18.11.2020 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు
బాబావారి శుభాశీస్సులు
బాబా
వారి వాక్కు ఎంత శక్తివంతమయినదో తెలిపే ఒక అధ్బుతమయిన లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.
శ్రీ
సాయి లీల సంవత్సరం I అశ్విన్ శక.సం.1845/వాల్యూమ్.8 సాయి అమృతాధార నుండి గ్రహింపబడినది.
తెలుగు
అనువాదమ్.. ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
బాబా
వాక్కు అమోఘమ్
అళంది, శ్రీ పద్మనాభేంద్రస్వామి గారు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను ఉత్తరాల ద్వారా బొంబాయిలో ఉన్న శ్రీ హరి సీతారామ్ దీక్షిత్ గారికి తెలియచేసారు. ఆ ఉత్తరంలో ఆయన స్వయంగా వివరించిన అనుభవాలు…
“జనవరి 29వ.తారీకు గురువారమునాడు మీ దగ్గరనుంచి బయలుదేరి షిరిడీ వెళ్ళాను. అక్కడినుండి అళందికి చేరుకొన్నాను. ఫిబ్రవరి రెండవ తారీకున గురుమహరాజ్ గారి సంవత్సరీకాలు పూర్తయిన తరువాత మంగళవారమునాడు బొంబాయికి చేరుకొన్నాను. నా చెవికి వెనుక భాగంలో వాపు వచ్చింది. దానిని డా.అండర్ వుడ్ గారికి చూపించాను.
అయన అంతా పరీక్షించి ఆపరేషనేమీ అవసరం లేదన్నారు. ఆయన ఒక విధమైన సీరం ఇంజక్షన్ చేసారు. అది సరిపోతుందని చెప్పారు. బాబావారి శక్తి ఆయన మాటలు ఎంత అధ్బుతమయినవో మనం
గ్రహించుకునే శక్తిలేనంత గొప్పగా ఉంటాయి.
నేను
సాయిబాబా వారి దర్శనం చేసుకోవడానికి షిరిడీ వెళ్లాను. ఆయన దర్శనం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అక్కడున్నవారందరూ నా చెవి వెనక వచ్చిన వాపు గురించి
బాబాకు చెప్పమన్నారు. కాని నేను చెప్పడానికి
అంగీకరించలేదు. కర్మ ప్రకారం ఏది నిర్ణయించబడిందో దానిని ధైర్యంగా భరించాలి అని శృతిలో
చెప్పబడింది. చివరికి మాధవరావు దేశ్ పాండేతో
బాబాకు నా చెవి సమస్య గురించి విన్నవించమని చెప్పాను. సాయి ఈ విషయం వినగానే ఎంతో ప్రేమగా “అల్లా భలా కరేగా”
అన్నారు. ఆయన ఈ మాటలు ఉఛ్చరించారో లేదో ఆక్షణంలోనే
నా తలనెప్పి తగ్గిపోయింది.
నాగపూర్,
అళందిలోని వైద్యులు నా చెవికి సర్జరీ చేయలని అన్నారు. కాని బొంబాయిలో ఉన్న వైద్యుడు నాకు సీరం ఇంజక్షన్
ఇచ్చిన తరువాత వాపు తగ్గిపోయింది. జరిగిన ఈ
సంఘటనలను గుర్తుకు తెచ్చుచోగానే నాకెంతో ఆనందమనిపించింది.
నేను
షిరిడీ మొట్టమొదటిసారిగా వెళ్ళి బాబాను దర్శనం చేసుకున్నపుడు ఆయన నన్ను దక్షిణ అడిగారు.
“మహరాజ్,
నేను ఒక సన్యాసిని.. నేను డబ్బు ఎక్కడినుంచి తేగలను?” అన్నాను.
ఆయన
దర్శనం చేసుకున్న తరువాత నేను తిరిగి వెళ్ళిపోయాను. ఆ తరువాత
బాబా, దేశ్ పాండేతో “నువ్వు నాకు ఏదయినా సమర్పించగలవా అని స్వామిని అడిగాను. కాని ఆయన నాకేమీ ఇవ్వలేదు. ఆయన నావద్దకు వచ్చారు కాబట్టి నేనే ఆయనకు ఇవ్వాలి”
అని అన్నారట. బాబా ఈమాటలను అనగానే నాలో ఉన్న
బాధలన్నీ నయమయ్యాయి. అటువంటి మహాత్ముడిని గురించే
నేనేమి పొగడగలను? మానవ అవతారంలో ఉన్న ఆ నారాయణుడే
బాబా.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment