Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 16, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ - 1 వ.భాగమ్

Posted by tyagaraju on 8:09 AM

      Image result for images of shirdisaibaba
            Image result for images of rose

16.02.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మన బ్లాగులో ప్రచురించి చాలా రోజులయింది.  ప్రచురించడానికి, సాయి భక్తుల మనస్సులను అధికంగా ప్రభావితం చేసే బాబా లీలలను ప్రచురిద్దామనే వెదకుతూ ఉన్నాను.  ఇంతకుముందు ఒక బ్లాగులోనివి ప్రచురిస్తూ వచ్చాను.  అందులోనివి అనువాదం చేసి ప్రచురిద్దామంటే అకస్మాత్తుగా సైట్ ఓపెన్ కాకుండా ఎఱర్ మెసేజ్ వస్తూ ఉండటం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది.  ఇక ఏమి ప్రచురిద్దామనే ఆలోచనలో ఉండగా లోరైన్ వాల్ష్ గారి “YOU BRING US JOY MERE KHWAJA, FRIENDSHIPS WITH GOD” పుస్తకాన్ని అనువాదం చేస్తే బాగుంటుందనిపించింది.  ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటారు.  ఆవిడకు బాబా ఇచ్చిన సందేశాలు ఆవిడ అనుభవాలు అన్నీ ఒక డైరీగా వ్రాసి ప్రచురించిన పుస్తకమ్.  ఆవిడకు మైల్ ఇచ్చి అనువాదమ్ చేయడానికి అనుమతి తీసుకుందామనే ఉద్దేశ్యంతో ముందుగా సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారిని సంప్రదించాను. అనువాదం చేసి బ్లాగులో ప్రచురించమని  ఆయన వెంటనే నాకు అనుమతినిచ్చారు.  కాని ఒక్క షరతు పెట్టారు.   పుస్తకం మొత్తం అనువాదం చేయకుండా కొన్ని కొన్ని మాత్రమే ప్రచురించమన్నారు.  అందులో ఉన్న భక్తుల అనుభవాలను కూడా ప్రచురించడానికి అనుమతినిచ్చారు.  వారికి నా ధన్యవాదములను తెలుపుకొంటున్నాను. ఇంతకు ముందు ఆయనకు బాబా గారు ఇచ్చిన సందేశాలను ఆయన డైరీ నుంచి సంగ్రహించి మన బ్లాగులో సాయిబానిస డైరీగా ప్రచురించాను.   


మొట్టమొదటి రెండు అధ్యాయాలను అక్కడక్కడ మాత్రమే అనువాదం చేసి ప్రచురిద్దామన్నా ఒక్క పేరా కూడా వదలడానికి వీలులేనిది.  ఆవిడ మీ బాబా అనుగ్రహం ఎంతగా ప్రసరింపబడి ఉన్నదో తెలపాలంటే ఆవిడ వ్రాసుకున్న ముందుమాటకు సంబంధించినదంతా తెలియచేయవలసినదే.  అందువల్ల కొన్ని కొన్ని వాక్యాలను వదలివేసి అనువాదం చేసి మీకు అందిస్తున్నాను. ఆమె వ్రాసిన అనుభవాలను, ఆవిడ జీవిత చరిత్రను చదివిన తరువాత బాబా ఆమెతో ప్రతి క్షణం ఎంత సన్నిహితంగా ఉంటారో మనకు అర్ధమవుతుంది.

బాబాను ఆమె ప్రశ్న అడిగిన వెంటనే ఏదో విధంగా జవాబులనివ్వడం 

చూస్తే బాబా తన అంకిత భక్తుల ఎడల ఎంతటి దయార్ద్ర హృదయులో 

మనకు అర్ధం అవుతుంది.  బాబా ఆమే ప్రక్కనే అదృశ్యంగా ఉన్నారనే  

విషయాన్ని మనం ప్రగాఢంగా విశ్వసించవచ్చు.

దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి.  దీనిలోని భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్


శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ - 1 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
                          
                      కృతజ్ఞతాభివందనాలు

బాబాకు నా ఆలోచనలు, నేను మాట్లాడే మాటలు, నేను చేసే పనులు అన్నీ తెలుసు.  అందుచేత పుస్తకంలో వ్రాసినదంతా కూడా బాబా సూచనల ప్రకారమే వ్రాయడం జరిగింది.  నేను కేవలం ఆయన ఎలా చెబితే అలా నడచుకునే మానవ మాత్రురాలిని మాత్రమే  నేను ఆయన చేతిలో ఒక సాధనాన్ని.  బాబా మీద నాకున్న ప్రేమంతా సహజసిద్దమయినది, సామాన్యమయినది.  నేను ఇంకే యితర సాధనాలను అభ్యసించి నన్ను నేను కష్టపెట్టుకోను.  దానికి కారణమేమిటంటే ఆయనే నా అల్లా మాలిక్, పరబ్రహ్మ.  నాహృదయంలో ఆయన ఎప్పటికీ కొలువయి ఉంటారు.

సర్వశ్యశరణాగతి చేసి బాబానే ఆశ్రయించుకున్న నేను పుస్తకాన్ని ఆయనకే అంకితం చేస్తున్నాను.  విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరునికి, దత్తాత్రేయునికి, మహాశివునికి, సరస్వతీదేవికి, దుర్గాదేవికి మరియు జీసస్ కి నా ప్రణామములను అర్పించుకొంటున్నాను.

తమ తమ అనుభవాలను పంపించిన ఎంతోమంది సాయిభక్తులకు ధన్యవాదములను తెలుపుకొంటున్నాను.  బాబా ప్రక్కనే ఎల్లప్పుడూ అంకితమయి ఉన్న శ్యామాలాగే పుస్తక ముద్రణ జరుగడానికి ఎంతో శ్రమ తీసుకుని ఓర్పుతో పూర్తిసహాయ సహకారాలనిందించిన నా స్నేహితురాలు రోషిణికి నా హృదయపూర్వక నమస్కారాలను అర్పించుకొంటున్నాను.  ఆమె సహకారమే లేనట్లయితే పుస్తక ప్రచురణ ఇంకా లస్యమయి ఉండేది.  ఎంతో ఓర్పుతో సహాయమంధించిన మరొక మిత్రుడు నితిన్ కి కూడా నాధన్యవాదాలు. 
మీకందరికీ కూడా నాధన్యవాదములు.

శ్రీ సాయి సత్ చరిత్ర 3.ధ్యాయములో బాబా పలిగిన మధురమయిన వాక్కులు

మీరెక్కడ న్నా సరే, మీ విషయాలన్నీ నాకు సంపూర్ణంగా తెలుస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి.  నేను నేను అని చెప్పే నేనే అందరిలోను ఉన్న అంతర్యామిని.  నేనే అందరి హృదయాలలోనూ ఉన్నాను.  అందరి స్వామిని నేనే.  సర్వ భూతాలలోను చరచరాలలో, బాహ్యాభ్యంతరాలలో నిండి ఉన్నాను.  సకలమూ ఈశ్వరుని సూత్రం.  నేను అతని సూత్రధారుణ్ణి.  నేను సకల ప్రాణులకు మాతను.  నేను త్రిగుణాల సామావ్యావస్థను.  కర్తా, భర్తా, సంహర్తా నేనే.  సకలేంద్రియాలను నడిపించువాడను నేనే.  నాయందు లక్ష్యమున్నవారికి ష్టాలుండవు.  నన్ను మరచిపోయినవారిని మాయ బాధిస్తుంది”.
                                
                       అవతారిక

బాబా నాకు కలిగించిన అనుభవాలు వివరించాలంటే అది అనితరసాధ్యం.  మీరు కూడా వాటిని అర్ధం చేసుకుంటారని నేను భావించడంలేదు.  కారణమేమిటంటె ప్రతివారి జీవిత ప్రయాణం వేరుగా ఉంటుంని బాబా ఉదహరించడమే కాకుండా ఆయనే స్వయంగా చెప్పారు. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమయిన కార్యాన్ని మనందరికీ నిర్దేశించారు.  కొందరిని ఆలయనిర్మాణానికి నియోగిస్తే, కొంతమందిని ధర్మకార్యాల నిర్వహణకి, మరికోదరికి రచనా వ్యాసంగాన్ని అప్పగించారు.  ఆయన నుగ్రహం ఆశీర్వాదబలంతోనే నేనీ పుస్తకాన్ని పూర్తిచేయగలిగాను.

నేను కలకత్తాలో, కాధలిక్ వంశంలో న్మించాను.  మాతాతగారు, అమ్మమ్మగారు ఇద్దరూ ఎంతో దయార్ద్ర హృదయులే కాక ఎంతో అణకువగలిగి ఉండేవారు.  దానధర్మాలయందు ఎంతో ప్రీతి.  వారికి అయిదుగురు సంతానం.  పదహారుమంది మనుమలు,మనుమరాండ్రు.  వీరందరిపోషణ భారం వారి మీదే ఉండేది.  అంతే కాదు పొరుగున ఉండే పేదలకి, వారి పిల్లలకి వారి మనుమలు మనుమరాండ్రలందరినీ కూడా అవసరానికి ఆదుకుంటూ ఊండేవారు.  నా మొట్టమొదటిగురువుమా తాతగారు. నేనాయననిఅంపాఅని పిలిచేదానిని.  మా తాతగారు ఎంతో దయగలిగిన మహానుభావుడు.  నిరాడంబరుయిన మా తాతగారి జ్ఞాపకాలు నాలో ఎంటో ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

1969 .సంవత్సరంలో మేము ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాము.  క్యాథలిక్ చర్చ్ మీద నాకు నమ్మకం.  ఆదివారాలు చర్చ్ కి వెళ్ళేదానిని.  నేనొక క్యాధలిక్ ని వివాహమాడాను.  మా కుటుంబమంతా క్యాధలిక్ కుటుంబం. 
వివాహమయిన 23 సంవత్సరాల తరువాత నేను, నా భర్త విడాకులు తీసుకున్నాము.  స్ట్రేలియాలో నివాసమేర్పరచుకున్న కొన్ని సంవత్సరాలకి నేను చర్చికి వెళ్ళడం మానేసాను.  నేను చర్చికి ఎందుకని వెళ్ళాలి?  నా ఇంటిలోనే భగవంతుడు ఉన్నాడు.  నేనాయనని ఇక్కడే పూజించుకోవచ్చు కదాఅనే భావంతో చర్చికి వెళ్ళడం మానేశాను.  ఆ సమయంలో నాకు కాన్సర్ కి వైద్యం కూడా జరుగుతూ ఉంది. ఇక చర్చ్ కి వెళ్ళడం పూర్తిగా మానేయడానికే నిర్ణయించుకున్నాను.  కాని జీసస్ ని, మేరీమాతని, ఇంకా పరిశుధ్ధులయిన వారిని పూజించడం మాత్రం మానలేదు.

శిష్యుని యోగ్యతను బట్టి గురువే వెతుక్కుంటూ వస్తాడు.  విధంగా నాగురువు, నా మార్గదర్శి, నా భగవంతుడు శ్రీ షిరిడీ సాయిబాబా నాజీవితంలోకి ప్రవేశించారు.  ఆయన నా జీవితంలోనికి ప్రవేశించేనాటికి నా వయస్సు 50 సంవత్సరాలు.

షిరిడి బాబా నాలో తన మీద ప్రగాడమయిన ప్రేమను కలిగించారు.  ఆయన ప్రేమ వల్ల నా మనసు ఎంతో నిర్మలంగా రూపు దిద్దుకొంది.  బాబాతో నాప్రశ్నల పరంపర కొనసాగింది.  ఇది నేను వర్ణించనలవికానిది. ఆయన అనుగ్రహాన్ని, శీర్వాదాలని, కటాక్షాన్ని పొందడానికే నేను న్మించానా అని అనిపించింది నాకు.  బాబావారి దివ్యానుగ్రహం ఏవిధంగా ఉంటుందంటె ఆయనది స్వచ్చమయిన ప్రేమ.  (బాబా మీద నాప్రేమ కూడా అటువంటిదే).
                   Image result for images of shirdi sainadh
 నేను బాబాని ఒక్కమాట అడిగితే చాలు.  బాబా నాకిచ్చిన అనుభవాలు, సూచనలు ప్రతి విషయంలోను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అనుగ్రహం, ఆశీర్వాదాలు నాకు కావాలి ఇంకా ఇంకా కావాలి అని తహతహలాడిన సమయాలలో కూడా నేనడిగిన ప్రతిఒక్క మాటకి కూడా నాకాయన సమాధానమిచ్చారు. నేనడిగిన ఏ ప్రశ్నకయినా సరే నాకు సమాధానమివ్వకుండా బాబా నన్నేప్పుడూ నిరాశ పరచలేదు.  బాబా నాకు స్వప్నంలో గాని, సూచనల ద్వారా గాని సమాధానాలు ఇస్తూ ఉంటారు.  ఒక్కొక్కసారి ఆయన నా ప్రశ్నలకు సమాధానాలను ఎంతొ ఉల్లాసంగాను, హాస్యపూర్వకంగాను ఇస్తారు. ఆయన ఇచ్చే సమాధానాలు నన్నెంతగానో ముగ్ధురాలిని చేస్తాయి.  ఆయన హాస్యధోరణిని నేను మెచ్చుకోలేకుండా ఉండలేను.



నాకు షిరిడీ సాయి ఎవరో తెలియని రోజులలో 16 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా సాయి సత్ చరిత్రను చదివినట్లు నాకు గుర్తు.  బాబా భగవంతుడు కావచ్చు, గురువు లేక మానవమాత్రుడయినా కావచ్చు, ఏది ఏమయినా సత్ చరిత్ర చదివిన వెంటనే నాకాయన మీద ప్రేమ ఉప్పొంగింది.  ఈ షిరిడీ సాయిబాబా ఎవరో నాకు తెలియకపోయినా నా హృదయమంతా ఆయన మీద ప్రేమతో నిండిపోయింది.  నేను సత్ చరిత్ర చదవడం పూర్తి చేసిన వెంటనే నా కళ్ళంబట ధారగా భాష్పాలు జాలువారడం నాకు స్పష్టంగా ఇప్పటికీ గుర్తే. 
                            Image result for images of woman holding sai sat charitra with tears.

ఎవరీ అత్యంత దయార్ద్ర హృదయులు షిరిడీ సాయిబాబా! నువ్వెవరో నాకు తెలియదు.  కాని, నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానుఅదే బాబాకు నాకు మధ్య అనుబంధం, స్నేహం ఏర్పడడానికి, కారణభూతమయిన సంఘటన.   బాబాతో నా అనుబంధం ఆ సంఘటన ద్వారా ప్రారంభమయింది.

(ఆసక్తికరమయిన సంఘటనలు ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

2 comments:

Lakshmi narayana reddy yaparla on December 18, 2019 at 8:41 PM said...

https://pothi.com/pothi/book/yaparla-lakshmi-narayana-reddy-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%8F%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82

శ్రీసాయి-ఏకాదశ-గురువార-వ్రతం

Lakshmi narayana reddy yaparla on December 18, 2019 at 8:42 PM said...

చాలా చక్కగా వుంది

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List