04.10.2022 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ
మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దసరా
శుభాకాంక్షలు
శ్రీ
సాయి దయా సాగరమ్ 30 వ, భాగమ్
అధ్యాయమ్
– 28
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
ప్రాణభిక్ష
పెట్టిన బాబా
నేను
విలే పార్లేలో ఉన్న సాయి మందిరంలో ముఫై సంవత్సరాలనుండి మానేజర్ గా పనిచేస్తున్నాను. మందిరంలో ఉన్న వివాహాలు జరిగే హాలును, ఇంకా మరికొన్ని
వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటాను. 30 సంవత్సరాలుగా
సాయిసేవలోనే ఉన్నాను. క్రీందటి సంవత్సరం నేను,
నాభార్య నేహ, మా ఇద్దరమ్మాయిలు నమ్రత, తన్విలతో షిరిడీ వెళ్ళాము.
షిరిడీ
చాలా రద్దీగా ఉంది. మొదటగా శనిసింగనాపూర్ వెళ్ళి
అక్కడ దర్శనం చేసుకున్న తరువాత షిరిడీకి ఉదయం 6 గంటలకు చేరుకున్నాము. స్నానాలు అయిన తరువాత బాబా దర్శనం కోసం క్యూలో నిలబడి
ఎదురు చూస్తున్నాము. నాకు మరుసటి రోజుకి దర్శనం
పాస్ ఉంది. షిరిడీలో ఉండటానికి వసతి ఏర్పాట్లన్ని
చేసుకున్నాను. సాయిని దర్శనం చేసుకున్న తరువాత
బసకు తిరిగి వచ్చి ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నాము. మరుసటిరోజుకి నాకు దర్శనం పాస్ ఉన్నందువల్ల బాగా
విశ్రాంతి తీసుకుని క్యూలో నిలబడే అవసరం, తొందర లేకుండా వెళ్ళచ్చనుకున్నాను.
తెల్లవారుఝామునే
నాలుగు గంటలకల్లా నిద్రలేచాను. క్యూలోనే నుంచుని
బాబా దర్శనం చేసుకోవాలనుకున్నాను. అందుచేత తొందరగా తెమలాలి అని మా అమ్మాయిలిద్దరినీ లేపుతున్నాను. అనుకోకుండా పైకి చూసినపుడు పైన ఉన్న సీలింగ్ ఫాన్
హోల్డర్ నుండి బయటకు వచ్చి వైరుమీద వేళ్ళాడుతూ కింద పడేలా ఉంది. అది సరిగ్గ మా ఇద్దరమ్మాయిలు పడుకున్న మంచం మీదే
పడబోతుంది. వెంటనే నేను ఒక్క ఉదుటున మంచం మీదకి
ఎక్కి పడబోతున్న ఫాన్ ని రెండుచేతులతో పట్టుకుని కింద ఒక వైపున పెట్టాను.
నేను
బాబా దర్శనానికి క్యూలోనే వెళ్ళాలనే ఆలోచన నాలో కలిగించి రాబోయే ప్రమాదాన్నుండి బాబా
మా ఇద్దరమ్మాయిలను రక్షించారు. దర్శనం పాస్ ఉంది కదా అని తెల్లవారుఝామునే లేవకపోయి
ఉంటె పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మేము తయారయి క్యూలో నుంచుని బాబాను దర్శనం చేసుకున్నాము. బాబా తన భక్తులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని కంటికి
రెప్పలా కాపాడుతూ ఉంటారు.
నితిన్
బార్వే
9220997877
(రేపటి సంచికలో పాదయాత్రలో జరిగిన అధ్భుతమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment