06.04.2022 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 7 వ, భాగమ్
అధ్యాయమ్
- 3
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
శ్రీ
సాయి విశ్వవిద్యాలయమ్ – 1
మనము పారాయణ చేస్తున్న 53 అధ్యాయాలు గల శ్రీ సాయి సత్ చరిత్రే ఒక విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి వైస్ చాంస్లర్ సాయిబాబా.
నాతల్లిదండ్రులు చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా 1974 వ.సం. మే 18 వ.తారీకున నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించింది.
ఇంటికయినా, పట్టణానికయినా, పాఠశాల, కళాశాల, రాష్ట్రం, దేశం ఏదయినా ఒక నిర్ణీతమయిన ఎత్తుకు ఎదగాలంటే ఎవరయినా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది.
ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశార్హత పొందిన విధ్యార్ధి ఎంతో అదృష్టవంతుడు.
మరణం
తర్వాత మానవుడిని మంటలు దహిస్తాయి. కాని చింతలు
మాత్రం వ్యక్తిని బ్రతికుండగానే దహిస్తాయి.
నాకు
ఉన్న సస్మస్యలన్నిటినీ సాయితో చెపుకుంటాను.
నామస్మరణలో నిమగ్నమయిపొమ్మని బాబా చెబుతారు. ఆవెంటనే నా సమస్యలన్నీ మాయమయిపోతాయి. కీ.శే, తాత్యాబువాకోతే పాటిల్, రామచంద్ర పాటిల్,
నానాసాహెబ్ రాస్నే, మాధవరావు దేశ్ పాండే, శ్యామరావు జయకర్, చంద్రాబాయి బోర్కర్, హేమాడ్
పంత్ ధబోల్కర్, ఈ విద్యార్ధులందరూ ఈ విశ్వవిద్యాలయంనుంచి ఉత్తీర్ణులయినవాళ్ళే. ఇటువంటి గొప్ప పట్టభభద్రులను చూసి, నేను కూడా ఈ
విశ్వవిద్యాలయంలో కష్టపడి పరీక్షకు తయారయి ఉత్తీర్ణుడినవుదామని నిర్ణయించుకున్నాను.
నేను
ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించి, ప్రతిరోజు చదవడం మొదలుపెట్టాను. నా మొట్టమొదటి పాఠం నమ్మకము, సహనము ఏవిధంగా నిలుపుకోవాలన్నదే. నీవు ప్రశాంతంగాను, సంతోషంగాను, జీవించాలనుకుంటే ఎవరి నమ్మకాన్ని భంగపరచవద్దు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవ్వరినీ కష్టపెట్టవద్దు. నువ్వు ఏవిత్తనమయితే నాటుతావో అదే పంట వస్తుంది.
మన
ఋషులు మనకి ఆధ్యాత్మిక జీవన విధానం గురించి నేర్పారు. ఒక దేవాలయం నిర్మింపబడిందంటే దానిని కేవలం ఆధ్యాత్మిక
కేంద్రంగానే మనం పరిగణించకూడదు. దేవాలయాలు
కూడా అనేకమయిన సామాజిక కార్యక్రమాలయినటువంటి సంగీతం, చిత్రకళ, నాట్యం, నాటకాలలాంటివాటికి
వేదికలుగా కూడా ఉంటాయి. ఇంకా మన సంస్కృతీ సాంప్రదాయాలు
ఇప్పటికీ నిలచి ఉన్నాయంటే అవి దేవాలయాల వల్లనే.
సమాజంలో అందరూ కలిసిమెలసి సన్నిహితంగా
ఉండటానికి దేవాలయాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఋషులు తాము ప్రదర్శించిన అధ్బుతాల కారణంగా ప్రపంచానికి
గొప్పవారిగా ప్రసిధ్ధి చెందలేదు. వారియొక్క
మృదుస్వబావం, అందరియడల దయగా ప్రవర్తించడం, వల్లనే మన ఋషులయొక్క గొప్పతనం జగత్ప్రసిధ్ధమయింది.
మానవ
జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి.
అటువంటి సమయంలో మనకి ధైర్యాన్నివ్వగలిగినవారు, ప్రేమతో మనకి రక్షణగా ఉండేవారు
అవసరమవుతారు. నేను దేవుడిని నమ్ముతాను. కాని
నా నమ్మకం ఏమిటంటే భగవంతుడిని పూజించడమంటే అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే. అదే మానవ సేవే మాధవసేవ. మా మందిరంలో బీదలకు తక్కువ వ్యయం అయే విధంగా వివాహాలు
జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసాము.
వివాహం
యొక్క అసలయిన ఉద్దేశ్యం, దాని ప్రాముఖ్యత ప్రతివారు తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఆకారణం చేతనే మేము ‘సత్యశోధక్ సమాజ్’ (దీని గురించి తెలుసుకోవాలంటే జ్యోతిరావు పూలే గురించి
గూగుల్ లో చదవండి….త్యాగరాజు) , మరియు పూనా ‘ధ్యానప్రబోధిని’ (దీని గురించి కూడా గూగుల్
లో చదవండి… త్యాగరాజు) సాంప్రదాయాన్ని తీసుకువచ్చాము. ఈ రెండు సాంప్రదాయాలు కూడా ప్రాచీనమయినవే. గురువారమునాడు వివాహాలకి, ఇతర సేవా కార్యక్రమాలకి
చావడి తెరిచే ఉంటుంది. ప్రతి ఆదివారమునాడు
సానె గురూజీ కధామాలను ఏర్పాటు చేస్తూ ఉంటాము.
విద్యార్ధులకు అవసరమయిన పుస్తకాలను, దుస్తులను ఉచితంగా పంచిపెడుతూ ఉంటాము. బాబా ఆంప్టే, ఎస్.ఎం. జోషీ, ప్రకాష్ మెహదీకర్ గార్లు
పన్వేల్ తాలుకా నెరూలో కుష్టురోగుల కోసం ఒక సంస్థను నడుపుతున్నారు. మా అందరి తరఫునుంచి వారు చేస్తున్న మంచి కార్యానికి
విరాళాలను సేకరించడానికి ఒక హుండీని కూడా ఏర్పాటు చేసాము. మతసంబంధమయిన కార్యక్రమాలకు సహాయపడటమే కాకుండా పార్లే
ఈస్ట్ లో రాత్రివేళలలో నడపబడే పాఠశాలలకు కూడా సహాయపడుతూ సమాజ సేవను కూడా చేస్తున్నాము.
(ఇంకా
ఉంది)
శ్రీమతి
ఉజ్వలా తాయి బోర్కర్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment