

18.11.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాసీస్సులు
ఈ రోజు కరెంట్ కోత చాలా దారుణంగా ఉండటం వల్ల, రాత్రి 8 గంటలకు కరెంట్ ఇవ్వడం వల్ల ప్రచురించడానికి ఏమీ కుదరదనుకున్నాను.
కాని అనుకోకుండా ప్రియాంకాగారి బ్లాగులో ఆమెకు బాబా చూపించిన లీలను చూడటం వెంటనె దానిని మీకందరికీ తెలియచేయాలనిపించి వెంటనే అనువాదం చేసి మీముందుంచుతున్నాను.
బాబా చూపించిన వాత్స్యల్యం, కరుణ, అనురాగం, ఆప్యాయత మరువలేనివి. బాబా ఎటువంటి అద్భుతాన్నయినా చేయగలరని ఈ లీల చదివితే తెలుస్తుంది.
శ్రీమతి ప్రియాంకాగారు ఈ అనుభవాన్ని 17 తారీకున ప్రచురించడం జరిగింది. దానిని యధాతధంగా మీముందుంచుతున్నాను.
సాయి భక్త పాఠకులారా , ప్రతీ నెల నేను అన్న దానానికి షిరిడీకి కొంత డబ్బు పంపిస్తూ ఉంటాను. నేను పంపించే డబ్బు ప్రతీ నెలా మారుతూ ఉంటుంది. ఒక్కొక్క సారి 1000 రూపాయలు పంపుతూ ఉంటాను. బీదలకు నేను ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు 101 రూపాయలు షిరిడీకి పంపుతూ ఉంటాను. అక్టోబరు నెల 1 వ తారీకున నేను షిరిడీకి 101 రూపాయలు మనీ ఆర్డరు చేసాను. గత కొద్ది నెలలుగా నావద్ద ఊదీ పాకెట్లు తక్కువగా ఉన్నాయనీ, ప్రపంచ వ్యాప్తంగా నేను అందరికీ ఊదీ పాకెట్లు పంచుతున్నానని అందుకని నాకు కొన్ని ఊదీ పాకెట్లు పంపమనీ సంస్థాన్ వారిని కోరాను.
నేను పంపిన మనీ ఆర్డరుకు సంస్థాన్ నించి నాకు రెండు వారాల క్రితం చిన్న ఊదీ పాకెట్, ప్రసాదం వచ్చాయి. నేను దానితో సంతృప్తి చెందాను. కాని బాబా నిన్న నా అంతర్గత కోరికను తీర్చారు. షిరిడీ సాయి సంస్థాన్ నించి నాకు మరలా కొరియర్ లో పెద్ద ఊదీ పాకెట్ (250 గ్రా.) వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. షిరిడీలో అన్నదానానినికి నేను పంపిస్తున్న 101 రూపాయలకు అంతకు ముందెప్పుడు అంత ఊదీ పాకెట్ వారు పంపించలేదు. అంత పెద్ద ఊదీ పాకెట్ ను కూడా నేను అంతకు ముందెప్పుడూ చూడలేదు. నేను పంపిన 101 రూపాయలకి ఊదీ పాకెట్ వచ్చింది. మరి మరలా ఇంత పెద్ద ఊదీ పాకెట్ చందా రసీదుతో రావడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
ఏమయినప్పటికీ ఒక సాయి భక్తురాలిగా నాకు అంత పెద్ద బహుమతీ రావడం చాలా సంతోషం వేసింది. క్రితం రోజు రాత్రి బాబా విగ్రహాన్నించి ఊదీ రాలుతున్నట్లుగా నాకు కల వచ్చింది. నాకు ఆ కలకి అర్థం తెలియలేదు. నాకు షిరిడీ నించి పెద్ద ఊదీ పాకెట్ రావడం వల్ల ఆవిధగా కల వచ్చి ఉండవచ్చనుకున్నాను. కాని ఈ రోజు అనగ బాబా రోజు ఉదయం మరొక పెద్ద ఊదీ పాకెట్ వచ్చింది. సాయి నామీద కురిపించిన వాత్సల్యానికి నా కళ్ళు చెమర్చాయి. నావద్ద తగినంత ఊదీ లేదని బాబాకు తెలుసు. కాని నేను కావలసిన వారికందరికీ ఊదీ పంపుతూ ఉంటాను. అందుచేతనే బాబా నాకు బాబా తన అద్భుతమైన లీలను చూపించారు. ఇప్పుడు మాయింటిలో అర కేజీ ఊదీ ఉంది. అదీ షిరిడీ నించి వచ్చినది.
బాబా చూపించిన ఈ లీలని మన సాయి భక్తులందరితోనూ పంచుకుంటున్నాను.
మీరు కూడా మీ మీ అనుభవాలను పంపండి.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు.
0 comments:
Post a Comment