Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, February 23, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (34)

Posted by tyagaraju on 5:14 PM


24.02.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 34 వ.భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1994 (34)

14.11.1994

నిన్నటిరోజున మానవుడు పొందవలసిన "ముక్తి" గురించి ఆలోచించి, రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి మానవుడు జీవిత ప్రయాణము ఆఖరిలో పొందవలసిన ముక్తి గురించి తెలపమన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు. 1) జీవితములో బరువు బాధ్యతలు అన్నీ సక్రమముగా పూర్తిచేసి, భగవన్ నామము స్మరించుతూ ఆఖరి హోలీ పండగనాడు అరిషడ్ వర్గాలను మంటలలో పడవేసి పసివారి మనసులాగ మనసును ఉంచుకొని మనవలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ లోకమునుండి నిష్క్రమించటమే ముక్తి.

2) చెడు వ్యసనాల నుండి, 3) చెడు ఆలోచనలనుండి , 3) పోలీసు భయమునుండి 4) మరణము అంటే భయమునుండి 5) చిల్లర దేవుళ్ళ ఆధిపత్యమునుండి దూరంగా ఏకాంతముగా, ప్రశాంతముగా జీవితము గడపటము కూడ ఒక విధమైన ముక్తి అని గ్రహించు.

01.12.1994

నిన్నటిరోజున శిరిడీకి వెళ్ళవలెనని ఆలోచన కలిగినది. 12.12.94 నాడు బయలుదేరవలెనని ఆలోచన కలిగినది.

శ్రీసాయి అనుమతి లేనిదే శిరిడీ వెళ్ళలేము అనే విషయము సాయి బంధువులు అందరికి తెలుసు. అందుచేత రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి అనుమతిని ప్రసాదించమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి అనుమతిని ప్రసాదించిన విధానము నన్ను సంతోషపరచినది. ఆదృశ్యము వివరాలు. "నేను మగ పెండ్లివారితో కలసి పెండ్లికి వెళుతున్నాను. మా పెండ్లివారి బస్సు ఒక పట్టణములో ఆగినది.

పెండ్లి వారు అందరు హోటల్ లో టిఫిన్ తినటానికి బస్సుదిగి హోటల్ లోనికి వెళ్ళినారు. అక్కడ నాకు నాపాత స్నేహితులు (1967 సంవత్సరమునాటి స్నేహితులు) శ్రీమతి & శ్రీ శుక్లగార్లు టిఫిన్ తినుచు కనిపించినారు. వారు నన్ను చూసి తమ టేబుల్ దగ్గరకు పిలిచి నాకు మిఠాయి పెట్టినారు.

ఏమిటి విశేషము అని నేను శుక్లాను అడిగినాను. తను తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియచేసినారు. నాకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఒక్కసారి ఆలోచించినాను. శ్రీ సాయి శిరిడీకి రమ్మనమని చెప్పిన విధానము 1) శ్రీ సాయి 1858 సంవత్సరములో ధూప్ గ్రామమునుండి చాంద్ పాటిల్ (మగపెళ్ళివారు) తో కలసి శిరిడీ గ్రామమునకు చేరుకొన్నారు. 2) పిల్లలు లేని దంపతులకు పిల్లలు కలుగబోతున్న శుభవార్త శ్రీ సాయి సత్చరిత్రలో కనిపించుతుంది. ఈవిధమైన దృశ్యాలు ద్వారా శ్రీ సాయి నా శిరిడీ ప్రయాణానికి అనుమతిని యిచ్చినారు అని నమ్మినాను.

03.12.1994

నిన్నటిరోజున శ్రీ సాయిని గురించి ఆలోచించుతూ శ్రీ సాయి తన భక్తులకు, అన్నీ ప్రసాదించుతున్నారే - మరి శ్రీ సాయి తన భక్తులనుండి ఏమి కోరుతున్నారు అనే ఆలోచన వచ్చినది. రాత్రి నిద్రకు ముందు నా ఆలోచనకు సమాధానము చెప్పమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో చూపిన సూచనలు.

1) వెండి కంచాలలో భోజనము, భోగభాగ్యాలకు దూరముగా యుండవలెను.

2) నీకంటె ధనవంతులను చూసి వారి జీవిత విధానాన్ని అనుకరించవద్దు. 3) జనులను మోసాలు చేసి జీవించేవారినుండి దూరముగా జీవించు.

4) తాము మత ప్రవక్తలమని, వేషభాషలు ప్రదర్శించుతూ నీకు లంచాలు ఇచ్చేవారినుండి దూరముగా ఉండవలెను. 5) ఎన్నికలు, రాజకీయాలు, పోలీసు గొడవలకు దూరముగా యుండవలెను. 6) గతములో నీకు జరిగిన అన్యాయాల గోతిని తిరిగి త్రవ్వవద్దు. వీలు అయినంతవరకు ఆగోతిని పూడ్చిపెట్టు. 7) రోడ్డు ప్రక్కన యిసుకలో సుఖముగా నిద్రపోతున్నవారికి నిద్రాభంగము కలుగకుండ నీవు స్కూటర్, కారు దిగి నడచి వెళ్ళు. 8) నీ నా పేరిట (సాయి పేరిట) ఎవరి దగ్గరనుండీ ధనము స్వీకరించవద్దు. 9) అన్నదానము పేరిట ఎవరైన బియ్యము యిచ్చిన నీవు జోలె పట్టు.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు







Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List