆ గడియారాన్ని మనం చూడవచ్చు.
(క్రింద ప్రచురించిన అనుభవమ్ కూడా ఆంగ్ల బ్లాగులోనిదే .... నా స్వంత అనుభవమ్ కాదని మనవి)
ఒకానొక సందర్భంలో నాకు
కూడా యిటువంటి అనుభవమే కలిగింది. నాకు
2003 వ.సంవత్సరంలో న్యూఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. నేను, మరొక అమ్మాయి కలిసి యిద్దరం ఒక అపార్ట్ మెంటులో
అద్దెకు ఉంటున్నాము. ఆరు నెలల తరువాత ఆ అమ్మాయి
వెళ్ళిపోయింది. నాకు తగ్గ మరొక అమ్మాయి రూమ్
మేటుగా దొరకలేదు. నేనెప్పుడూ ఒంటరిగా నివసించకపోవడం
వల్ల యిపుడు ఈ అపార్ట్ మెంటులో ఒంటరిగా నివసించాలంటే చాలా కష్టంగా ఉంది. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉండటం వల్ల కూడా
ఒంటరితనం చాలా భయం గొలిపేదిగా ఉంది. అపార్ట్ మెంటులో ఒంటరితనాన్ని భరిస్తూ ఉన్న రోజులు. మనస్సంతా చాలా అశాంతిగా ఉంది. నా చుట్టూ
ఎవరూ లేరు, పలకరించేవారు కూడా ఎవరూ లేరు అని భాధపడుతూ ఉన్నాను. ఈ విధమయిన ఆలోచనలలో ఉండగా అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో
గడియారం అలారం మ్రోగసాగింది. అప్పుడు రాత్రి
7 గంటలయింది. అలారం యొక్క శబ్దం నా ఆలోచనలనుంచి
నన్ను బయటకు లాగింది. గత ఆరునెలలుగా గడియారం
పని చేయడంలేదు. ఇన్ని నెలలుగ పనిచేయని ఆ గడియారం
హటాత్తుగ అలారం మ్రోగడమేమిటి? చాలా విచిత్రం
అనిపించింది నాకు. వెంటనే లేచి షెల్ఫ్ లో ఉన్న
గడియారాన్ని తీసి నిజంగా మ్రోగుతోందా అని పరీక్షించాను. పూజామందిరానికి ప్రక్కనే ఉంది గడియారం. గడియారంలోని ముళ్ళు రెండు ఆగిపోయే ఉన్నాయి. అవి ఏమాత్రం కదలడంలేదు. కాని అలారం మ్రోగుతున్న శబ్దం మాత్రం వస్తోంది. ఎటువంటి అధ్భుతమయిన సంఘటనో కదా? అసలు పని చేయని గడియారం ఈ విధంగా మ్రోగడమేమిటి?
అపుడు సాయిబాబా దీనిద్వారా నాకొక సందేశం యిచ్చారనే భావన కలిగింది. నువ్వు వంటరిగా లేవు నీచెంతనే నేనున్నాననే విషయాన్ని
గడియారాన్ని తిరిగి పని చేయించి అధ్భుతమయిన చమత్కారాన్ని నాకు ప్రత్యక్షంగా చూపారు.
వెంటనే నేను బాబాని మనసులో ప్రార్ధించుకోగానే
నాలో గూడుకట్టుకున్న నిరాశాజనికమయిన ఆలోచనలన్నీ పటాపంచలయిపోయాయి. అప్పటినుంచి నేను ఒంటరిదానిననే భావం ఎపుడూ నాకు
కలగలేదు. స్వామీజీ, సాయిబాబా, శ్రీనివాసుడు
అందరూ అదృశ్యంగా ఉండి నాయోగక్షేమాలను చూస్తూ ఉన్నారని నాకు తెలుసు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment