Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, January 28, 2011

సచ్చరిత్ర - బాబా గారు ఇచ్చే సందేశములు

Posted by tyagaraju on 5:56 AM





28.01.2011 శుక్రవారము
సచ్చరిత్ర ద్వారా బాబా గారు ఇచ్చే సందేశములు


మన సాయి బంథువులందరికి కూడా బాబా గారే మనకు, తల్లి, తండ్రి, గురువు, దైవం. మన ఇంటిలో బాబా గారి ఫోటో, లేక విగ్రహమున్నా బాబా గారు మన ఇంటిలో ఉన్నట్లే.

బయటకు వెళ్ళేటప్పుడు, బాబా ఊదీ నుదుట పెట్టుకుని, బాబా గారి, ఫొటొ ముందుగాని, విగ్రహం ముందు గాని నిలబడి , బాబా వెళ్ళి ఒస్తానని చెప్పి వెళ్ళండి. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. వచ్చాక మళ్ళీ వచ్చాను బాబా అని చెప్పండి. ఇప్పుడు మన ఇంటిలో పెద్దవారు అంటే, తండ్రిగాని, తాతగారు గాని, లేక అమ్మకి గాని యెలా చెప్పి వెడతామో అలాగే, బాబా గారికి కుడా మనము చెప్పి వెళ్ళాలి. మన సాయి బంథువులందరూ ఇది అలవాటు చేసుకోవాలి.
మనకి యేదయినా సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రని చేతిలో పెట్టుకుని మనసమస్య మనసులో బాబాకి చెప్పుకుని పరిష్కారము చూపించమని అడిగి, పుస్తకము తెరవాలి. మన సమస్యకి పరిష్కారము ఆయనే చూపిస్తారు.
కాని నాకు, సమస్య అడగకుందానే జరగబోయే సంఘటన తెలియచేశారు. బాబా లీలలు నిగూఢంగా ఉంటాయి.

ఈ రోజు 2009 సం.లో నాకు కలిగిన అనుభూతి గురించి వివరిస్తాను.

నేను చదువుకునే రోజులలో యెప్పుడైనా డిక్ షనరీ తీసి మూసిన పుస్తకంలోనుంచి యేదొ ఒక పేజీ తీసి యే మాట వస్తుందో చూసేవాడిని. ఇది నేను చాలా తక్కువ సార్లే చేశాను.

యెప్పుడైనా పుస్తకాల ఎక్జిబిషన్ కి కి వెళ్ళినప్పుడు యేదొ పేజీ తీసి విషయము బాగుంటే వెంటనే కొనడం అలవాటు.
నా దగ్గర శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు వ్రాసిన శ్రీ సద్గురు సాయిబా జీవిత చరిత్ర - నిత్య పారాయణ గ్రంథం ఉంది. ఈ పుస్తకము నా స్నేహుతుడు యెప్పుడొ ఇచ్చాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం కాలుకి ఫ్రాక్చర్ అయ్యి ఇంటిలో ఉన్నప్పుడు అతనికి నేను ఇటువంటి పుస్తకం ఇచ్చి పారాయణ చేయమని ఇచ్చాను. అతనికి బాబా పరిచయం ఈ పుస్తకము ద్వారానే అయింది మొదటిసారిగా. అప్పటినుంచి అతను తనకు తెలిసినవారికి ఇటువంటి పుస్తకం కొని ఇస్తూ ఉన్నాడు.

అసలు విషయానికి వస్తాను. ఈ పారాయణ పుస్తకం నా కంప్యూటర్ టేబులు మీదే పెట్టుకున్నాను. ఒకసారి 2009 మార్చ్ నెలకి ముందు ఈ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని యేదో ఒకపేజీ తీసి ఒపేజీలొ ఒకచోట వేలుపెట్టి కనులు తెరచి చదివాను.

అది 97 పేజీ. అందులొ నేను వేలు పెట్టిన చోట ఇలా ఉంది>

" ఈ రోజు నీకు దుర్దినం. నీ ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త" ఇది చదవగానే ఇంక మిగతా పేరా చదవకుండా పుస్తకం మూసేశాను. భయం వేసి మిగతాది చదవలేదు. ఇలా ఆ నెలలో చాలా సార్లు యెప్పుడు తీసిన ఇదే పేజీ ఇదే పేరా రావడం జరిగింది. యేమిటి ఇలావస్తొంది అనుకున్నాను. బాబా గారి మీద పూర్తి విశ్వాసం ఉంది , కాని యేమిటి ప్రతీసారి ఇలా వస్తోంది అనుకున్నాను.

అసలు విషయమేమంటే ఆ అథ్యాయంలో నానా సాహెబ్ డెంగ్లీ శ్రీ మాన్ బూటీని ఇలా హెచ్చరించాడు. బూటీ భయపడిపోయాడు. తరువాత బాబా గారు బూటీని చూస్తూ "యేమిటి, డెంగ్లీ యేమంటున్నాడు? నీకు చావును సూచిస్తున్నాడా? భయపడకు థైర్యంగా ఉండు, నాకె ప్రమాదం లేదని అతనితో గట్టిగా చెప్పు. నువ్వు ద్వారకామాయి బిడ్డవు. " ఆ పేరాలో ఉన్న మొత్తము విషయము అది.

ప్రతీసారి అదేపేజీ రావడానికి నేను ఆ పుస్తకాని ప్రతీరొజు పారాయణ చెయ్యటల్లేదు. మరి యెందుకని అదే వస్తోందొ నాకు అర్థము అవలేదు.

మార్చ్ నెలలో మా ఆవిడ బంథువులతో షిరిడి వెళ్ళడం జరిగింది. అక్క్డ డినించి శ్రీప్రత్తి నారాయణరావు గారిచే రచింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము పుస్తకము తెచ్చింది.

ఒకరోజు నేను ఇంతకుముందు చెప్పిన పుస్తకములో యెప్పుడూ కుడివైపు పేజీ మాత్రమే చూస్తున్నాను, అనుకుని ఈ సారి ప్రత్తి నారాయణరావు గారి పుస్తకము తీసాను. ఆ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని తెరిచి యెడమవయిపు పేజీ తీసి వేలు పెట్టి చూసాను. అది 22 అథ్యాయములోని చివరి పేరా. అందులో కూడా పాము గురించి ఉంది. ఆ పేరాలో "పాములు, తేళ్ళతో సహ సక ల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును " అన్న వాక్యములు ఉన్నాయి.

14.03.2009 న శనివారమునాడు మా ఇంటిలో బాబా గారి విగ్రహము ముందు నిలబడి " బాబా నేను జ్ఞానిని కాదు, పుస్తకము తెరవగానే వచ్చే ఈ వాక్యముల అర్థము తెలియటల్లేదు, అంధు చేత ఈ రోజు నా కలలోకి వచ్చి దీనికి నివారణ చెప్పు" అని ప్రార్థించాను. ఆ రోజున మా సత్సంగములో ని ఒకరిని ఈ విషయము గురించి అడిగాను కాని వారుకూడా యెమి చెప్పలేదు.
నేను స్టేట్ బ్యాంకులో పని చేస్తున్నాను. అందులో నేను ఎస్.బీ. ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటేటర్ గా ఉన్నాను. 16.03.2009 న మరలా శ్రీ ఓరుగంటి రామకృష్ణప్రసాద్ గారి పుస్తకము తీసి, కళ్ళు మూసుకుని పేజీ తెరవగా, మరల అదే విషయము వచ్చింది. ఆ రోజున నేను స్కూటర్ మీద మా నరసాపురము నుంచి 15 కి.మీ. దూరములో ఉన్న మొగల్తూరు బ్యాంక్ కి ఇన్సూరెన్స్ పని మీద వెడుతున్నాను. నేను యెప్పుడు , బైక్ మీద వెళ్ళేటప్పుడు సాయి నామ స్మరణ చేసుకుంటూ ఉంటాను. అల్లా వెడుతుండగా సడన్ గా పైన ఆకాశంలో ఒక పక్షి వెళ్ళడం, కింద రోడ్డుమీదయేదో పడడం చూశాను. నా బైక్ కి కొంచెము దూరములోనే పడింది. చూసేటప్పటికి అది పాము, రొడ్డుమీద పడి కొంచెం తలయెత్తి ఉంది. నేను రోడ్డుకు కుడివైపున వెడుతున్నాను అది రోడ్డు మీద యెడమ ప్రక్కన పడింది . రోడ్డుకి యెడమవయిపు కాలవ, కుడివయిపు పంట పొలాలు ఉన్నాయి. నాకు శరీరంలో దడ పుట్టింది. ఆ వేగంలో పక్కనుంచి వెళ్ళిపోయాను. డ్రైవింగ్ లొ కొంచెం ముందుకు వెళ్ళి ఉంటే, అది నామీద కనక పడి ఉంటే? ఇది తలుచుకోగానే ఊహించడానికే భయము వేసింది. బాబా గారిని ఇలా ప్రార్థించాను, బాబా, నాకు ఇన్సూరెన్స్ పాలసీలు రాకపోయినా ఫరవాలేదు, ఈ రోజు నాప్రాణాల్ని, కాపాడావు, అదే చాలు అనుకుని నామస్మరణ ఆపకుండా
వెళ్ళాను. యే సత్సంగము ద్వారానయితే నాకు బాబాగారి తత్వము అవగాహనకు వచ్చిందో, ఆ సత్సంగానికి 116/- సమర్పించుకున్నాను. ఆయన చేసిన సహాయానికి 116/- కూడా తక్కువే, యేమిచ్చినా కూడా."

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List