24.11.2022 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 46 వ, భాగమ్
అధ్యాయమ్
– 45
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
శ్రీ
సాయి సత్ చరిత్ర 16 వ.అధ్యాయమ్
సాయి
కృప
2000 వ. సంవత్సరంలో నేను, నా భార్య శ్రధ్ధ షిరిడీ వెళ్ళాము. అప్పుడు మా బాబు పియూష్ వయస్సు మూడు నెలలు. వాడిని బాబా చరణాల వద్ద పెట్టి బాబా ఆశీర్వాదాలు తీసుకుందామని షిరిడీ వచ్చాము. మా కోరిక నెరవేర్చుకుని బాబాను దర్శించుకుని సమాధిమందిరం బయటకు వచ్చాము. అకస్మాత్తుగా మా బాబు పియూష్ నా భార్య చేతులలోనుండి జారి క్రింద నేల మీద పడిపోయాడు.
శ్రధ్ధాకి ఒక్కసారిగా మతిపోయినంతపనైంది. ఒక్కక్షణం ఏమి జరిగిందో అర్ధం కాలేదు. కాని క్రిందకు చూసేటప్పటికి మా బాబు నేలమీద కాకుండా పువ్వుల మీద పడి ఉన్నాడు. ఎటువంటి దెబ్బలు తగలలేదు. బాబు క్షేమంగా ఉన్నందుకు మేమిద్దరం చాలా సంతోషించాము
మా
అబ్బాయికి 5 వ.ఏడు వచ్చాక మేము మరలా షిరిడీకి వెళ్లాము. ఆరోజు ఆదివారం. మరునాడు నేను మళ్ళీ ఆఫీసుకు వెళ్లవలసి ఉండటం వల్ల
ఆదివారమునాడే తిరుగు ప్రయాణం పెట్టుకున్నాము.
మాకు రిజర్వేషన్ లేదు. బస్సులన్నీ నిండిపోయి
ఉన్నాయి. నేను నా భార్యనీ, అబ్బాయినీ ఉన్న
చోటనే ఉండమని చెప్పి ఏబస్సులోనయినా ఖాళీ దొరుకుతుందేమోనని వెతకసాగాను. కాని ఏఒక్క బస్సులోను సీట్లు దొరకలేదు.
ఆసమయంలో
ఒక ఫకీరు శ్రధ్ధ దగ్గరకు వచ్చి ఒకచోటు చెప్పి అక్కడికి వెడితే రిజర్వేషన్ దొరుకుతుందని
చెప్పాడు. నేను, శ్రధ్ధ, ఆఫకీరు చెప్పిన చోటకు వెళ్ళాము. అక్కడ మాకు రెండు సీట్లకి రిజర్వేషన్ దొరికింది.
ఆసమయంలో
మాకు సహాయపడిన ఆ ఫకీరు సాయిబాబా తప్ప మరెవరూ కాదు.
రాత్రి
రెండు గంటలకి మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము.
బాబా
తన భక్తులు ఎక్కడ ఎటువంటి పరిస్థితులలో ఉన్నా వారి యోగక్షేమాలను కనిపెట్టుకుని చూస్తూ
ఉంటారు.
సురేంద్ర
కండోల్కర్
9820666772
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment