26.12.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 18 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస కర్త… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
నా డైరీలోని సారాంశాలు
4.20
P.M. ఈ రోజు సుదినం.
ఏదేమైనగాని
పరిస్థితులు
కాస్త ఒత్తిడి కలిగిచేలా ఉన్నాయి.
అందుచేత
నన్ను నేనే జాగ్రత్త వహించుకొంటూ ప్రతివిషయంలోను సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
ఇప్పుడే
The Pilgrims In హోటల్
లో గదితీసుకున్నాను.
ఇక్కడ
చాలా సౌకర్యంగా ఉంది.
రోజుకు
రూ.85/- అద్దె.
నాకు
ఎక్కువ అనిపించలేదు.
అద్దె
విషయంలో నాకు చాలా సంతృప్తిగా అనిపించింది.
ఈరోజు ఉదయం సాయిబాబాకు మొట్టమొదటీ భక్తుడు, బాబా షిరిడీలోకి ప్రవేశించగానే ‘సాయి’ అని పిలిచిన ప్రముఖవ్యక్తి మహల్సాపతి కుమారుడయిన మార్తాండ బాబాతో ముఖాముఖీ సంభాషించాను.
ఆయన
బాగా వృధ్ధుడు.
ఆయనను
చూడగానే ఎంతో గౌరవభావం కలిగింది.
కారణం
ఆయనకు సుమారు 108 సంవత్సరాల వయసుండవచ్చు.
ఆయనతో
సంభాషణ చాలా క్లుప్తంగా జరిగినా కాని ఫలవంతంగానే జరిగింది.
ఆతరువాత
నేను షిరిడీ గ్రామస్థుడయిన బాలాజీ పిలాజీ గౌరవ్ తో గంటసేపు పైగా సంభాషించాను.
ఆయన
వయసు 90 సంవత్సరాలు ఉంటుంది.
ఆయన
స్వగృహంలోనే
మాసంభాషణ బ్రహ్మాండంగా జరిగింది.
మహల్సాపతిగారి ఇంటిలో
మొట్టమొదటగా
జరిగిన సంభాషణలో మార్తాండబాబా నాకు ఒక ఫొటోని కానుకగా ఇచ్చారు.
ఆఫొటోలో
మార్తాండబాబా
చాలా చిన్నపిల్లవానిగా ఉన్నపుడు సాయిబాబా ఒడిలో పడుకుని ఉన్నాడు.
ప్రక్కనే
మహల్సాపతిగారు
ఉన్నారు.
మధ్యాహ్నం దగ్గరలోనే ఉన్న కోపర్ గావ్ కి వెళ్ళాను.
అక్కడ
ఉన్న బ్యాంకులో నాదగ్గర ఉన్న డాలర్స్ మార్చుకొందామని నా ఆలోచన.
కోపర్
గావ్ షిరిడీనుంఛి 15 కి.మీ.దూరంలో ఉంది.
కాని,
బస్సులో అక్కడికి వెళ్లడానికి అరగంట సమయం పట్టింది.
మహారాష్ట్ర
ప్రజలందరూ గంగానది అంత పవిత్రంగా భావించే గోదావరి నది కోపర్ గావ్ గుండా ప్రవహిస్తుంది.
నేను
బ్యాంకుకు వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అవడంవల్ల నేను డాలర్లు మార్చుకోలేకపోయాను.
డాలర్
కి మారకంవిలువ రూ.12/- ఉంది.
మళ్ళీ
కోపర్ గావ్ కి రాకుండా వచ్చే సోమవారం హోటల్ లోనే మార్చుకోవాలి.
చూద్దాం. వాతావరణం
ఎల్లవేళలా బాగానే ఉంటోంది.
ఎండవేడిమి
కూడా ఎక్కువగానే ఉంది.
నేను ఈరోజు మధ్యాహ్నం 5 గంటల తరువాత శ్రీనారాయణబాబా గారితో ముఖాముఖీ సంభాషించగలననే అనుకొంటున్నాను.
ఆయన
ఇపుడు షిరిడీలోనే ఉన్నారని, ఆయనతోపాటుగా చాలామంది భక్తులు ఉన్నారని నాకు, స్వామి శేఖరరావు మా ఇద్దరికీ తెలిసింది.
ఆయనతో
కూడా మాట్లాడవచ్చని అనుకున్నాము.
బాలాజీ
పిలాజీ గౌరవ్ ఇంటిలో నేను శ్రీనారాయణబాబా ఫొటోలు, కొన్ని కరపత్రాలను చూసాను.
నాకు
కాస్త అలసటగాను, కొంచెం తలనొప్పిగాను ఉన్నప్పటికి, ఇంతవరకు నేను చేసినపని నాకెంతో తృప్తినిచ్చింది.
7.15
P.M. The Pilgrims In హోటల్లో నాగదిలో
---
దురదృష్టవశాత్తు నేను శ్రీనారాయణబాబా గారిని కలుసుకుని మాట్లాడలేకపోయాను.
మేము
ఆయనను కలుసుకోవడానికి వెళ్ళినపుడు ఆయన అప్పుడే బొంబాయికి బయలుదేరి వెళ్ళిపోయారని తెలిసింది.
అక్కడ
బొంబాయిలో ఆయన ప్రధాన కార్యాలయం, మందిరం ఉందని, అక్కడ సాయిబాబావారి పుణ్యతిధి వేడుకలను జరపడానికి వెళ్లారని చెప్పారు.
ఆయనను
కలుసుకోలేకపోయినందుకు
నాకు చాలా బాధ కలిగింది.
బొంబాయికి
వెళ్లిన తరువాత బహుశా ఆయనను కలుసుకునే అవకాశం కలగవచ్చు.
సంస్థానం వారితో మాట్లాడాను.
షిరిడీలో
అక్టోబరు, 21,23 తేదీల మధ్య జరగబోయే శ్రీసాయిబాబావారి పుణ్యతిధి కార్యక్రమాల వివరణ అంతా ఉన్న కరపత్రం నాకు ఇచ్చారు.
పుణ్యతిధి
కార్యక్రమాలన్నీ
ముగిసిన తరువాత అక్టోబరు, 24వ.తారీకున సంస్థానం మానేజర్ తో మాట్లాడె అవకాశం ఊండవచ్చని చెప్పారు.
ఈ
సంవత్సరం సాయిబాబా సమాధిచెందిన రోజు అక్టోబరు 22 వ.తేదీనాడు వచ్చింది.
ఆయన
సమాధి చెందిన రోజున జరుగబోయే పుణ్యతిధి ఉత్సవాలలో నేను షిరిడిలో ఉండటం నాకెంతో శుభదాయకం.
ఈ
వేడుకలో పాల్గొనడం అంతా బాబా అనుగ్రహమే.
ఈ
రోజు నేను తిరిగివచ్చేటప్పటికి మధ్యాహ్నం చాలా ఆలశ్యమయింది. అందువల్ల రేపు చావడివద్ద శివనేశన్ స్వామీజీతో చాలాసేపు మాట్లాడవచ్చని అనుకొంటున్నాను.
ఆతరువాత
సాకోరీకి వచ్చి మరొకసారి శ్రీఉపాసనీ కన్యాకుమారి ఆశ్రమాన్ని దర్శించాలి.
సాయంత్రం
మళ్ళీ షిరిడి సంస్థానానికి తిరిగిరావాలి.
1960 సం.నుండి ఆంగ్లంలో సాయిలీల మాసపత్రికలు ప్రచురింపబడుతున్నాయని చెప్పారు.
వాటిని
కొనుక్కోవాలని
ఉందని వారికి ముందుగానే చెప్పాను
(అంతముకుందు
వరకు మరాఠీ భాషలోనే ప్రచురించేవారు).
పాతసంచికలు
దొరుకుతాయేమో
చూడాలి.
మధ్యాహ్నం చాలా ఆలస్యంగా స్వామి శేఖరరావుతో క్లుప్తంగా జరిగిన సంభాషణ రికార్డు
చేసాను. కొద్దిసేపట్లో క్రిందకి
వెళ్ళి హోటల్ రెస్టారెంటులో ఏదయినా తినాలి.
భోజనం
బాగానే ఉంటుందనుకొంటున్నాను.
ఒంటరిగా
ఉన్నందువల్ల
నన్నునేనే ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బాగా తినాలి, మంచి శుభ్రమయిన నీరు త్రాగాలి, మంచి నిద్ర ఉండాలి.
ఈరోజు
జరిగిన ముఖాముఖి…
షిరిడీలోని
మార్తాండమహల్సాపతిగారి తండ్రిగారి గృహంలో ఉదయం గం.9.30 నుండి 10.30 వరకు జరిగిన సంభాషణ…
(మహల్సపతి గారి గృహమ్)
మహల్సాపతి
చిమనాజీ నగారే (మరణించిన సం.1922) గారి కుమారుడు మార్తాండబాబాగా పరిచితులయిన మార్తాండ
మహల్సాపతి గారితో మొట్టమొదటగా జరిపిన సంభాషణ.
స్థానికంగా ఉన్న ఖండోబా ఆలయానికి ఆయన వంశపారంపర్య పూజారి…
మార్తాండబాబాగారి
వయసు విషయంలో సరైన నిర్ధారణ లేదు. ఆయన తనకు
108 సంవత్సరాల వయసు అని చెప్పారు. కాని ఆయనకు
92 సంవత్సరాల వయసు ఉంటుందని ఉధ్ధవరావు దేశ్ పాండె మాధవరావు దేశ్ పాండే గారు చెప్పారు. బి.వి.నరసింహస్వామిగారు, మార్తాండగారు 1897 వ.సం.లో
(కృష్ణజన్మాష్టమినాడు జూలై - ఆగస్టు)లో జన్మించినట్లుగా
తను రచించిన పుస్తకం Life of Saibaba లో వ్రాసారు. కాని రామలింగస్వామిగారు 1890 వ.సం.జన్మాష్టమికి
ఏడుసంవత్సరాలముందుగా జన్మించినట్లుగా ఆయన తను రచించిన పుస్తకం Ambrosia in Shiridi
లో వ్రాసారు. ఆవిధంగా 1985 వ.సం.లో మార్తాండగారి
వయసు 88 సం.ఉండవచ్చు. (నరసింహస్వామిగారు వ్రాసినదాని ప్రకారం) లేక 95 సం.వయసుండవచ్చు.(రామలింగస్వామిగారు
వ్రాసినదాని ప్రకారం). కాని సాయిబాబా గురించి
వ్రాసిన రచనలలో నరసింహస్వామిగారు వ్రాసినవాటినే ఎక్కువమంది పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల 1897వ.సంవత్సరాన్నే మార్తాండగారి జన్మతేదీగా
భావిస్తారు.
ప్రశ్న --- సాయిబాబా
గురించి మీకు గుర్తున్న విషయాలు చెబుతారా?
జవాబు --- మానాన్నగారు
మహల్సాపతిగారు జీవించి ఉన్నపుడే బాబాగారే నాకు పెండ్లిసంబంధం కుదిర్చి వివాహం చేసారు. నావివాహం ఏసంవత్సరంలో జరిగిందో నాకు సరిగా గుర్తులేదు. బాబా సమాధి చెందేనాటికి నావయస్సు 40సం. ఆసమయంలో నేను ప్రత్యక్ష సాక్షిని.
ప్రశ్న --- ఆరోజులలో
జరిగిన విషయాలు మీకు గుర్తున్నవి చెబుతారా?
జవాబు --- మాతండ్రిగారు
మరణించినపుడు ఆయనను సమాధి చేసారు. ఆయన సమాధిని
ఆయన స్వగృహంలోనే ఏర్పాటుచేసారు.
ప్రశ్న --- అంటే
మీరు చెప్పేది మహల్సాపతిగారి సమాధి ఇదే ఇంటిలో ఉందా?
అవును. ఇక్కడే ఉంది (ఆ సమాధిని నాకు చూపించారు) ఇదే ఈఇంటిలోని ప్రత్యేకమయున విశేషం.
ప్రశ్న ---సాయిబాబావారు సమాధి చెందిన సమయంలో ఏంజరిగింది?
జవాబు --- అక్టోబరు 15, 1918వ.సం. లో దసరా ఉత్సవాలు జరుగుతున్న సమయంలో బాబా తమ దేహాన్ని విడిచారు. ఆతరువాత 1922వ.సంలో మాతండ్రిగారు కాలం చేసారు.
ప్రశ్న --- మీతండ్రిగారు
బాబాతో చాలా సన్నిహితంగా ఉండేవారని చదివాను.
వారిద్దరిమధ్య అత్యంత సన్నిహితంగా ప్రత్యేకించి జరిగిన సంఘటన ఏదయినా మీకు గుర్తుందా?
జవాబు --- బాబా
మాకుటుంబాన్ని ఎంతగానో అభిమానించేవారు. ఆయనకు
మేమంటే చాలా చాలా ఇష్టం. ఆయన మానాన్నగారికి ఎన్నో
కానుకలు ఇచ్చారు. ఇది చూడండి ఇది బాబాగారి
కఫనీ. అది బాబాగారిచ్చిన కఱ్ఱ.
ప్రశ్న --- ఇక్కడె నేను చూస్తున్న పసుపురంగు కఱ్ఱేనా బాబాగారు ఇచ్చినది?
జవాబు --- అవును. అదే. ఆయన
మాకు డబ్బు కూడా ఇచ్చారు. చూడండి ఇవే బాబా
ఇచ్చిన మూడు వెండిరూపాయి నాణాలు (నాకు ఆయన ఆనాణాలను చూపించారు). ఈమూడు నాణాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంకేతాలు,
త్రిమూర్తులు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment