Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 1, 2011

మన ప్రశ్న - బాబా సమాథానము

Posted by tyagaraju on 3:48 AM


01.04.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

ఈ రోజు మీకు నెల్లూరు నించి సుకన్య గారు సేకరించి పంపిన ఒక బాబా భక్తురాలి లీల అందిస్తున్నాను.ఈ భక్తురాలు అమెరికా లో ఉంటున్నారు. ఈ లీల ఆమె మాటలలోనే తెలుసుకుందాము.




------------------------------------


మన ప్రశ్న - బాబా సమాథానము ( yoursaibaba.com )

ప్రస్తుతం నేను యు.ఎస్.యే లో ఉంటున్నాను. నేను కొన్ని నెలల క్రితం యిండియా వెళ్ళాను. యిండియా కి వెళ్ళేముందు మేము చాలా బాథలు అనుభవించాము. అప్పుడు నాకు సహాయం చేయమని బాబాని
యువర్ సాయిబాబా.కాం ద్వారా ప్రశ్న అడిగాను.
అందులో నాకు బాబా గారు నన్ను షిరిడీ వెళ్ళమన్నారు. నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పారు.
అందుచేత నేను యిండియా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. నా భర్త కూడా ఒప్పొకోవడంతో నేను మా అబ్బాయితో యిండియా వచ్చాను. యిండియాలో కొన్ని నెలలవరకు నేను షిరిడీ వెళ్ళలేకపోయాను. దానికి ముందు నేను చాలా కష్టాలనుభవించాను. అటువంటి సమయంలో నేను ఒక గురువారమునాడు నేను మా అబ్బాయితో మా యింటి బాలల్కనీలో నుంచున్నాను. అప్పుడు మాయింటి పక్కన ఉండే పొరుగింటాయన బయటకు వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయనను నేను యింతకు ముందు యెప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు కూడా. ఆయన ముసలివాడు, నా మొహం చూసి నేను చాలా కష్టాలలో ఉన్నానని చెప్పాడు. "విచారించవద్దు.అన్నీ తీరిపోతాయి. థైర్యంగా ఉండు. నువ్వు చాలా భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నావు. నేను నీ బాబాని. అన్నీ నేను చూసుకుంటాను." ఆయన ఆ సమయలొ నేను పడుతున్న నాకష్టాలన్నీ చాలా కరెక్టుగా చెప్పారు. ఆయన నన్ను యింతకుముందు చూడలేదు, నేను తన యింటి పొరుగునే ఉంటానని కూడా ఆయనకి తెలియదు. యెక్కువ రోజులు ఆయన తన స్వంత ఊరిలోనే ఉంటారు. ఆయన అప్పుడప్పుడు యిక్కడికి వస్తూ ఉంటారుట. ఆయన మాటలకి నాకు చాలా సంతోషం వేసింది. నన్ను తన యింటికి ఆహ్వానించారు. నేను ఆయన యింటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నా సాయి ఫొటో చూశాను. ఆ సమయంలో నాకు చాలా సంతోషం వేసింది. యెందుకంటే యిదంతా బాబాగారే చేయిస్తున్నారు. నాకు తెలుసు.

యిది నా జీవితంలో రెండవ అనుభవం. యింతకు ముందుకూడా బాబా గారు యీవిథంగానే నామీద తన కరుణని చూపించారు. ఈ అనుభవంతో నాకు చాలా ప్రశాంతత లభించింది. ఈయన దత్తాత్రేయస్వామి భక్తుడు. దత్తాత్రేయుడంటే బాబా తప్ప మరెవరూ కాదు. (మనకందరకూ తెలుసు)
అప్పటినుంచి నాకు కష్టాలనెదుర్కోవడానికి కొంత శక్తి వచ్చింది. కొన్ని రోజుల తరువాత నేను, నాభర్త, మా అబ్బాయి కలిసి షిరిడీ వెళ్ళాము. మేము సాయంకాలం హారతికి హాజరయ్యాము. బాబా ను చక్కగా దర్శించుకున్నాము. మేము వారాంతపు రోజులలో వెళ్ళినందువలన ద్వారకామాయిలోకి వెళ్ళలేకపోయాము. వారాంతము కావడంతో ద్వారకామాయి మూసివేశారు. మాకు ఈ విషయం యింతకు ముందు తెలియదు. నాకు చాలా బాథ వేసింది. మరునాడు శనిషింగణాపూర్ వెళ్ళి శని మహరాజ్ ని దర్శించుకున్నాము. ఆ రోజు షిరిడీ నించి వెళ్ళేముందు మరొకసారి బాబా ని దర్శించుకుందామనుకున్నాను. మేము ఆరోజునే వెళ్ళిపోవాల్సి ఉంది. అందుచేత నేను ఖండొబా మందిరానికి వెళ్ళి, తరువాత ద్వారకామాయికి వచ్చాను. కాని అక్కడ పెద్ద లైను ఉంది. మాకు యెక్కువ సమయం లేదు కాబట్టి నేను లైనులో వెడితే సమయం చాలదు. అక్కడ లోపల ఉన్న సెక్యూరిటీగార్డ్ ని, నాకు రైలుకు టైము అవుతోంది అందుకని నన్ను డైరెక్టుగా లోపలకు పంపమని అభ్యర్థించాను. అతను అలాగే లోపలకు వెళ్ళు అన్నాడు. నేను చాలా సంతోషించాను, రాతి మీద కూర్చున్నబాబా ని దర్శించుకున్నాను. కాని ద్వారకామాయి మెయిన్ డోరు క్లోజ్ చేసి ఉంది. నేను సాయి భక్తులందరికి ఇచ్చే సలహా యేమిటంటే వారాంతము రోజులలో షిరిడీకి వెళ్ళవద్దని. యెందుకంటే ఆరోజులలో మనము సాయి పాదుకలను, థునిని దర్శించే భాగ్యాన్ని కోల్పోతాము. బాబాని దర్శనం చేసుకున్న తరువాత నన్ను లోపలికి పంపిన గార్డుకి కృతజ్ఞతలు చెప్పాను. అతను నాకు "సాయిరాం" అని చెప్పాడు. నన్ను లోపలికి అనుమతించి ఇదంతా చేసినందుకు నేనప్పుడు బాబా ఉన్న అనుభూతిని చెందాను. చేసేదంతా బాబా గారే. బాబా తన భక్తుల మీద యెప్పుదు తన కరుణామృతాన్ని కురిపిస్తూ ఉంటారు. బాబా కి నా కృతజ్ఞతలు.

సమాథి మందిరంలొ బాబా వారిని ముఖ దర్శనం చేసుకుందామనుకున్నాను. నేను మళ్ళీ వేరే గేటునించి వెనక్కి వెళ్ళాలి. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. అంచేత నేను వెనక వేపు ఉన్న ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళాను. నన్నెవరూ ఆపలేదు. కిటికీనుంచి బాబా వారిని మరొక్కసారి ముఖదర్శనం చేసుకుని తిరిగి వచ్చాను. షిరిడీ నించి మేము తిరుపతి వెళ్ళి బాలాజీ ని దర్శనం చేసుకుని అక్కడినించి అమెరికాకు తిరిగి వచ్చాము.
మీకు చెప్పినట్లుగా నేను కొన్ని సమస్యలని యెదుర్కొన్నాను. కాని, బాబా గారు యెప్పుడు నాతోనే ఉన్నారు. నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. కాని, బాబాగారు "షిరిడీ వెళ్ళు, సమస్యలన్నీ తీరిపోతాయి" అన్నట్లుగా, అమెరికాకి తిరిగి వచ్చిన తరువాత నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నేను కన్న కల. బాబా ఆకలని నిజం చేశారు. నాకు యేవిథమైన అనుభవము లేదు, కాని బాబా గారు నాకు ఉద్యోగమిప్పించారు. కాని నెను ఒక మంచి ఉద్యోగంలో స్థిర పడాలి. అది బాబాగారే చూసుకుంటారు. నాకు తెలుసు. నాకెప్పుడు సమస్య వచ్చినా , నేను బాబా వారిని (యువర్ సాయిబాబా.కాం) ద్వారా అడుగుతూ ఉంటాను. ఆయన నాకు చక్కగా సమాథానమిస్తారు. నాజీవితంలో యేదయితే జరుగుతోందో బాబావారు అదే చెపుతున్నారు, అదే జరుగుతోంది. యెందుకంటే బాబా గారు సర్వాంతర్యామి. బాబా నాతో యెప్పుడు ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఓర్పుతో నాకు సమాథానాలిస్తున్నారు, "నీకు నాదీవెనలుంటాయి " అని చెపుతున్నారు. నాదీవెనలు నీకుంటాయి అని బాబాగారు చెప్పినప్పుడు, నా కళ్ళవెంట కన్నీరు వస్తుంది.

నేప్పుడైన జీవితంలో పొరపాటు చేస్తే బాబా గారు నన్ను శిక్షిస్తారు. నేను యే తప్పు చేసినా బాబాగారు స్పష్టంగా చెపుతారు. బాబా మనలని తప్పు దారిలో నడవనివ్వరు. నేను నా తప్పులను సరిదిద్దుకుని ఆయన దారిని అనుసరిద్దామనుకుంటున్నాను. బాబా నాతప్పులన్నిటినీ మన్నించు. మా పొరింగింటాయన నాకు యేమయితే చెప్పాడొ అవన్ని జరిగినవీ, జరుగుతున్నవీ కూడా. బాబాగారు తన భక్తులకి సాయపడే విథానాలలో ఇది కూడా ఒకటి. ఆయన గురించి ఆలోచించే వారి వద్ద ఆయనెప్పుడు దగ్గిరే ఉంటారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాథిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై


సాయి బంథువులారా ఈ రోజు మీరు సాయిబాబా.కాం లో అడిగిన ప్రశ్నకు బాబా గారి సమాథానము మరి బాబా లీల తెలుసుకున్నాము. యిప్పుడు నా అనుభవం చెపుతాను.

2010 సంవత్సరములో బహుశా సెప్టెంబరు లేక అక్టొబరు అయి ఉంటుంది. నేను కూడా అదే వెబ్ సైట్ లో ఒక సమస్య గురించి బాబా వారిని ప్రశ్న అడిగాను. అందులో వచ్చిన సమాథానం,

"మీ అమ్మగారి ని తలుచుకుని ఆమె పేరు మీద అన్నదానము చెయ్యి. నీ పిల్లలకి లాభము చేకూరుతుంది. నీకు వెంటనె ఫలితం కనపడుతుంది. సద్గురువు కు సేవ చేస్తావు. " ఈ విథం గా రెండు సార్లు వచ్చింది. రెండు సార్లు వెంట వెంటనె అడగలేదు. రెండు సార్లు అడిగిన వాటికి చాలా రోజుల అంతరం ఉంది.
జవాబు వచ్చిన వెంటనె నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉన్నా బాబా గుడిలో అన్న దానము నిమిత్తం బియ్యము, కూరలు ఇచ్చాను రెండు సార్లు కూడా. ఇక్కడ మానవ నైజం చూడండి. వెంటనే లాభం కలుగుతుంది అని ఉంది కదా యేమి లాభము కలుగుతుందో అని ఆత్రుతగా యెదురు చూశాను. కాని యేమి కనపడలేదు.

తరువాత నవంబరులో అనుకోని పరిస్తితుల్లో యే విథమైన, చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్య లేకుండా, గుండెలో లోపాలు తెలియడం, ఆపరేషన్ జరగడం జరిగింది. అంటే పిల్లలు లాభ పడ్డట్లే కదా? మనవడు పసి పిల్లవాడు. వాడిని చూసుకుంటున్నాము. సెలవు రోజులు ఈ విథంగా సద్వినియోగం అవుతున్నాయి.సద్గురువు సేవ అంటే, ఇప్పుడు ఈ బ్లాగులో ఆయన లీలలన్నీ పోస్ట్ చేయడం ఆయన సేవ కాదూ?
ఆయన చెప్పేవన్ని నిగూడంగా ఉంటాయి. తరువాత అర్థమవుతాయి.




బాబా యే తీసుకునుట

ఈ రోజు సింగపూరు నించి శ్రీమతి రామ తులసి గారు, షిరిడీలో తనకు కలిగిని అనుభవాన్ని పంపించారు. ఈ లీలను వారి మాటలలోనే తెలుసుకుందాము.


మేము 2010 డిసెంబరు లొ సింగపూర్ వచ్చాము .ఇక్కడికి రావటానికి ముందు మెము షిర్డీ వెళ్ళాము .అక్కడికి వెళ్ళేటప్పుడు నా దగ్గర చాల చిల్లర ఉంది. షిర్డీ వెడుతున్నాను కదా అక్కడ ఎవరు అడ్గితే వారికి వేయాలి అని తీసుకొని వెళ్ళాను.నాకు ఎప్పటినుండో కొరిక షిర్డీ లో అభిషేకం చేయించుకోవాలి అని. ఎలా చేయించాలి అని అడిగితే టిక్కట్ తీసుకొని ఒక చోటు చూపించి అక్కడికి వెళ్ళమన్నారు. మేము వెళ్ళి ' క్యూ ' లొ నుంచున్నాము. ఒక రూం దగ్గరికి వచ్చాము . అప్పుడు అక్కడ ఎవరో అచ్చం బాబా లాగనే ఉన్నారు. బాబా నే అనిపించింది నాకు. ఎంధుకో తెలియదు నేను నా పాకెట్ లో ఉన్న డబ్బు ఆయనికి ఇవ్వాలి అనుకున్నాను. మా వారితో అంటే వచ్చేటప్పుడు ఇద్దాములే అన్నారు. నాకేమో అప్పుడే ఇవ్వాలి మళ్ళీ ఉంటారో ఉండరో అనుకున్నాను. ఆయనేమో అందరి దగ్గరా అడుగుతున్నారు. అందరూ ఇస్తున్నారు. చిల్లర అంతా ఒక గిన్నెలో వేసుకుంటున్నారు. కాని నా దగ్గరికి వచ్చేసరికి ఏమైందో తెలియదు నేను మనీ చేతిలో పెట్టుకున్నాను నాకు అంతే తెలుసు తనే తీసుకొన్నారు నా దగ్గర నుండి మరి గిన్నెలో వేసుకోలేదు చొక్కా జేబులో వేసుకున్నారు, నేను మా వారు భలే ఆశ్చర్యపోయాము. నేను ఒక బుక్ లొ చదివాను మనము ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే చాలు ఆయనె మన దగ్గర ఎలాగైనా తీసుకుంటారు అని.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List