Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, June 20, 2011

బాబా అనుగ్రహంతో పోయిన సొమ్ము 72 గంటలలో దొరకిన లీల

Posted by tyagaraju on 8:21 AM20.06.2011 సోమవారము

బాబా అనుగ్రహంతో పోయిన సొమ్ము 72 గంటలలో దొరకిన లీల


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంధువులకి బాబా వారి శుభాశీస్సులు


ఈ రోజు శ్రీ ఏ.ఎస్. కుమార్ గారు వివరించిన బాబా లీలని తెలుసుకుందాము. సేకరణ కుమారి సుకన్య, నెల్లూరు.
సాయి భక్తుడు శ్రీ ఎ.ఎస్. కుమార్ గారు వివరించిన బాబా లీల.


అది ఆగస్ట్ 14, 2010 సంవత్సరం. ఉదయం నించి నాకు యెందుకనో అశాంతిగా ఉంది. మా పెద్దమ్మాయి కూడా కొంచెం జ్వరంతో బాథపడుతోంది. తను చాల విథేయత గల అమ్మాయి తను యెప్పుడు యేమీ అడగదు, దేనికీ పేచీ పెట్టదు. కానీ ఆరోజు ఉదయం నించి కొంచెం మొండితనంగానూ విపరీతంగానూ ప్రవర్తిస్తోంది. తన కోరిక యేమిటంటే తను నా సోదరుడి యింటికి వెళ్ళాలని. తను చాలా మొండి పట్టు పట్టడంతో, ఆఖరికి నేను, నా భార్య మా సోదరుడి యింటికి వెళ్ళి ఆ రాత్రికి అక్కడే ఉందామని నిర్ణయించుకున్నాము. నేను నా భార్యకి మధ్యహ్ న్నం వెళ్ళమని, నేను నా ఆఫీసు పని పూర్తి అయిన తరువాత వస్తానని చెప్పాను.

10 గంటలకి నేను యింటినించి ఆఫీసుకు బయలుదేరాను. మాయింటినించి ఆఫీసుకు 2 కి.మీ. దూరం ఉంటుంది. కారు నడుపుతూ, దారిలో వెడుతున్న వివిథ రకాలయిన వాహనాల మీద వెనుకవైపు దాదాపు 20, 25 కన్న యెక్కువ బాబా బొమ్మలు స్టిక్కర్లు చూశాను. బాబా నన్ను దీవిస్తున్నట్టుగా నాకు చాలా అనందం వేసింది. నా భార్య, తాము నా సోదరుడి యింటికి చేరుకున్నట్లు ఫోను చేసింది. మా అమ్మాయికి కూడా జ్వరం తగ్గి కజిన్స్ తో ఆటలలో మునిగిపోయిందని చెప్పింది.


సాయంత్రం నేను ఆఫీసునించి నా సోదరుడి యింటికి బయలు దేరాను. మరలా అన్ని చోట్ల బాబా బొమ్మలను చూశాను. అప్పుడు బాబా నాకేదో చెపుతున్నారనిపించింది. యేదో జరగబోతోందనిపించింది. నేను వెంటనే నా భార్యకు ఫొను చేసి అందరూ కులాసాగా ఉన్నారా అని అడిగాను. దేవుని దయ వల్ల అందరూ బాగానే ఉన్నారని చెప్పింది. అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను కాని యింకా యేదో అసంతృప్తిగానే ఉంది. నేను బాబా ని మా కుటుంబ సభ్యులని స్నేహితులని చల్లగా చూడమని ప్రార్థించాను.


నేను నా సోదరుడి యింటికి చేరుకున్నాను. మేమంతా చాలా సంతోషంగా గడిపాము. ఆ రాత్రికి అక్కడే పడుకున్నాము. కాని నేనింకా సమాథానం కోసం వెతుకుతున్నాను. దానితో నేను సరిగా నిద్ర పోలేకపోయాను. మరునాడు ఆగస్ట్ 15 న మేము తిరిగి మాయింటికి వెళ్ళడానికి తయారయ్యాము, కాని నా సోదరుడు ఉండిపోయి రాత్రి భోజనం చేసి అప్పుడు వెళ్ళమని బలవంతం చేశాడు. నేను సరేనన్నాను. మేము భోజనాలు ముగించుకుని రాత్రి 9 గంటలకి యింటికి తిరిగివచ్చాము. నేను నాభార్యతో నువ్వు పైకి వెళ్ళు నేను పది నిమిషాలలో వస్తానని చెప్పాను.


నేను తిరిగి వచ్చేటప్పటికి నాభార్య, పిల్లలతో కిందే నుంచుని ఉంది. నేను ఆశ్చర్యంతో, యేం జరిగింది, యిక్కడే నుంచుండి పోయారు అన్నాను. బాగా వణికిపోతూ ఆమె మన యిల్లు దోచేశారు అని కళ్ళంబట నీళ్ళు పెట్టుకుంది. ఒక క్షణంపాటు నేనుకూడా నిశ్చేష్టుడినయ్యాను యేం చేయాలో తోచలేదు. మా అమ్మగారు, నా సోదరుడిని పిలిచింది, వెంటనె నా సోదరుడు, స్నేహితులూ వచ్చి నాకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు.


మేము షాక్ నుంచి తేరుకునేటప్పటికి రాత్రి 11 గంటలు అయింది. మేము పోలీసులని పిలిచాము, వారు దొంగతనానికి సంబంధించిన ప్రశ్నలన్నిటినీ వేసి ఎఫ్.ఐ.ఆర్. తీసుకుని తమకు చేతనయినంతగా చెస్తామని చెప్పారు. మా కుటుంబమంతా కన్నీళ్ళతో నిండిపోయి దిగులుగా ఉన్నారు. ప్రతీరోజు నేను పోలీసు స్టేషన్ కి వెళ్ళి యేమయినా ఆచూకీ దొరికిందా అని అడుగుతూ ఉండేవాణ్ణి. నేను బాబా గుడికి వెళ్ళి బాబా ముందు కూర్చుని హృదయపూర్వకంగా ఆయంతో మాట్లాడాను. హటాత్తుగా నాకు ధైర్యం వచ్చినట్టనిపించింది. మరునాడు నాకు పోలీసు స్టేషన్ నించి కబురు వచ్చింది. వారికి కొంత క్లూ దొరికిందని అదే కనక ఫలిస్తే మా సొమ్ము మాకు దొరుకుతుందని చెప్పారు.

మేము కొన్ని ప్రదేశాలకి వెళ్ళాము కాని యేమీ ఫలితం కనిపించలేదు, అలాగే మరునాడు వెళ్ళాము, కొంత ఆశ కలిగింది కాని దొంగను పట్టుకోలేకపోయాము. మరునాడు నేను వెళ్ళేటప్పుడు నాకూడా "మిరకిల్ పుస్తకం" తీసుకునివెళ్ళాను. "మిరకిల్ పుస్తకం మాటలాడుతుందని మీకు తెలుసు "మిరకిల్ పుస్తకం చదువుతే మీ తీరని మీసమస్యలు తీరుతాయి" ఆరోజు నాకు ధైర్యం వచ్చింది. నేను పోలీసు స్టేషన్ కి వెళ్ళాను, వారు నన్ను కూడా తమతో రమ్మన్నారు. అనుకున్న చోటకి మేము రాత్రి 10.30 కి వెళ్ళాము దొంగ ఉన్న చోట దాడి చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.


మేము పోలీసు స్టేషంకి వెళ్ళాము. వారు 90% బంగారం, డబ్బు రికవరీ చేశారు. ఈ తతంగమంతా పూర్తి అయ్యేసరికి తెల్లవారుఝాము 2 గంటలు అయింది. మా కుటుంబం యింకా మా శ్రేయోభిలాషులూ అందరూ చాలా సంతోషించారు. ఉదయం 2.15 కి యింటికి వెళ్ళేముందు, నేను తిన్నగా బాబా గుడికి వెళ్ళి శిరసు వంచి నమస్కరించాను, నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదు.


తరువాత నేను కూర్చుని జరిగిందంతా మరలా విశ్లేషించుకున్నాను. బాబా మా కుటుంబం మీద యెంతో దయతో ప్రేమగా చూశారు. ముందర మమ్మల్ని ఉన్నచోటునించి పంపివేసి మా కుటుంబానికి యెటువంటి హాని జరగకుండా చూశారు. అందుచేతనే మా అమ్మాయి ద్వారా మేము యింటినుంచి వెళ్ళేలా చేశారు. మేమే కనక యింటిలో ఉంటే మాకేమి జరిగిఉండేదో నేను ఊహించలేను. నాకు యిద్దరమ్మాయిలు, చిన్న పిల్లలు వాళ్ళు. ఒకమ్మాయికి 5 సంవత్సరాలు, చిన్నమ్మాయికి 2 సంవత్సరాలు. తనెప్పుడూ రోజంతా నాతోనే ఉంటుంది.


బాబా లీలని యేమని వర్ణించను. ఆయన తన భక్తులని యెంతో దయతో కాపాడుతూ ఉంటారు. యేవరయితే నన్ను ఆశ్రయిస్తారో వారిని యెల్లప్పుడు కాపాడి రక్షిస్తానని బాబా . చెప్పారు. మేము పోగొట్టుకున్న సొత్తు విలువ బంగారము, కొంత డబ్బు , దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. దర్యాప్తు అంతా పూర్తి అయాక, ఆఫీసరు గారు ఒక సాయంత్రం నన్ను పిలిచి, నా మొత్తం సర్వీసులో 4 రోజులలో చేదించిన కేసు చూడలేదని మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారు. యిది యింకా బాబా లీల అనే భావంలో ఉన్నాను. యిది నిజంగా చిత్రం.


మా కుటుంబాన్ని, మా సంపదనీ రక్షించి కాపాడినందుకు బాబా కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన చరణ కమలాల మీద శిరసు వంచి నమస్కరించి మనలనందరిని దయతో చూడమని కోరుతున్నాను.

***********

పై లీలకి నా విశ్లేషణ.


బాబా ని నమ్మని వారు, బాబాని పూజించని వారు, నాస్తికులు ఈ లీల చదివినా విన్నా వారికి ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది.


మరి మీరు బాబాని పూజిస్తూ ఉంటే దొంగ పడి సొత్తు దోచుకోకుండా ముందరే ఆపి ఉండవచ్చుకదా అనే సందహెహం వెలిబుచ్చుతారు.


అలాంటివారికి నేను చెప్పేదేమంటే, కొన్ని పూర్వజన్మ కర్మలని భగవంతుడు కూడా తప్పించలేడు. అందుకనే ప్రతి క్షణం ఆయన నామ స్మరణ చెయ్యమన్నారు. బాబాని నమ్మినవారు కనకనే అమ్మాయికి జ్వరం రావడం, యెప్పుడూ లేనిది, బంధువుల యింటికి వెడదామని మారాము చేయడం, తీరా అక్కడకు వెళ్ళాక, జ్వరం తగ్గి, హాయిగా ఆడుకోవడం యిదంతా బాబా ముందుగానే యేర్పాటు చేసినది. దారిలో కారులో వెడుతుండగా అన్ని వాహనాలమీద బాబా బొమ్మలు కనపడి నేను నీ వెనుక, ముందర ఉన్నాను, నిన్ను యెల్లప్పుడూ కాపాడతాను అని సందేశం ఇచ్చినట్లుగా ఉంది. పెద్ద ఆపద నించి కాపాడారు. పోయిన సొమ్ము కూడా 90 శాతం తిరిగి వచ్చేలా చేశారు. పోయిన సొత్తు కూడా దొరకడం కూడా బాబా లీల కాక మరేమిటి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment