Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 18, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 12 వ.భాగమ్

Posted by tyagaraju on 8:10 AM

Image result for images of flower garland

   Image result for images of shirdisaibaba and ugadi
        Image result for images of shirdisaibaba and ugadi


18.03.2018 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ శ్రీ విలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు

సాయి బంధువులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించి నిరంతరం మనలనందరినీ కంటికి రెప్పలా కాపాడమని సాయిబాబాని ప్రార్ధిస్తున్నాను.

ఈ రోజు నూతన తెలుగు సంవత్సర సందర్భముగా సాయి బంధువులందరికీ స్వామీజీ గారి అనుగ్రహ భాషణములో కొంతయినా ఇద్దామని ప్రయత్నం చేసాను.  సమయా భావం వల్ల ఎక్కువగా ఇవ్వలేకపోయాను.  తరువాతి ప్రచురణలో మరికాస్త ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.  --- సాయిరామ్

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.  రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు.  సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.


తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 12 .భాగమ్
09.11.1971   ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి సర్వతోముఖమయిన దృక్పధం ఏవిధంగా ఉంటుందో స్వామీజీ వివరించారు.  ఆత్మజ్ఞానికి ద్వైతము, అద్వైతము, విశిష్టద్వైతము మొదలయిన తారతమ్యాలు ఏమీ ఉండవు.  ఆవిధంగా బాబా కూడా వాటి తారతమ్యాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు.  ఆయన అన్ని సాంప్రదాయాలను, మతాలను ఒక్కటిగానే భావించారు.  


ఆయన తరచుగా నాయందెవరి దృష్టి కలదో, వారియందే నాదృష్టిఅనేవారన్న విషయం మనందరికీ తెలుసు. అనగా దాని భావమేమి?  ప్రపంచాన్ని వీక్షించు.  అంతా నారాయణ అంశమే.  అనగా నువ్వు కూడా ఆనారాయణుని అంశం”.  ఇక వ్యావహారికంగా ఆలోచిస్తే అందరి హృదయాలలో ఉన్నది ఆ నారాయణుడేఅనే భావనతో ఉండాలి.  ఇదే విశ్వవ్యాప్త దృక్పధం.  మొట్టమొదటగా నిన్ను నువ్వు పవిత్రునిగా మలచుకో.  ఆతరువాత ఇతరులను పవిత్రం చేయడానికి ప్రయత్నం చేయి.  అనగా మనలో ఉన్న దోషాలను నిర్మూలనం చేసుకోకుండా యితరులలోని దోషాలను ఎంచి వారిని దోషరహితులుగా మార్చగలమా?  స్వామి వివేకానంద చెప్పినట్లుగా ప్రతిఒక్కరూ జాగరూకతతో ఉండాలి.  భగవంతుని దృష్టిలో అందరూ సమానులే.  ఆయన దృష్టిలో ధనికులు, బీదలు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు, తక్కువ స్థాయిలో ఉన్నవారు అనే భేదాలు ఏమాత్రం లేవు.  ఎటువంటి భేదము లేకుండా సూర్యరశ్మి ప్రతిఒక్కరి మీదా ఏవిధంగానయితే ప్రసరిస్తుందో అదేవిధంగా భగవంతుని దయ కూడా ప్రసరిస్తుంది.  భగవంతుడు ఎంతో దయకలవాడు.  గీతలో భగవానుడు చేసిన గీతోపదేశం.
                           Image result for images of geethopadesam

అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్
సాధురేవ మంతవ్యః సమ్యగ్వ్యవస్తితో హి సః

మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును.  ఏలనన యధార్ధముగా అతడు నిశ్చయబుధ్ధి కలవాడు.  అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు.  
(అ.9 శ్లో.30)

అనగా పాపాత్ముడయినా ఆభగవంతుని పాదాలవద్ధ శరణాగతి చేసినట్లయితే ముక్తి లభిస్తుంది.  అనగా కష్టాలు వచ్చినపుడే సంకట బందగ వెంకటరమణుని (కష్టాలు వచ్చినపుడే వెంకటరమణుని ప్రార్ధించకుండా) ప్రార్ధించడం కాకుండా నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూనే ఉండాలి.  

పాండవుల తల్లి కుంతీదేవిని శ్రీకృష్ణుడు ఏమి వరం కావాలో కోరుకోమని అడిగినపుడు ఆమె “ఓ కృష్ణా నేను నిన్నెపుడూ మరువకుండా ఉండేలాగ నాకెప్పుడూ కష్టాలనే యివ్వు” అని ప్రార్ధించింది.  దాని అర్ధం ఏమనగా మనం సుఖసంతోషాలలో మునిగి ఉన్నపుడు ఆయనను మర్చిపోతాము.  ఆయనను మర్చిపోకుండా ఉండాలంటే మనకు కష్టాలు ఉండటమే మంచిది.  మనము భగవంతుని స్మరించుకుంటూ ఉండటానికి ప్రతీ ప్రయత్నం చేయాలి.  మనకంత సమయం ఎక్కడ ఉంది?  సినిమాలు చూడమని, వారపత్రికలు, దినపత్రికలు చదవమని ప్రోత్సహించే సమాజంలో బ్రతుకుతున్నాము.
 (ఈ రోజుల్లో పుస్తకపఠనం కూడా తగ్గిపోయి దూరదర్శన్ కార్యక్రమాలు వీక్షించడంతోనే సమయం గడిచిపోతూ ఉంది.  ఇక భగవంతుని గురించి తీరికగా ఆలోచించే సమయమే మిగలటంలేదు.  విశాఖపట్నంలో ఒక కాలనీలో చిన్న బాబా మందిరం ఉంది.  అక్కడ ఒకాయన ప్రవచనం ఇస్తూ ఉంటే చుట్టుప్రక్కల ఉన్న యిండ్లలోని వారు తమ తమ యింట్లో టి.వి. లు చూసేవారు కొందరయితే మరికొందరు మైక్ లో ప్రవచనం వినపడుతోంది కదండి.  ఇంట్లోనే కూర్చుని వింటున్నాము అన్న జనాలు కూడా ఈ సమాజంలో ఉన్నారు.  స్వామీజీ గారి కాలంలో మనదేశంలో టి.వి. లు లేవు మరి.)
ఈ పత్రికలు, పుస్తకాలు భగవంతుని గురించి తెలిపేవయితే వాటిని చదవడం సమర్ధింపదగినదే.  ప్రతిరోజు సాయంకాలం భగవంతుని నామజపం చేసుకోవడం ఆవశ్యకం.  అలా కాకుండా సినిమాకి వెడదామనే ఆలోచన ఉన్నట్లయితే అది మనలను భగవంతుని నుంచి దూరం చేస్తుంది.  లక్ష్మీదేవికి ప్రతీక అయిన గోమాతను పూజించడం మన ధర్మం. 
                              Image result for images of gopuja
మీకు సుఖసంతోషాలు, సంపద, అన్నీ కావాలనుకుంటే గోవును పూజించండి.  ప్రజలలో ఇటువంటి మంచి ఆలోచన ఉన్నట్లయితే గోవులను కబేళాలకు అమ్మివేసే సందర్భం రాదు.  ప్రతివారికి మనము సానుకూల దృక్పధంతో బోధించవలసినది ఏమిటంటే “గోవును పూజించండి” అని.  
                          Image result for images of gopuja
అంతే కాని ప్రతివారికి మనము “గోవును వధించండి” అని చెప్పనవసరం లేదు.  సానుకూలమయిన భావనతో చెప్పినట్లయితే దాని ఫలితం ఎంతో సమర్ధవంతంగా ఉంటుంది.  గోపూజ చేయడమంటే అదే గొప్ప తపస్సు.

(స్వామీజీ సంభాషణలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment