Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 3, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 9 వ.భాగమ్

Posted by tyagaraju on 7:31 AM


      Image result for images of Shirdisaibaba with lord siva
          Image result for images of jasmine flower

03.03.2019  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు


శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 9 .భాగమ్ 
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744

ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 

దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నానుసాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.

ఓమ్ సాయిరామ్  
నాడీ జాతక వివరాలు చదివిన తరువాత బాబా ఆమె తలచుకున్న వెంటనే ఏ విధంగా దర్శనమిస్తున్నారో, ఆవిడ అడిగిన విధంగా ఏది కోరితే అది ఎందుకని తీరుస్తున్నారో ఈ పాటికి పాఠకులు గ్రహించే ఉంటారు.  కాని ఆయన మనకు కూడా పలుకుతారు.  కావలసినది శ్రధ్ధ, సబూరి....

బాబాతో జీవనమ్ – 2006 .సంవత్సరమ్
లోరైన్ వాల్ష్ గారి డైరీ

27.11.2006

ఈ రోజున నేను 102 ఏంజెల్స్ ( 102 Angles) పుస్తకం పూర్తిగా చదివేసాను.  బాబా నాకు ఒక ఏంజిల్ (దేవదూత) ని చూడాలని  ఉంది.  చూపించవా అని కోరుకొన్నాను.  ఈ రోజు ఆఫీసులో మిస్టర్ TM గారికి సహాయం చేయమని నన్ను నియమించారు.  ఆయన మా డిపార్టుమెంటు గురించి మొత్తం పరిశోధన  (Research) చేస్తున్నారు.  ఆయన సేకరించిన సమాచారాన్నంతటినీ నేను టైప్ చేయాలి.  


మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా మా శాఖలో ఉన్న డైరెక్టర్ల లో ఒకరయిన డా.ఏంజెల్ గారి గురించి ఆయన ప్రస్తావించారు.  నాకు వెంటనే నవ్వు వచ్చింది. బాబా చూపించిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి.  నేను ఏంజల్ ని చూపించమని కోరుకుంటే డా.ఏంజిల్ గురించి ప్రస్తావన వచ్చేలా చేసారు బాబా.  పని పూర్తయిన తరువాత ఆఫీసునుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మొట్టమొదటి క్రిస్మస్ కార్డు వచ్చి ఉంది.  
              Image result for images of christmas card with angels

ఆ కార్డు చూడగానే నా కెంతో సంతోషం కలిగింది.  దానికి కారణం ఆకార్డంతా ఏంజిల్స్ బొమ్మలతో నిండిపోయి ఉంది.  కవరు నిండా 102 ఏంజెల్స్.

ఇది ఇంతటితో ఆగలేదు.  నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా ధ్యానంలో నాకు పొడవుగా ఉన్న ఏంజెల్ రెండు రెక్కలతో కనిపించింది.  ఆ దేవదూత ఇల్లంతా ఎగురుతూ ఆశీర్వదిస్తూ ఉంది.  
                  Image result for images of angels

ఆ ఏంజెల్ తెల్లని కఫనీ ధరించిన షిరిడీ సాయిబాబాగా మార్పు చెందింది.  బాబా ఇపుడు ఎగరకుండా, ఇంటిలోని ప్రతి గదిలోనుంచి నడుస్తూ తన రెండు చేతులను పైకెత్తి ప్రతి గదినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. 
                         Image result for images of shirdisaibaba raising hands

ధ్యానం పూర్తయిన తరువాత, ఈ రోజున బాబా మా  ఇంటికి వచ్చి ప్రతి గదిలోను తిరిగారనే ప్రగాఢమయిన అనుభూతి నాకు కలిగింది.  ఈరోజున నాకు నాయింటిలో ఇంతకు ముందుకన్నా ఎంతో ప్రశాంతత, బాబా అనుగ్రహం కలిగిందనిపించింది.  ఆభావం ఎంతో సేపు నిలబడలేదు.  మళ్ళీ నా కళ్లజోడు ఎక్కడో పెట్టి మర్చిపోయాను.  దానికోసం వెదకుతూ బాబాని కూడా సహాయం చేయమని అడిగాను.  ఎప్పుడూ నేను  నాకళ్ళజోడుని ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉండటం, బాబాని సహాయం చేయమని అడగటం మామూలే.  అలా అడిగినప్పుడల్లా కళ్ళజోడుని నాముందర కనపడేలా చేయడం గాని, లేక అవి ఎక్కడ ఉన్నాయొ నాకు కనపడే మార్గం చూపిస్తూ ఉంటారు.  ఆ తరువాత కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నాను.   కాస్త చిన్న కునుకు పట్టింది.  అంతలోనే మనసుకు కలవరాన్ని కలిగించే

కల …… కలలో బాబా విగ్రహాలు కనిపించాయి.  కొన్ని విగ్రహాలు పగిలిపోయికొన్ని పగిలిపోతూ కొన్ని ఛిన్నభిన్నమయి పడిపోయి ఉన్నాయి.  అక్కడ నేను ఉన్నాను.  చుట్టూ పరిగెడుతూ వాటినన్నిటినీ అతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను.

మనసంతా వికలమయిపోయి మెలకువ వచ్చింది.  మరలా కల గుర్తుకు రాగానే నామనసుని వేరే ధ్యాసలోకి మళ్ళిద్దామని నిశ్చయించుకున్నాను.  నాకిష్టమయిన సినిమా షిరిడీ కే సాయిబాబా సిడి పెట్టుకుని చూసాను. మూడవవంతు  సినిమా చూసిన తరువాత చిన్న పిల్లలా ఏడిచాను. “



I look to You You look to me”.  నాయెందవరి దృష్టో  వారియందే నా దృష్టి నేను అలాగే ఆచరిస్తాను బాబా నేను నిరంతరం నీయందే నాదృష్టిని నిలుపుతాను.

దానికి నిదర్శనం అన్నట్లుగా బాబా ఫోటో నుంచి నాకు అధ్బుతమయిన దర్శనం కలిగింది.  ఆ ఫోటోలో బాబా సూటిగా నావయిపే చూస్తున్నట్లుగాను, తన సుందరమయిన కనులతో నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. 
                         Image result for images of shirdi saibaba looking

ఆయన వదనం, పెదవులు మాత్రం కదలటల్లేదు.  కాని ఆయన నుంచి నాకు వస్తున్న సందేశం మాత్రం స్పష్టంగా తెలుస్తూనే ఉంది.  అది -  నీయందే నాదృష్టి – I Am Looking to Thee…

27.12.2006

నేను చూపించుకున్న నాడీ జాతకం వివరాల కాపీ ఈ సంవత్సరంలోనే నాకు అందింది.  అందులో పొందుపరచిన వివరాలన్నీ యదార్ఢమే అయినట్లయితే మరలా మరొక్కసారి ధృవపరచమని బాబాతో మెల్లగా విన్నవించుకున్నాను.  బాబా నేను నీలో ఐక్యమవడానికి ఎంతకాలమయినా వేచి ఉంటాను. (వేచి చూడటం చాలా కష్టమయినా నేను మాట ఇస్తున్నాను).  (9 నెలల క్రితం)  నాడీ జాతకంలో చెప్పినది యదార్ధమే అయినట్లయితే నాకేదయినా సంకేతం చూపించు బాబా అని అడిగాను.  ఆ తరువాత బాబాకు ఆరతీ ఇవ్వడానికి తయారవుతుండగా గోడమీద ఉన్న బాబా ఫోటోలో చలనం కలిగింది.  బాబా చిలుం పీలుస్తున్నట్లుగా కనిపించారు
                           Image result for images of shirdi saibaba smoking

బాబా కదలుతూ ఉండటం వల్ల ప్రదేశమంతా పొగగా అయిపోయింది.  (గోడమీదనుంచి బాబా దుమికి నాప్రక్కన నిలబడితే బాగుండుననే ఆశ నాలో కలిగింది) ఊపిరి బిగపెట్టి చూసేలా ఉంది ఆ దృశ్యం. గోడ మీద ఉన్న బాబా ఫొటో ప్రక్కనే  ఆయన  కాంస్య విగ్రహం ఉంది.  ఓహ్...ఆగిపోయి అలాగే చూస్తున్నాను.  బాబా ముఖమంతా పొగతో నిండిపోయి ఉంది.  గోడమీద ఉన్న ఫొటోలో బాబా చిలుము పీలుస్తూ పొగ వదలుతూనే ఉన్నారు. ఆపొగలో బాబా కఫనీ మళ్ళీ ప్రకాశవంతంగా తెల్లగా మారిపోయింది.  
                                    Image result for images of shirdi saibaba smoking
బాబా మవునంగా నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది.  ఇవన్నీ గమనించిన తరువాత బాబా అంతటా నిండి ఉన్నారనిపించింది..  ఆయన సర్వవ్యాపకత్వం నాకర్ధమయింది.

ఓమ్ సాయిరామ్.
(డైరీలో విశేషాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List