Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 19, 2020

వంద కోట్ల రూపాయలు

Posted by tyagaraju on 6:52 AM

 




19.11.2020 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

వంద కోట్ల రూపాయలు

రోజు మరొక కొత్త విషయాన్ని ప్రచురిస్తున్నాను.  ప్రపంచంలో పుట్టిన ప్రతివాడికి ఏదో ఒక ఆశ ఉంటూనే ఉంటుంది.  అది ఎవరూ కాదనలేని నిత్య సత్యం.  ఆశ అనేది కాస్తో కూస్తో ఉండచ్చు గాని, మరీ అత్యాశ ఉండకూడదు.  ప్రతివాడు తనకి ఉచితంగా కావాలనుకోవడం మరీ దురాశ.  ఎదటివారినుంచి ఏదో విధంగా లబ్ధి పొందాలనుకోవడం కన్నా మనం ఇతరులకు ఏమయినా సాయపడుతున్నామా అని ఆలోచించాలి.  మనం కష్టపడి ఏదయితే సంపాదిస్తామో అది చిన్న మొత్తమయినా సరే అదే మనకు కొండంత తృప్తిని ఇస్తుంది

పుడు ప్రచురిస్తున్న వృత్తాంతం శ్రీ షిరిడీసాయి ట్రస్ట్.ఆర్గ్ లో సాయిసరోవర్ గురజాతీ పుస్తకంనుండి ప్రచురింపబడింది. 

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

శ్రీ సాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తికి బాబా ఏవిధంగా హితబోధ చేసారో మనకు తెలుసు.  ఇపుడు పదికోట్ల రూపాయలు కావాలని వచ్చిన ఒక వ్యక్తిని మరొక సాధువు వద్దకు పంపించి బాబా వ్యక్తికి ఏవిధంగా గుణపాఠం చెప్పారో వివరిస్తున్నాను.


తనవద్దకుఎవరువచ్చినా ఆఖరికి ప్రపంచం మొత్తాన్ని మోసం చేసిన వ్యక్తయి నా సరే ఎవరినీ నిరాకరించడం బాబా నైజం కాదు.  సాయిదర్బార్ కి అటువంటి వ్యక్తి వచ్చినా బాబా సాదరంగానే ఆహ్వానిస్తూ ఉండేవారు. అందుచేత మనం సాయి దర్బార్ కు వెళ్ళేటట్లయితే మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని వదిలివేయాలిసాయిబాబాయే భగవంతుడు, బ్రహ్మ, సృష్టికర్తఆయనకు ఆది అంమనేవి లేవు ప్రపంచంలో ఎక్కడ వెదకినా దురా లేని మానవుడే కనపడడుప్రతివారు మగవారు కాని ఆడవారు కాని ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో తమకేదో లాభం కలగాలని కోరుకోవడం లేక దానికోసం ప్రయత్నించడం జరుగుతూనే ఉంటుంది.

ఒకానొక భక్తుడు ఉన్నాడు. ( పెద్ద మనిషి సాయిబాబాకు భక్తుడనిగాని, లేక మరొక భగవంతుని యొక్క భక్తుడని గాని ఏవిధమయిన వివరాలు ఇవ్వబడలేదు.)  పెద్దమనిషికి ఒకే ఒక కోరిక ఉంది.  అది, ఏవిధంగాను కష్టపడి పని చేయకుండా ఎలాగయినా సరే పదికోట్ల రూపాయలు సంపాదించాలనే దురాశ.  తని మనసులో ఒక్క విషయం నాటుకుపోయి ఉంది.  అదేమిటంటె సాధువు అనేవాడు   సచ్చీలుడు, నిజమయిన సాధువు అయినట్లయితే లక్ష్మీదేవి ఆయన హృదయంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటుందని అతని గట్టి నమ్మకం.  ఒకవేళ లక్ష్మీదేవే కనక ఆసాధువులో నివాసం లేకపోయినట్లయితే అతను నిజమైన సాధువు కాడని భక్తుని అభిప్రాయం.

అతనిలో నమ్మకాన్ని బట్టి ఎవరో ఒక సలహా ఇచ్చారు.  చూడు, తమ్ముడూ, నీకు అటువంటి మహోన్నతమయిన సాధువు షిరిడీలో కనిపిస్తాడు.  శ్రీ షిరిడీ సాయిబాబా బాగా ధనవంతుడు, కోటీశ్వరుడు.  అంతే కాదు, ఆయన ఎంతో దయ, జాలి ప్రేమ కలవాడు.  నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళావంటే నీకోరిక నెరవేరుతుంది

సలహా అతనికి నచ్చి షిరిడీ వెళ్ళి రెండు మూడు రోజులు ఉన్నాడు.  రెండు మూడు రోజులు సాయిబాబా లీలలు అన్నీ గమనించాడు.  కాని అతని దృష్టి అంతా సాయిబాబావారి కఫనీకి ఉన్న పొడవాటి జేబు మీదనే ఉంది. బాబా తనవద్దకు ఎవరు చ్చినా కఫనీ జేబులో చేయిపెట్టి తన చేతికి ఎంతవస్తే అంతా వచ్చినవారికి పంచిపెడుతూ ఉండటం అంతా జాగ్రత్తగా గమనించాడు.  ఎవరూ కూడా రిక్త హస్తాలతో తిరిగి వెళ్లడంలేదు.  అది చూసిన తరువాత సాయిబాబా వద్ద ఖచ్చితంగా పదికోట్ల రూపాయలు ఉంటాయనే పూర్తి నమ్మకం కలిగింది.  అపుడా వ్యక్తి బాబాతో, “బాబా నేను ఎక్కడెక్కడో తిరిగాను.  కాని నాకు అసలయిన సాధువు ఎక్కడా కనిపించలేదు.  మీరు ప్రతిరోజు ఎంతో ధనం దానం చేస్తూ ఉన్నారు.  అందువల్ల మీరే అసలయిన సాధువు, మహాత్ములు.  లక్ష్మీదేవి మీ హృదయంలోనే నివాసం ఉంని నాకు పూర్తిగా అర్ధమయింది.  అందుచేతనే నేను మీవద్దకు వచ్చాను.  దయచేసి మీరు లక్ష్మీదేవిని అడిగి నాకు పదికోట్ల రూపాయలను మాత్రమే ఇప్పించండి చాలు.  అంతకన్నా వేరే ఏమీ మీవద్దనుంచి నాకు అక్కరలేదుఅని వేడుకొన్నాడు.

సాయిబాబా అతని కోరిక విని మృదువుగా ఇలా అన్నారు…”చూడు, నేనే ఇక్కడ భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉన్నాను.  అటువంటపుడు ఫకీరు వద్ద పదికోట్ల రూపాయలు ఎలా ఉంటాయి? పోనీ ఒకపని చెయ్యి. గోండవలేలో ఉన్న గోండవలేకర్ మహరాజ్ గారి వద్దకు వెళ్ళుఅని సాయిబాబా అతనిని దగ్గరకు పిలిచి అతని చెవిలో నెమ్మదిగానీకు ఆయన పదికోట్ల రూపాయలు ఇస్తే, అందులో ఒక కోటి నాకు ఇవ్వు.  నేనిక భిక్ష చేస్తూ ఫకీరు జీవితం గడపనక్కరలేదుఅన్నారు.

                              (గోండవలేకర్ మహరాజ్)

పెద్దమనిషి ఎలాగయితేనే కష్టపడి గోండవలేకర్ మహరాజ్ ని కలుసుకున్నాడు.  ఆయన దగ్గర తన కొరికను వెల్లడించాడు.  అపుడు గోండవలేకర్ మహరాజ్, “ఇదేమంత పెద్ద సమస్య కాదు.  కాని ఈరోజు నువ్వు చాలా ఆలశ్యంగా వచ్చావు.  రేపు రాఅన్నారు.  మరుసటిరోజు ఆపెద్దమనిషి గోండవలేకర్ మహరాజ్ వద్దకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొన్నాడు.  గోండవలేకర్ అతనితోనువ్వు అంతదూరంనుండి ఎందుకు వచ్చావు, చెప్పుఅన్నారు. 

నాకు పదికోట్ల రూపాయలు మాత్రమే కావాలని మీకు నిన్ననే చెప్పాను కదాఅని కాస్త గౌరవం లేకుండా దురుసుగా  సమాధానమిచ్చాడు.

అపుడు మహరాజ్! అవును కదా! మర్చేపోయాను.  అయితే నీకు పదికోట్లు మాత్రమే కావాలి.  అంతేగా. ఇది పెద్ద విషయం ఏమీ కాదు.  నేను నీకోసం డబ్బు సద్దుబాటు చేస్తాను.  అప్పటివరకు నువ్వు ఇక్కడె ఉండుఅన్నారు.

విధంగా మహరాజ్ బ్బు సద్దుబాటు చేస్తాను అనే మాట మళ్ళీ మళ్ళీ చెపుతూ ఒక వారం రోజులదాకా అతనిని అక్కడె ఉంచేసారు.  ఇక తనికి ఓపిక నశించి స్థిమితం లేకుండా పోయింది.  ఆహారం కూడా ముట్టకూడదనుకున్నాడు.  మహరాజ్ అతనిని భోజనం చేయమని చెప్పారు.

ఆ తరువా గోండవలేకర్ మహరాజ్ అతనితోనేను నీకోసం డబ్బు తయారుగా ఉంచాను.  మొత్తం డబ్బంతా చిన్న చిన్న సంచులలో కట్టి ఉంచాను.  నువ్వు ఆసంచులన్నీ ఇపుడు ఎలా తీసుకువెడతావు?” అన్నారు. 

వాటిన్నిటినీ డ్లబండిలో వేసుకుని తీసుకెడతానుఅన్నాడు.

అయితే పదికోట్ల రూపాయలు ఉన్న సంచులను తీసుకెళ్లడానికి ఎన్ని బళ్ళు వసరమవుతాయిఅని ప్రశ్నించారు మహరాజ్.

మొత్తం సంచులన్ని తీసుకువెళ్లడానికి వంద బళ్ళు అవసరమవుతాయిఅన్నాడు.

అయితే వెంటనే వందబళ్ళు తీసుకునిరా.  తీసుకొచ్చిన వెంటనే నీకు వందకోట్లు ఇచ్చేస్తానుఅని మహరాజ్ అన్నారు.

పద్దమనిషి ఆలోచించి అన్ని బళ్ళను నేను ఎక్కడినుంచి తీసుకురాగలను.  ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వంద బళ్ళు.   ఇక ఏసాధువు వద్దనుంచి వందకోట్ల రూపాయలను పొందాలనుకోకూడదు అని చివరికి ఆపెద్దమనిషికి అర్ధమయింది. తన మూర్ఖపు ఆలోచనను వదలిపెట్టి బరువెక్కిన హృదయంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment