Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, September 14, 2020

ఊదీ ధరించిన వెంటనే బాబా ప్రవేశమ్ - 2

Posted by tyagaraju on 7:53 AM

Shirdi Sai Baba Poster - Shop Online
Red & White Rose | Red and white roses, Pink rose wallpaper hd, Beautiful  roses

14.09.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిలీల ద్వైమాసపత్రిక మేజూన్ 2016.సంవత్సరంలో ప్రచురింపబడిన అత్యద్భుతమయిన బాబా లీలను రోజు  ప్రచురిస్తున్నాను.  బాబా మనలని కనిపెట్టుకుని మన వెంటే ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు ఎలా అనూహ్యంగా మన జీవితంలోకి ప్రవేశిస్తారొ దీని ద్వారా మనం గ్రహించుకోవచ్చు.  ఇక చదవండి.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైద్రరాబాద్
ఊదీ ధరించిన వెంటనే బాబా ప్రవేశమ్ - 2
మా కుటుంబానికి మంచి స్నేహితుడయిన శ్రీ కె. గోపాలకృష్ణన్ గారి జీవితంలోకి బాబా ఏవిధంగా ప్రవేశింఅరొ, ఆతరువాత జరిగిన మార్పులు అన్నీ కూడా బాబా చూపించిన  ఒక అధ్భుతమయిన లీల.
పద్మా రామస్వామి – 8/3 శ్రీరామ్ నగర్
ఎస్.వి.రోడ్, అంధేరో (వెస్ట్)
ముంబాయి – 400 058
మొబైల్ (0) 9820349755
ఒడలు పులకరించేటంతటి అనుభవాలని శ్రీ కె. గోపాల కృష్ణన్ గారు స్వయంగా వివరించారు.

అధ్భుతమ్! హనుమాన్ గుడినుంచి కొద్ది గజాలు ముందుకు నడుచుకుంటూ వచ్చిన తరువాత షిరిడీ సాయిబాబా నా చుట్టూనే ఉన్నట్లుగా అనుభూతి కలిగింది.  ఆయన నా చెవిలో స్వాంతన వచనాలు పలుకుతున్నారు.  


నీ భార్య ఆస్పత్రిలో నా సంరక్షణలో ఉంది.  త్వరలోనే ఆమె మంచి ఆరోగ్యవంతురాలయి ఇంటికి తిరిగి వస్తుంది.”  బాబా పలికిన ఓదార్పు మాటలు నాహృదయానికి న్నీటీ జల్లులా అనిపించాయి.  నాకు చెప్పలేని మానసిక ప్రశాంతత లభించింది.  నాకళ్ళు ఆనంద భాష్పాలతో చెమర్చాయి.  ఇక నామనసులో రవ్వంత అపనమ్మకం గాని సందేహం గాని లేశమయినా లేకుండా హాయిగా శరీరమంతా తేలికపడినట్లుగా అయింది.  ఆత్మవిశ్వాసంతో ఆస్పత్రివైపు నడకసాగించాను.

ఆస్పత్రిలో స్పెషల్ విజిటర్స్ గదిలోకి వెళ్ళాను.  గదిలోకి వెళ్ళగానే  నాకళ్ళకెదురుగా కనిపించిన దృశ్యం నన్ను కట్టిపడేసింది.     ఎదురుగా గోడమీద పటం ఉందిఅందులో బాబా తన రెండు చేతులను పైకెత్తి తన భక్తులను రక్షించడానికా అన్నట్లుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు.  
      Shirdi Sai – Page 20 – SAI GURU TRUST – Daily Parayana of Shri Sai  Satcharitra

అంతకుముందు నేను గుడినుంచి వస్తుండగా నాకు కలిగిన అనుభూతికి ఇక్కడ సాయిబాబా పటం కనిపించడం చూస్తే నిస్సహాయస్థితిలో ఉన్న నాజీవితంలోకి సాయిబాబా ప్రవేశించారని ప్రగాఢమయిన భావం నాలో కలిగింది.

నాకు కలిగిన ఆధ్యాత్మికానుభూతిని నేను నా భార్య స్నేహితురాలికి చెప్పాను.  ఆమె కూడా సాయిబాబా భక్తురాలు.  నేను చెప్పిన విషయం విన్నవెంటనే ఆమె మరొక ముఖ్యమయిన సంగతి చెప్పింది.  ఆమె చెప్పినది విన్నంతనే నాకెంతో పారవశ్యం కలిగింది. నాశరీరమంతా పులకరించిపోయింది.   ఆనందాన్ని నేను మాటలలో వివరించలేను.  క్రితంరోజు ఆమె మాఇంటికి వచ్చినప్పుడె తాను బాబా ఊదీని నాభార్య నుదుటికి రాసినట్లుగా చెప్పింది ఆమె ఈవిషయం తెలియచేసినవెంటనే నాకర్ధమయింది.  జూన్ 10.తారీకునాడె ఎప్పుడయితే నాభార్య నుదుటిమీద ఆమె ఊదీ రాసిందో అప్పుడే బాబా మాఇంటిలోకి ప్రవేశించారని.  నాభార్య స్నేహితురాలు నాకు బాబా ఊదీ పొట్లం, శ్రీసాయిబాబా సత్ చరిత్ర పుస్తకం, బాబా ఫోటో ఇచ్చింది.  ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఊదీని నాభార్య నుదుటికి రాస్తూ ఉండమని, మరికాస్త ఊదీని నీటిలో కలిపి త్రాగించమని చెప్పింది.  ప్రతిరోజు శ్రీసాయి సత్ చరిత్రలోని ఒక అధ్యాయాన్ని గాని, లేక కొన్ని పేజీలను గాని చదవమని చెప్పింది.  నాభార్య త్వరగా కోలుకోవాలని బాబా మీద భక్తితో ప్రార్ధించమని చెప్పింది.  ఆమె చెప్పినట్లే ఆరోజునుండె శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ ప్రారంభించాను.  ఆయన ఆశీర్వాదాల కోసం ప్రతి గురువారం మా కాలనీలోనే ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాలని ఒక నియమంగా పెట్టుకున్నాను.

నాభార్య ఆస్పత్రిలో ఉన్న రోజులలో ఇంకా ఒకటి రెండు ప్రమాదకరమయిన పరిస్థితులను దాటవలసి ఉంది.  ఆమె స్పృహలోనే ఉన్నాగాని, బాబా దయవలన ఏపరిస్థితిలోను కోమాలోకి వెళ్ళడం సంభవించలేదు.  బాగా చెప్పుకోదగినంతగా తను చాలా త్వరగానే కోలుకొంది.  ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే సాయిబాబా అనుగ్రహం వల్లనే జరిగిన ఒక ద్భుతమనే చెప్పాలి.  నాభార్యని జూన్ ఆఖరివారంలో ఆస్పత్రినుంచి ఇంటికి పంపించారు.
కాని సంఘటన జరిగిన తరువాత తనకు వచ్చిన భాషలలో ఒకటయిన మళయాళం మాట్లాడలేకపోయింది.  ఇది చాలా అకస్మాత్తుగా జరిగింది.  అంతకుముందు ఆమె మళయాళం చాలా అనర్గళంగా మాట్లాడేది. (తను కేరళలోనే పుట్టి పెరిగినందువల్ల మళయాళం బాగా వచ్చు). కాని ఇప్పుడు మాత్రం ఎవరయినా మాట్లాడితే బాగానే అర్ధం చేసుకుంటోంది, కాని మళయాళంలో తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం, బదులుగా హిందీలో సమాధానం ఇవ్వడం మొదలుపెట్టింది.  ఈవిషయం గురించి డాక్టర్స్ తో చర్చించినప్పుడు బ్రైన్ హెమరేజ్ వల్ల ఇటువంటి సమస్యలు వస్తుంటాయని చెప్పారు. ఆమె మళ్ళీ ఆభాష మాట్లడవచ్చు లేక మాట్లాడలేకపోవచ్చు, ఇంకా చెప్పాలంటే మరలా ఆభాష మాట్లాడటానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అని చెప్పారు. 

మన మాతృభాష తమిళం, ఇంకా నువ్వు మరొక మూడు భాషలు మాట్లాడగలవు కదా, అందుచేత మళయాళం మాట్లాడలేకపోతున్నానే బాధ మనసులో పెట్టుకోవద్దని నాభార్యకు చెప్పాను.  ఇది చాలా చిన్న విషయం అని చెప్పి ఆమె మనసులో ఉన్న బాధను తొలగించాను.  ఇంత చిన్న విషయానికి మనమిద్దరం బాధపడటం అనవసరం, మనజీవితం రాబోయే రోజులు సంతోషంగా గడిపేద్దామని నాభార్యను ఉత్సాహపరిచాను.

జూన్ 26.తారీకున నాభార్యను ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేసారు.  ముందుగా మళయాళం భాషలో ఉన్న దేవుడి పుస్తకాలలోని స్తోత్రాలను మెల్లి మెల్లిగా చదవడం మొదలుపెట్టింది.  ఆవిధంగా నాభార్యలో మంచి ఆత్మ విశ్వాసం అతి తొందరలోనే కలిగింది.  ప్రతిరోజు శ్రీసాయిసత్ చరిత్ర చదవడం ప్రారంభించింది.  నాభార్యలో ఉన్న ధృఢ నిశ్చయం, దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆమె చేసిన ప్రయత్నం వీటన్నిటి ఫలితంగా 2015 జూలై నెలలో అనుకోనివిధంగా చాలా స్పష్టంగా అనర్గళంగా ఎటువంటి సంకోచం లేకుండా మళయాళం మాట్లాడటం మొదలుపెట్టింది.  ఇది బాబా చేసిన మరొక అధ్భుతం.  మేమందరం చాలా ఆశ్చర్యపోయాము.

ఇంటికి వచ్చిన తరువాత నెలన్నరపాటు ఫిజియోథెరపీ చేయించాము.  రెండు నెలల తరువాత ఎమ్ ర్ స్కాన్ చేయించాము.  అంతా సవ్యంగానే ఉందని చెప్పారు.  ఇక నేను నా ఆఫీసు పని బాధ్యతలనుండి తప్పుకుని జీవితాంతం నాభార్యకు తోడుగ ఉండాలని నిర్ణయించుకున్నాను.  అమె త్వరగా కోలుకునేందుకు ఆమెకు సహాయకారిగా ఉండాలని అనుకున్నాను.  ఆవిధంగా నేను కొత్త జివితాన్ని ప్రారంభించాను.  ఆధ్యాత్మికానుభూతులతో కొత్త జీవితం.  రెండు మూడు నెలల్లో నేను శ్రీసాయి సత్ చరిత్ర మూడు సార్లు పారాయణ చేసాను.  ప్రతి గురువారం సాయిబాబా మందిరానికి క్రమం తప్పకుండా వెడుతున్నాను.  ప్రతి గురువారం సాయంత్రం మా ఇంటిలో బాబాకు నైవేద్యం పెట్టి ఆరతులు ఇవ్వడం కొనసాగిస్తూ వస్తున్నాము.  మా కుటుంబంలో నలుగురం ఉన్నాము.  నేను, నాభార్య, నా కొడుకు కోడలు.  మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాయిబాబా నామస్మరణ చేసుకుంటూ ఉన్నాము..

కొన్ని రోజుల తరువాత మాకాలనీలోని కొంతమంది యువకులు వచ్చి తాము షిరిడిలో సాయిభజనలు చేయడానికి వెడుతున్నామని చెప్పి నన్ను కూడా రమ్మన్నారు.  మొట్టమొదటిసారిగా వాళ్ళతో కలిసి షిరిడీ వెళ్లాను.  సాయిబాబాను దర్శించుకోవడానికి సమాధిమందిరంలోకి ప్రవేశించాను.  ప్రవేశించిన తరువాత సమాధి వేదికకు (ప్లాట్ ఫారము) కుడివైపు ఉన్న క్యూ వరుసలోకి వెళ్లాను   ఆగష్టు 15 సందర్భంగా భక్తులు విపరీతంగా వచ్చారు.  బాబా చరణకమలాలను మనఃపూర్వకంగా ప్రార్ధించుకున్న తరువాత నా చేతిలోఉన్న బుట్టతో బయటకు రాబోతున్నాను.  మెల్లగా బయటకు వెళ్ళే దారివద్దకు (EXIT) రాగానే ఇద్దరు గార్డులు పూజారిగారు చెప్పారని చెప్పి నన్ను బాబా విగ్రహం దగ్గర ఉండమని చెప్పారు.  నామన్సులో ఒక విధమయిన అనుభూతి లిగింది.  మనసు పులకించిపోయింది.  బాబా నన్ను ఆశీర్వదించినట్లుగా అనుభూతి చెందాను.పూజారిగాను నాకు సాయిబాబా డాలరు ఇచ్చారు.  దానిమీద సాయిబాబా అన్న అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. 

బయటకువచ్చిన తరువాత గురుస్థానం వద్దనున్న వేపచెట్టు దగ్గరకు వచ్చాను.  అక్కడ సాయిబాబాను ప్రార్ధించుకుంటూ ఉండగా ఒక గార్డు నాదగ్గరకు వచ్చి రెండు వేపాకులు నాచేతిలో పెట్టాడు.  నేను చాలా ఆశ్చర్యపోయాను.  ఇంటికి తిరిగి వెళ్లాక వేపాకులను సాయిబాబా ఫొటోవద్ద పెట్టుకోమని మాకాలనీవాసులు చెప్పారు.  నేను షిరిడీలో ఒక రోజు ఉన్నాను.  తరువాత బాబా అనుమతి తీసుకుని, ఆయన శీర్వాదం, ఊదీతో బొంబాయికి తిరిగివచ్చాను.

రోజు రోజుకు నాభార్య కోలుకుంటూ ఉండటం బాబా ప్రసాదించిన ఒక అధ్భుతమయిన వరం.  బాబా ఆశీర్వాదాలు నాయందు ఉన్నాయని నేను ప్రగాఢంగా మ్మాను.

నాతో సహా మాకుటుంబసభ్యులందరం సాయిబాబాకు భక్తులమయ్యాము.  మేము ఆయన ప్రార్ధించుకుంటున్నపుడెల్లా ఆయనతో మేము ప్రతిరోజూ బంధం ఏర్పరచుకుంటున్నామని భావిస్తూ ఉంటాము.  పరిపూర్ణమయిన నమ్మకంతో మేమందరం ఆయనకు సర్వశ్య శరణాగతి చేసుకున్నాము.  ప్రతినిమిషం ఇపుడు బాబా మాతోనే ఉన్నారని మేమందరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము.
సాయి లీల సాయికే తెలుసు
సంకలనం  డా. సుబోధ్ అగర్వాల్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List