Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, May 6, 2019

బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన సాయి భక్తుల అనుభవాలు - 24

Posted by tyagaraju on 8:41 AM
      Image result for images of shirdi sai
      Image result for images of rose

06.05.2019  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –24 .భాగమ్ 

YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS


 Lorren Walsh e mail.  shirdi9999@hotmail.com

 బాబాతో సాన్నిహిత్యమ్ -  డైరీ లో ప్రచురించిన 
 సాయి భక్తుల అనుభవాలు - 24
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
ఫోన్.  9440375411  &  8143626744


(అనువాదం చేసి ప్రచురించడానికి బాబా గారు కూడా తమ అనుమతిని లోరెన్ వాల్ష్ గారి ద్వారా ప్రసాదించారు)

ఈ రోజు మరొక సాయి భక్తుడు శ్రీ మంజునాద్, కరూర్ గారు చెబుతున్న అనుభవాన్ని మనమందరము చదివి ఆనందిద్దాము.

రెండునెలల క్రితం నేను దక్షిణభారత దేశంలోని కొన్ని ప్రదేశాలు చూద్దామని బస్సులో  ప్రయాణం చేస్తున్నాను.  ప్రయాణం మధ్యలో ఒకచోట నేను ప్రయాణిస్తున్న బస్సుకి చిన్న యాక్సిడెంట్ అయింది.  బస్సులో ప్రయాణిస్తున్నవాళ్ళందరి అరుపులు కేకలతో అంతా గందరగోళంగా తయారయింది.  నేను క్రిందకి పడిపోయాను.  నా శరీరం మీద చిన్న చిన్న గీరుళ్ళు పడ్డాయి.  నేనొక మూలగా కూర్చుని అందరినీ గమనిస్తున్నాను.  దెబ్బలు తగినవాళ్ళందరూ ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు.  కొంతమంది పోయిన తమ సామానుల కోసం వెతుక్కుంటుంటే మరికొందరు దెబ్బలు తగిలినవాళ్ళకి సహాయం చేస్తున్నారు.  ఒక్కసారిగా నాకొక స్వరం వినిపించింది.  “కళ్ళు మూసుకో” అని.  నాకా స్వరం చాలా స్పష్టంగా వినిపించింది.  



వెంటనే నేను కళ్ళు మూసుకున్నాను.  అలా కళ్ళుమూసుకున్నానో లేదో వెంటనే బస్సు కిటికి అద్దం  పగిలి ఒక్కసారిగా ఎగిరి నా దవడ ఎముకలపై భాగంలో తగిలింది.  ఆ తరువాత కొద్ది సెకండ్లలోనే నేను కళ్ళు తెరచి చూశాను.  నన్ను కళ్ళు మూసుకోమని చెప్పినవాళ్ళెవరూ నా చుట్టుప్రక్కల కనిపించలేదు.  నాప్రక్కన ఎవ్వరూ లేరన్నది నేను ఖచ్చితంగా చెప్పగలను.  ఆ విధంగా నన్ను హెచ్చరిస్తూ ప్రమాదంబారిన పడకుండా నన్ను కాపాడిన సాయిబాబాకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.  ఒక మూలగా నేను ఒక్కడినే కూర్చుని ఉన్నాను.  నాదగ్గరగా ఎవ్వరూ లేరు.  బస్సులో నాస్నేహితులు కూడా ఎవరూ ప్రయాణం చేయటంలేదు. నా చిన్నతనంనుంచీ నేను సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తున్నాను.  సరైన సమయంలో నన్ను హెచ్చరించి నా కళ్ళను కాపాడటమే కాకుండా బాబా మీద నాకున్న విశ్వాసాన్ని మరింతగా పెంచిన ఆస్వరం సాయిరామ్ ది తప్ప మరెవరిదీ కాదు.  నేనాయనకు జన్మజన్మలకూ కృతజ్ఞుడిని.

మా అమ్మగారికి జరిగిన మరొక అధ్భుతమయిన ప్రత్యక్ష అనుభవమ్

మా నాన్నగారు వృత్తిరీత్యా వైద్యులు.  మానాన్నగారికి షిరిడీ సాయిబాబా మీద ఎంతో భక్తి.  అలాగే మా అమ్మగారు కూడా సాయిబాబాను పూజిస్తూ ఉంటారు.

అమెరికాలో ఉన్న నా సోదరి డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది.  నా సోదరికి 6 లేక 7 వ.నెలలో అనుకుంటాను సహాయంకోసం మా అమ్మగారు అమెరికా వెళ్ళారు.  ఎప్పటికప్పుడు ఫోన్ లో మా అమ్మగారు అన్ని విషయాలు చెబుతూనే ఉన్నారు.  నా సోదరికి కడుపులోని శిశువు బరువు తక్కువగా ఉందని, మార్పేమీ లేదని చెప్పారు.  ఇటువంటి పరిస్థితులలో మా కుటుంబంలోనివారొకరు నా సోదరి, మా బావగారి ఇద్దరి జాతకాలను ఒక జ్యోతిష్కుడికి చూపించారు.  ఆయన అన్నీ పరిశీలించి ఇద్దరికీ జాతకంలో సంతాన యోగం లేదని తేల్చి చెప్పాడు.  ఒకవేళ గర్భం దాల్చినా అబార్షన్ అవుతుందని చెప్పాడు.  కాని మేమెవ్వరం ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు.  మా సోదరికి 7వ.నెల వచ్చేసింది.  కాని రోజు రోజుకి చాలా బలహీనపడసాగింది.  ఆమె ఆరోగ్యం గురించి మాకందరికీ చాలా కంగారుగా ఉంది.  ఇక రోజులు గడుస్తున్నకొద్దీ తల్లి, బిడ్డ ఇద్దరి బరువు ఉండవలసినదానికన్నా తక్కువగా ఉండటం, పరిస్థితి కూడా కష్టంగా మారుతూ ఉండటంతో ఆపరేషన్ చేయక తప్పదని, డాక్టర్స్ చెప్పారు.

ఒక రోజు ఉదయాన్నే మా అమ్మగారు ఫోన్ చేసారు.  క్రితం రోజు రాత్రి తను మాసోదరి ప్రక్కనే వార్డులో కూర్చుని ఉన్నారు.  కొంతసేపటికి చిన్న కునుకు పట్టింది.  ఒక్కసారిగా మెలకువ వచ్చి చూసేటప్పటికి కాషాయరంగు కఫనీ ధరించి ఉన్న ఒక పొడవాటి వ్యక్తి మాసోదరి పడుకున్న మంచం ప్రక్కనే నిలబడి తలమీద చేయి వేసాడు.  ఆ తరువాత గదిలోనుండి వెళ్ళిపోయాడు.  మా అమ్మగారికి తను ఏమి చూసిందీ గ్రహించి ఆవ్యక్తి ఎవరో తెలుసుకోవాలని వెంటనే గది బయటకు వెళ్ళి చూసారు.  గది తలుపులు మూసి ఉన్నాయి.  వార్డులోపలికి అటెండెంట్స్ మాత్రమే వస్తారు.  అటువంటప్పుడు ఎటూకాని వేళలో ఆవ్యక్తి ఎలా వచ్చాడా అని ఆశ్చర్యపోయారు.  అంతేకాదు అటెండెంట్స్ అయినట్లయితే ఆస్పత్రి యూనిఫారమ్ లో ఉంటారు.  ఆవ్యక్తి గదిలోనుండి బయటకు వెళ్ళిన రెండు సెకండ్లలోనే గది బయటకు వచ్చి చూసారు.  నడవా మొత్తం ఖాళీగా కనిపించింది.  ఎవ్వరూ కనిపించలేదని ఫోన్ లో జరిగిన విషయమంతా చెప్పారు.

తెల్లవారుజామున 3.00 లేక 3.30 సమయంలో నిద్రలో ఏదో కలగని ఉంటావని నేను, మానాన్నగారు అన్నాము.  మేము అన్నదానికి మా అమ్మగారు ససేమిరా ఒప్పుకోలేదు.  తనకి వచ్చింది కలకాదనీ, ఆవ్యక్తిని స్పష్టంగా మెలకువగా ఉన్న స్థితిలోనే చూసినట్లు చెప్పారు.  అసలు ఆవ్యక్తిని లోపలికి ఎవరు పంపించారో, తలుపులు మూసి ఉండగానే గదిలోకి ఎలా వచ్చాడో తెలుసుకుందామని వెంటనే ఆవ్యక్తిని అనుసరించి వెళ్ళినట్లు చెప్పారు.  మా అమ్మగారు ఆవిధంగా చెబుతుండగానే అదంతా ఆమె భ్రమ తప్ప మరేదీ కాదని కొట్టే పారేసాము.  కాని మా అమ్మగారు తనది భ్రమ అంటే అస్సలు ఒప్పుకోలేదు.

ఈ సంభాషణంతా పూర్తయిన తరువాత అదే రోజున మా సోదరికి నొప్పులు మొదలయ్యాయి.  సుఖప్రసవం అయి పండంటి ఆడపిల్ల పుట్టింది.  పుట్టగానే పాపకూడా మంచి ఆరోగ్యంగా ఉంది.  ఇపుడామెకి 8సం.వయసు.  అమెరికాలోని డాక్ట్సర్స్ కూడా అది చాలా అధ్భుతమని అన్నారు.

ఒక సంవత్సరం తరువాత మాసోదరి పాపతో సహా భారతదేశానికి వచ్చింది.  ఆమె బంధువులలో ఒకరు ఆమె జాతకాన్ని మరొక జ్యోతిష్కుడికి చూపించారు.  అతను కూడా ఆమెకు సంతానయోగం లేదని చెప్పాడు.  కాని ఆమెకు అప్పటికే పాప పుట్టిందని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు.  ఇదంతా బాబా చేసిన అధ్బుతమని చెప్పక తప్పదు.  ఆ తరువాత మాకు  మా అమ్మగారు చెప్పిన సంఘటనలో మాకు నమ్మకం కుదిరింది.  ఆరోజున కాషాయ రంగు కఫనీ ధరించి మాసోదరి తలపై చేయివేసి అనుగ్రహించిన వ్యక్తి బాబా తప్ప మరెవరూ కాదని మేము ప్రగాఢంగా విశ్వసించాము.  బాబా తప్ప మూసి ఉన్న తలుపులలోనుండి గదిలోకి ఎవరు ప్రవేశించగలరు?

గదిలోకి ప్రవేశించడానికి బాబాకు తలుపులతో ఏమిపని?

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)








          `


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List