


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వినాయక చవితి శుభాకాంక్షలు
ఈ రోజు నెల్లూరునించి సుకన్యగారు సేకరించి పంపిన బాబా లీల తెలుసుకుందాము.
మీతోనే ఉంటా..మీ వెంటే ఉంటా..మీతోనే చేయిస్తా
బాబా నీదగ్గిరుంటే నీకెందుకు బెంగ. అన్ని మరచిపో. అంతా బాగుందనే భావనలోనే ఉండిపో. బాబా సహాయం తప్పకుండా అందుతుంది. ఒకోసారి ఆయన మనచేతే మరచిపోలేని సహాయం చేయిస్తారు. అసంకల్పితంగా జరుగుతుంది. దానికి ఉదాహరణగా ఈ రోజు ప్రచురింపబోయే ప్రతిభగారి ఈ లీలను చదవండి.
నా అనుభూతిని మీతో పంచుకోవడానికి బాబా వారు ఇప్పుడంగీకరించారనీ ఇదే తగిన సమయమని నేను భావిస్తున్నాను.
బాబా, నా చిన్నతననం నించీ నాకు బాబా తెలుసు. నేను బాబానుపూజిస్తాను కాని పూర్తిభక్తితో కాదు.
నా చదువు అయిపోయినతరువాత ఒక సంవత్సరం లెక్చరర్ గా పనిచేసి ఒక కోర్స్ చేద్దామని ఉద్యోగానికి రాజీనామా చేశాను. కోర్స్ చేయడానికి యింటికి కొన్ని నెలలు దూరంగా ఉన్నాను. నేనున్న చోటు బాబా గుడికి దగ్గరగా ఉంది.
మేము ప్రతిగురువారము గుడికి వెళ్ళేవాళ్ళము, నేను ప్రతీరోజూ గురుచరిత్ర చదవడం ప్రారంభించాను. నా జీవితంలో ప్రతీ విషయంలోనూమార్పు రావడం మొదలెట్టింది. నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బాబా నన్నావిధగా అనుగ్రహించి ప్రతీ క్షణం నాతోనే ఉన్నారు.
నేను షిరిడీ వెళ్ళాను, అది నాకు అనుకోని యాత్ర. నాకు వివాహమైన తరువాత నేను అయిదవ నెల గర్భంతో ఉన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ కి వచ్చాను. యేమి పొరపాటు జరిగిందో తెలీదుగాని, మా అబ్బాయి కొంచం అనారోగ్య సమస్యతో పుట్టాడు. డాక్టర్స్ బతికే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. యెక్కడకివెళ్ళాలో, యేమి చెయాలో నాకు తెలీలేదు.
కాని నాకు నా సాయి ఉన్నాడు. నేను ఆయనని ప్రార్థించి యెప్పుడూ నామస్మరణ చేస్తూ ఉన్నాను. బాబా ఒక్కరే సహాయం చేసి నయం చేయగలరనిపించింది. కొన్ని రోజుల తరువాత మా అబ్బాయికి సర్జరీ అయి కోలుకోవడం మొదలెట్టాడు.
ఏడు నెలల తరువాత ఆస్పత్రినుంచి విడుదల చేయబడ్డాడు. యింటికి వచ్చేటప్పటికి వాడికి తినడం యెలాగో తెలీలేదు, పాలు తాగడం తెలీదు, ప్రతీదీ కూడా గొట్టం ద్వారనే ఇవ్వవలసి వచ్చింది. బాబా నామస్మరణ చేస్తూ ఆయన మీదే నమ్మకం ఉంచుకున్నాను. అది చాలా కష్ట సమయం కాని బాబా దయతో జీవితమలా సాగింది.
స్నేహితులందరితో కలిసి నేను సాయి వ్రతం చేశాను. రెండు వారాల తరువాత మా అబ్బాయి ఫీడింగ్ ట్యూబు అనుకోకుండా బయటకి వచ్చేసింది. నేను స్పృహలో ఉన్నప్పటికీ నాలోంచి ఆమాటలు యెలా వచ్చాయో తెలీదు, నేను నా భర్తతో ఇక ఫీడింగ్ ట్యూబు అవసరం లేదు నేను నా కొడుకుని, మామూలుగా తినగలిగేలా చేయగలను అని అన్నాను.
అది పనిచేసింది. నేను మెల్లిగా ప్రారంభించాను, వాడు రోజు రోజుకీ అలవాటు పడ్డాడు. వాడిలో వచ్చిన గుణానికి ఆస్పత్రిలో ఉన్న డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. కొంత వయసు వరకు మా అబ్బాయి తినలేడనే అనుకున్నారు ప్రతీవారూ. కాని నా హృదయానికి తెలుసు, బాబా తనే ఈ నిర్ణయాన్ని తీసుకునేలా నాలోజ్ఞానాన్ని కలిగించి, నా కొడుకుకి నయమయి సహాయం చేసేలా చేశారు.
అది నిజంగా బాబా లీల. యేమి చెప్పాలో నాకేమీ తెలీడంలేదు. డాక్టర్స్ చేయలేని పరిస్థితుల్లో మా అబ్బాయికి నయం చేయడమే కాకుండా కొత్త జీవితాన్నిచ్చింది బాబాయే, దీనిని నేను మాటలలో వర్ణించలేను.
ఇది హృదయాన్ని హత్తుకున్నే లీలలో ఒకటి. కాని నా జీవితంలో ఆయన ప్రతీ క్షణం నాతోనే ఉన్నానని తగిన మార్గాన్ని సూచించిన బాబా లీలలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు నేనేమి చేసినా, యెక్కడ ఉన్నా నా హృదయం, ఆత్మ అన్ని బాబాతోనే ఉంటాయి. జీవితమంటే నాకు భయం లేదు కారణం నాకు మార్గం చూపించడానికి, సహాయం చేయడానికి ప్రతీ క్షణం బాబా నాతోనే ఉన్నారు.
బాబా దయవల్ల మా అబ్బాయి 'సాయీ' బాగా ఉన్నాడు. వాడి జీవితాంతమూ బాబా వాడితో ఉంటాడని నాకు బాగా తెలుసు.
క్రితం మార్చ్ లో షిరిడీ వెళ్ళే భక్తురాలి ద్వారా నా ప్రార్థనను పంపించాను, ఆమె తాను షిరిడీలో ఉన్నంత సేపూ మా అబ్బాయి పేరే తన మనస్సులోకి వచ్చిందని నాకు మైల్ చేసింది.
ప్రత్యేకంగా ఈ పేరే తన మనస్సులోకి వస్తోందని ఆమే ఆశ్చర్యపోయింది. అపుడామె బాబా అతనితోనే ఉన్నాడని చెప్పింది.
కాని ఒక విషయం మాత్రం చెప్పగలను, కిందటి రెండు సంవత్సరాలనుండి నేను చాలా క్లిష్ట పరిస్థితులనెదొర్కొన్నాను, కాని సమస్యలకి సమాథానం లభించలేదు. కాని నాకెప్పుడూ నేను ఒంటరిదాన్ననే భావం రాలెదు. గంటలకొద్దీ ప్రార్థించిన తరువాత ఆయననించి నాకు సమాథానం లభించేది. నేనెప్పుడనుకున్నా బాబా నాతో ఉన్నారు అనుకునేదాన్ని. ఆ ఆలోచన నాకు సంతోషాన్నిచ్చేది.
నేను భక్తులందరికి కొంత చెప్పదలచుకున్నాను, "మీరు నింజంగా బాబాని నమ్మితే ఆయననేమీ అడగద్దు, (ప్రార్థించండి అంతే) ఆయనకన్నీ తెలుసు, మనకేది ఇవ్వాలో తెలుసు".
నా అనుభవాన్ని చదివినందుకు మీకు కృతజ్ఞతలు.
ఓం శ్రీ సాయినాథాయనమః
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment