


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి మహా నిర్వాణ ఋజువు ముంబాయిలో
ఓం శ్రీ సాయినాథాయనమహ
ఇంతకు ముందు నేను, మోరేశ్వర్ ప్రథాన్ గారి ఆస్త్మా తిరగబెట్టినప్పుడు బాబా ఊదీ యొక్క ఔషథ ప్రభావాన్ని వివరించాను. ఆ సమయంలో మా తాతగారు ఆయనకు పవిత్రమైన ఊదీ త్రాగడానికి యిచ్చినపుడు ఆయనకు ఉపశమనం కలిగింది. మా నాన్నగారు, తాతగారు, యెంతో హామీతో ఇచ్చిన అదే ఊదీని యింత తొందరగా ఆయనకు ఉపయోగించవలసి వస్తుందని వారెప్పుడు ఊహించలేదు. దానికి వారెంతో సంతోషించారు. కాని ఆసక్తికరమయినది ఒకటి జరిగింది. మోరేశ్వర్ యింటినించి వారు బాంద్రాలోని తమ యింటికి తిరిగి వచ్చాక, బాబాకు థన్యవాదాలు తెలుపుకునేందుకు తమ చందనపు మందిరం ముందుకు వెళ్ళారు. అక్కడ బాబా చిత్రపటం అది పెట్టబడిన చెక్క దిమ్మనుండి నిండి జారి కిందకి వేళాడుతూ ఉన్న స్థితిలో చూశారు. తాము లేనప్పుడు పనివాడు శుభ్రం చేయడంలాంటిదేమన్నా చేశాడా అని మా నాన్నమ్మగారిని అడిగారు. ఆరోజు విజయదశమి కనుక అంతా శుభ్రం చేయడం, పూజ అన్నీ కూడా ఉదయమే జరిగాయి కాబట్టి, అల అ జరగడానికి అవకాశం లేదు. కాకతాళీయంగా జరిగిన ఈ రెండు సంఘటనలకి యేమన్నా సంబంథం ఉందేమోనని ఆలోచించారు. బాంద్రాలోని వారింటికి దగ్గరలోనే ఉంటున్న టెండూల్కర్ యింటికి గాని, దభోల్కర్ గారి యింటికి గాని వెడదామని అనుకున్నారు. కాని యిది అవసరం లేకపోయింది, కారణం విలే పార్లే నుంచి దీక్షిత్ గారి సేవకుడు సాయంత్రం వారింటికి వచ్చాడు. అతను షిరిడీలో మథ్యాహ్న్నం బాబా మరణించారని చెప్పాడు. దీక్షిత్ గారు షిరిడీకి బయలు దేరుతున్నారనీ బాబా సాహెబ్ తార్ఖడ్ గారిని (మా తాతగారిని) తనతో రమ్మనమని చెప్పారని చెప్పాడు. యిది తెలుసుకున్నాక వారిద్దరూ ఈ రెండు సంఘటనలని క్రోడీకరించుకుని, బాబా తాను ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబుతూ మహా సమాథి చెందుతున్నానని తమకు వైర్ లెస్ మెస్సేజ్ యిచ్చినట్లు అర్థమయింది. అంచేత అది తాత్కాలికంగా తిరగబెట్టిన ఆస్త్మా, చందనపు మందిరంలో బాబా చిత్రపటం జారడం, షిరిడీకి బొంబాయికి మథ్యనున్న దూరం ఊహించుకోండి. తాను యిక శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నానని తన ప్రియ భక్తులకి సందేశమిచ్చిన విథానం యెంత విచిత్రం. ప్రియమైన సాయి భక్తులారా బాబా చాలా చక్కగా తగిన విథంగా చెప్పారు. "అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాథిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదాననంద సాయినాథ్" గా బాబా పిలవబడ్డారు . అటువంటి అపూర్వమైన పథ్థతిలో సందేశాన్ని తన ప్రియ భక్తులకివ్వడం వెన్నులోంచి తీవ్రమైన ప్రకంపనాలానుభూతి కలగడం వారికి మాత్రమే బాగా తెలుసు. సాయిబాబా వారి మహా సమాథి శారీరకంగానే జరిగింది కాని, తానెప్పుడూ అక్కడే ఉంటాననీ వారి పిలుపుకి సిథ్థంగా ఉంటానని తన అవతార కార్యంలో ఆయన భక్తుల మదిలో ముద్ర వేశారు. "నా సమాథినుండి నా యెముకలు మాట్లాడతాయి. నా యందు అమితమైన విశ్వాసం పెట్టుకోండి" అని ప్రకటించారు. శాశ్వతమైన సత్యం , నేనెప్పుడు జీవించేవుంటాను. యిది నా వాగ్దానం, వీటిని మీరెప్పుడు మరవద్దు." (నిత్య మె జీవంత జానా హేచి సత్యా).

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

0 comments:
Post a Comment