28.12.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 20 వ.భాగమ్
(పరిశోధనా
వ్యాస రచయిత… శ్రీ
ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
నా డైరీలోని సారాంశాలు
షిరిడీలో బాలాజీ పిలాజీ గురవ్ గారి గృహంలో
మధ్యాహ్నం 11.00 నుండి
12.15 వరకు
1912వ.సంవత్సరంలో షిరిడిలో
స్థిరపడిన శ్రీ బాలాజీ పిలాజీ గురవ్ గారితో మొట్టమొదటి సంభాషణ
ప్రశ్న --- మీ వయసెంత?
జవాబు --- నాకు ఇపుడు 90 సంవత్సరాలు
తుకారామ్ --- బాబా సమాధి చెందేనాటికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు
బాలాజీ పిలాజీ (దుబాసీ చెప్పిన విషయాన్ని సరిదిద్దుతూ) బాబా సమాధి చెందినపుడు
నావయస్సు 20 సంవత్సరాలు 30 కాదు. బాబా సమాధి చెందిన సమయంలో నేనక్కడే
ఉన్నాను. ఇక్కడ నాదగ్గర
ఉన్న లంగోటీ ఇదే బాబా ధరించినది.
తుకారామ్ --- బాబా ధరించిన లంగోటీ అదే ఈయన దగ్గర ఉన్నది.
బాలాజీ పిలాజీ ---
బాబా నాకు డబ్బు ఇచ్చారు. అవి నాణాలు. అది దక్షిణగా ఇచ్చినవి కాదు. నా అవసరాలకోసం ఇచ్చిన డబ్బు. నాదగ్గర ఇంకా కొన్ని నాణాలున్నాయి. వాటిని ఇప్పటికీ దాచుకొన్నాను.
ప్రశ్న
--- మీఉద్దేశ్యంలో బాబా
బోధించిన ఉపదేశాలలో అతిముఖ్యమయినది ఏదో చెబుతారా?
జవాబు
--- నాకు 14
సం.వయసున్నపుడు బాబాకు సన్నిహిత భక్తునిగా మారాను. నేను
మానాన్నగారితో 1912వ.సం.లో షిరిడీకి వచ్చాను. అపుడు నాకు 14 ఏండ్లు. బాబా సమాధి చెందినపుడు నావయసు
20 సంవత్సరాలు. 1912
నుండి 1918 వరకు 6 సంవత్సరాల
కాలంలో బాబానుండి నాకు చాలా లభించింది.
ప్రశ్న
--- బాబాతో కలిసి మీరేమి
చేస్తూ ఉండేవారు?
జవాబు
--- మానాన్నగారు సంగీత
వాయిద్యాలు వాయించేవారు. మానాన్నగారి పేరు పిలాజీ గురవ్.
నేను కూడా వాయిస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా తబలా వాయించేవాడిని. మానాన్నగారు
సన్నాయి వాయించేవారు.
ప్రశ్న
--- బాబా తరచుగా ఆగ్రహిస్తూ ఉండేవారట, నిజమేనా?
జవాబు
--- కొన్నిసార్లు. నేను చిన్నవాడిగా ఉన్నపుడు బాబా
నన్ను కొట్టడం గుర్తుంది. అప్పుడప్పుడు బాబా నన్ను కొడుతూ ఉండేవారు.
ప్రశ్న
--- ఆయన మిమ్మల్ని ఎందుకని
కొట్టేవారు? దానికి ఏమయినా కారణాలున్నాయా?
జవాబు --- లేవు. ఏవిధమయిన కారణాలు లేకుండానే కొట్టేవారు. ఎటువంటి కారణం లేకుండానే మాలాంటి యువకుల మీద కోపగిస్తూ ఉండేవారు. ఒకసారి నేను బాబాతో లెండీబాగ్ కు వెడుతున్నాను. అక్కడ బాబా కొన్ని మొక్కలను నాటి వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉన్నారు. ఆమొక్కలు విరిగిపోయి దెబ్బతిని పడిఉన్నాయి. బాబా కోపంతో “ఇది చూడలేదా నువ్వు? ఈ చెట్లను ఈ విధంగా ఎందుకని పాడుచేయించావు? వెళ్ళు అవతలికి” అని నామీద కోపపడ్డారు.
ప్రశ్న
--- ఆయన మిమ్మల్ని కొట్టారా?
తుకారామ్ జవాబు
--- లేదు, లేదు. బాబా ఆయనని వెళ్ళిపొమ్మన్నారు
అంతే.
ప్రశ్న
--- అంటే ఆమొక్కలని
జాగ్రత్తగా పెంచే బాధ్యత బాలాజీ పిలాజీది, ఆయన దానిని సరిగా నిర్వర్తించలేదు,
అందువల్లనే బాబాకు కోపం వచ్చిందా?
తుకారామ్
--- అవును, ఆరోజుల్లో ఆయన బాబాకు తోటమాలి.
ప్రశ్న
--- అంటే బహుశా ఆరోజుల్లో
కొంతమంది యువకులు చెట్లెక్కి వాటిని పాడుచేస్తూ ఉండేవారా?
తుకారామ్
--- అవును, అది నిజమే.
బాలాజీ పిలాజీ ఇంకా చెప్పిన విషయాలు…
“అపుడు నేను బాబాతో “బాబా మీరెందుకని
నాతో ఇలా కోపంగా మాట్లాడుతున్నారు?
ఈ చెట్లు ఇలా పాడయిపోయాయని నన్నెందుకు నిందిస్తున్నారు? ఈ చెట్లు ప్రభుత్వంవారి ఆస్తి. అది ఇంకొకరికి చెందినవి.” అని అన్నాను. అపుడు బాబా “కాని చెట్లకి కూడా ప్రాణం ఉంటుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిని నరికి నాశనం చేయకూడదు. ఈవిధంగా జరగకుండా నిరోధించాలి” అన్నారు.
నేను (ఆంటోనియో)--- అయితే ఎవరో ఆచెట్ల కొమ్మలను నరికేసి ఉంటారు అందుకనే బాబాకు అంతటి తీవ్రమయిన
ఆగ్రహం కలిగింది అవునా?
తుకారామ్
--- అవును. ఎవరూ కూడా ఆవిధంగా చేయకూడదని బాబా
చెప్పారు.
బాలాజీ పిలాజీ గుర్తుకు తెచ్చుకొని చెప్పిన విషయం…
ఒకసారి రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో షిరిడీలో నీటికొరత
ఏర్పడింది. అసలు ఒక్క
చుక్క నీరు లేకుండా అయిపోయింది. ఏమిచేయాలో ఎవరికీ అర్ధం కాలేదు.
రామనవమికి వేలాదిమంది యాత్రికులు షిరిడికి చేరుకొన్నారు. పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. గ్రామస్తులంతా ఇపుడు మనమేమి చేయాలి,
మనమేమి చేయాలి అని చాలా గాభరాపడుతూ ఉన్నారు. అపుడు అందరూ కలిసి బాబా వద్దకు వెళ్ళి
ఇపుడేమి చేయాలి అని బాబాను అడిగారు. అపుడు బాబా ఈవిధంగా చేసారు. బాబా గ్రామస్తులనుండి కొన్ని జొన్నలు తీసుకున్నారు.
ఆజొన్నలను తీసుకు వెళ్ళి అసలు నీటిఊట కూడాలేని గ్రామంలో ఉన్న ఎండిపోయిన బావిలో వేసారు. బాబా ఆ బావిలో జొన్నలను వేసిన వెంటనే
ఆ బావిలోకి మరలా సమృధ్ధిగా నీరు ఉబికి వచ్చింది. అప్పటినుండి షిరిడీలో నీటి కొరతన్నది
రాలేదు. మేమందరం ఆబావిలోనుండే
నీటిని తోడి తెచ్చుకునేవారము.
ప్రశ్న
--- ఇది సాయిబాబా చేసిన
అధ్బుతమయిన లీలా?
జవాబు
--- అవును అది అధ్భుతమే.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment