Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, December 4, 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 8 వ.భాగమ్

Posted by tyagaraju on 11:03 PM

 Image result for images of Shirdisaibaba
        Image result for images of green rose hd
05.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 8 .భాగమ్

శ్రీ సాయి సత్ చరిత్రలో కష్టానికి కూలి అనే సంఘటన గుర్తుచేసుకొందాము.  బాబావారు ద్వారకామాయిలో ఒక రోజున నిచ్చెన తెచ్చిన కూలీవానికి రెండురూపాయలు కూలి ఇచ్చారు.  ఈవిషయము 18 & 19 అధ్యాయములో వివరముగా హేమాద్రిపంత్ వ్రాసారు

ఇదే విషయాన్ని శ్రీసాయిబానిసగారు 26.10.2019 నాడు తెల్లవారుజామున ధ్యానములో బాబాగారిని అడిగారు.  బాబా చెప్పిన వివరాలు సాయిబానిసగారికి కన్నీరు తెప్పించింది.  ఆయన చాలా బాధతో ఆవివరాలు నాకు తెలియచేసారు.

బాబా ఆదేశానుసారము నిచ్చెన తెచ్చిన వ్యక్తి షిరిడీకి రాక ముందు ఒక జమీందారు ఇంట పనివాడుగా పనిచేసేవాడు.  ఆ జమీందారు ఇంట ఆడమగ కూలీలకు భోజనము పెట్టి వెట్టిచాకిరీ చేయించుకొనేవారు.  మగవారు తమ పనిలో తప్పు చేసిన లేక పొరపాటు జరిగిన ఆకూలీవానిని పశువులను బాదినట్లుగా కఱ్ఱతో కొట్టేవారు.  ఇక ఆడ కూలీలు తప్పు చేసినా, పొరపాటు చేసినా వారిని వారి పిల్లల సమక్షములోనే కాలుతున్న కట్టెతో కాలిమీద వాలు పెట్టేవారు.

తమ తల్లికి వాతలు పెట్టడం ఆ ఆడకూలీ పిల్లలు చూసి వారు భయముతో ఏడ్చేవారు.  ఈ విధమయిన శిక్షలను అక్కడి తోటి కూలీలతో జరిపించేవారు.  జమీందారు, వాని భార్యాపిల్లలు ఈ శిక్షలను చూసి పైశాచిక ఆనందాన్ని పొందేవారు.  ఈ బాధలను తట్టుకోలేక ఈ నిచ్చెన తెచ్చిన కూలీవాడువాని భార్య ఆ జమీందారు ఇంటినుండి పారిపోయి షిరిడీకి వచ్చి నన్ను శరణువేడారు.  వారు జీవితములో ఏనాడు ఒక రోజు కూలీ రెండురూపాయలను చూడలేదు.  ఈ రోజున వానికి రెండురూపాయలు కూలీ ఇచ్చాను.  వాని కళ్ళలో ఆనందమును చూసాను.
   Image result for images of chandpatil
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చాంద్ పాటిల్ యొక్క తప్పిపోయిన గుఱ్ఱమును వెతికిపెట్టారనే విషయము సాయిభక్తులందరికీ గుర్తే.  ఆ తర్వాత బాబా చాంద్ పాటిల్ పెండ్లివారితో కలసి షిరిడీకి వచ్చి 1918 వరకు నివసించి షిరిడీలో మహాసమాధి చెందారు.  చాంద్ పాటిల్ గుఱ్ఱము తప్పిపోవడం, దానిని బాబా వెతికి పెట్టడము బాబా చేసిన ఒక లీలగా సాయిబానిసగారు భావిస్తారు.

అటువంటి అనుభూతిని శ్రీసాయి ఆయనకు ప్రసాదించారు.

శ్రీసాయిబానిసగారు 1955 .సంవత్సరములో తన పినతండ్రి శ్రీ యు.పి.సోమయాజులుగారి ఇంట ఉండి విద్యాభాసము చేసారు.  ఆ సమయములో వారి పినతండ్రి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్ష్నరీ కొన్నారు.  ఆపుస్తకము చాలా పెద్దపరిమాణములో ఒక కిలో బరువు ఉంటుంది.  సాయిబానిసగారికి ఆ పుస్తకము అంటే చాలా ఇష్టము.  కాలచక్రములో 1991 సంవత్సరము రానే వచ్చింది.  శ్రీసోమయాజులుగారు మరణించేముందు సాయిబానిసగారిని పిలిచి ఆపుస్తకము ఆయనకు బహూకరించారు.  ఇంతవరకు ఇదంతా శ్రీసాయిబానిసగారి నిజ జీవితములో జరిగింది.  సాయిబానిసగారు ఆ పుస్తకమును తన ప్రాణప్రదముగా తన ఇంటిలో దాచుకొన్నారు.  

27.10.2019 నాడు ఆయన సాయిపై ధ్యానం చేసుకొంటున్నారు.  ఆ ధ్యానములో తనకు తన పినతండ్రి ఇచ్చిన ఇంగ్లీషు ఆక్స్ ఫర్డ్ డిక్ష్నరీ ఎవరో దొంగిలించారు అని తెలిసి బాధపడసాగారు.  శ్రీ సాయిసాయిబానిసగారికి  ధ్యానములో  దర్శనము ఇచ్చి "నీవు పోగొట్టుకొన్న పుస్తకం ఇపుడు నీవీధిచివలో ఉన్న నీ ధనిక స్నేహితుని ఇంట భద్రముగా ఉందివెళ్ళి తెచ్చుకో" అన్నారు.  సాయిబానిసగారు వెంటనే తన బస్తీలోని ఆ ధనిక స్నేహితుని ఇంటికివెళ్ళి అతని ఇంట ఇంగ్లీషు డిక్ష్నరీ ఉందా అని అడిగారు.  ఆ స్నేహితుడు మంచి మనసుతో క్రిందటి రోజున పాత పుస్తకాల దుకాణములో ఆ పుస్తకాన్ని కొన్నానని చూపించాడు.  ఆపుస్తకాన్ని చూసి ఆయన సంతోషముగ ఆపుస్తకము నాదిదానిని ఎవరో దొంగిలించారుఇపుడు అది మీఇంట ఉందినాపుస్తకమును నాకు ఇవ్వమని కోరారు.  ఆధనికుడు అది నీపుస్తకము అయితే దానికి ఉన్న గుర్తులు చెప్పమని కోరాడు.  ఆయన దానిపై శ్రీ యు.పి.సోమయాజులుగారి చిరునామాదానిక్రింద 1991లో తాను అతికించిన చిన్నసైజు సాయిబాబాఫోటోఆఫోటో క్రింద తన సంతకము ఉంటుందని చెప్పారు.

ఆ ధనికుడు సాయిబానిసగారు చెప్పిన వివరాలు ఆపుస్తకములో సరిపోల్చుకొని నీకు నీపుస్తకం నాదగ్గిర ఉందని ఎలాగ తెలిసిందని అడిగాడు.  నేను నా సద్గురు శ్రీషిరిడీసాయిబాబా గారు, నేను పోగొట్టుకొన్న పుస్తకం మీఇంట ఉందని చెప్పారుదయచేసి నాపుస్తకమును నాకు ఇవ్వండని వేడుకొన్నారు.  ఆధనికుడు ఆ పుస్తకములో శ్రీసాయిఫోటోకి నమస్కరించి సాయిబానిసగారికి ఆయన పుస్తకాన్ని ఇచ్చేసారు.

సాయిబానిసగారికి మెలకువ వచ్చింది.

((మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో మరపురాన్ని అనుభవాన్ని ఇచ్చిన బాబా)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List