Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, September 3, 2020

రావుబహద్దూర్ సాఠే – 3 వ.భాగమ్

Posted by tyagaraju on 8:34 AM

Original Photos of Shirdi Sai BabaZeven dagen Shirdi Sai
      HD wallpaper: white rose, Flowers, rose - flower, petal, flower head,  nature | Wallpaper Flare
03.09.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి సత్ చరిత్రలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.  బాబా అంకిత భక్తులు తమంత తాముగా చెప్పిన కొన్ని విషయాలను సంఘటనలను మరాఠీలో మిస్. ముగ్ధా సుధీర్ దివాద్కర్ గారు  వ్రాసిన వాటిని ఆంగ్లంలోనికి అనువదించినవారు శ్రీ సుధీర్ గారు.
సాయిలీల ద్వై మాసపత్రిక మార్చ్ఏప్రిల్ 2013 .సం. సంచికనుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్..  ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
 SriSaikalpa::Devotees
రావుబహద్దూర్ సాఠే – 3 .భాగమ్
శ్రీ సాయినాధ ప్రభ మరియు శ్రీ సాయినాధ కధా కరందక్
బాబా భక్తులతో సంభాషించే సమయంలో ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ ఉండేవారు.  ఆవిధంగా మాట్లాడుతున్నపుడు వినేవారికి ఆ సమయంలో అవి అవసరం లేనివిగాను, అసంధర్భంగాను అనిపించేవి.  ఆయన  మాట్లాడుతున్నపుడు మధ్యలో చెప్పే మాటలు వినేవారికి అర్ధరహితంగాను, అంతకుముందు మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం సంబంధం లేనివిగాను ఉండేవి. 



సాఠేగారు చెబుతున్న విషయాలు

బాబా మాట్లాడుతున్నపుడు నేను ఎన్నో విషయాలు విన్నాను.  ఆయన చెప్పిన విషయాలకు నేను నా భావాలని మరికొన్నిటిని జోడించిశ్రీసాయినాధ్ కధా కరందక్అనే పుస్తకాన్ని సంకలనం చేసాను.  బాబా అనుమతి లేకుండా నేనా పుస్తకాన్ని రాసాను.  ఆయన చెప్పిన విషయాలు చాలా తక్కువ.  ఆయన మాట్లాడేటప్పుడు అకస్మాత్తుగా మధ్యలోనే ఆపేసేవారు.

సాఠేదక్షిణ భిక్షా సంస్థను స్థాపించి దానికి కార్యనిర్వాహకునిగా తానే వ్యవహరించారు.  ఈ సంస్థ, ‘సాయినాధ ప్రభఅనే పత్రికను కూడా ప్రారంభించింది.  పేరుకు తగినట్లుగానే ఇతర విషయాలతోపాటుగా బాబా చెప్పిన విషయాలను కూడా ప్రచురించారు.  ఆ తరువాత ఇందులోని విషయాలన్నిటినీ సేకరించిశ్రీసాయినాధ కధాకందకఅనే పుస్తకాన్ని ముద్రించారు.

ఈ పుస్తకంలోని విషయాలన్నీ రావుబహద్దూర్ సాఠే గారి అనుమతితోశ్రీసాయిలీలపాతపత్రికలలో ప్రచురించారు.  అందులోని భాష బాబాగారు ఏవిధంగా మాట్లాడేవారో తెలియచేస్తుంది.  దీనిద్వారా మనకు బాబా మాట్లాడే పధ్ధతి ఏవిధంగా ఉండేదో ఒక అవగాహన కలుగుతుంది.
కధలను రచించేటపుడు సాఠేగారుఛోప్ దార్’ (అనగా కావలివాడు లేక గార్డు) శ్రీసాయినాధునికిఅనే కలం పేరు పెట్టుకున్నారు.

ఆయన రచనా శైలికూడా బాబా మాట్లాడె విధానంలాగానే అదే రీతిలో సరిసమానంగా ఉండేది.  ముందుమాటలో సాఠేగారుబాబా చెప్పిన విషయాలను ప్రత్యక్షంగా వినే అదృష్టం లేనివారు ఎంతో మంది ఉన్నారు.  బాబా ఎలా, ఏమని మాట్లాడారో ఇపుడు వారు పూర్తిగా గ్రహించుకుంటారు.  ఈ పుస్తకం కాపీలు లభించడం చాలా కష్టం. 

బాబా ఏవిధంగా మాట్లాడేవారో తెలియచేసే వృత్తాంతము

బాబా చెప్పే విషయాలు ఆయన చెబుతూ ఉండగా ప్రత్యక్షంగా విన్నవాళ్ళలో మనలో చాలామంది అదృష్టవంతులు.  ప్రధమంగా మరాఠీలో ఉన్న ఆ విషయాలు చదవడానికి ఎంతో యోగ్యమయినవి.  కాని, మరాఠీ భాష తెలియని భక్తులకోసం పూర్వపురోజులలో బాబా చెప్పిన అటువంటి వెలకట్టలేని వృత్తాంతాలలో ఒకటి ఈ క్రింద వివరిస్తున్నాను.

రచయితసమర్ధగారి ఛోప్ దార్
(పవిత్ర దండమును ధరించినవాడురావు బహద్దూర్ సాఠేగారి కలంపేరు)
ఉదయాన్నే, ప్రొద్దున్న చేయవలసిన పనులన్నిటినీ పూర్తి చేసుకుని ఎప్పటిలాగానే రెండు మూడు ఇండ్ల వద్ద భిక్షను స్వీకరించిన తరువాత సమర్ధ సాయినాధ్ మహరాజ్ గారు అల్పాహారం తీసుకున్నారు.  అల్పాహారం తరువాత ఆయన మసీదులో మధ్యగా కూర్చున్నారు.  బాబా సేవకు నియోగింపబడిన కొంతమంది భక్తులు ఆయన చుట్టూ కూర్చుని సేవ చేస్తున్నారు.  అపుడు సమర్ధ కొన్ని కధలను వివరించడం మొదలుపెట్టారు.  కాని ఆయన చెబుతున్న విషయాలు పైకి అసందర్భంగా అనిపించాయి.  ఆవిధంగా ఆయన చెప్పిన కొన్ని కధలను వినే భాగ్యం ఈ రచయితకు కలిగింది.  ఆవిధంగా ఆయన వివరించినవాటిలో కొన్ని

వాటిలో కొన్నింటినికరందకపుస్తకంలో ముద్రించడానికి ఎంపిక చేయబడ్డాయి.  వాటిని ఎన్నుకొనే విషయంలో ప్రధమంగా వాటిని పొందికగా సందర్భానుసారంగా అన్నీ క్రోడీకరించి ప్రచురించాలనేదే   ముఖ్యోద్దేశం.  ఇక రెండవ విషయానికొస్తే అటువంటి కధలను చదివే పాఠకులకి ఆసక్తికరంగాను, కొన్ని సందేశాలను/ఉపదేశాలను ఇవ్వగలిగేలా ఉండాలి.
కధాకరందకపాఠకులకి శ్రేయస్సును చేకూరుస్తుందని భావిస్తున్నాను.  రచయిత వీటిని ఎంతో వినయంగాను, భక్తిశ్రధ్ధలతోను, శ్రీసమర్ధ చరణకమలాలకి అర్పిస్తున్నాడు.

(రేపటి సంచికలో బాబా 200 సంవత్సరాల క్రితం జరిగిన వృత్తాంతాన్ని గురించి చెప్పిన విషయం)
శ్రీ సాయి సాగరం నుండి వెలికితీసిన ఆణిముత్యాలు 18వ.భాగం ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చదవండి.)
http://teluguvarisaidarbar.blogspot.com/2020/09/18.html#more
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List