13.06.2022 సోమవారం
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 14 వ, భాగమ్
అధ్యాయమ్
–11
అధ్యాయం
10 దాసగణు కీర్తన గురించిన లీల. ఇది శ్రీ షిరిడీ
సాయిబాబాతో తర్ఖడ్ కుటుంబము వారి అనుభవాలు లో కొన్ని ఏండ్ల క్రితం ప్రచురించాను. కాని శ్రీ ఉదయ్ అంబాదాస్ గారి పుస్తకం
BENEVOLENCE OF SHRI SAI లో చాలా సంక్షిప్తంగా ఇచ్చినందువల్ల ప్రచురించడం లేదు.
ఇచ్చాను
--- తీసుకున్నాను
డా. కేశవ్ భగవంత్ అనబడే అన్నాసాహెబ్ గావంకర్ శ్రీ సాయిబాబాతో కలయిక
అన్నాసాహెబ్ గావంకర్ 1906 వ. సం. ఏప్రిల్ 28 వ.తారీకున వసై జిల్లాలోని ఆర్నాలలో జన్మించాడు. చిన్నతనంలో అతనికి జబ్బు చేసింది. జ్వరం కూడా చాలా తీవ్రంగా ఉంది. వైద్యం చేయిస్తూ ఎన్ని మందులు వాడినా ఫలితం కన్పించలేదు. పరిస్థితి ఇంకా తీవ్రమవసాగింది. అతని చాతీ అంతా చీముతో నిండిపోయిఉంది. అతని తల్లిదండ్రులు ప్రముఖ వైద్యుని వద్ద చూపించడానికి బొంబాయికి తీసుకు వచ్చారు.
పూర్తిగా పరీక్షించిన
తరువాత ఆపరేషన్ చేయడం తప్ప మరొక మార్గం లేదని వైద్యుడు చెప్పాడు. తమ కొడుకు వయస్సు కేవలం ఏడు సంవత్సరాలు కావడం వల్ల
అతని తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించడానికి సుముఖంగా లేరు. అందుచేత స్వగ్రామానికి తిరిగి
వచ్చేశారు. తమ కొడుకు పరిస్థితికి వారు చాలా
ఆందోళనతో ఉన్నారు. ఒకరోజున షిరిడీనుంచి యశ్వంతరావు
గావన్ కర్, కేశవ్ ను చూడటానికి వచ్చారు.
యశ్వంతరావు,
కేశవ్ తల్లిదండ్రులతో ఎటువంటి గాభరా పడనవసరం లేదనీ, తాను షిరిడీనుంచే వచ్చాననీ చెప్పి
వారికి సాయిబాబా ఫొటో, ఊదీ ఇచ్చారు. కేశవ్
తల్లిడండ్రులు బాబా ఫోటోని ఒక బల్ల మీద పెట్టి ప్రతిరోజు సాయిని పూజించసాగారు. కేశవ్ తల్లి, కొడుకుకు నయమయితే షిరిడీ తీసుకువచ్చి
సాయికి వీశెడు మిఠాయిని సమర్పించుకుంటానని
మొక్కుకుంది. అదే వారంలో కేశవ్ చొక్కా తడిసిపోయింది. అతని ఛాతీ నుండి చీము రావడం ఆరంభమయింది. కొద్ది రోజులలోనే కేశవ్ కి ఆరోగ్యం చేకూరింది. చాతీలోనుంచి చీము స్రవించిన చోట మచ్చ ఏర్పడింది.
అయిదు
సంవత్సరాల తరువాత కేశవ్ కి 12 సంవత్సరాల వయసున్నపుడు తల్లి కుమారుడిని షిరిడీకి తీసుకువచ్చింది. తను మొక్కుకున్న ప్రకారం సాయికి మిఠాయి సమర్పించింది. బాబా మిఠాయి తీసుకుని కొన్ని కేశవ్ కి తినమని ఇచ్చారు. అపుడు అక్కడే ఉన్న దేశ్ పాండే మిఠాయిలను ఇంకెవరికీ
పంచలేదేమని బాబాని అడిగాడు. బాబా, కేశవ్ తల్లిని చూపిస్తూ ఈమె నన్ను అయిదు సంవత్సరాలుగా
ఉపవాసం ఉంచింది అన్నారు. మరుసటి రోజు కేశవ్,
అతని తల్లి ఇద్దరూ బాబాను దర్శించుకోవడానికి ద్వారకామాయికి వచ్చారు. అప్పుడు బాబా కేశవ్ ని దక్షిణ ఇమ్మని అడిగారు. కేశవ్ కి కొంతసేపు ఏమీ అర్ధం కాలేదు. అపుడు మాధవరావు దేశ్ పాండే, కేశవ్ అరచేతిని గుప్పిటగా
మూసి సాయి చేతిలో ఉంచాడు. బాబా కేశవ్ చిట్టి చేతులను కొంతసేపు పట్టుకున్నారు. దేశ్ పాండే,
కేశవ్ తో ఇచ్చాను అని బాబాతో చెప్పమన్నాడు.
బాబా తన చేతిని కఫనీ జేబులో పెట్టుకుని తీసుకున్నాను అని అన్నారు.
కేశవ్
మరియు బాబా మధ్య మాటల వ్యవహారం జరిగిందే తప్ప డబ్బుకి సంబంధించినదేమీ జరగలేదు. మూడవరోజున వారందరూ షిరిడీనుంచి తిరిగి వెళ్లడానికి
బాబా అనుమతి కోసం సాయిబాబా వద్దకు వెళ్ళారు.
కేశవ్, బాబాకు శిరసు వంచి నమస్కరించడానికి వంగున్నపుడు సాయిబాబా అతని శిరస్సును
తన చేతితో పట్టుకుని తన పాదాలమీద కొట్టుకొన్నారు.
కేశవ్ కళ్లముందు ప్రకాశవంతమయిన వెలుగు కనిపించింది. ఈ విధంగా కేశవ్ కి శక్తిపాతం ప్రసాదింపబడింది. పదినెలల తరువాత అక్టోబరు 15వ.తారీకున బాబా సమాధి
చెందారు.
కేశవ్
తన వైద్యవిద్యను పూర్తి చేసుకుని బాబా ఆశీర్వాదాలతో వైద్య పట్టా పొందారు. జీవితమంతా ప్రజలకు సేవ చేసారు. 1985వ. సం. ఆషాఢ ఏకాదశినాడు సాయి చరణాల వద్ద తన
జీవితాన్ని అంకితం చేసారు.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment