

21.06.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
నా భార్యకు ప్రాణబిక్ష పెట్టిన బాబా
శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగునుండి ఒక సాయి భక్తుడు చెప్పిన బాబా చెసిన అద్భుతమైన, ఊహకందని లీల
బాబా మీద నమ్మకం, వెనువెంటనే మనకి సంతోషాన్ని, శాంతిని, స్థిరత్వాన్ని, శాంతస్వభావాన్ని, ప్రేమని తెస్తుంది. అందుచేత మీకు నమ్మకం లేకపోతే, నేను మీకిచ్చే సలహా యేమిటంటే ముందర నమ్మకం కోసం ప్రార్థించండి. యెందుకంటే మీరు సాయి ఉనికిని దర్శించాలనుకుంటే మీకు ఉండవలసినది నమ్మకం...నమ్మకం....నమ్మకం..బాబా మీద నమ్మకం. ప్రతీరోజూ బాబా, యెవరికైతే నమ్మకం ఉంటుందో వారికి తన లీలలు చూపుతున్నారు.
ఈ ప్రపంచంలో నమ్మకం నిలిచిపోవడానికి కారణం ఈ ప్రప్రంచం ఒక సబ్బు బుడగలాంటిది. మీకష్ట కాలాల్లో నీకు దగ్గిరగా ఉన్నవారిని నిన్నాదుకునే వారినీ నువ్వెప్పుడు చూడలేవు, ప్రతీవారు కూడా బుడగలలాగా మాయమయిపోతారు. కాని బాబా నిజానికి బుడగ కాదు. బాబా తను ప్రేమించే బిడ్డలని యెవరికీ యెటువంటి ఆపద రాకుండా క్షేమకరమైన బుడగలలో ఉంచుతారు. అందుచేత మీరు యేది విలువైనదని అనుకుంటున్నారు మీ నమ్మకమా??? నమ్మండి అది ఈ అశాస్వతమైన ప్రపంచంలో మీకు మీ ప్రియమైనవారికి యేదైనా జరిగవచ్చు, అటువంటప్పుడు మనని రక్షించే మన ప్రియతమ తండ్రి సాయి మాత్రమే.
పైన చెప్పిన విషయానికి సంబంధించి నేను ఈ రోజు ప్రచురించేది మీకు సాయి మీద నమ్మకాన్ని మరింత పెంచుతుంది. యెందుకంటే నేను ప్రతీసారి భక్తుల యొక్క నిజమైన అనుభవాలని ప్రచురించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వారి అనుభూతులు శ్రథ్థ, నమ్మకం దారిలో వెళ్ళడానికి కదలే మెట్ల దారిలా ఉపయోగపడుతుంది.
అమెరికానించి నాకు మైల్ వచ్చింది. ఆయన కోరిన మీదట వారి పేరును ప్రస్తావించటంలేదు.
ఆయన చెప్పిన ఈ అనుభవాన్ని చదవండి. ఈ లీల చదివాక మీకు కూడా ఒడలు గగుర్పొడుస్తుంది, యెందుకంటే మొదటిసారి చదవగానే నేను కూడా అటువంటి అనుభూతికి లోనయ్యాను.
సాయిరాం ప్రియాంకా గారు,
మేము అమెరికాలో ఉంటాము. నేను మీ తెలుగు బ్లాగును చదువుతున్నాను. సాయి లీలలతో నేను చాలా ప్రభావితుడనయ్యాను. నేను కూడా నా జీవితంలో యెన్నో బాబా అనుభూతులను చవి చూశాను. అందులో ఒకటి ఈ క్రింద చెప్పిన లీలని మీతో పంచుకుంటున్నాను.
నాకు 2002 సంవత్సరంలో వివాహం అయింది. వివాహం అయిన తరువాత మేము, నా భార్య తల్లితండ్రుల యింటికి, కోస్తా ఆంధ్రకి ప్రయాణిస్తున్నాము. నేను అంతకుముందు రెండుసార్లు బస్ లో వెళ్ళాను, కాని యెప్పుడు రైలులో అక్కడకు వెళ్ళలేదు. మేము హైదరాబాదు నించి రాత్రి 9 గంటలకు బయలుదేరాము. నేను ఒక ప్రయాణీకుణ్ణి మేము దిగవలసిన స్టేషన్ కి (నా భార్య తల్లితండ్రులు ఉండే ఊరు ) యెన్ని గంటలకు వెడుతుందని అడిగాను. అతను మరునాడు ఉదయం 7 గంటల ప్రాంతంలో వెడుతుందని చెప్పాడు.
ఆ రాత్రి ప్రయాణంలొ, నేను నా స్నేహితుడు ఒంటిగంట దాకా కబుర్లు చెప్పుకుంటూ తరువాత నిద్ర పోయాము. ఉదయం 4.30 ప్రాంతంలో నా స్నేహితుడు నన్ను నిద్రలేపి బూట్లు వేసుకుని దిగమన్నాడు, మన ఊరు వచ్చేసింది అని చెప్పాడు. నేను, ఒకతను 7 గంటలకు వస్తుందని చెప్పాడు అన్నాను. నా స్నేహితుడు, అతను తప్పు చెప్పాడు, మన వూరు వచ్చేసింది అని అన్నాడు.
నేను బెర్త్ మీంచి కిందకి దిగి బూట్లు లేసులు కట్టుకుంటూ, నా భార్య యేది అని అడిగాను. ఆమె సామాన్లు సద్దుతోంది అని చెప్పాడు. ఈ లోపులో రైలు వేగంగా వెళ్ళడం మొదలు పెట్టింది. నేను నా భార్య బెర్త్ వైపు చూస్తే అక్కడామె లేదు. నేను నా స్నేహితుడితో చెప్పి యిద్దరం తలుపు దగ్గిరకి వెళ్ళాము. అక్కడ తలుపు దగ్గిర చూసి చాలా షాక్ కి గురయ్యాము. నా భార్య తలుపు హాండిల్ ని పట్టుకుంది, రైలు చాలా వేగంగా వెడుతోంది.
నా స్నేహితుడు ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పటికి, ఆమె హాండిల్ ని వదలివేసింది. నేను, నా స్నేహితుదు అదిరిపోయాము. నా స్నేహితుడు బోగీలో చైన్ లాగమని చెప్పాడు. నేను చైన్ లాగాను. రైలు ఆగి పోయింది. మేము రైలు నించి కిందకి దిగేటప్పటికి ప్లాట్ ఫారం మీద చాలా మంది గుమిగూడారు, యేదొ జరిగిందని అనుకున్నాను నేను.
నేను నా స్నేహితుడు ఆ గుంపు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాము. నా భార్య ఒక ముసలామె ఒడిలో ఉండటం చూశాము. ఆ ముసలావిడ నా భార్యకి మంచినీళ్ళు పట్టిస్తోంది. కొంత సేపటి తరువాత యెం జరిగిందని నా భార్యను అడిగాను.
ఆమె, తను నిద్ర మత్తులో రైలు దిగుతూండగా, రైలు కదిలిందని అప్పుడు తలుపు హాండిల్ పట్టుకున్నానని, రైలు కదలుతున్న వేగానికి పట్టుకోలేక వదలివేశానని చెప్పింది. హాండిల్ ని వదలి వేసిన వెంటనె ఆ వేగానికి తను రైలు చక్రాల వైపు విసురుగా వెళ్ళింది, అప్పుడే అద్భుతమైన విచిత్రం జరిగింది. ఒక ముసలి వ్యక్తి (మన బాబా) ఆమె కాళ్ళని పట్టుకుని వెనుకకు లాగాడు. యిప్పుడు ఆశ్చర్యకరమైన విషయం, అటువంటి చిన్న పల్లెటూరి స్టేషన్ లో ఆ ముసలి వ్యక్తి యెలా వచ్చాడు, వచ్చి వెంట్రుకవాసిలో ఆమెని యెలా లాగగలిగాడు? అది చాలా అద్భుతం. ఆ సంఘటన తరువాత నా భార్య బాబా భక్తురాలిగా మారిపోయింది. మాకింకా బాబా అనుభూతులు చాలా ఉన్నాయి. వాటిని తరువాతి మైల్ లో పంచుకుంటాము.
జై సాయిరాం.
@@@@@@@@
ఈ రోజు ఉదయం శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులో చదివాను. ఇది చదువుతుంటే చివరి రెండు పేరాలు యింకా చదవకుండానే యేమి జరిగి ఉండవచ్చొ ఊహించుకునేటప్పటికి నా కళ్ళల్లోంచి కన్నీరు రావడం మొదలుపెట్టింది. మానవ మాత్రుడికి సాథ్యమేనా ఆవిథంగా రక్షించడం? పైగా అది ఉదయం 4.30, కొంచెం చీకటిగా ఉంటుంది. ఒకవేళ వెలుతురున్నా మానవ మాత్రుడికి ఆ సమయంలో యేమి చేయాలో కూడా తొందరగా స్ఫురణకు రాదు. వేగంగా వెడుతున్న రైలు నుంచి పడబోతున్న వ్యక్తిని కాళ్ళు పట్టుకుని లాగడమంటే, అలా చేయడం యెవరికి సాథ్యం? మన బాబాకి కాదూ? అవును బాబా బాబా బాబా. సర్వకాల సర్వావస్తలలోనూ నేనప్రమత్తుడనై ఉంటానని చెప్పారు. బాబా సర్వ శక్తిమంతుడు. బాబా తన భక్తులనెప్పుడు సదా రక్షిస్తూనే ఉంటారు. కాని మనకి కావలసినది ఆయన మీద నమ్మకం, శ్రథ్థ, భక్తి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment