Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, July 16, 2020

నేను ఒంటరివాడిని కాను – బాబా నాకు తోడుగా ఉన్నారు – 2 వ.భాగమ్

Posted by tyagaraju on 7:15 AM






    Pink roses HD wallpaper | Wallpaper Flare

16.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి సుభాశీస్సులు

సాయి లీల ద్వైమాసపత్రిక మేజూన్ 2000 సంవత్సరంలో ప్రచురించిన శ్రీ కె. షెనాయ్, పూనా వారి బాబా లీల రెండవ భాగమ్.  ఈ రోజు ఆణిముత్యాలు 4 వ.భాగం ప్రచురించి  శుక్రవారం నేను ఒంటరివాడను కాను 2వ.భాగాన్ని ప్రచురిద్దామనుకున్నాను.  మొదటిభాగం చదివినవారు ఆ తరువాత భాగాన్ని చదవడానికి ఆసక్తితో ఉన్నారని భావించి, వారిని నిరాశపరచడం భావ్యం కాదని సాయిభక్తుల కోరికపై ఈ రోజు ప్రచురిస్తున్నాను. 
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744

నేను ఒంటరివాడిని కానుబాబా నాకు తోడుగా ఉన్నారు – 2 వ.భాగమ్

నేను పూర్తిగా స్పృహలోకి వచ్చాను.  నేనెక్కడ ఉన్నానో నాకే తెలియటల్లేదు.  నేనక్కడా లేను, ఇక్కడా లేను.  నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను.  ఒక నిమిషమయిందో లేక రెండు నిమిషాలయిందో తెలియదు.  అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.  ఒక్కసారిగా గ్రహింపుకొచ్చింది.  నేను బాబాతో ఉన్నాను.  నేనాయన హృదయంలోనుండి క్రిందకి నడచుకుంటూ తిరిగి నామంచం మీదకు చేరుకొన్నాను.  ఏదీ సరిగా నిర్ణయించుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నాను.
 
       
 On A Trail Of Parks And Gardens In Shirdi
అటువంటి సుందరమయిన ప్రదేశాన్నుండి బాబాని వదలి ఇటువంటి దుఃఖపూరితమయిన ప్రపంచంలోకి ఎందుకు వచ్చానో ఒక్కక్షణం అర్ధం కాలేదు.  నేనాయనకోసం వెతికాను.  కాని ఆయన నాకెక్కడా కనిపించలేదు.  కొంతసేపటి తరవాత బాబా కూడా నాతోపాటే వచ్చి నాహృదయింలోనే ప్రవేశించారనే నిశ్చయానికి వచ్చాను. 

అవును ఆయన నాహృదయంలోనే నిరంతరం ఉంటారు.  నేను బాబాతో కలిసి అటువంటి సుందరమయిన తోటలలో విహరించే అవకాశం మరలా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు.  దాని గురించి నేనింక చింతించడమెందుకు?  బాబాయే నిర్ణయిస్తారు. సర్జరీ అయిన తరవాత నా హృదయంలో ప్రవేశించినవి కొత్తగా అతికించిన రక్తనాళాలు కావు.  దాని బదులుగా నాలో కలిగిన ఒక కొత్త ఆలోచన, నేను ఒంటరివాడిని కాను అనేదే.  బాబా ఎప్పుడూ నాకు తోడూనీడగా ఉన్నారు.  ఆయన మనలని ప్రేమిస్తారు, జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతూ రక్షిస్తారు.

‘నేను ఒంటరివాడను కాను, బాబా నాకు తోడుగా ఉన్నారు’ ఇది పూర్తిగా నాకు సంబంధించినదే కాదు.  ఈ విషయం ప్రతిసాయి భక్తుడికి నిశ్చయింపబడిన విషయం అన్నది యదార్ధం.  మనం ఆయన ఉన్నారనే విషయాన్ని ఎఱుకతో ఉండాలి.  మనం ఏమి మాట్లాడినా, ఏమి చేసినా, చేస్తున్నా ప్రతిదానిని గమనిస్తూ బాబా మనతోనే ఉంటూ ఉంటారు.  మనం మాటలాడె ప్రతిమాటకీ, ప్రతిపనికి ఆయన ప్రత్యక్షసాక్షి.  మనం మాటలాడె ప్రతిమాట మనలో కలిగే ఆలోచనల ప్రభావమే అనేది మనం గ్రహించుకుంటే మనలో మార్పు సహజంగానే వస్తుంది.

మన మాటలకి, చేతలకి బాబాగారి ఆమోదం ఉంటుంది.  మనలో ‘నేను’ అనే అహం పూర్తిగా పటాపంచలయిపోతుంది.  మనం మాటలాడె మాటలలో మార్పు వచ్చి మృదువుగా మాట్లాడతాము.  ఇతరులయెడల ఎంతో మర్యాదగాను, గౌరవంగాను ప్రవర్తిస్తాము.  ఇతరులని కూడా ప్రశంసించే గుణం అలవడుతుంది.  ‘మీరు చాలా మంచిపని చేసారండి’ అని ఎదటివారిని ఎంతో గౌరవంగా మెచ్చుకొంటాము. దీనికి కారణమేమిటంటే ఎదుటివానిలో కూడా బాబాయే ఉన్నారని మనం భావించడం వల్లనే.  ఒకవేళ మనం ఏదయినా తప్పుచేసినట్లయితే “అవును నిజమే నేను తప్పు చేసాను” అని ఒప్పుకుంటాము.  మనలో ఉన్న లోపాలను ఒప్పుకోవడమంటే అదెంత కష్టమో నాకు తెలుసు.

కాని బాబా మనలోనే ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటే అదంత పెద్ద కష్టమయినదేమీ కాదు.  అపుడు ‘నేను’ అనేది నశించిపోతుంది. ‘నేను’ స్థానంలో ‘మేము’ వచ్చి చేరుతుంది. ఆ విధంగా మన జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది.
(ఇక్కడ మేము అనగా బాబాతో కలిసి అని భావించాలి.  మన హృదయంలో బాబా ఉన్నప్పుడు ‘మేము’ అని సంబోధించాలి….   త్యాగరాజు)

మరొక విషయం ఏమిటంటే సాధారణంగా మనం ‘నేను చేసాను, నేను చెప్పాను, నేనది చేసాను, ఇది చేసాను’ అని మాట్లాడుతూ ఉంటాము.  దాని బదులుగా మనం,  ‘మనం ఇది చేద్దాము, మనం అది చేద్దాము ‘ అని అనడం అలవాటు చేసుకోవాలి.  అనగా మనం ఏమిచేస్తున్నా ఏమి మాట్లాడినా బాబాని కూడా కలుపుకుని మాట్లాడాలి.  బాబా లేకుండా నేనే లేను.  ప్రతీదీ చేసేది, చేయించేది  ఆయనే.  మనం ఆయన చేతిలో ఒక పనిముట్టు మాత్రమే.  ఎనిమిది అక్షరాలు అయిన “I AM NOT ALONE, BABA IS WITH ME’  ఈ మంత్రాన్నే మనం ప్రతిరోజూ ప్రతిక్షణం మననం చేసుకొంటూ ఉంటే ఆయన మనతోనే ఉన్నారనే భావన కలుగుతుంది.

కె. షెనాయ్,  కొథ్రుడ్, పూనె,
 నా అభిప్రాయమ్
( ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని కూడా మీకందరికీ తెలియచేస్తున్నాను.  నేను ఇతరులకి ఏమి చెప్పినా సరే బాబా నాచేత చేయించారు అనే చెబుతూ ఉంటాను.  బాబా గురించిన పుస్తకాలు ప్రచురింపబడినా ‘నేను’ అనే పదాన్ని తొలగించి బాబాయే ప్రచురింపచేసుకున్నారని చెబుతూ ఉంటాను.  ప్రతిపనిలోను, ప్రతివిషయంలోను బాబాని కలుపుకోవాలి.  నేను ఉదయాన్నే కాఫీతాగడం ప్రారంభించినా, ‘బాబా కాఫీ తాగుదాం రండి,   భోజనం చేయడానికి ముందు ఆయనకు సమర్పించి ఆ తరువాత, బాబా భోజనం చేద్దాం రండి, స్నానానికి వెళ్ళినా బాబా స్నానం చేద్దాం రండి’ అని మనసులోనే ఆయనని కలుపుకుంటూ ఉంటాను.  కొన్ని సంవత్సరాల క్రితం నేను స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు, “బాబా వెనకాల కూర్చోండి, కూర్చున్నారా? అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడిని”  ఆవిధంగా మనం సాధన చేస్తే అదే అలవాటయిపోతుంది. బజారుకు వెళ్ళే సమయంలో కూడా, “బాబా బజారుకు వెడదామా, కూరలు తెచ్చుకుందాం రండి” అని  గుర్తుకొచ్చినపుడు ఆయనని కూడా మనసులో పిలుస్తూ ఉంటాను.   ఒక్కోసారి మర్చిపోతూ ఉండవచ్చు.  ఇకనుండి మరచిపోకుండా ఉంటాను.

ప్రతివిషయంలోను బాబాని మనం కలుపుకుని పోతూ ఉండాలి.  నేను ఆచరిస్తున్నాను కనకనే మీకు కూడా చెప్పగలిగాను.  నేను ఆచరించకపోతే నాకు ఆవిధంగా చెప్పే అర్హతే లేదు.  ఈ బ్లాగు కూడా బాబాదే.  ఆయనే వ్రాయించుకుంటున్నారు.  బాబా చేతిలో నేనొక సాధనాన్ని మాత్రమే…. ఓమ్ సాయిరామ్…. త్యాగరాజు)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.3. లోభి ఎక్కడనున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక.      శ్రీ సాయి సత్ చరిత్ర అ.14 ప్రతినిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీ సాయిని చూడగలవు.  నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము.)

(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List