Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, December 15, 2022

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 3 వ.భాగమ్

Posted by tyagaraju on 4:41 AM

 


15.12.2022 గురువారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


 ఓమ్ శ్రీ సాయినాధాయనమః                               శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర – 3 వ.భాగమ్

(స్థిత ప్రజ్ణుడు - 3 వ.భాగమ్)

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744


శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్   -   11

బాబా క్షమాశీలురు, క్రోధరహితులు, ఋజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్యసంతుష్టులు, నిరాకార స్వభావులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు.

శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్   -   12

బాబా అందరినీ సమానముగా ప్రేమించెడివారు.  వారికి దేనియందు అభిమానము లేకుండెను.  శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరూ వారికి సమానమే.


శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్   -   23

బాబా ఎవరినీ నిరాదరించుటగాని, అవమానించుటగాని వారెరుగరు.  సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు.

శ్రీ సాయి సత్ చరిత్ర,  అధ్యాయమ్   -   32

శ్రీ సాయి దర్బారులోకి అనేకమంది వస్తూ ఉండేవారు.  గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాధసంప్రదాయమువారు, పగటివేషములవారు అచ్చట సమాదరింపబడుచుండిరి.

శ్రీ సాయి సత్ చరిత్ర, ఆధ్యాయమ్   _   35

బాబా దేనియందు అభిమానముంచలేదు.  ఎవరయినను నమస్కరించినను, నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను, ఈయకున్నను, తనకందరూ సమానమే.  బాబా ఎవరినీ అవమానించలేదు.  తనను పూజించినందుకు బాబా గర్వించెడివారు కాదు, తనను పూజించటల్లేదని విచారించేవారు కాదు.  వారు ద్వంద్వాతీతులు.

శ్రీ సాయి సత్ చరిత్ర,  అధ్యాయమ్   -   37

శ్రీ సాయి జీవితము మిగులపావనమయినది.  వారి నిత్యకృత్యములు ధన్యములు.  వారి పధ్ధతులు, చర్యలు వర్ణింపనలవి కానివి.  కొన్ని సమయములందు వారు బ్రహ్మానందములో మైమరచెడివారు.  మరికొన్ని సమయములందాత్మజ్ణానముతో తృప్తి పొందెడివారు.  ఒక్కొక్కప్పుడన్ని పనులు నెరవేర్చుచు, ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు.  ఒక్కొక్కప్పుడేమియు చేయనట్లు కన్పించినప్పటికి వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడువారు కాదు.  వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు.

శ్రీ సాయి సత్చరిత్ర అధ్యాయమ్   -   46

బాబా అన్న మాటలు, “ నాకు ఇల్లుగాని, కుటుంబము గని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు”.

శ్రీ సాయి సత్ చరిత్ర,   -   అధ్యాయమ్  48

బాబా యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు.  వారికి కుటుంబము గాని, ఇల్లుగాని, ఎట్టి ఆధారము లేకుండెను.  18 ఏండ్ల వయస్సునుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి.  వారొంటరిగా నిర్భయముగా ఉండెడివారు.  వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి యుండెడివారు.

శ్రీమద్భగవద్గీత  రెండవ అధ్యాయమ్  శ్లోకమ్,  69

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః

నిత్యజ్ణాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ణుడయిన యోగి మేల్కొని యుండును.  అది ఇతర ప్రాణులన్నిటికిని రాత్రితో సమానము.  నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని యుండును.  అది పరమాత్మతత్త్వమునెఱిగిన మునికి (మననశీలునకు) రాత్రితో సమానము.

శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్   -   4

ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్ర యందుండెడివారు.  లోకము నిద్రించినపుడు వారు మెలకువతో నుండెడివారు.  ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందే మునిగియుండెడెవారు.  (యోగి)  యోగి గురించి ముందు ముందు వస్తుంది ఈ  అధ్యాయములోని వివరణను గుర్తుంచుకొనండి)

పైన ఉదహరించిన భగవద్గీత శ్లోకములను బట్టి, శ్రీ సాయి సత్చరిత్రలోని విషయములను బట్టి బాబా స్థితప్రజ్ణుడని, యోగి అని మనం గ్రహించుకోవచ్చు.

(శ్రీ మద్భగవద్గీత 2 వ. అధ్యాయమ్ పూర్తయినది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List