Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 25, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (01)

Posted by tyagaraju on 10:00 PM

26.02.2012 ఆదివారము
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుండి సాయి.బా.ని.స. డైరీ - 1995 ప్రారంభము
teluguvarisaidarbar.blogspot.com లో ద్వారకామాయి ఓ సంగీత నిలయం అనే శీర్షికతో మరొక పేజీ మహా శివరాత్రినాడు ప్రారంభింపబడింది. మీరంతా చూసే ఉంటారు. దానిలో బాబా మీద మధురమైన పాటలు, అలనాటి పాత చిత్రాలలోని మధురమైన పాటలను ఆస్వాదించండి.

సాయి.బా.ని.. డైరీ - 1995 (01)

03.01.1995

నిన్న రాత్రి శ్రీ సాయ్కి నమస్కరించి 1995 సంవత్సరానికి శ్రీ సాయిభక్తులకు సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సందేశాల వివరాలు.

1) నీ ప్రాపంచిక విషయాలలో, నీ బరువు బాధ్యతల నిర్వహణలో సహాయము చేసేవాడు గురువు. నీ ఆధ్యాత్మిక విషయాలలో నీకు తోడుగా ఉంటూ భగవంతుని దరికి చేర్చేవాడు సమర్ధ సద్గురువు.

2) నిజ జీవిత ప్రయాణములో నీ ప్రేమ నీవాళ్ళ మీదనే యుంటుంది. నీ వాళ్ళలో ఎవరైనా దారి తప్పిన నీమనసు విల విలలాడిపోతుంది. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో నీ, నా అనే భేదము యుండదు. అందరు సమానమే.

3) గుడిలోని పూజారి నీనుండి దక్షిణ తీసుకొని తన పొట్ట నింపుకొంటాడు. ఆధ్యాత్మిక రంగములో సమర్ధ సద్గురువు నీ నుండి దక్షిణ తీసుకొని నీకంటే లేనివాని పొట్టనింపి నిన్నుతనతో సమానముగా తీర్చిదిద్ది వివేక, వైరాగ్యాలను ప్రసాదించుతాడు.

4) నీయింటికి వచ్చే నీ బందువులు నీకు ఏమి కానుకలు తెచ్చినారు అని ఆలోచించి ఆ తర్వాతనే వారికి ఏవిధమైన మర్యాదలు చేయాలి అని ఆలోచించుతావు. కాని సమర్ధ సద్గురువు తన దగ్గరకు వచ్చేవారికి ఏవిధముగా ప్రేమతో పలకరించాలి అని ఆలోచించుతు వారి అర్హను బట్టి వారికి తన ఆధ్యాత్మిక ఖజాన నుండి కానుకలు తీసి యిస్తారు.

అందుకే నూతన సంవత్సరములో సమర్ధ సద్గురువు ఆశీర్వచనాలు పొందటానికి ప్రయత్నించండి.

04.01.1995

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగములో ముందుకు వెళ్ళటానికి మార్గము చూపు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో చూపిన మార్గము వివరాలు.

1) అన్నార్తులు అన్నము కోసము నిరాహార దీక్ష చేస్తే ఈలోకం హర్షించదు. అదే , అన్ని భోగభాగ్యాలు అనుభవించుతున్నవాడు ఒక పూట ఉపవాసముతో నిరాహార దీక్ష చేసిననాడు ఈలోకం తల్లడిల్లి పోతుందే! - మరి ఆధ్యాత్మికముగా నీవు ఆలోచించి ఏమార్గములో పయనించాలి నిర్ణయించుకో.

2) నిజ జీవిత ప్రయాణములో నీవాళ్ళు నీ స్నేహితులు నీకు తోడుగా యుంటారు. మరి ఆధ్యాత్మిక రంగ ప్రయాణములో సమర్ధ సద్గురువు మాత్రమే నీదు తోడుగా యుంటారు.

3) ఆధ్యాత్మిక రంగ ప్రయాణములో గొప్పవాడు బ్రాడ్ గేజి రైలు పట్టాలమీద ప్రయాణము చేస్తాడు. బీదవాడు మీటరు గేజీ రైలు పట్టాల మీద ప్రయాణము చేస్తాడు. ఆఖరికి యిరువురి గమ్యస్తానము ఒక్కటే అని గుర్తు ఉంచుకోవాలి.

మూడు విషయాలు అనుక్షణము గుర్తు ఉంచుకొన్నరోజున ఆధ్యాత్మిక రంగములో నీప్రయాణము సులువుగా సాగిపోతుంది.

05.01.1995

నిన్న రాత్రి ఆధ్యాత్మిక రంగములో ముందుకు వెళ్ళేటప్పుడు ఎదుర్కోవలసిన యిబ్బందులు చెప్పు తండ్రి అని శ్రీసాయినాధుని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో చూపిన సందేశము.

"కన్న కుమార్తెపై ప్రేమ - భార్యపై వ్యామోహము - తల్లిపై మమకారము నీ ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకములు అని గుర్తుంచుకోవలెను.

10.01.1995

నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు నాచేత వేయించు తండ్రి అని వేడుకొన్నాను. 1) చిన్న తనములోనే మంచి నడవడితో పేరు ప్రఖ్యాతలు సంపాదించి అల్ప ఆయుష్ తో మంచముమీద పరుండి లోకమునుండి వెడలిపోయేటప్పుడు తనతో ఏమి తీసుకొని వెళ్ళగలను అని ఆలోచనా శక్తి గలవాడే ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు వేయగలడు.

2) జీవితములో సర్వ సుఖాలు అనుభవించి శరీరముపై మమకారమును విడవలేక జవసత్వాలు వడలిపోయిన యింకా శరీరముపై వ్యామోహము గలవాడు ఆధ్యాత్మిక రంగములో వెనుక అడుగు మాత్రమే వేయగలడు.

మరి నీవు ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు వేయాలా, వెనుక అడుగు వేయాలా అని ఆలోచించి తేల్చుకో అన్నారు శ్రీసాయి.

14.01.1995

నిన్నటి రోజున శ్రీసాయి తత్వ ప్రచారములో నేను అవలంబించవలసిన పధ్ధతులను తెలపమని శ్రీసాయిని వేడుకొన్నాను. శ్రీసాయి చూపిన దృశ్యముయొక్క సారాంశము. "నీవు ఎవరినైన మంచిమార్గములో నడవమని చెప్పేముందు నీవు నడుస్తున్న మార్గముగురించి బాగా ఆలోచించుకో. నీమార్గములో ప్రయాణానికి అహంకారము అనే వాహనాన్ని ఉపయోగించనినాడు నీవు ఎదుటివానిని నీమార్గములో ప్రయాణము చేయమని వినయముతో చెప్పు.

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List