Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, February 18, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 2 వ.భాగమ్

Posted by tyagaraju on 2:47 AM

          Image result for images of shirdi baba
                  Image result for images of beautiful flower

18.02.2019  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 2 .భాగమ్

YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS

తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు

దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి.  దీనిలోని భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్

బహుశ సంఘటన ద్వారానే బాబా మరల నన్ను తన అధీనంలోకి తీసుకొన్నారు.  ఆక్షణం నేనెన్నటికీ మర్చిపోలేను.  బాబా నాకు చాలా దగ్గరగా ఉన్నారనే అనుభూతి, అది ఆయన నామీద చూపించే స్వచ్చమయిన ప్రేమ అనే భావనలు నాలో కలగడానికి కారణమయిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి.  ఆయన ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు లేవు.  ఆయన ఉపదేశాలను వర్ణించడానికి కూడా సాధ్యం కాదు.  వాటికి కొలమానం లేదు.  అవి అపరిమితం.  కారణం ఏమిటంటె ఆయనకు నాహృదయం, మనస్సు, అన్నీ అవగతమే.  నాలో ప్రాణంగా ఉన్నది ఆయనే కాబట్టి.  వర్ణించనలవి కాని ప్రేమను ఆయన నా హృదయంలో నింపారు.


బాబా తను మాట్లాడవలసిన అవసరం లేకుండానే నాకు సందేశాలను ఇస్తూ ఉంటారు.  ఆయన నాతో మాట్లడకపోయినప్పటికి నేను వాటిని జాగ్రత్తగా ఆలకించాలి సాధారణ భక్తునికి అల్లాతో అనగ  నా ప్రియమయిన షిరిడీ బాబాతో కలిగిన చిన్న చిన్న అనుభవాలు ఇవి.  నేను అల్లా, బాబా , భగవంతుడు, అని ప్రస్తావించినా బాబా అందరికన్న ఎక్కువ.

నాకు 34 సంవత్సరముల వయసులో కాన్సర్ వ్యాధి సోకింది.  ఆరకమయిన కాన్సర్ చాలా అరుదు (నాసోఫారిన్జియల్ కార్సొనోమా).  అటువంటి వ్యాధి గురించి ఎప్పుడూ వినలేదు కూడా.  ఆరకమయిన వ్యాధి నాకు వచ్చినందుకు వైద్యనిపుణలనే గందరగోళ పరిచింది.  3 నెలలపాటు సర్జరీ, రేడియో థెరపీ అయ్యాక నా     బరువు 23 కే.జీ. లకి తగ్గిపోయింది.  నిరంతరం భరించలేని గొంతు నొప్పితో జీవనం సాగించాను.  రేడియోథెరపీ వల్ల కాన్సర్ కణాలన్నీ నాశనమయి ఉండవచ్చు, కాని సంవత్సరాలు గడేచే కొలదీ వైద్యం వల్ల కలిగిన దుష్ప్రభావాలు నాశరీరానికి ఎంతగానో హాని కల్గించాయి. 

దుష్ప్రభావాల కారణంగా నానోటిలో లాలాజలం ఊరడం ఆగిపోయి నోరంతా పొడిగా అయిపోయింది.  నా దంతాలు బలహీనపడిపోయాయి.  ఆహారాన్ని కూడా నమిలి మ్రింగలేని పరిస్థితి కలిగింధి.  ఏది తినాల్సివచ్చినా దానిని మెత్తగా నలిపి బాగా గుజ్జులాగ చేసి మ్రింగవలసిందే.  నాకళ్ళు పొడిగా అయిపోయాయి.  ముక్కులో స్రావాలు ఆగిపోయి ముక్కు కూడా పొడారిపోయింది.   వేసవికాలపు రోజులలో నోటినుంచి గాని, ముక్కునుంచి గాని రక్తం వస్తూ ఉండేది.  ఇటువంటి చిన్న చిన్న దురవస్థలన్నీటినీ అనుభవిస్తూ నన్ను నేను నియంత్రించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నా గాని, అంతకు మించి దైవానుగ్రహం నామీద ఉన్న కారణంగానే నేను బ్రతికి ఉన్నాను.

2012 .సంవత్సరం అక్టోవర్ 5 .తారీకున నేను 66 .సంవత్సరంలోనికి అడుగుపెట్టాను.  నా ఉద్యోగవిధి నిర్వహణలో కూడా నాకున్న అనారోగ్య పరిస్థితులలో బాబా నాకు మార్గదర్శిగా ఉండి నాజీవితంలో ఎంతో సహాయపడ్డారు.  నేను అనారోగ్యం పాలయినా ఆరోగ్యంగా ఉన్నా బాబా అనుగ్రహమే లేకపోయినట్లయితే నేను జీవించి ఉండేదానినే కాదు.
                  Image result for images of shirdi baba

2010.సంవత్సరం ఆగస్టు 13.తారీకున నాకు దంతాలకి సంబంధించిన సర్జరీ జరిగింది.  సర్జరీ జరుగుతున్నంతసేపు బాబా నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ మరుసటి రోజంతా ధ్యానంలోనే గడిపాను.  మవునంగా ధ్యానంలో ఉన్న సమయంలో నాలో ఎన్నో ఆలోచనలు, కలిగాయి.  వాటిలో మొట్టమొదటిది, “ఇన్ని సంవత్సరాలుగా భగవంతుడు నాకు ఎందుకని జీవితాన్ని ప్రసాదించాడు.  నాగురించి ఆయన మనసులో ఒక ఉద్దేశ్యం ఏదో ఉండి ఉండవచ్చు.  బహుశ నాద్వారా ఆయన ఒక మహత్కార్యాన్ని చేయించదలచుకున్నారేమో”.  నాఆలోచనలు సంవత్సరాల వెనుకకి మళ్ళాయి.  అపుడు నాలో కలిగిన ప్రశ్నలకు, “నేనెవరిని, నేనీ ప్రపంచంలో ఎందుకని ఉన్నాను?”.  ఇటువంటివాటికన్ని సమాధానాలే ప్రస్తుతం,  “నా పరిస్థితి ఏమిటి?  ఇపుడు నేనెవరిని?”

నేను వ్రాసిన మొదటి పుస్తకం I AM ALWAYS WITH YOU (IAAWY) 2006 .సంవత్సరంలో ముద్రింపబడినా కూడా, బాబాతో నా అనుబంధం ఏర్పడటానికి గల కారణాలను ఎందుకని వివరిస్తున్నానంటే, ప్రజలనుంచి నాకింకా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  ఉదాహరణకి, షిరిడీ బాబాతో నీకనుభవాలు ఏవిధంగా కలుగుతున్నాయి.  నువ్వు హిందువువి కాదు.  నీకాయన గురించి ఏమి తెలుసు?" మొదలయిన ప్రశ్నలు. 
                              Image result for images of shirdi baba

ప్రశ్నలన్నిటికి నా సమాధానం --- నేను క్రిస్టియన్ ని కాను, ముస్లిమ్ కాను, హిందూ లేక జ్యూ కాను.  నేను నేనే.  విశాలహృదయంతో నేనందరినీ ప్రేమిస్తాను.  అందరి మతాచారాలని, అన్ని మతాలను, సంస్కారాలని గౌరవిస్తాను. 

నాకు బాబా గురించి తెలియదు.  ఆయనతో నాకు అనుభవాలు మాత్రమే అనుభవంలోకి వచ్చాయి.  నేను బాబాని అర్ధం చేసుకోలేదు.  ఎవరు అర్ధం చేసుకోగలరు?  నాకు సంబంధించినంత వరకు నేను జీవించి ఉన్నందుకు బాబాకు నేనెంతో ఋణపడి ఉన్నాను

బాబా నాకు జీవితమంటే ఏమిటో చూపించారు.  నిరాడంబరంగా ఏవిధంగా జీవితం గడపాలో నేర్పారు.  (నా మతిమరపువల్ల పొరబాటు చేస్తూ ఉంటాను).  ఇన్ని సంవత్సరాలుగా నాకు జీవితాన్ని ప్రసాదించిన బాబాకు నేనెప్పటికీ కృతజ్ఞురాలినే.  నేను జీసస్ ని, బుధ్దుడిని అందరినీ గౌరవిస్తాను.  నాశ్వాస, నా హృదయం, నా ఆత్మ, నా ఆలోచనలు, నామాటలు, చేతలు అన్నీ షిరిడీ సాయిబాబాకే సమర్పణ.  జీవితంలో అన్నీ నేర్చుకుంటూనే ఉండాలి.  దానికి అంతమంటూ ఉండదు.  అన్నీ నేర్చేసుకున్నాము ఇక నేర్చుకోవలసినదేమీ లేదు అని అనుకోరాదు.  బాబా నాకు గొప్ప గురువు,  అంతేకాదు, ఆయన నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు.  నా జీవితమే నాషిరిడీ, నా షిరిడీయే నా జీవితం”.  తరచుగా నాకు కొన్ని ఒడిదుడుకులు తడబాట్లు ఏర్పడిన సమయాలలో నాకు దారి చూపమని, లేక సూచనలు ఇమ్మని కోరుకుంటూ ఉంటాను.  బాబా ఎపుడూ నాకు సహాయం చేస్తూనే ఉంటారు.  ఆయన నాకు ఓపికతో శిక్షణ ఇచ్చే గురువు.  ఆయనే నన్ను సరైన దారిలో నడిపించే ఆధ్యాత్మిక గురువు.  నాజీవితానికి వెలురురును ప్రసాదించే కారుణ్యమూర్తి. 

(తరువాతి అధ్యాయంలో 2005.సం.లో బాబాతో నేను)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List