13.12.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
(రెండు వారాలుగా వ్యక్తిగత పనుల వత్తిడివల్ల ప్రచురించలేకపోయాను. కాని ఈ నెలంతా పనుల వత్తిడి, ప్రయాణాలు కూడా ఉండటం వల్ల వీలును బట్టి ప్రచురిస్తూ ఉంటాను... త్యాగరాజు)
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 3 వ.భాగమ్
10.04.1971 “ప్రతివారు ‘సమరస’ సూత్రాన్ని అనుసరించాలి. అనగా అందరితోను సామారస్యంగా మెలగుట. కుల మత వర్గ విభేదాలు లేకుండా ఇరుగు పొరుగువారితో
సఖ్యంగాను. ప్రేమతోను మెలగాలి. వారికి మనం
సహాయం చేయలేకున్న కనీసం వారి యోగక్షేమాల గురించయినా విచారిస్తూ ఉండాలి.
డబ్బు పోగుచేసుకోవడమొక్కటే ధర్మసూత్రం కారాదు. ఇతరులకు సేవకోసం కూడా వినియోగిస్తూ ఉండాలి. నిజమయిన సాయిభక్తుడు నిస్వార్ధంగా అందరినీ ప్రేమిస్తాడు.
15.04.1971 ఒక భక్తుడు స్వామీజీని ఈవిధంగా ప్రశ్నించాడు. “మీభారములను నాపై పడవేయుడు నేను మోసెదను” అని బాబా
అన్నారు కదా, దాని యొక్క అర్ధం వివరించండి.”
దానికి సమాధానంగా స్వామీజీ ఎవరయినా సరే తన విధిని నిర్వర్తిస్తున్నపుడు పూర్తిగా
తనకు తాను బాబాకు సర్వశ్య శరణాగతి చేయాలి.
అపుడు మన యోగక్షేమాలన్నిటినీ బాబాయే చూసుకుంటారు. శ్రీకృష్ణపరమాత్మ గీతలో అనన్న్యాశ్చింతయంతోమాం….” (అ.9 శ్లో.22) అని చెప్పాడు. దానియొక్క అర్ధం, ఎవరయినా తనకు
తాను భగవంతునికి సర్వశ్యశరణాగతి చేసుకున్నయెడల ఆయన మనలను కాపాడుతాడు. (పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును)
అటువంటి వ్యక్తిని భగవంతుడు నిశ్చయంగా రక్షిస్తాడు.. కాని మనం ఏమిచేస్తున్నాము? కష్టాలు వచ్చినపుడె భగవంతుడిని గుర్తు చేసుకుంటున్నాము. అది పధ్ధతికాదు. మన ప్రారబ్ధ కర్మను బట్టే మనకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాని, మనము బాబాకు సర్వశ్య శరణాగతి చేసి మన కర్తవ్యాన్ని
మనం నిర్వహిస్తే మనకు ఎటువంటి అడ్డంకులు ఎదురవకుండా ఆయన మనలని తప్పక కనిపెట్టుకుని
ఉంటారు. మనకి ఏది మంచో అదే మనకు లభింప చేస్తారు. కాని, ప్రత్యేకంగా దేనికోసమూ ఆయనని ప్రార్ధించుకోనక్కరలేదు. ఆయన మనలని కాపాడుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతీదీ ఆయనకే వదలివేయడం మంచి పధ్ధతి.
19.04.1971 కొంతకాలం క్రితం స్వామీజీ ఊటీలో ఉన్నపుడు తన అనుభవాన్ని
వివరించారు. ఆయన ఇంటి ప్రక్కనే ఒక శాస్త్రిగారు
ఉండేవారు. ఆ శాస్త్రిగారికి వివాహం కావలసిన
యిద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కుమార్తెలకు
వివాహం కావటంలేదని తన కష్టాలన్నీ స్వామీజీతో చెప్పుకున్నారు. ఆయన కుమార్తెలిద్దరూ ఎక్కువ సమయం వార్తాపత్రికలను
చదవడంలోనే వృధాగా గడిపేస్తూ ఉండేవారు. శాస్త్రిగారి
కుటుంబంతో కాస్త చనువు పెరిగిన తరువాత స్వామీజీ గారు వారిద్దరినీ మీకింతవరకు వివాహం
ఎందుకు కాలేదని ప్రశ్నించారు. మా నాన్నగారు
ఎంత ప్రయత్నించినా ఏమీ ఫలితం కలగటంలేదని ఆ అమ్మాయిలిద్దరూ సమాధానమిచ్చారు. అపుడు స్వామీజీ ఆ విధంగా సమాధానం చెప్పద్దు. మొదటగా మీరు ఆ వార్తాపత్రికలు చదువుతూ సమయాన్ని సోమరిగా
గడపద్దు. పత్రికలు చదివినందువల్ల మీకు ఎటువంటి
లాభం కలగదు. దానికి ప్రతిగా ఈ రోజునుండి
25 రోజులపాటు ప్రతిదినం విష్ణుసహస్రనామం పారాయణ చేయండి. మీ యింటిముందున్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు
చేయండి. మీ వివాహం కోసం మీవంతు ప్రయత్నం మీరు
కూడా చేయడం మంచిది. మీకు పెద్ద వయసు వచ్చిన
తరువాత మిమ్మల్ని కనిపెట్టుకుని చూసేదెవరు?”
అన్నారు. మీరు చెప్పినట్లే చేస్తామని
స్వామీజీతో చెప్పారు యిద్దరూ. ఆ తరువాత స్వామీజీ
అమ్మాయిలిద్దరికీ వరుడి కోసం పత్రికలలో ప్రకటన ఇవ్వమని తండ్రితో చెప్పారు. ఆఖరికి పెండ్లి గురించి మాట్లాడుకోవటానికి పత్రికా
ప్రకటనలు చూసి కొంతమంది వచ్చారు. శాస్త్రిగారి
యింటిప్రక్కనే స్వామీజీ గారు నివసిస్తున్నందువల్ల తమ కుటుంబాలకి తగిన సంబంధం అవునా
కాదా అని తెలుసుకోవడానికి స్వామీజీ గారిని వరుల తల్లిదండ్రులు సంప్రదించేవారు. స్వామీజీ ఆ విధంగా వచ్చిన వారితో అమ్మయిలిద్దరూ
మంచి సాంప్రదాయం కలవారని, పెళ్లయిన తరువాత మంచి గృహిణులుగా బాధ్యతలను నిర్వర్తించగలరని
తనని సంప్రదించినవారందరికి చెప్పారు. కొంతకాలం
తరువాత యిద్దరమ్మాయిలకి వివాహమయింది. శాస్త్రిగారు
చాలా సంతోషించారు.
స్వామీజీ యింకా యిలా
చెప్పారు. “ఒకసారి శివుడు తనతో కూడా పార్వతిని రమ్మన్నాడు. అపుడు పార్వతీదేవి తను భగవన్నామ స్మరణ చేసుకుంటున్నాననీ,
అందువల్ల మధ్యలో నామస్మరణను ఆపి రావడం కుదరదని చెప్పింది. అపుడు శివుడు “శ్రీ రామరామ రామేతి రమే రామే మనోరమే----“
అనగా రామనామాన్ని ఒక్కసారి ఉఛ్ఛరించితే చాలు.
విష్ణుసహస్రనామాన్ని పూర్తిగా పఠించనక్కరలేదు” అని అన్నాడు.
ఇక్కడ మనం ఒక ముఖ్యమయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరయినా అంతటి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నారా? కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు.”భగవంతునియొక్క వేయి
నామాలను ఉఛ్ఛరించాలా? ఆయన పేరును ఒక్కసారి
ఉఛ్ఛరిస్తే చాలదా?” అని. మనం ఆధ్యాత్మికంగా అటువంటి అతున్నత స్థాయికి చేరుకుని ఉన్నట్లయితే
భగవంతుని నామాన్ని ఒక్కసారి స్మరణ చేస్తే చాలు.
అలాగే మనం యింటిలో ఆధ్యాత్మిక సాధన చేయలేమా? కాని మనకు యింటిలో ఏదో విధంగా మన సాధనకు అంతరాయాలు
ఎల్లపుడూ కలుగుతూనే ఉంటాయి. అటువంటి వాతావరణంలో
సహజంగానే మన మనస్సు భగవంతుని గురించి ఆలోచించదు.
అటువంటప్పుడే మన మనస్సు ప్రశాంతంగా నిశ్చలంగా భగవంతుని గురించిన ఆలోచనలతోనే
ఉండాలంటే దానికి తగిన వాతావరణం మనకు గుడిలోనే లభిస్తుంది. ఈ ప్రపంచంలో మనం దేనియందూ వ్యామోహాన్ని పెంచుకోకుండా
బ్రతకాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అనగా దేని
గురించీ పట్టించుకోకుండా కేవలం మనసు భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే ఆఫీసులో పని చేసే వ్యక్తి తన
ఆఫీసు గోడలు తెల్లగా లేకున్నా, ఆఫీసు భవనానికి మరమ్మత్తులు ఏమన్నా చేయించవలసి ఉన్నా
ఏమీ పట్టించుకోకుండా తన పనిమీదనే మనసు లగ్నం చేస్తాడు. అదే విధంగా మనం గుడికి వెళ్ళినపుడు గుడిలోని అధికారులు
మనలని గుర్తించారా లేదా? మనం రాగానే ఆహ్వానం పలికారా లేదా అనేది పట్టించుకోకుండా మనం
భగవంతుని గురించే వచ్చాము కాబట్టి ఆవిషయం మీదనే మనసును లగ్నం చేసుకుని ఉండాలి. ఇపుడు ఉత్పన్నమయే ప్రశ్న --- మనం ఈ ప్రపంచంలో ఏవిధంగా జీవించాలి? ఈ ప్రశ్నకి సమాధానం – మన శరీరాన్నే ఒక దీపంగా మార్చుకోవాలి. భక్తి అనేది చమురు అయితే మన హృదయం వెలిగే వత్తి.
(ఇంకా మరికొన్ని మంచి విషయాలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment