Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, February 4, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 6 వ.భాగమ్

Posted by tyagaraju on 8:00 AM
Image result for images of shirdi sai baba hd
Image result for images of rose hd

04.02.2018 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.     ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు.  సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
 Image result for images of radhakrishna swamiji
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 6 వ.భాగమ్

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

15.06.1971 : స్వామీజీ – “మనము యిక్కడికి భగవంతుని గురించి మాట్లాదుకోవటానికి మాత్రమే వచ్చాము.  అటువంటప్పుడు మనం ఇతరులలోని దోషాలను ఎపుడూ గమనించరాదు.  బీదవారికి, ధనికులకి మధ్య భేదాలను చూడరాదు.  మంచి, చెడు, సత్ప్రవర్తన, దుష్ప్రవర్తన వీటిలోని తారతమ్యాలను కూడా గమనించరాదు.  భగవంతుడు అటువంటి వ్యత్యాసాలను చూడడు.  భగవంతుడు ‘సమత్వభావన’ కలిగి ఉంటాడు.  అనగా ఆయన దృష్ష్టిలో అందరూ సమానమే.  


ఎవరయినా ఇతరులలో అటువంటి వివక్షతను గమనించినట్లయితే బాబా చెప్పిన తమో, రజ, సత్వ గుణాలకన్నా యింకా క్రింది స్థాయిలోనే ఉంటాడు.  ఈ మూడు గుణాలను అధిగమించి ముందుకు సాగాలి.  1922 వ.సంవత్సరంలో నేను తిరువణ్ణామలై వెళ్ళినపుడు శేషాద్రిస్వామి గారిని కలుసుకున్నాను. 
                                         Image result for images of seshadri swamigal
నేను ఆయన వద్దకు వెళ్లగానే ఆయన మూడు రాళ్ళను ప్రక్కకు పెట్టి ‘వీటిని వండి తిను’ అన్నారు.  ఆ తరువాత నేను శ్రీరమణ మహర్షి గారితో ఈ విషయం గురించి చెప్పాను.  అపుడాయన శేషాద్రిగారు చేసిన చర్యకు అర్ధాన్ని యిలా వివరించారు.  “తమ, రజ, సత్వ ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండాలి నువ్వు అని ఆయన నీకు ప్రబోధించారు” .  బాబా కూడా ఇదే సందేశాన్నిచ్చారని (మూడు గుణాలను అధిగమించాలని) శ్రీ నరసింహస్వామిగారు నాకు వివరించారు.  కాని నరసింహస్వామిగారి అభిప్రాయం ప్రకారం మూడు లోకాలనగా భూ, భువః, సువః.  సాధారణ మానవులయొక్క ఆలోచనలు అతని కడుపు చుట్టూ కేంద్రీకృతమయి ఉంటాయి.  అది భూలోకం – అనగా భూమి.  కాని మానవుడు దానికన్నా అత్యున్నత స్థానమయిన భువర్ లోకాన్ని చేరుకోవడానికి శ్రమించాలి.  అదే హృదయ స్థానం.  (ఆధ్యాత్మిక హృదయం).  చివరికి సువర్ లోకాన్ని చేరడానికి ప్రయత్నించాలి.  సువర్ లోకమనగా రెండు నేత్రాలమధ్యనున్న స్థానం.  ఈ అభివృధ్ధిని సాధించాలంటే ఒక గురువుయొక్క సహాయం అవసరం.  భగవంతుని చేరుకోవాలనే తపన ఉన్నవాడికి గురువే ముందుకు నడిపిస్తాడు.  అందువల్లనే గురువుయొక్క పాత్రకు అత్యున్నతమయిన గౌరవం యివ్వబడింది.  అందుచేత మహామహిమాన్వితులయిన గురువులయొక్క ఆశీర్వాదాన్ని, దీవెనలను అందుకోవడానికే గురుపూర్ణిమను జరుపుకొంటున్నాము.  ఇంకా మనము భగవంతునికి సర్వశ్య శరణాగతి చేసుకున్న యెడల మోక్షాన్ని పొందగలము.  కిరాతకుడయిన వాల్మీకి “రామ, రామ అనడానికి బదులుగా “మరా, మరా అని జపించి మహామునిగా ప్రసిధ్ధి చెంది 24,000 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు.  వాల్మీకి మహర్షిగా ప్రసిధ్ధి చెందాడు.  
          Image result for images of valmiki

పురందరదాసు “నిన్న నమద బలవోన్ దిద్దరే సకో అని చెప్పాడు.  అనగా ఆయన (భగవంతుని) యొక్క నామానికున్న శక్తే చాలు మనకి.  అపుడు మనం ఇతరులలోని దోషాలను ఎంచకూడదు.  బాబా బోధించిన విధానం కూడా అదే.  ఈసందర్భంగా ఒక భక్తుడు “కామాన్ని జయించినా, క్రోధాన్ని మాత్రం జయించలేము.  అపుడు మనమేమి చేయాలి?” అని ప్రశ్నించాడు.  దానికి సమాధానంగా స్వామీజీ “ ఈ దుష్టగుణాలను మనము పూర్తిగా విసర్జించదగినవి. 
                         Image result for images of kama krodha

           Image result for images of kama krodha
      Image result for images of kama krodha
      Image result for images of kama krodha
       Image result for images of kama krodha

అత్యాశ గాని కోరిక గాని పెద్దపులిలాంటిది.  పెద్దపులి తన దారిలోకి వచ్చిన ప్రతీ జంతువుమీద దాడి చేస్తుంది.  ఆవిధంగా ఏకోరికయినా సరే హానికరమయినది.  కోరికలు అనంతం.  వాటికి అంతం అనేది ఉండదు.  అదేవిధంగా లోభమనేదాన్ని ఎలుగుబంటితో పోల్చవచ్చు.  ఎలుగుబంటి ఎపుడూ ఫలాలను, తేనెను సేకరించి తన గుహలో నిల్వ చేసుకుంటుంది.  మనం కూడా సరిగ్గా అదేవిధంగా లోభంతోను దురాశతోను సంపదలను, ఆస్తులను కూడబెట్టుకుంటూనే ఉంటాము.  కాని మనం ఈ చెడు లక్షాణాలగురించి ఎందుకని బాధపడాలి?  మనం వాటిని జయించడం చాలా కష్టం.  అది నిజమే.  అందువల్ల మనం చేయవలసినదేమిటి?  మనము ఆభగవంతుని శరణు వేడుకొని ఈ విధంగా ప్రార్ధించాలి.  “హే భగవాన్!  నువ్వే నన్ను కనిపెట్టుకుని నాయోగక్షేమాలను చూస్తూ ఉండాలి.  ఈవిధంగా చేస్తే చాలు. 
 Image result for images of kama krodha

21.06.1971 :    ఆధ్యాత్మిక జీవితంలో గురువుయొక్క పాత్ర గురించి స్వామీజీ వివరించారు.  దానికి సంబంధించిన వ్రాతప్రతిని చదివి వినిపించారు. 
 జీవితం భౌతిక విషయాలతోను,  ఆధ్యాత్మిక విషయాలతోను కూడి ఉంటుంది.  ఆధ్యాత్మిక అంశం నిస్సందేహంగా చాలా గొప్పది.  పునాదిలేకుండా ఏభవనమూ నిలబడదు.  ఆవిధంగా భవనానికి పునాదిలాగా మానవ జీవితానికి ఆధ్యాత్మిక జీవనం పునాది.  ఆధ్యాత్మిక జీవితం అభివృధ్ధి చెందాలంటే గురువు ఆవశ్యకత ఎంతయినా ఉంది.  మనం గురువుని ఏవిధంగా సేవించగలం?  భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ “ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా-----“ అని చెప్పాడు.  జ్ఞానాన్ని సంపాదించాలంటే గురువుని జిజ్ఞాసతో ప్రశ్నిస్తూ ఆయన సేవ చేసుకోవాలి.  గురువు అనగా ఎవరు?  దైవసంబందమయిన జ్ఞానాన్ని విశదీకరించి తెలియచేసేవాడే గురువు.  గురువు లేకుండా ఏవిషయాన్ని మనం నేర్చుకోలేము. అదీ ముఖ్యంగా నిజమయిన ఆధ్యాత్మిక జ్ఞానం.  గురువునే భగవంతునిగా పరిగణించాలి.  గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.  సర్వశ్రేష్టుడయిన పరబ్రహ్మ.  “గురుబ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్ దేవో మహేశ్వరః----“ శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకొనండి.  అది ఎంతో అర్ధవంతమయినది. 

02.07.1971  :  గురువుయొక్క ఆవశ్యకతను గురించి స్వామీజీ వివరిస్తూ ఈ విధంగా అన్నారు.  “చూడండి.  అసాధారణమయిన ప్రతిభ గలవారికి గురువు అవసరం లేదు.  దానికి కారణం వారు అప్పటికే ఆధ్యాత్మికంగా ఉన్నతమయిన స్థానాన్ని పొంది ఉండటమే.  (మిగిలినవారు అటువంటి అత్యున్నతమయిన స్థానానికి చేరుకోవాలంటే ఎంతగానో కష్టపడాలి).  శేషాద్రిస్వామివారు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి.  ‘నేను’ కనక మరణిస్తే ప్రతివారు సంతోషంగా ఉంటారు.  అనగా దాని అర్ధం అహంకారం (నేను) నశిస్తే ప్రతివారు చాలా సంతోషంగా ఉంటారు.  రమణమహర్షిగారు కూడా “మనం ఎక్కడినుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళితీరాలి” అని చెప్పేవారు.  భగవానుడు చెప్పినదేమంటే “తత్వమిత్తు మహద్భాగో -- గుణకర్మ విభాగయోగం----“   “త్రిగుణాలు”  ఎవరయితే ఈ త్రిగుణాలను అధిగమిస్తారో వారు భగవంతునిలో ఐక్యమవగలరు.  వారు భగవంతునిగా మార్పు చెందుతారు.  ఆవిధంగా త్రిగుణాలను అధిగమించినవారిలో నెరూర్ గ్రామంలోని సదాశివ బ్రహ్మేంద్రగారు ఒకరు.  మొత్తాం విశ్వమంతా (I) నేను నుండి ఉద్భవంచిందని తెలుస్తుంది.  కాని ఇక్కడ ‘నేను’ ( I ) అన్నది మనలో ఉన్నటువంటి చిన్నపాటి అహంకారం కాదు.  అది ‘ఆత్మ’.  ఆ ఆత్మనుండే అన్ని జీవులు జన్మించాయి. ( ఆవిధంగా బాబా “నాయందెవరి దృష్టి కలదో వారియందే నాదృష్టి అని చెప్పారు.  ఇక్కడ ‘నేను’ అన్నదానికి అర్ధం ఏమిటి? ఇక్కడ 'నేను' అన్నదానిని తక్కువ చేసి చూపడంకాదు.  కాని ‘నువ్వు’ అన్నది మాత్రం తక్కువగా చేసి చెప్పడం.  కాని ‘నేను’ అనగా ఆత్మ.  మనమంతా చేయవలసినదేమిటంటే మనలోఉన్న ఆత్మని మేలుకొలపాలి.  ఆవిధంగా చేసినట్లయితే మనలో ఉన్న ఆత్మ స్పష్టమవుతుంది. 
(నేను, ఆత్మ, పరమాత్మ -  దీనికి సంబంధించిన వీడియో చూడండి)

‘ఆత్మ’ సకల జీవరాసులలోను ఉంటుంది.  కాని ఆ ఆత్మని మనం ప్రకాశింప చేయాలి.  మనలను ముందుకు నడిపించేది, రక్షించేది మనలో ఉన్న ఆత్మే.  మనలో ఉన్న ఆత్మని ప్రేరేపించాలంటే నిరంతరం భగవన్నామస్మరణ చేసుకుంటు ఉండాలి.  క్రమం తప్పకుండా విష్ణుసహస్రనామ పారాయణ కనక చేస్తూ ఉన్నట్లయితే కామ,క్రోదాలు మరేయితర చెడు లక్షణాలతో ఉన్నవాడినయినా వెనుకకు పట్టిలాగి సరియైన మార్గంలో నడిపిస్తుంది.

(స్వామీజీ అనుగ్రహ భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List