07.05.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు
కలిగిన సందేహాలు –
బాబా సమాధానాలు – 8 కి సాయి భక్తుల స్పందన
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
(ఈ బ్లాగులోని సమాచారాన్ని ఎవరయినా తమ స్వంతబ్లాగులోనికి గాని, ఫేస్ బుక్ లోనికి గాని కాపీ పేస్ట్ చేసుకునే ఉద్దేశ్యం ఉన్నట్లయితే ముందుగా నాకు తెలియపరచవలసినదిగా నా మనవి...త్యాగరాజు)
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై,
- చాలా మంచి ప్రశ్న అడిగారు. బాబాగారు ఆమెకు అందే పుణ్యఫలమ్
అందకుండా పోతుందేమో అని అలా చేసారన్న విషయం ఉధ్ధవగీత శ్లోకం ద్వారా చక్కగా మనందరికి
అర్ధమయ్యేలా తెలియచేసారు.
శ్రీ పార్ధసారధి, పాలకొల్లు,
- నాచేత బాబా సేవ చేయించుకుంటున్నారు అనే భావన ఆమెది. నేను సేవ చేస్తున్నాను అనే భావన తక్కినవారిది. చక్కగా వివరించారు. ధన్యవాదములు.
శ్రీమతి కాంతి, మణికొండ,
హైదరాబాద్, - ఉధ్ధవగీత గురించి వినటమే తప్ప చదివే
అవకాశం రాదు తెలుగువారికి ఎంతో శ్రమించి ఆ గ్రంధంలో మంచి విషయాలు తెలియజేసారు. ఆత్మానందం కలిగించే మాటలు…
ధన్యవాదాలు.
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు
కలిగిన సందేహాలు -
బాబా సమాధానాలు
- 8 (1)
శ్రీ సాయి సత్ చరిత్ర అ.9 – భిక్షయొక్క
ఆవశ్యకత.
సంతానము, ధనము,
కీర్తి సంపాదించుటయందాపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని
మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై
గలదు.
సాయిబాబా గృహస్థుడు
కారు. వానప్రస్థుడు కూడ
కారు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడియున్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు
సంపూర్ణముగా కలదు. శ్రీ
సాయి సత్ చరిత్ర అ. 13 మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ
ప్రతిరూపములని ఉధ్ధవునకు చెప్పియున్నాడు.
21.04.2020 : ఈ రోజు బాబాను అడిగిన నా సందేహం
: బాబా నువ్వు ఎప్పుడూ అయిదిండ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవాడివి,
కారణమేమిటి?
(ఉపనిషత్తుల సారాంశాన్ని, మరియు
వాటిలోని విషయాలకు, శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా జీవన విధానమ్, ఆయన అవలంబించిన పధ్ధతులను,
ఆయన ఉపదేశాలను, పలుమార్లు మరల మరల పరిశీలించడం వల్ల ప్రచురణ ఆలస్యమయింది. ఏఒక్క విషయం వదలకూడదనే ఉద్దేశ్యంతో ఒకటికి పదిమార్లు
చూడడం జరిగింది. పరీక్ష బాగా రాసి ఇంటికి వచ్చిన
తరువాత మనం ఏమిరాసామో మరలా ఒకసారి పుస్తకం చూస్తాము. అందులో ఏఒక్క వాక్యం గాని, విషయం గాని మర్చిపోతే అరెరె ఇది రాయలేదే అని ఎంతగానో బాధపడతాము. ఆవిధంగా జరగకూడదనే నా ప్రయత్నం…అయిదిండ్లకు భిక్షకు ఎందుకని వెళ్ళేవారో ఒక పేరాలో
ఇస్తే సరిపోతుంది. కాని మరింత ఎక్కువగా సమాచారం తెలుసుకోవడం అవసరం.... ఓమ్ సాయిరామ్)
01.05.2020 రోజున నా సందేహానికి బాబా ఇచ్చిన సమాధానమ్ : “బ్రహ్మ ముఝె తెలుగు “
అంటే బాబా ఆ మాటలను హిందీ భాషలో
లో చెప్పారు.. తరువాత తెలుగు అన్నారు. అనగా హిందీలొ ఉన్న సమాచారారాన్ని తెలుగులోకి అనువదించమన్నారని భావించాను. ధ్యానంలోనుండి లేచి గూగుల్ లో హిందీలో
‘బ్రహ్మ ముఝె’ అని శోధించాను. లాభం లేదు కావలసిన సమాచారమ్ ఏమీ దొరకలేదు. ఏవేవో వస్తున్నాయి. నా సందేహాలు – బాబా సమాధానాలు 7వ.భాగాన్ని తయారు
చేస్తూనే దీనిమీద కూడా దృష్టి పెట్టాను.
కాని లాభంలేకపోయింది. ఒకవేళ నేను పొరబాటుగా వినిపించుకున్నానా
లేక నా భ్రమా అనే సందేహం కలిగింది.
బాబా ఈ సారి నాకు పరీక్ష పెట్టినట్లున్నారు. సమాచారమ్ ఏదీ దొరకలేదని వదిలివేస్తానా లేక సాధిస్తానా అని చూస్తున్నారు అనుకున్నాను. కాని నేను వదలలేదు. అన్ని విధాలుగా ప్రయత్నించి చివరికి బాబా అయిందిండ్లకు భిక్ష అని (హిందీలో కాదు) శోధించాను. కావలసిన సమాచారమ్
దొరికింది. ఇపుడు మీకు
దానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాను. అయిదిండ్లకు క్రమం తప్పకుండా భిక్షకు
ఎందుకని వెళ్ళేవారో చెప్పడానికి మరికొంత సమాచారాన్ని కూడా మనమందరం తెలుసుకోవలసిన అవసరం
ఉంది కాబట్టి కాస్త సంగ్రహంగా ఇస్తున్నాను.
బాబా హిందీలో చెప్పిన మాటలను
తెలుగులోనికి అన్వయించుకుంటే, “బ్రహ్మ నాకు” అని అర్ధం
వస్తుంది. అనగా బ్రహ్మ
నాకు చెప్పారు అని. తరువాత తెలుగు అన్నారు. అంటే తెలుగులోకి అనువాదం చేయమని అని
అర్ధం చేసుకున్నాను.
ఇప్పుడు చెప్పబోయే సమాచారం నారద
మహర్షి బ్రహ్మను యోగి అనేవాడు ఏవిధంగా ఉండాలి అని అడిగిన ప్రశ్నలన్నిటికి బ్రహ్మ గారు చెప్పిన
సమాధానాలనే ఇప్పుడు నేను మీకు అందిస్తున్న సమాచారం.
అంటే బ్రహ్మ చెప్పిన విషయాలేకదా బాబా ఇపుడు మనకు చెబుతున్నది.
అంటే పరోక్షంగా బ్రహ్మగారు బాబాకు చెప్పినవె కదా. ఈ విషయాలన్ని ఉపనిషత్తుల సారాంశములోనిది.
బ్రహ్మగారు నారద మహర్షికి యోగి
అయినవాడు ఎట్లుండవలెనో వివరించిన విషయములు…
యోగి అయినవాడు ఎప్పుడూ ధర్మాచరణమును
తప్పడు. ప్రజలు తనను అగౌరవపరచినా లేక తన సహవాసాన్ని
కోరుకున్నా అందరిని సమదృష్టితోనే చూస్తాడు. ఆయన దృష్టిలో అందరూ సమానమే.
(శ్రీ సాయి సత్
చరిత్ర అ.7 బాబా ప్రభువులను భిక్షుకులను నొకే రీతిగా ఆదరించిరి.
శ్రీ సాయి సత్ చరిత్ర అ.12 సద్గురు శ్రేష్టుడైన
శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగా ప్రేమించెడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరు
వారికి సమానమే.)
బ్రహ్మ నారదునితో ….
యోగియొక్క ధర్మములు, భిక్షద్వారా
లభించినదానినే స్వీకరించుట, మౌనముగా ఉండుట, తపస్సు. గ్రామము
చివరలో ఉన్న చెట్టుక్రింద కాని, దేవాలయములో గాని తపమాచరించుట.
పాడుబడిన గృహములోగాని, దేవాలయములో గాని,
చెట్టుక్రింద గాని నివసించుట. ప్రతిరోజు లభించిన భిక్షద్వారానే
జీవనం గడుపుట. యోగి ఎప్పుడూ తాను బ్రహ్మమే అని చెప్పకుండుట. కాని ఎప్పుడయినా నేను బ్రహ్మమే అని
చెప్పుట.
(శ్రీ సాయి సత్
చరిత్ర అ.3 ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే.
ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే)
(శ్రీ సాయి సత్
చరిత్ర 23. వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. ‘నేను భగవంతుడను’ అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయసేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడు తలచువారు. ఎల్లప్పుడు ‘అల్లా మాలిక్’ అనగా భగవంతుడే సర్వాధికారియని యనుచుండెడివారు.
(శ్రీ సాయి సత్
చరిత్ర అ.4 బాబా ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. బాబా పదునారేళ్ళ బాలునిగా వేపచెట్టు
క్రింద నవతరించెను. ఆ
తరువాత పాడుబడిన మసీదులో నివసించారు.
బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గానిపించెను. )
(శ్రీ సాయి సత్
చరిత్ర అ. 16 – 17 బాబాకు ఇల్లుగాని, భార్యగాని,
సంతానము గాని బంధువులుగాని లేరు. అయినప్పటికి వారు సమాజములోనే యుండేడివారు.)
బ్రహ్మ నారదునితో…
యోగి ఎప్పుడూ అయిదిండ్ల నుండె భిక్షను
స్వీకరించాలి. ఎప్పుడయితె
ఆయింటిలో వంటంతా పూర్తయి పొయ్యి మండటం ఆగిపోతుందో అప్పుడె ఆయింటినుండి భిక్షను స్వీకరించాలి.
యోగులు లేక సన్యాసులలో కొన్ని
భేదాలు ఉన్నాయి. ఒక వర్గంవారు కేవలం ఒక ఇంటినుండే
భిక్షను స్వీకరించాలి. మరొక వర్గం వారు ఎనిమిది ఇండ్లనుండి భిక్ష స్వీకరిస్తే మరొక వర్గం వారికి ఎటువంటి
పరిమితి లేదు. కాని మరొక
వర్గంలోని యోగులు అయిదిండ్లనుండి భిక్షను స్వీకరించాలి.
(శ్రీ సాయి సత్
చరిత్ర అ.8 బాబా భిక్షస్వీకరించిన
అయిదు ఇళ్ళు)
1 1 శ్రీ సఖారామ్ షెల్కె పాటిల్
2 శ్రీ నంద రామ సంక్లేచా
3 శ్రీ అప్పాజి కోతే పాటిల్
4 శ్రీ వామనరావ్ గోండ్ కర్
5 శ్రీ గణపతి కోతె పాటిల్
(ఈ అయిందిండ్లవారు
బాబాను ఎప్పుడు రిక్త హస్తములతో పంపించలేదు. బాబా వచ్చుసమయానికి వీరందరూ రొట్టెలను
తయారుచేసి సిధ్ధముగా ఉంచి బాబా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు.)
(బాబా నాలుగయిదిండ్లనుండి
భిక్ష చేసి, ఎల్లప్పుడు వేపచెట్టుక్రిందనే కూర్చొనెడువారు.)
(అంతకుముందు హిందీలొ ప్రసారమ్ అవుతున్న "మేరే సాయి" సీరియల్ చూసాను. అందులో బాబా ఒకరింటికి భిక్షకు వెళ్ళి మూడు సార్లు పిలుస్తారు. అప్పటికి ఆయింటివారు వచ్చి భిక్ష వెయ్యకపోతే బాబా వెళ్ళిపోతారు. ఆయింటివారు వచ్చి భిక్షవేయడానికి పిలిచినా ఆయన రారు. ఆయన చెప్పిన మాటలు..."నేను మూడు సార్లు మాత్రమే పిలుస్తాను. ఆలోపులో రానట్లయితే మరలా నేను భిక్షతీసుకోవడానికి వెనుకకు రాను" బహుశ సీరియల్ తీసినవారు కూడా సన్యాసులు, యోగుల పద్ధతుల గురించి ఎక్కడో చదివి ఉంటారని నేను భావించాను.... ఆసక్తి ఉన్నవాళ్ళు యూ ట్యూబ్ లో మేరే సాయి సీరియల్ చూడండి. నటినటులందరూ అద్భుతంగా నటించారు. త్యాగరాజు)
(ఈ భాగం ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment