Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 11, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 52 వ.భాగమ్

Posted by tyagaraju on 6:34 AM

 




11.03.2021 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మహాశివరాత్రి శుభాకాంక్షలు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 52 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీమంగళవారంఅక్టోబరు, 22, 1985

ప్రశ్న   ---   తనలాగే ఉపాసనీ కూడా గొప్ప గురువు అవుతారని బాబా అన్నారని మీ ఉద్దేశ్యమా?

తుకారామ్   ---   అవును.  సాయిబాబా ఆవిధంగా ఉపాసనీ మహరాజ్ తో చెప్పారు.

ప్రశ్న   ---          మరి ఆయనకు భోజనం సంగతి ఏమిటి?  ఆయన తన  భోజనానికి ఏమయినా ఏర్పాట్లు   చేసుకున్నారా?

జవాబు   ---   ఉపాసనీ మహరాజ్ ఖండోబా దేవాలయానికి వెళ్లగానే తన సర్వస్వాన్ని వదిలేసుకున్నారు.

ప్రశ్న   ---   అంటే మీరు చెబుతున్నది ఏమిటి?

జవాబు   ---   సర్వస్వం అంటే ఆయన తన బట్టలు, ఇంకా ఏమయినా ఉంటే అవీ మొత్తం వదిలేశారు.

ప్రశ్న   ---   ఆయన దిగంబరంగా ఉండేవారా?

తుకారామ్   ---   అవును.


బాలాజీ పిలాజీ   ---

ఖండోబా దేవాలయం వద్ద, “ఈయన ఒక వెఱ్ఱివాడిలో ఉన్నాడుదిగంబరంగా తిరుగుతున్నాడుఅని ఎవరో అన్నారు. ఆయనను ఆవిధంగా చూసినవారందరూ  పద్ధతి మంచిది కాదు, ఏమయిన బట్టలు వేసుకోండి”  అనేవారు. 


ప్రశ్న   ---   మరి భోజనం సంగతి ఏమిటీ?  ఎవరూ భోజనం పెట్టకపోతే ఆయన ఏవిధంగా తన ఆకలి తీర్చుకునేవారు?

జవాబు   ---   శారదాబాయి, దుర్గాబాయి అని ఇద్దరు స్త్రీలు ఉండేవారు.  వారిద్దరూ ఉపాసనీ బాబాకి భోజనం తెచ్చేవారు.

ప్రశ్న   ---   వారిద్దరూ ఉపాసనీ మహరాజ్ కు ఖండోబా దేవాలయంలోకి భోజనం తీసుకువచ్చేవారావారిద్దరి పేర్లు మరొక్కసారి చెబుతారా?

జవాబు   ---   శారదాబాయి, దుర్గాబాయి.

ప్రశ్న   ---   సాయిబాబా ఎప్పుడూ ఉపదేశాలు ఇచ్చేవారా?  కధలు ఎప్పుడూ చెబుతూ ఉండేవారా?

జవాబు   ---   బాబా అనేక విషయాలమీద భక్తులందరికీ కధలు చెబుతూ ఉండేవారు.  బాబా ఎప్పుడూ హిందీ గాని మరాఠీ గాని మాట్లాడేవారు.  అందరిలాగానే ఆయన కూడా రెండు భాషలు మాట్లాడేవారు.

నేను  (ఆంటోనియో)   ---   ఆవిధంగా ఆయన ప్రతిరోజు కధలు చెబుతూ ఉండేవారు

తుకారామ్   ---   అవును.

ప్రశ్న   ---   ఏదయినా ఒకటి చెప్పగలరా?

జవాబు   ---   లేదు.  నేను మర్చిపోయాను.

ప్రశ్న   ---   ఆయన యోగాభ్యాసం చేస్తుండగా మీరెప్పుడయినా చూసారా?   ఇక్కడ షిరిడిలో ఆయన ఏమయినా ఆసనాలు వేసేవారా?

జవాబు   ---   మీకు నేను నామొదటి ఇంటర్వ్యూలోనే చెప్పాను. హరిద్వార్ నుండి ఒక మహాత్ముడు వచ్చాడనీ ఆయన మారుతీ మందిరంలోనే ఉండేవాడనీ, సాయిబాబాతో యోగా గురించి చర్చించేవాడనీ విషయాలన్నీ మీకు చెప్పాను.

ప్రశ్న   ---   సాయిబాబా ద్వారకామాయిలో పదే పదే ఇదే భంగిమలో కూర్చొనేవారన్నది నిజమేనా? (నేను కాలుమీద కాలు వేసుకుని ఏవిధంగా కూర్చునేవారో చూపించాను).

జవాబు   ---   ఎప్పుడూ అలా కూర్చొనేవారు కాదు.  అప్పుడప్పుడు మాత్రమే ఆయన ఆవిధంగా కూర్చొనేవారు.

నేను  (ఆంటోనియో)   ---   అప్పుడప్పుడు మాత్రమేనా?

తుకారామ్   ---   అవును.

నేను (ఆంటోనియో)   ---   నేను ప్రశ్న ఎందుకు అడిగానంటే చాలా పటాలలో సాయిబాబా భంగిమలోనే కూర్చొని ఉన్నట్లుగా ఉంటాయి.

తుకారామ్   ---   అవును.  కాని అప్పుడప్పుడు మాత్రమే ఆయన ఆవిధంగా కూర్చొనేవారు.

ప్రశ్న   ---   మరింకేమయినా వేరే భంగిమలో కుర్చొనేవారా?

తుకారామ్   ---   లేదు మనం కూర్చొనేటట్లుగానే ఆయన కూడా మామూలుగానే కూర్చొనేవారు.

ప్రశ్న   ---   బహుశ పద్మాసనంలోనా?

తుకారామ్   ---   లేదు.  అలాకాదు.  మనం కూర్చొన్నట్లుగానే బాసింపట్టు వేసుకుని కూర్చొనేవారు. (సుఖాసనం)

బాలాజీ పిలాజీ   ---   బాబా ప్రత్యేకించి ఆసన భంగిమలోను కూర్చొనేవారు కాదు.  ఆయన ప్రజలముందు గాని, ఇతర సందర్భాలలో గాని ఎటువంటి భంగిమలోనూ ఉండేవారు కాదు.

ప్రశ్న   ---   ఆయన ఎప్పుడూ అదే భంగిమలో కూర్చొనేవారు కాదా?

తుకారామ్   ---   లేదు.  అప్పుడప్పుడు మసీదులో ఉన్న రాతిమీద కూర్చొని ఉన్న సమయంలోనే ఆయన ఆవిధంగా కూర్చొనేవారు.

ప్రశ్న   ---   నారాయణబాబా గురించి ఏమయినా వివరిస్తారా?

జవాబు   ---   1960.సం నుండి నారాయణ బాబా షిరిడీకి రావడం మొదలుపెట్టారు.  అందరు భక్తులలాగానే ఆయన కూడా వస్తూ పోతూ ఉండేవారు.

ప్రశ్న   ---   ఆయన కూడా ఇతర సామాన్య భక్తుడిగానే ఉండేవారా?

జవాబు   ---   నేను మీకు రామ్ బాబా గురించి చెప్పగలను.  ఆయనకు 130 సం.వయస్సు.  అంత వృధ్ధులయినప్పటికీ బాబా జీవించి ఉన్న రోజులలో ఆయన ఇక్కడ లేరు.

ప్రశ్న   ---   అలాగా,  అయితే సాయిబాబా జీవించి ఉన్న రోజులలో ఆయన ఇక్కడ  లేరన్నమాట?

తుకారామ్   ---   లేదు.  ఆవిధంగా బాలాజీ పిలాజీ చెబుతున్నారు.  ఆతరవాతి సంవత్సరాలనుండి ఆయన ఎప్పుడూ షిరిడీకి వస్తూ పోతూ ఉండేవారు.

ప్రశ్న   ---   సాయిబాబా సమాధి చెందిన తరువాత రామ్ బాబా షిరిడీకి వస్తూ పోతూ ఉండేవారు.

తుకారామ్   ---   అవును.

ప్రశ్న   ---   అంతకు ముందు వచ్చేవారు కాదా?

తుకారామ్   ---   లేదు.

బాలాజీ పిలాజీ ---

అంతకుముందు ఎప్పుడూ రాలేదు.  బాబా సమాధి చెందిన తరవాత మాత్రమే రావడం మొదలుపెట్టారు.

నేను   (ఆంటోనియో)   ---   చాలా చిత్రంగా ఉందే?

తుకారామ్   ---   అవును.

(కాని నిజానికి రామ్ బాబా సాయిబాబా జీవించి ఉన్న రోజులలో ఫిబ్రవరి, 22, 1914 .సం. లో ఒక్కసారి మాత్రం షిరిడీలో ఉన్నారు.  ధబోల్కర్ గారి శ్రీ సాయి సత్ చరిత్ర ఆంగ్ల పుస్తకం .23, .వి.  12 – 20 లో వివరించబడి ఉంది.)

శ్రీ సాయి సత్ చరిత్ర ఆంగ్ల పుస్తకంలోని ఓ.వి. చదవండి..  త్యాగరాజు)

(Bhaavaarth Shri Saisachcharit By Shri Govind Raghunath Dabholkar Ch.23

O.V. 12..Once, one devotee accompanied Mr.Nanasaaheb Chandorkar who took him to masjid for Darshan, a glimpse of Sai Baba.  This devotee was a follower of Yoga.

After O.V. 18 narration regarding this devotee…

This devotee was later known as one of the ardent devotees of Baba.  His name was Shrirambaba.  He had his residence in suburbs of Mumbai at Khar.  He lived upto 125 years of age.  He used to refer to himself as Ram.

O.V. 19 – The devotee, Rambaba took a seat near Sai Baba and with a pure mind, without any doubts surrendered himself to Baba.)

ప్రశ్న   ---   మీరెప్పుడయినా బషీర్ బాబా గురించి, మెహర్ బాబా గురించి విన్నారా?

జవాబు   ---   ఇక్కడ షిరిడిలో బషీర్ బాబాను ఒక్కసారి మాత్రమే చూసాను.

ప్రశ్న   ---   ఒక్కసారేనా?

తుకారామ్   ---   ఒక్కసారే.  ఆయన ఇక్కడ షిరిడిలో పది రోజులున్నారు.  ఆయన ఇక్కడ కొన్ని యజ్ఞాలు కూడా చేసారు.

బాలాజీ పిలాజీ---

ఇక్కడ షిరిడికి వచ్చినపుడు తనకు 55 సం.వయసని బషీర్ బాబా చెప్పారు.   ఆతరవాత నుంచి నేనాయనను చూడలేదు.

ప్రశ్న   ---   బషీర్ బాబా కూడా అందరిలాగానే ఒక సామాన్య భక్తుడని మీరు భావిస్తున్నారా?

తుకారామ్   ---   అవును.  ఆయన ఒక భక్తుడు మాత్రమే.  ఆయన మరణించారని విన్నాను.

బాలాజీ పిలాజీ   ---   గణేష్ పురి నుండి స్వామి ముక్తానంద అనే ఆయన ఇక్కడికి షిరిడీకి వస్తూ ఉండేవారు.  కాని బాబా జీవించి ఉన్న రోజులలో రాలేదు.  బాబా సమాధి చెందిన తరువాత వచ్చారు.

ప్రశ్న   ---   ఆయన మాటిమాటికీ షిరిడీ వస్తూ ఉండేవారా?

తుకారామ్   ---   అవును. వచ్చిన తరువాత తిరిగి గణేష్ పురికి వెళ్ళిపోయేవారు.

నేను  (ఆంటోనియో)   ---   ధన్యవాదాలు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List