Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, December 14, 2017

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 4 వ.భాగమ్

Posted by tyagaraju on 8:38 AM
Image result for images of shirdi sainadha
Image result for images of rose hd


14.12.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు
        
         Image result for images of radhakrishna swamiji

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 4 .భాగమ్


20.04.1971  స్వామీజీభగవంతుని కోసం కొంత సమయాన్ని ఎందుకని కేటాయించకూడదు?” మనం ఆఫీసు పనికి, బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి, సరకులు కొనడానికి, వినోదాలకి విధంగా అనేక రకాలయిన  వ్యాపకాలకి కొంతకొంత సమయాన్ని కేటాయిస్తున్నాముమరి అటువంటప్పుడు రోజుకి ఒక్క పదినిషాలు భగవంతుని కోసం కేటాయించలేమా?  


ఆధునిక యుగంలో మానవుడు వినోదాలు, సంతోషాల కోసం క్రొత్తక్రొత్తవాటికోసం ఎగబడుతున్నాడుతాగుడు యింకా ఎన్నో రకాల మార్గాలను తన వినోదం కోసం వెతుక్కుంటున్నాడుభగవంతుడిని ప్రార్ధించడానికి ఎందుకని ప్రయత్నం చేయకూడదుకలిప్రభావం వల్లనే తమకు కష్టాలు కలుగుతున్నాయని కొంతమంది చెబుతూ ఉంటారుమరికొంతమంది గ్రహాల ప్రభావం వల్లనని చెబుతూ ఉంటారుమరి అటువంటప్పుడు ఏమి చేయాలిదుష్టగ్రహాల ప్రాబల్యం ఉన్నపుడు మానవుడు భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలికనీసం ఉదయం, సాయంత్రం భగవంతుని ధ్యానించాలినా 70 సంవత్సరాల జీవితంలో ఆఖరికి నేను ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చానుమనం ఉదయం, సాయంత్రం భగవంతుని ధ్యానం చేసినట్లయితే మన కష్టాలు, జీవితంలో కలిగే ఒడిదుడికలన్నిటినీ అధిగమించగలిగి తద్వారా సుఖ సంతోషాలను పొందగలుగుతాముముఖ్యంగా సాయంత్రం వేళలు ప్రార్ధించుకోవడానికి అనుకూలంగాను, ఆనందదాయకంగాను ఉంటాయిఅదే విధంగా మనం ఆహారం తీసుకుంటున్నపుడు కూడా భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోరాదుమొట్టమొదటగా మనం ఆహారాన్ని స్వీకరించేముందు,



శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః  బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినాగీత..4 . 24 శ్లో.


గీతలోని శ్లోకాన్ని స్మరిస్తూ భగవంతునికి సమర్పించి తరువాతనే మనం స్వీకరించాలిస్వామీజీ విధంగా చెప్పగానే ఒక భక్తుడు విధంగా ప్రశ్నించాడు.  “స్వామీజీ! భగవంతుడు తిరిగి తమకు ఏదయినా ప్రసాదిస్తాడనే భావంతో చాలామంది భగావంతునికి ఏదోఒకటి సమర్పిద్దామనే కోరికతో ఉంటారుఆకోరికతో భగవంతునికి తమకు తోచినదేదో సమర్పించి ఆ తరువాత తాము స్వీకరిస్తూ ఉంటారువారి భక్తి అంతవరకెఅటువంటివారు ఆధ్యాత్మికంగా ఏవిధంగా ఎదగగలరు?”.  ప్రశ్నకు సమాధానంగా స్వామీజీఅసలు భగవంతుని స్మరించకున్నా కనీసం ఆవిధంగా చేసినా మంచిదే కదాఈవిధంగా భగవంతునికి ఆహారాన్ని సమర్పించడమనేది మొదటి మెట్టుభగవంతునినుంచి ఏదో ఆశిద్దామని గుడికి వెళ్ళేవాళ్ళని వెళ్ళనీకాని చాలామంది ఆవిధంగా చేయనివాళ్ళు ఎంతోమంది ఉన్నారుఉదాహరణకి తలనొప్పి వస్తే అనాసిన్ వేసుకుంటారుఅదేవిధంగా మన మనసుకి సంతోషంగా లేనపుడు భగవంతుని గురించి ఎందుకని చింతించకూడదుద్విజుడయినవాడు (అనగా రెండుసార్లు జన్మించినవాడు అనగా ఉపనయనం అయినవాడు) ప్రతిరోజు కనీసం 10 సార్లు గాయత్రిమంత్రాన్ని జపించినా చాలుమిగిలినవారు భగవన్నామ స్మరణ చేసుకోవాలినామస్మరణ మనలను ఏవిధమయిన ప్రమాదాల బారినపడకుండా రక్షణ వహిస్తుందిఅయితే భగవంతునికి ఏది సమర్పించాలిశ్రీకృష్ణపరమాత్మ తనకు భారీగా ఎటువంటివి అవసరం లేదని, శ్లోకంలో చెప్పినట్లుగా పత్రం, పుష్పం,ఫలం, తోయం చాలునని చెప్పాడుఆవిధంగా భక్తితో పత్రాన్ని సమర్పించినా కూడా ఆయన స్వీకరిస్తాడు.  
(జ్ఞాని అయినవాడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అనగా అంతరార్ధాన్ని ఏవిధంగా అర్ధం చేసుకుంటాడో ఈ వీడియో చూడండి)

భక్తి మార్గంలో ఉన్నపుడు మన అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలికాని, అది చాలా కష్టమయిన పనిఉదాహరణకు ధనవంతునికి తనకెంతో ధనం ఉన్నదనే అహంకారం ఉంటుందిభక్తిపాటలు పాడే భాగవతకారుడు సభలో పాటపాడుతాడు. ప్రేక్షకులు మరొకసారి పాడటానికి అవకాశం యివ్వకపోతే ఒక్కసారిగా అతని అహం దెబ్బతింటుందిమనలోని అహంకారాన్ని తొలగించుకోవడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలిలేకపోయినట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో అహంకారం పెద్ద అడ్డంకిగా మారుతుందిఅహంకారం వల్లనే మానవుడు తన భార్యపిల్లలతో కూడా రాజీపడలేదుఅటువంటివాడు ఇక బయటివ్యక్తులతో ఏవిధంగా రాజీ పడగలడుసాధ్యమయినంతవరకు యితరులతో మనం సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించాలిఉదాహరణకి వ్యాపారంలో భాగస్వాములు ఉన్నపుడు ఒకరికొకరు కలివిడిగా ఉండాలివ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే భాగస్వాములందరూ ఐకమత్యంగా ఉండటం తప్పనిసరి.  విదేశీయులనుంచి మనం నేర్చుకోవలసినది ఎంతో ఉంది.  కాని మనతో పోల్చుకుంటే వారి జీవనవిధానం వేరు.  కాని, వారు యితరులతో లావాదేవీలు జరిపే విషయంలో ఖచ్చితంగాను,  సమయపాలన పాటించడంలోను, శ్రధ్ధతోను వ్యవహరిస్తారు.  ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి.

మరొకరోజున స్వామీజీకి యిష్టం లేకున్నా భక్తులందరూ ఆయన జన్మదినోత్సవాన్ని జరిపారు.  ఆయనకి పాదపూజ కూడా చేసారు.  ఆ తరువాత స్వామీజీ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ “ఓం" యొక్క ప్రాముఖ్యతను వివరించారు.  మనము “ఓం" యొక్క ప్రాముఖ్యతను గనక అర్ధం చేసుకుంటే మనం భగవంతుని గురించి తెలుసుకోగలమని వివరించారు.  



అది సాధించాలంటే ముందుగా గణపతిని పూజించాలి.  ఆయన అన్ని విఘ్నాలను తొలగిస్తాడు.  తద్వారా చివరికి మనం భగవంతుని గురించి తెలుసుకోగలం.  దానికి మనవంతు ప్రయత్నం కూడా చేయాలి.  అదేమిటంటే ప్రాపంచిక విషయాలయందు ఆసక్తిని పెంచుకోరాదు.  ఉదాహరణకి మందిర నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలలో మనం తలదూర్చి అనవసరంగా మనకు మనమే బాధపడుతూ ఉంటే మనం  ఆధ్యాత్మిక మార్గంలోనుండి చాలా సులభంగా ప్రక్కకు తప్పిపోతాము.

(మంచి విషయాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List