

19.06.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీస్సులు
షివపూర్ బాబా లీలలు (తరువాయి భాగం) బ్రెస్ట్ కాన్సర్ ని తగ్గించిన బాబా అద్భుత లీల
ఈ రోజు షివపూర్ బాబా యొక్క మరొక అద్భుతమైన లీల తెలుసుకుందాము. యిది నిజంగా చాలా అత్యద్భుతమైన లీల. బాబా ఘటనాఘటన సమర్థుడు అని తెలుస్తుంది. షివపూర్ లీలలు చదివిన తరువాత ఒక్కసారయిన షివపూర్ బాబా ని దర్శిద్దామనే కోరిక తప్పకుండా కలుగుతుంది.
నాడియా వాసి అయిన శ్రీమతి లతికా ఘోష్ గారికి రొమ్ము వద్ద యిన్ ఫెక్షన్ మొదలయింది. దురదృష్టవశాత్తు స్థానికంగా ఉన్న వైద్యులు సరిగా గుర్తించకుండా తప్పుడు వైద్యం చేశారు. రోజులు గడుస్తున్నా ఆమె ఆరోగ్యంలో యెటువంటి మార్పు లేదు, ఆమె పరిస్థితి యింకా దిగజారడం మొదలుపెట్టింది. అప్పుడామె యింకా కొన్ని అవలక్షణాలతో బాథపడుతోంది. ఆఖరికి అది కాన్సర్ అని గుర్తించాక, ఆమెని నిల్ రతన్ సర్కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడామె తీవ్రమైన రక్త లేమితో బాథపడుతూంటే అది లుకేమియాగా గుర్తించి ఆమెకు వెంటనే రక్తం మార్చడానికి నిర్ణయించుకున్నారు. చివరికి యిక ఆమె బ్రతకదని , ప్రతీరోజు ఆస్పత్రి చార్జీలు కూడా చెల్లించడానికి వారు అంతగా ఆర్థికంగా ఉన్నవారు కాదుకనక ఆస్పత్రినించి ఆమెని విడుదల చేశారు.
లతి క గారి తోటికోడలు షివపూర్ గ్రామంలోని యింటివారి కోడలు. అమె శ్రీరామనవమినాడు (24, మార్చ్ 2010) బాబా గారి ప్రతిష్టాపన జరుగుతున్న రోజున బాబా దర్శనానికి వచ్చింది. హటాత్తుగా ఆమెకు, లతికా చివరి దశలో ఉందనీ యెంత వీలయితే అంత తొందరగా యింటికి రమ్మని మొబైల్ కి కాల్ వచ్చింది. యిది వినగానే ఆమె అదిరిపడి బాబాముందు ఉద్రేకంగా బిగ్గరగా యేడిచింది. అక్కడి గుడి కమిటీ సభ్యులని , బాబా దయతో లతికా ప్రశాంతంగా దేహాన్ని విడిచి వెడుతుందని కొంత ఊదీ, ప్రసాదం లతిక కోసం అడిగింది. ఊదీ, ప్రసాదం తీసుకుని వెంటనె ఆమె యింటికి వెళ్ళేటప్పటికి లతిక పూర్తిగా అచేతనంలో ఉంది. మెల్లిగా ఆమె చివరిదశలోకి వెడుతోంది. ఆమె వెంటనె లతిక నోటిలో ప్రసాదం ఉంచి కొంత ఊదీ ఆమె నుదిటిమీద పెట్టింది.
తరువాత జరిగిన అద్భుతమైన లీలకి, అక్క్డడ ఉన్నవారికి యెవరికీ నోట మాట లేదు. వెంటనే లతిక లేచి మంచం మీద కూర్చుని పూర్తి స్పృహలోకి వచ్చి, నిలకడగా స్పష్టంగా "నువ్వు యింతకుముందే నాకు ఈ ఊదీ ప్రసాదం యెందుకు తేలేదు" అని అడిగింది. ఇప్పుడు జరిగినది చూసి అక్కడున్న ఆమె బంథువులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. లతిక తోటికోడలు వెంటనే బాబా గుడికి వెళ్ళి బాబా ముందు యేడిచింది. ఇప్పుడు ఆమె కళ్ళలోంచి వచ్చిన కన్నీరు బాబా అనుగ్రహంతో పరిమళించాయి. అవి బాబా మీద ప్రేమకి, భక్తికి ప్రతీకలు....ఘటనా ఘట సమర్థుడు.
ఇప్పుడు లతిక పూర్తిగా కోలుకుంది. యింతకుముందులాగే ఆమె తన పనులన్ని చేసుకుంటొంది.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment